
ఆవిడ కాస్ట్యూమ్స్ ఖర్చు... కోటికి పైనే!
నటి డింపుల్ కపాడియా పేరు చెప్పగానే సినీ ప్రియులకు ‘బాబీ’ రోజుల నుంచి ‘దిల్ చాహ్‌తా హై’ దాకా ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలు వస్తాయి
నటి డింపుల్ కపాడియా పేరు చెప్పగానే సినీ ప్రియులకు ‘బాబీ’ రోజుల నుంచి ‘దిల్ చాహ్‌తా హై’ దాకా ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలు వస్తాయి. తాజాగా ‘వెల్‌కవ్‌ు బ్యాక్’ సినిమాలో నటించారామె. సెప్టెం బర్ మొదటివారంలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఒక విశేషం ఉంది. ఈ సినిమాలో డింపుల్ వేసుకున్న దుస్తుల విలువ దాదాపు కోటి రూపాయల పైచిలుకట. ఈ విషయం గురించి బాలీవుడ్ జనం ఇప్పుడు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. హీరోయిన్‌గా చేసిన రోజులతో పోలిస్తే, క్యారెక్టర్ యాక్ట్రెస్‌గా చేస్తున్నప్పుడు ఇంత ఖరీదైన కాస్ట్యూవ్‌ు్స ఏమిటని ఆశ్చర్యపోకండి. డింపుల్ ఈ వయసులో కాస్ట్యూవ్‌ు్సకి అంత డిమాండ్ చేసిందా అనుకోకండి.
జాన్ అబ్రహవ్‌ు, శ్రుతీహాసన్, అనిల్ కపూర్, నానా పాటేకర్ లాంటి ప్రముఖ నటులున్న ఈ ‘వెల్‌కవ్‌ు బ్యాక్’ సినిమాలో డింపుల్ పాత్ర అలాంటిది మరి. డింపుల్ ఈ సినిమాలో రాజవంశపు మహారాణిగా నటిస్తున్నారు. దాంతో, పాత్రకు తగ్గట్లుగా రియల్‌గా కనిపించడం కోసం డింపుల్ కాస్ట్యూవ్‌ు్స మీదే కోటికిపైగా ఖర్చుపెట్టారట. చిత్ర దర్శకుడు అనీస్ బాజ్మీ స్వయంగా ఆ మాట చెప్పారు. మొత్తానికి, లేటు వయసులో కూడా డింపుల్ కపాడియాకు ఖరీదైన పాత్రే తగిలిందన్న మాట.