బాలయ్య ఎన్‌బీకే107 మూవీ.. సమరసింహారెడ్డిని మించిపోయేలా టైటిల్ | Nandamuri Balakrsihna 107 Movie Title Logo Released At Kurnool Kondareddy Fort | Sakshi
Sakshi News home page

NBK107 Title Logo: బాలయ్య ఎన్‌బీకే107.. టైటిల్‌ లోగో రిలీజ్

Published Fri, Oct 21 2022 8:46 PM | Last Updated on Fri, Oct 21 2022 9:04 PM

Nandamuri Balakrsihna 107 Movie Title Logo Released At Kurnool Kondareddy Fort - Sakshi

బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్ర చేస్తున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఏపీలోని కర్నూలు పట్టణంలో ఉన్న చారిత్రక కట్టడం కొండారెడ్డి బురుజు వేదికగా చరిత్రలోనే తొలిసారిగా టైటిల్ లోగోను విడుదల చేశారు. ఈ సినిమాకు సమరసింహారెడ్డి రేంజ్‌లో 'వీరసింహారెడ్డి' అనే టైటిల్‌తో టైటిల్ లోగో పోస్టర్ రిలీజ్ చేశారు. గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు.

టైటిల్‌ లోగో చూస్తే పక్కా మాస్ యాక్షన్ ఖాయంగా కనిపిస్తోంది. పోస్టర్‌లో నలుపు రంగు షర్ట్‌  ధరించి.. కిలోమీటర్‌ రాయిపై ఒంటికాలితో నిలబడిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. బాలయ్య యంగ్‌ అండ్‌ డాషింగ్‌ కనిపిస్తున్నాడు. హై ఇంటెన్స్‌ మాస్, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ దునియా విజయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. బాలకృష్ణ కెరీర్‌లో 107వ చిత్రంగా నిలవనుంది. ఎక్కడా రాజీపడకుండా భారీ బాడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement