Balakrishna NBK107 Movie Title And Logo Launch At Kurnool, Deets Inside - Sakshi
Sakshi News home page

NBK 107 Movie Update: బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్.. టాలీవుడ్‌ చరిత్రలోనే తొలిసారి..!

Published Wed, Oct 19 2022 4:48 PM | Last Updated on Wed, Oct 19 2022 5:37 PM

Balakrishna Latest Movie NBK107 Title Logo Launch At Kurnool On 21st October - Sakshi

నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్‌ న్యూస్. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఎన్‌బీకే107 నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ లోగోను లాంఛ్‌ చేయనున్నట్లు ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈనెల 21 కర్నూలులోని చారిత్రక కట్టడమైన కొండారెడ్డి బురుజుపై ఆవిష్కరించనున్నారు. దీపావళి కానుకగా నందమూరి అభిమానులకు టైటిల్ లోగోను విడుదల చేస్తున్నారు. అఖండతో బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టిన నటసింహం.. మరోసారి 'ఎన్​బీకే 107'తో ప్రేక్షకులను అలరించనున్నారు. 

(చదవండి: NBK107: కర్నూల్‌ కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య సందడి!)

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి 12 జనవరి 2023న ఈ సినిమా విడుదలకు చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. గోపీచంద్​ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్​ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు  వరలక్ష్మీ శరత్ కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలయ్య సరసన శ్రుతిహాసన్​ హీరోయిన్​గా నటిస్తోంది. ఈ చిత్రానికి బీజీఎం కింగ్ ఎస్ఎస్ తమన్​ సంగీతమందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement