Sruthi Hassan
-
హీరోయిన్ శ్రుతి హాసన్ మెంటల్ హెల్త్ టిప్స్
-
లాక్మే ఫ్యాషన్ వీక్ 2024: వయ్యారి భామల సందడి, ఫోటోలు
-
ఇద్దరు మిత్రులు శత్రువులు అయితే అనేదే 'సలార్'
పాన్ ఇండియా హీరో ప్రభాస్ కెరీర్‌కు చాలా ముఖ్యమైన చిత్రం సలార్. ఎందుకంటే బాహుబలి రెండు చిత్రాల తరువాత డార్లింగ్ నటించిన రాధేశ్యామ్, ఆదిపుష్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కినప్పటికీ పూర్తిగా నిరాశ పరిచాయి. దీంతో తాజా చిత్రం సలార్‌తో కచ్చితంగా హిట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభాస్‌పై పడింది. ఇక ఈ చిత్రం హీరోయిన్ శృతిహాసన్ సలార్‌పై చాలా నమ్మకం పెట్టుకున్నారు. మరో ప్రధాన పాత్రలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ నటించడం విశేషం. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఇందులో తమిళ నటుడు పశుపతి కూడా కీలక పాత్రను పోషించారు. కెజీఎఫ్ చిత్రం ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోమ్ బలే సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీన భారీ అంచనాల నడుమ తెరపైకి రానున్న సలార్ చిత్రం గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ఇది ఇద్దరు మిత్రుల ఇతివృత్తంతో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. అయితే ఆ ఇద్దరు శత్రువులుగా మారితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం ఇదని చెప్పారు. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. గత చిత్రం కేజీఎఫ్ ఛాయలు సలార్‌లో కనిపిస్తున్నాయనే వాదన కరెక్ట్ కాదన్నారు. ఆ చిత్రంకు సలార్ అస్సలు పోలిక ఉండదన్నారు. ఇంకా చెప్పాలంటే కేజీఎఫ్ చిత్రాన్ని రూపొందించడానికి ముందే సలార్ చిత్ర కథను రాసుకున్నానని చెప్పారు. అదే విధంగా సలార్ చిత్రానికి కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని, త్వరలోనే సీక్వెల్‌కు సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రశాంత్ నీల్ చెప్పారు. -
నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. దీపావళికి బిగ్ సర్ప్రైజ్..!
నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఎన్బీకే107 నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈనెల 21 కర్నూలులోని చారిత్రక కట్టడమైన కొండారెడ్డి బురుజుపై ఆవిష్కరించనున్నారు. దీపావళి కానుకగా నందమూరి అభిమానులకు టైటిల్ లోగోను విడుదల చేస్తున్నారు. అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నటసింహం.. మరోసారి 'ఎన్బీకే 107'తో ప్రేక్షకులను అలరించనున్నారు. (చదవండి: NBK107: కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య సందడి!) ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి 12 జనవరి 2023న ఈ సినిమా విడుదలకు చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి బీజీఎం కింగ్ ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. The MASS euphoria intensifies 🔥#NBK107 title launch on the iconic Konda Reddy Buruju, Kurnool on October 21st at 8:15 PM ❤️🔥 NATASIMHAM #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @RishiPunjabi5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/Qe6zPYrVgp — Mythri Movie Makers (@MythriOfficial) October 19, 2022 -
రూ. 3వేల కోసం థియేటర్లో పనిచేశా: స్టార్ హీరో మాజీ భార్య
Kamal Haasan Ex Wife Sarika About Her Financial Status: ఒకప్పుడు ఆమె స్టార్ హీరో భార్య, ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్ తల్లి.. అయినా ఆమెకు మహమ్మారి కాలంలో ఆర్థిక సమస్యలు తప్పలేదు. లాక్డౌన్ సమయంలో కేవలం 3వేల కోసం ఆమె థియేటర్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేశానని చెప్పడం అందరిని షాక్‌కు గురిచేస్తోంది. ఆమె మరెవరో కాదు లెజెండరి నటుడు, హీరో కమల్ హాసన్ మాజీ భార్య, శుృతి హాసన్ తల్లి సారిక. సారిక కూడా ఒకప్పుడు హీరోయిన్. కానీ కమల్ హాసన్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పి చెన్నై వెళ్లిపోయింది. చదవండి: ‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్ ఏంటంటే.. ఇక ఆయనతో విడాకుల అనంతరం తిరిగి ముంబైకి వచ్చిన ఆమె మళ్లీ నటిగా బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెజాన్ ప్రైం ‘మోడ్రన్ లవ్ ముంబై’ అనే ఆంథాలజీలోని ‘మై బ్యూటీఫుల్ రింకిల్స్’ అనే పార్ట్‌లో నటించింది. ఇందులో ఆమె నటనకు గాను ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కరోనా కాలంలో తాను ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలపై నొరు విప్పింది సారిక. ‘కమల్‌తో విడాకుల అనంతరం తిరిగి ముంబై వచ్చాయి. మళ్లీ నటిగా చిన్న చిన్న రోల్స్ చేయడం ప్రారంభించాను. అలా ఓ రోజు చూస్తే లైఫ్ రోటీన్‌గా అనిపించింది. చదవండి: బిగ్‌బాస్ ఓటీటీ: రవిపై ఫైర్ అయిన నటరాజ్ మాస్టర్? ఉదయం లేవడం వర్క్‌కు వెళ్లడం.. మళ్లీ రాత్రికి పడుకోవడం. కొత్తగా ఏం అనిపించడం లేదు. దీంతో ఒక ఏడాది పాటు నటనకు బ్రేక్ తీసుకున్నా. అదే సమయంలో కరోనా, లాక్డౌన్లు వచ్చాయి. దీంతో అయిదేళ్లు ఈజీగా గడిచిపోయాయి. ఈ పాండమిక్ సమయంలో నా దగ్గర ఉన్న సేవింగ్స్ పూర్తిగా అయిపోయాయి. ఏం చేయాలో తెలియదు. దీంతో థియేటర్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేశా. కానీ వారు కేవలం 2000 నుంచి 2700 వరకు మాత్రమే చెల్లించేవారు. దీంతో తిరిగి సినిమాల్లో నటించడమే మంచిదని నిర్ణయించుకున్నా’ అంటూ సారిక చెప్పుకొచ్చింది. చదవండి: మీడియా ముందుకు కరాటే కల్యాణి: నేను ఎక్కడికీ పారిపోలేదు దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఓ స్టార్ హీరోయిన్ తల్లి అయ్యిండి కూడా ఆమెకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా కమల్-సారికలు కొంతకాలం రిలేషన్లో ఉన్న అనంతరం 1998లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్‌లు జన్మించారు. ఈ క్రమంలో 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న కమల్-సారికలు 2004లో విడాకులు తీసుకున్నారు. -
స్టార్ స్టయిల్: శ్రుతి హాసన్ ధరించిన చీర, జ్యూయెలరీ ధర ఎంతో తెలుసా?
‘ఆకాశం అమ్మాౖయెయితే, నీలా ఉంటుందే.. నీలా ఉంటుందే..’ఆ అమ్మాయి ఎవరో ఈ పాటికే మీకు తెలిసిపోయే ఉంటుంది! మరి, అంతటి అందంతో పోటీపడేందుకు నిచ్చెన వేస్తున్న ఆ ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.. దేవనాగ్రి.. ఓ పండుగ రోజు అమ్మమ్మ తయారుచేసిన సంప్రదాయ దుస్తులు ధరించడంతో అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియాంకల భవిష్యత్తు ప్రణాళిక మారిపోయింది. ఒకరు ఇంజనీర్, మరొకరు డాక్టర్ కావాలనుకున్నా.. చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఆసక్తితోనే జైపూర్‌లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. తర్వాత దేశమంతటా వివిధ పండుగలకు తగ్గ దుస్తులను డిజైన్ చేయటం మొదలుపెట్టారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవనాగ్రి’అనే ఓ ఫ్యాషన్ హౌస్ ప్రారంభించారు. భారతదేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. చాలామంది సెలబ్రిటీస్ వివిధ పండుగల్లో ఈ బ్రాండ్ దుస్తుల్లో మెరిశారు. స్పెషల్ అకేషన్స్‌కు సరిపోయే డిజైన్స్ రూపొందించడంలోనూ వీరు సిద్ధ హస్తులు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. చీర.. బ్రాండ్: దేవనాగ్రి ధర: రూ. 34,000 అమ్రపాలి జ్యూయెలరీ నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజమేరా కలసి జైపూర్‌లో ‘అమ్రపాలి’ పేరుతో మ్యూజియం స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘అమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే అమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో కూడా అమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: అమ్రపాలి జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. చదవండి: ఇవి తింటే బట్టతల ఖాయం..! గుడ్డు తెల్లసొన, చేప, చక్కెర.. -
విరాట్ కోహ్లి తాగే లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా?
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కోహ్లి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూనే తన ఫిట్ నెస్ పై బాగా శ్రద్ద చూపిస్తుంటారు. ఆయన చేసే వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచకుంటాడు కూడా. ఇక తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకునే విరాట్ కోహ్లీ తాగే మంచినీటి బాటిల్ ఖరీదు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఎందుకంటారా..తాను బ్లాక్ వాటర్ తాగుతానని చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకోచ్చాడు. ఈ నీళ్ళలో హైడ్రేటెడ్‌గా ఉండడమే కాకుండా.. పీహెచ్ అధికంగా ఉంటుంది. చదవండి: T20 World Cup 2021: ‘ఈసారి విజేత భారత్ కాదు.. ఆ జట్టే గెలుస్తుంది సాధారణంగా మనం తాగే లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు.. రూ. 20 నుంచి ఆపై మరికాస్త ఖరీదు ఉండొచ్చు.. అయితే ఈ బ్లాక్ వాటర్ ధర లీటరుకు రూ.3000 నుంచి రూ.4000 వరకు ఉంటుంది. ఈ నీళ్ళలో సహజసిద్ధమైన బ్లాక్ ఆల్కలీన్ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది. బ్లాక్ వాటర్‌లో పీహెచ్(pH) ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లాక్ వాటర్ చర్మ నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, బరువును కూడా అదుపులో ఉంచుతుంది. కరోనా నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ తాగుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా మలైకా అరోడా, శ్రుతిహాసన్ ఫిట్‌గా ఉండేందుకు బ్లాక్ వాటర్ తాగుతున్నారు. చదవండి: సచిన్‌లో ఆ బలహీనత గమనించా.. దిగ్గజ స్పిన్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by EvocusH2O Global (@evocus_water) -
ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సాక్షి, చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు ఎస్సీ జననాథన్ ఆదివారం కన్నుమూశారు. జననాథన్ అకాలమరణంపై పరిశ్రమకు చెందిన పెద్దలు, ఇతర నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన రోల్ మోడల్, కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ వర్ధంతి రోజే ఆయనకూడా కన్నుమూశారంటూ గుర్తు చేసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డైరెక్టర్ జననాథన్ ఈ ఉదయం గుండెపోటుతో కన్నుమూశారని మరో డైరెక్టర్ ఆర్ముగకుమార్ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. (అవార్డు వేడుకలో వేదికపై పూర్తి నగ్నంగా నటి) హీరోయిన్ శృతిహాసన్ జననాథన్ మృతిపై సంతాపం ప్రకటించారు. భారమైన హృదయంతో గుడ్‌బై చెబుతూ ట్వీట్ చేశారు. ఆయనతో కలిసి పనిచేసినందుకు చాలా ఆనందంగానూ గర్వంగానూ ఉంది. తన ఆలోచనలలో ఎప్పుడూ బతికే ఉంటారంటూ శృతి నివాళులర్పించారు. సినిమా ఎడిటింగ్ పనిలో ఉన్న ఆయన గురువారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లారు. అయితే జననాథన్ ఎక్కువసేపు తిరిగి రాకపోవడంతో, సిబ్బంది తనిఖీ చేయగా, అపస్మారక స్థితిలో పడి ఉండగా గుర్తించారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. బ్రెడ్ అయినట్టుగా తెలిపిన వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చివరకు ఆయన తుది శ్వాస తీసుకున్నట్లుగా ఆదివారం ప్రకటించారు. కాగా విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ లాబాం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు జననాథన్. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ మూవీని ఈ సంవత్సరం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జననాథన్ 2004 సంవత్సరంలో అయ్యర్కై సినిమాకు తమిళంలో జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డును గెలుచుకున్నారు. It is with the heaviest Heart that We say good bye to #SPJananathan sir - it was a pleasure working with you sir Thankyou for your wisdom and kind words you will always be in my thoughts ! My deepest condolences to his family 🙏 pic.twitter.com/Ox1Ag0EEYE — shruti haasan (@shrutihaasan) March 14, 2021 #Laabam director #SPJananathan , is no more... Incidentally he passed away on the death anniversary of social revolutionary #KarlMarx , who was his role model.We miss you sir.#RIP pic.twitter.com/Zl8qF0mokD — D.IMMAN (@immancomposer) March 14, 2021 -
షార్ట్ అండ్ స్ట్రాంగ్!
గాయనిగా, నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా, సంగీత దర్శకురాలిగా తనలోని విభిన్నమైన కోణాలను ప్రేక్షకులకు చూపించారు శ్రుతీహాసన్. ఇప్పుడు మరో మీడియమ్‌లోకి అడుగుపెడుతున్నట్టు తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన శ్రుతీహాసన్ తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటీమణులు కాజోల్, నేహా ధూపియా, నీనా కులకర్ణి అలాగే ముక్తా బావ్రే, రామా జోషీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రియాంకా బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్‌కు ‘దేవి’ అని టైటిల్ పెట్టారు. శక్తిమంతమైన సందేశంతో షార్ట్ అండ్ స్ట్రాంగ్‌గా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందుతోందని సమాచారం. ‘‘నా తొలి షార్ట్ ఫిల్మ్‌ను ఇంత మంది ప్రతిభ కలిగిన నటీమణులతో కలసి చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. -
పండగ పోస్టర్లు
పండగ అనగానే సినిమా వాళ్లు చాలా ఉత్సాహంగా ఉంటారు. అందులోను సంక్రాంతి అనగానే ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహం వస్తుంది. కారణం వాళ్ల సినిమాలను విడుదల చేయటమే కాకుండా అనేక సినిమా ప్రమోషన్లను ఈ పండగకి ప్రారంభించటం ఆనవాయితీ. కొందరు తమ సినిమాల లుక్స్‌ను ఈ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. రవితేజ, శ్రుతీహాసన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్’. ‘ఠాగూర్’ మధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మలినేని గోపిచంద్ దర్శకుడు. సాయి మాధవ్ బుర్రా మాటల రచయిత. ఎస్. ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ‘క్రాక్’ చిత్రం వేసవిలో విడుదల కానుంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. మంగళవారం ఈ సినిమాలోని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాల్ నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుంది. ఏప్రిల్ 2న ‘లవ్‌స్టోరీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన పాత్రలను పోషించి మంచి మార్కులు కొట్టేసే నటుడు సత్యదేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను పండగ సందర్భంగా విడుదల చేశారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేశ్ మహా ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా కూడా వేసవి సందర్భంగానే విడుదల చేయాలనుకుంటున్నారు. -
కాలానికి ధన్యవాదాలు
న్యూ ఇయర్ వచ్చేసింది. గడచిన సంవత్సరం ఎలా గడిచింది? అని విశ్లేషించుకుంటూ ఈ ఏడాది ఎలా ఉండాలో కోరుకుంటూ బిజీగా ఉన్నారు చాలామంది. శ్రుతీహాసన్ ఏమంటున్నారంటే.. ‘‘ఎలా జీవించాలో నాకు నేర్పుతున్న ప్రతి ఏడాదికి థ్యాంక్స్. కాలం నాలో తెచ్చిన మార్పులకు థ్యాంక్స్. నాలో నన్ను వెతుక్కునే అవకాశం కల్పించి, నన్ను నేను ప్రేమించుకునేలా చేసిన టైమ్‌కి థ్యాంక్స్. అలాగే 2019 కూడా నన్ను ఎగై్జట్ చేసే ఎన్నో అంశాలను నా ముందుకు తీసుకురావాలి. నాకు నచ్చిన విషయాలను ఎంపిక చేసుకునే అవకాశాలను ఇవ్వాలి. నా సంతోషంలో గతేడాది భాగమైన నా బంధుమిత్రులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను ఆమె తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో కలిసి లండన్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక శుత్రి సినిమాల విషయానికి వస్తే.. హిందీలో విద్యుత్ జమాల్ సరసన ఆమె ఓ సినిమా చేస్తున్నారు. మహేశ్ మంజ్రేకర్ ఈ సినిమాకు దర్శకుడు. -
అమెరికాలో పంద్రాగస్టు వేడుకలకు కమల్
తమిళసినిమా: పంద్రాగస్ట్ వేడుక దగ్గర పడుతోంది. ఎందరో పోరాటయోధుల త్యాగఫలం స్వాతంత్ర దినోత్సవం. ఆగస్ట్ 15న యావత్ భారతదేశంలో అశోక చక్రాన్ని ఇముడ్చుకున్న మువ్వన్నెల పతాకం రెపరెపలాడే తరుణం దగ్గరపడింది. ఈ వేడుకలు భారతదేశంలోనే కాకుండా అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో కూ డా జరగుతుంటాయి. వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొం టుంటారు. ఈ ఏడాది అమెరికాలోని న్యూ యార్క్‌లో జరగనున్న వేడుకల్లో విశ్వనటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్, ఆయన కూతరు శ్రుతీ హాసన్ పాల్గొననున్నారన్నది తాజా సమాచారం. ప్రస్తుతం కమల్‌హాసన్ బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొంటున్నారు. మక్కళ్ నీ ది మయ్యం పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. నటి శ్రుతి హాసన్ చిన్న గ్యాప్ తరువాత హిందీ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. -
శ్రుతి బాటలో..
తమిళసినిమా: సినిమా ఇతర రంగాలకు కాస్త భిన్నమైందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ రిస్క్ ఎక్కువే, ఆకర్షణ, క్రేజ్ ఎక్కువే. అలా లక్కుకిక్కు ఉన్న పరిశ్రమ సినిమా. ఈ రంగంలోకి ఒక్కసారి వస్తే, తిరిగి వెళ్లడం అంత సులభం కాదు. ఇక నటి కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే 2004లో బాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇచ్చినా అక్కడ ఎవరూ గుర్తించలేదు. దీంతో దక్షిణాది సినిమాపై గురి పెట్టింది. ఇక్కడ కూడా మొదట్లో తడబడ్డా ఆ తరువాత నిలదొక్కుకుంది. కాజల్‌ను స్టార్‌ను చేసింది తెలుగు చిత్రం మగధీరానే. ఆపై తమిళం, తెలుగు చిత్రాల్లో క్రేజీ కథానాయకిగా రాణిస్తోంది. 14 ఏళ్ల తన నట జీవితంలో కాజల్ చాలా ఎత్తుపల్లాలను చూసింది. ఆ మధ్య సినిమా నిరంతరం కాదని, చాలినంత సంపాదించుకుని ఇతర వ్యాపారాల్లో దృష్టి సారించాలని పేర్కొంది. అలాంటిది ప్రస్తుతం తన నిర్ణయంలో మార్పు వచ్చింది. నిజానికి కాజల్‌అగర్వాల్‌కు ప్రస్తుతం అవకాశాలు తగ్గు ముఖం పట్టాయనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్‌లో ప్యారిస్ ప్యారిస్ అనే ఒక్క చిత్రమే చేతిలో ఉంది. ఇకపోతే ఈ బ్యూటీ వేరే రంగంలోనూ పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని గడిస్తోంది. మరో భాగస్వామితో కలిసి ముంబయిలో జ్యువెలరీషాప్ నడుపుతోంది. తాజాగా చిత్ర నిర్మాణం చేపట్టాలన్న ఆలోచనలో ఉందట. దీని గురించి ఈ బ్యూటీ ఏమంటుందో చూద్దాం. జ్యువెలరీ వ్యాపారాన్ని మరింత విస్తరించే పనిలో ఉన్నాను.. అదే విధంగా మంచి స్క్రిప్ట్ దొరికితే చిత్ర నిర్మాణం చేపట్టాలన్న ఆశ ఉంది. సరైన సందర్భం వచ్చినప్పుడు చిత్ర నిర్మాతగా అవతారమెత్తుతాను అని చెప్పింది. ఇటీవలే నటి శ్రుతిహాసన్ చిత్ర నిర్మాణంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాను సైతం అంటోందన్న మాట కాజల్. సరే ఇంతకీ ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తోంది. మరి ఏ భాషలో చిత్రాన్ని నిర్మిస్తుందో వేచి చూడాలి. -
గ్యాంగ్‌స్టర్‌గా శ్రుతి
తమిళసినిమా: నాటి తరం చిత్రాల్లో హీరోయిన్లను గ్యాంగ్‌స్టర్స్‌గా ఎక్కువగా చూసి ఉంటాం. ఇటీవల అసలు ఆ తరహా చిత్రాలే తగ్గిపోయాయి. ఇక హీరోయిన్లను గ్యాంగ్‌స్టర్స్‌గా చూసే అవకాశం ఎలా ఉంటుంది? అయితే తాజాగా ఆ కొరత తీర్చడానికి అందాల భరిణి శ్రుతిహాసన్ రెడీ అవుతున్నారు. ఈ సంచన నటి నాయకిగా పరిచయమైంది బాలీవుడ్లోనే అన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత తెలుగు, తమిళం అంటూ పలు భాషల్లో చుట్టేశారు. ప్రస్తుతం చిన్న గ్యాప్ తీసుకుని మరో ఇన్నింగ్‌ను కెరీర్ ఎక్కడ ప్రారంభించారో అక్కడి నుంచే మొదలెట్టనున్నారు. తొలి హిందీ చిత్రం లక్కులో అందాలారబోసి సంచలనం కలిగించిన శ్రుతిహాసన్ తాజాగా గ్యాంగ్స్టర్లో అదరగొట్టడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్జమ్మాల్ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి కథానాయకిగా నటిస్తున్నారు. ఇందులో ఆమె గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా వెల్లడించారు. పిరియడ్ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు. ఈ చిత్ర తొలి షూటింగ్ షెడ్యూల్ ఇటీవల ముంబయిలో పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్‌ను గోవాలో చిత్రీకరించనున్నారు. దీంతో మహేశ్‌మంజ్రేకర్ తన చిత్ర బృందంతో గోవాకు పయనం అవుతున్నారు. ఈ షెడ్యూల్లో నటి శ్రుతిహాసన్ పాల్గొనబోతున్నారు. సాధారణంగా మహేశ్‌మంజ్రేకర్ చిత్రాలలో హీరోలతో పాటు హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. అదే విధంగా ఈ చిత్రంలోనూ శ్రుతి పాత్ర కీలకంగా ఉంటుందంటున్నారు దర్శకుడు. ఇందులో శ్రుతిహాసన్ గురించి ఆయన తెలుపుతూ చిత్రంలో శ్రుతిహాసన్ పాత్ర ఇతర పాత్రల్లోని జీవితాలపై చాలా ప్రభావం చూపేదిగా ఉంటుందన్నారు. ప్రస్తుతం లండన్‌లో తన అంతర్జాతీయ సంగీత ఆల్బమ్‌కు సంబంధించిన పనులను పూర్తి చేసుకుంటున్నారని, త్వరలోనే ఇండియాకు తిరిగి వచ్చి మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో నటించడానికి గోవా బయలు దేరనున్నారు. ఆ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే శ్రుతి తన తండ్రి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మిస్తున్న శభాష్ నాయుడు చిత్ర షూటింగ్లో పాల్గొంటారని ఆమె తరఫు వర్గాలు తెలిపారు. -
ఈ ప్యాక్ బ్యాక్ ఎవరో?
ఇక్కడున్న ఫొటోలను గమనించారా? ఎవరో కనిపెట్టేశారా? ప్చ్.. లేదు అంటున్నారా? అయితే.. క్లూ ఇదిగో. ఒక ఫొటోలో ఇద్దరు ఉన్నారు కదా.. ఆ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. ఇంకో ఫొటోలో నల్ల ప్యాక్ వేసుకుంది చూశారూ.. ఆ అమ్మాయి మన అతిలోక సుందరి శ్రీదేవికి బంధువు అవుతుంది. బాలీవుడ్ అన్నమాట. మిల్క్లాంటి ప్యాక్ వేసుకున్న అమ్మాయి ఎవరనే క్లూ ఇవ్వక్కర్లేదేమో. ఈ క్లూస్‌తో ప్యాక్ బ్యాక్ ఉన్న ముఖారవిందం ఎవరిదో కనిపెట్టేసి ఉంటారు కదూ. తెలుసుకోలేనివాళ్ల కోసం పేర్లు చెప్పేస్తున్నాం... చెప్పేస్తున్నాం... చెప్పేస్తున్నాం. ఆ అక్కాచెల్లెళ్లు ఎవరో కాదు.. లోకనాయకుడు కమల్‌హాసన్ కుమార్తెలు శ్రుతీహాసన్, అక్షరాహాసన్. శ్రీదేవి బంధువు అంటే.. సోనమ్ కపూర్. శ్రీదేవి భర్త బోనీకపూర్ తమ్ముడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ అనే విషయం తెలిసిందే. మిల్క్లాంటి ప్యాక్ వేసుకున్నది ఎవరో కాదు.. మిల్కీ బ్యూటీ తమన్నా. ముఖారవిందం మిలమిలా మెరిసే ముందు ఆ ముఖం కనిపించకుండా ఇలా ‘ఫేస్‌ప్యాక్’ వేసుకుంటారన్న మాట. -
ఇప్పట్లో పెళ్లి లేదు
లవ్ బర్డ్స్ విరాట్ కోహ్లి, అనుష్కా శర్మ ఒక ఇంటివాళ్లయ్యారు. కన్నుల పండువగా ఈ జంట వివాహ వేడుక జరిగింది. ఇప్పుడు అందరి దృష్టీ మిగతా సెలబ్రిటీ లవ్ బర్డ్స్‌పై పడింది. దీపికా–రణవీర్‌సింగ్, శ్రుతీహాసన్–మైఖేల కోర్సెల్.. ఇలా కొన్ని జంటల గురించి మాట్లాడుకుంటున్నారు. విరాట్, అనుష్కల్లా వీళ్లు కూడా పెళ్లి చేసుకుంటారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముందు పెళ్లి చేసుకోబోయేది శ్రుతి–మైఖేల్ అని కూడా చాలామంది ఫిక్స్ అయ్యారు. చెన్నైలో ఇటీవల జరిగిన నటుడు అధవ్ పెళ్లిలో శ్రుతి–మైఖేల్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయింది. లండన్ కుర్రాడు మైఖేల్ ఎంతో ఇష్టంగా తమిళ వేష్టీ (పంచె) కట్టుకుని, కుంకుమ బొట్టు పెట్టుకోవడంతో కచ్చితంగా దేశీ అల్లుడు అవుతాడని ఊహిస్తున్నారు. పైగా వివాహ వేడుకలో కమల్‌హాసన్, శ్రుతి, మైఖేల్ వరుసగా కూర్చుని ఉండటంతో పెళ్లికి తండ్రి నుంచి కూతురికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందనే సంకేతం అందింది. అటు తల్లి సారికకు కూడా సమ్మతమే అని, త్వరలో ఈ జంట పెళ్లి పీటల మీద కూర్చుంటుందని చాలామంది ఓ అభిప్రాయానికి వచ్చేశారు. అయితే ‘‘ఇప్పట్లో పెళ్లి లేదు’’ అని శ్రుతి సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరి.. మైఖేల్‌తో లవ్‌లో ఉన్నది నిజమేనా? అంటే.. శ్రుతి తన పర్సనల్ మేటర్స్ని ఎవరి దగ్గరా డిస్కస్ చేయరని, అయితే ప్రస్తుతానికి ఆమె దృష్టంతా సినిమాల పైనే ఉందని అంటున్నారు. మరి... శ్రుతి మనసులో ఏముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. అయితే లండన్ నుంచి మైఖేల్ ఇక్కడికి రావడం, అడపా దడపా శ్రుతి అక్కడికి వెళ్లడం, తమిళ సంప్రదాయాన్ని ఆచరించి, మైఖేల్ పంచె కట్టుకోవడం.. ఇవన్నీ చూస్తుంటే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. -
త్వరలో శృతి హాసన్ వివాహం!
కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తాడో లేదో నాట్ ష్యూర్ గానీ, శృతి హాసన్ మ్యారేజ్లోకి రావడం ఆల్మోస్ట్ కన్ఫామ్డ్ అంటున్నారు. స్వీట్ హార్ట్ నెక్ లైన్ కట్ ఉన్న ఓ తెల్లటి మ్యాక్సీ డ్రెస్ వేసుకుని, జుట్టును బన్ను లాగా ముడేసుకుని, చెవులకు రెండు స్టేట్మెంట్ దుద్దులు పెట్టుకుని ఎంతో క్యాజువల్‌గా, ఎంతో సింపుల్‌గా తన సంతోషం బయట పడకుండా బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సేల్‌తో, తల్లి సారికతో కలిసి ఓ హై క్లాస్ రెస్టారెంట్లో లంచ్ చేశారట శృతి హాసన్! రెండేళ్ల నుంచీ శృతి, కోర్సేల్ ప్రేమాయణం చక్కర్లు కొడుతున్న సిట్యుయేషన్లో సారికకు కోర్సేల్ని కలిపించడంలో పెడర్థం ఏమీ లేదు.. మ్యారేజ్ అర్థమే ఉందని మీడియా అంటోంది. దానికి తోడు సారిక చేతిలో అందమైన పూల గుచ్ఛం ఉంది కాబట్టి కాబోయే అల్లుడు గారే ఇచ్చారని, ఆవిడ స్వీకరించింది కాబట్టి పెళ్లి జరగడం ఖాయమనీ మీడియా మితిమీరి ఎక్సయిట్ అయిపోతోంది. -
కమల్‌పై శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
కమల్‌పై శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : కమల్ హాసన్ రాజకీయ ప్రవేశంపై ఆయన కుమార్తె, నటి శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి రాజకీయాల్లోకి వస్తే రాణించటం ఖాయమని చెప్పారు. రాజకీయాల్లో తన మద్దతు ఎప్పుడూ ఆయనకే ఉంటుందని అన్నారు. తన తండ్రి మంచి నిజాయితీపరుడని, అందుకే నిర్మోహమాటంగా మాట్లాడగలుగుతారని తెలిపారు. చెన్నైలో శుక్రవారం ఓ షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా మీడియాతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కమల్ హాసన్ నవంబర్ 7న తన 63వ పుట్టినరోజు సందర్భంగా కొత్త పార్టీని ప్రారంభించే పనిలో ఉన్నారు. -
‘శ్రుతీహాసన్ అసలు అందగత్తే కాదు’
తమిళసినిమా: నటి శ్రుతీహాసన్ అసలు అందగత్తే కాదు. ఆమెను మేకప్ లేకుండా చూస్తే పారిపోతారు. శ్రుతీహాసన్ కంటే అందగత్తెలు కర్ణాటకలోని కళాశాలల్లో చాలా మంది ఉన్నారని కన్నడ నటుడు విమర్శల దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. అసలు విషయం ఏమిటంటే ధృవ సార్జా హీరోగా నటించనున్న కన్నడ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నటి శ్రుతిహాసన్ తాను కన్నడ చిత్రంలో నటించడం లేదని తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. అంతే కన్నడ సినీ అభిమానులు తమ ఊరులోనే అందమైన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. మీరు మాకు అక్కర్లేదు అంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లో శ్రుతిహాసన్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ తతంగం అంతా చూసిన కన్నడ నటుడు జగ్గూష్ కర్ణాటకలో చాలా మంది అందమైన హీరోయిన్లు ఉన్నారనీ, అందువల్ల నిర్మాతలు శ్రుతిహాసన్ ఇంటి వాకిలిలో నిలబడి బిచ్చమెత్తాల్సిన అవసరం లేదని అన్నారు. అయినా నిర్మాతలు మారరని పేర్కొన్నారు. శ్రుతిహాసన్ కంటే అందగత్తేలు కర్ణాటకలో చాలా మంది ఉన్నారని, అసలు శ్రుతిహాసన్‌ను మేకప్ లేకుండా చూస్తే జనాలు పారిపోతారని ఆమెను చాలా తక్కువ చేస్తూ విమర్శల దాడి చేశారు. ఎలాంటి ప్రమేయం లేకుండా కన్నడ నటుడు జగ్గేష్ నటి శ్రుతిహాసన్‌పై విమర్శలు చేయడం వివాదాస్పదంగా మారింది. తాను కన్నడ చిత్రంలో నటించడం లేదని శ్రుతిహాసన్ క్లారిటీ ఇవ్వడం కూడా తప్పా? దీనికే ఇంతగా దిగజారి విమర్శిస్తారా? అంటూ తమిళ సినీ అభిమానులు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి. -
ఎగరాలని ఉంది!
‘‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది...’’ అంటూ ‘వేదం’ సినిమాలో అనుష్క హుషారుగా ఆడిపాడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు శ్రుతీహాసన్ కూడా ఎగిరిపోవాలని ఉందంటున్నారు. అయితే, ఆ సినిమాలో సీన్‌కీ శ్రుతీహాసన్ ఎగిరిపోవాలనుకోడానికి సంబంధం లేదు. సీన్ కంప్లీట్ డిఫరెంట్. రీసెంట్గా శ్రుతీహాసన్ ట్రాఫిక్ సమస్యల వల్ల బాగా ఇబ్బందిపడుతున్నట్లున్నారు. ఆదివారం కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారట. దాంతో సహనం కోల్పోయారు. ‘‘ఈ ట్రాఫిక్ వల్ల బోలెడంత టైమ్ వేస్ట్ అవుతోంది. రెక్కలు ఉంటే బాగుండేది. ఎంచక్కా ఎగరొచ్చు’’ అంటూ ట్విట్టర్లో తన అసహనం వ్యక్తం చేశారు. ఆ సంగతి పక్కనపెడితే.. ప్రస్తుతం శ్రుతి చేతిలో పెద్దగా సినిమాలు లేవు. తండ్రి కమల్‌హాసన్ దర్శకత్వం వహిస్తూ, టైటిల్ రోల్ చేస్తోన్న ‘శభాష్ నాయుడు’లో ఆయనకు కూతురిగా నటిస్తున్నారు. కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నారట. త్వరలో ఓ మంచి కథ సెలక్ట్ చేసుకుని, ఆ చిత్రవివరాలను ప్రకటించాలనుకుంటున్నారట. -
స్త్రీల గీతానికి 'శ్రుతి'
మహిళా దినోత్సవం స్పెషల్ శ్రుతీహాసన్ మల్టీ ట్యాలెంటెడ్. ఆమెలో మంచి నటి, గాయని, సంగీత దర్శకురాలు, రచయిత్రి ఉన్నారు. రానున్న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరిలో చైతన్యం నింపే విధంగా ఆమె ‘మై డే ఇన్ ది సన్...’ అనే పాట రాశారు. ప్రతి స్త్రీ ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థయిర్యంతో ఉండాలని ఈ పాట ద్వారా చెప్పడమే తన ప్రధానోద్దేశమని శ్రుతీహాసన్ పేర్కొన్నారు. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పాటను విడుదల చేయనున్నారు. పాట రాయడం, పాడటంతో పాటు సంగీత దర్శకులు ఎహ్సాన్-లాయ్ జంటతో కలిసి ట్యూన్ తయారు చేయడానికి కూడా కృషి చేశారామె. ‘‘ఇది మన (మహిళలను ఉద్దేశించి) టైమ్. మనం ఎదగాలి. మానసికంగా బలంగా ఉండాలి. ఆత్మన్యూనతా భావంతో, అభద్రాతాభావంతో తమను తాము ఎదగనివ్వ కుండా చేసుకుంటున్న మహిళలకు స్ఫూర్తిగా నిలవాలి. ఈ పాట అలానే ఉంటుంది. ఇది మనసుతో పాడుకోదగ్గ పాట. ఎహ్సాన్-లాయ్ వంటి ప్రతిభావంతులతో కలిసి ఈ పాట చేయడం ఆనందంగా ఉంది. వాళ్ల పాటలు వింటూ పెరిగినదాన్ని నేను’’ అని శ్రుతి చెప్పారు. ఆడియో విడుదల చేసి, ఆ తర్వాత కొన్ని నెలలకు వీడియోను కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. -
మరో రీమేక్ పై మనసుపడ్డాడు
బ్రూస్ లీ సినిమాతో ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయిన రామ్ చరణ్ ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాల మీద దృష్టిపెట్టాడు. కొత్త కథలతో ప్రయోగం చేసే కన్నా ఇప్పటికే హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయటం బెటర్ అని భావిస్తున్నాడు. అందుకే తమిళంలో ఘనవిజయం సాధించిన తనీఒరువన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ సురేందర్ రెడ్డి, ఈ సినిమాను తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్చే పనిలో బిజీగా ఉన్నాడు. తనీఒరువన్ రీమేక్ తరువాత కూడా మరోసారి రీమేక్ సినిమానే చేయాలనే ఆలోచనలో ఉన్నాడు చెర్రీ. ప్రస్తుతం బాలీవుడ్లో జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ రాఖీ హ్యాండ్సమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. రాఖీ హ్యాండ్సమ్ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ చెర్రీతో ఈ సినిమా కథ గురించి చెప్పడంతో, చరణ్ ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడన్న టాక్ వినిపిస్తోంది. -
నాగచైతన్యతో మడోనా
భారీ వేట తరువాత నాగచైతన్యకు మూడో జోడి కుదిరింది. ప్రస్తుతం మళయాల సూపర్ హిట్ సినిమా ప్రేమమ్‌కు రీమేక్‌గా రూపొందుతున్న మజ్ను సినిమాలో నటిస్తున్నాడు చైతు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్‌లు హీరోయిన్లుగా ఫైనల్ కాగా ఇప్పుడు మరో పాత్రకు మళయాలి బ్యూటినే ఎంపిక చేశారు. ప్రేమమ్ ఒరిజినల్ వర్షన్లోనటించిన మడోనా సెబాస్టియన్‌ను, తెలుగు వర్షన్లోనూ అదే పాత్రకు ఫైనల్ చేశారు.రకుల్ ప్రీత్ సింగ్, అమైనా దస్తర్ లాంటి చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించినా ఫైనల్‌గా ఒరిజినల్ వర్షన్లోనటించిన మడోనాకే ఓటేశారు చిత్రయూనిట్. నాగచైతన్య మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్న ఈ సినిమాకు కార్తికేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు. -
'ధూమ్ 4'లో అల్లు అర్జున్
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ధూమ్ 4తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. బన్నీ హీరోగా నటించిన ధూమ్ 4 త్వరలోనే బాలీవుడ్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. అదేంటి ధూమ్ 4 సినిమాలో బన్నీనా..? అది కూడా అప్పుడే రిలీజ్‌కు రెడీ అయ్యిందా...? అని ఆశ్చర్యపోకండి. అక్కడే ఉంది అసలు కథ. అల్లు అర్జున్ హీరోగా నటించిన తెలుగు బ్లాక్ బస్టర్ సినిమా రేసుగుర్రం, ధూమ్ 4 పేరుతో హిందీలో రిలీజ్ అవుతోంది. తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ అయి, సక్సెస్ సాధించిన సందర్భాలు చాలా అరుదు. అయితే ఈసారి మాత్రం బన్నీ.., ధూమ్ టైటిల్‌తో మంచి పబ్లిసిటీనే సాధించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. శృతితో పాటు విలన్‌గా నటించిన రవికిషన్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస్‌లు నార్త్ ప్రేక్షకులకు సుపరిచితులు కావటంతో రేసుగుర్రం అక్కడ కూడా మంచి వసూళ్లనే రాబడుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.