
కమల్‌హాసన్
చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌లో రహస్యంగా వ్యూహరచన చేస్తున్నారట నటుడు కమల్‌హాసన్. మరి.. కమల్ తాజా ప్రణాళిక లక్ష్యం ఏంటో వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌లో జరుగుతోందని కోలీవుడ్ సమాచారం. హోటల్ బ్యాక్‌డ్రాప్‌లో కమల్‌పై వచ్చే కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
హాటల్లో కమల్ ఎవరెవరితో రహస్యంగా భేటీ అయ్యారో ప్రస్తుతానికి సస్పెన్స్. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. 1996లో కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలోనే వచ్చిన ఇండియన్ చిత్రానికి ‘ఇండియన్ 2’ సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మహిళా సాధికారిత అంశాలపై ‘ఇండియన్ 2’ కథనం ఉంటుం దని టాక్.