Nandamuri Balakrishna Movie: Kannada Actor Duniya Vijay As Villain - Sakshi
Sakshi News home page

Balakrishna New Movie: బాలయ్యకు విలన్‌గా దునియా విజయ్‌

Published Sat, Nov 6 2021 11:30 AM | Last Updated on Sat, Nov 6 2021 11:54 AM

Kannada Actor Duniya Vijay As Villain In Nandamuri Balakrishna Movie - Sakshi

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.  మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోయే ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనుందని టాక్‌. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి చేసిన గోపీచంద్ నటీనటులను సెలెక్ట్‌ చేసే పనులతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బాలయ్య సరసన శృతి హాసన్‌ను ఖరారైంది. ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది.

చదవండి: బాలయ్యతో జతకట్టనున్న శ్రుతీ

ఇక ఈ సినిమాలో బాలకృష్ణకు విలన్‌గా కన్నడ నటుడిని సంప్రదించినట్లు తెలుస్తోంది.  ఆయన ఎవరో కాదు దునియా విజయ్‌.  కన్నడలో రౌడీ రోల్స్ ఎక్కువగా చేసిన విజయ్ .. 'దునియా' సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఆ సినిమా పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బాలయ్య కోసం ఆయనను విలన్‌గా దర్శకుడు ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాలి. గతంలో కన్నడ నుంచి వచ్చిన ప్రభాకర్ .. దేవరాజ్  ఇక్కడ విలన్స్‌గా రాణించిన సంగతి తెలిసిందే.

చదవండి: Unstoppable Talk Show: చిరంజీవిపై మోహన్‌ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement