ఆ ముగ్గురిలో నేనున్నా! | Priya Bhavani Shankar Confirms Her Presence in Indian 2 | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురిలో నేనున్నా!

Published Sun, Aug 11 2019 10:03 AM | Last Updated on Sun, Aug 11 2019 10:03 AM

Priya Bhavani Shankar Confirms Her Presence in Indian 2 - Sakshi

ఆ ముగ్గురిలో నేనున్నానంటూ సంబరపడిపోతోంది నటి ప్రియ భవానీశంకర్‌. బుల్లితెరపై నటనలో ఓనమాలు నేర్చుకున్న ఈ బ్యూటీ వెండితెరపై స్టార్ ఇమేజ్‌ కోసం ఎదురుచూస్తోంది. మేయాదమాన్‌ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన నటి ప్రియా భవానీశంకర్‌పై ఆ చిత్ర హిట్‌ కావటంతో బిజీ అయ్యింది. ఇక ఆ తరువాత కార్తీ సరసన కడైకుట్టి సింగం, ఎస్‌జే.సూర్యతో జతకట్టిన మాన్‌స్టర్‌ చిత్రాలు ప్రియాభవానీశంకర్‌ను సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ల పట్టికలో చేర్చాయి.

ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడికి తాజా బంపర్‌ డ్రా తగిలినట్లయ్యింది. అవును ఏకంగా విశ్వనాయకుడితోనే నటించే లక్కీచాన్స్‌ను ఇండియన్‌–2లో కొట్టేసింది. స్టార్‌ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. కాగా ఇందులో హీరోయిన్లగా నటి కాజల్‌ అగర్వాల్, ఐశ్వర్యారాజేశ్, ప్రియభవానీశంకర్‌ నటించనున్నట్లు తెలిపింది.

త్వరలోనే ఇండియన్‌–2 చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. కాగా ఇండియన్‌–2 చిత్రంలో నటించే అవకాశం రావడం గురించి నటి ప్రియభవానీశంకర్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇండియన్‌–2 చిత్రంలో తాను నటించనున్న మాట నిజమేనని చెప్పింది. ఈ చిత్రం కోసం తనను పిలిపించిన శంకర్‌ రెండు గంటల పాటు కథను వినిపించారని చెప్పింది. అందులో తన పాత్ర గురించి తెలిసిన తరువాత ఆశ్చర్యపోయానని అంది.

కమలహాసన్‌ చిత్రంలో 10 నిమిషాల పాత్రలోనైనా నటిస్తే చాలని భావించానని అంది. అలాంటిది ఇండియన్‌–2 చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో తానూ ఒకరినని తెలిసి వెంటనే నటించడానికి అంగీకరించినట్లు చెప్పింది. శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్, సిద్ధార్థ్, కాజల్‌అగర్వాల్‌ వంటి వారితో కలిసి నటించడం భాగ్యంగా భావిస్తున్నానని చెప్పింది. ఇండియన్‌–2లో ఈ బ్యూటీ పాత్ర చిత్రంలో చివరి వరకూ ఉంటుందట.

ఇకపోతే ఈ చిత్రంతో పాటు ప్రియభవానీశంకర్‌ను మరో భారీ చిత్రంలో నటించే అవకాశం వరించింది. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌కు జంటగా ఆయన 54వ చిత్రంలో నటించనుంది. ఇలా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకుంటోందీ అమ్మడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement