సాక్షి, చెన్నై : కమల్ హాసన్ రాజకీయ ప్రవేశంపై ఆయన కుమార్తె, నటి శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి రాజకీయాల్లోకి వస్తే రాణించటం ఖాయమని చెప్పారు. రాజకీయాల్లో తన మద్దతు ఎప్పుడూ ఆయనకే ఉంటుందని అన్నారు.
తన తండ్రి మంచి నిజాయితీపరుడని, అందుకే నిర్మోహమాటంగా మాట్లాడగలుగుతారని తెలిపారు. చెన్నైలో శుక్రవారం ఓ షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా మీడియాతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కమల్ హాసన్ నవంబర్ 7న తన 63వ పుట్టినరోజు సందర్భంగా కొత్త పార్టీని ప్రారంభించే పనిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment