#NBK107తో సరికొత్త విలనిజం చూపెడదాం: మాస్‌ డైరెక్టర్‌ | Duniay Vijay Plays Vilian Role In Balaksrishna Gopichand Malineni Movie | Sakshi
Sakshi News home page

#NBK107: బాలకృష్ణ సినిమాలో విలన్‌గా కన్నడ హీరో.. ఇట్స్‌ అఫిషియల్‌

Published Mon, Jan 3 2022 9:26 PM | Last Updated on Mon, Jan 3 2022 9:30 PM

Duniay Vijay Plays Vilian Role In Balaksrishna Gopichand Malineni Movie - Sakshi

Duniay Vijay Plays Vilian Role In Balaksrishna Gopichand Malineni Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ' సినిమాతో బాక్సాఫీస్‌ను  ఒక ఊపు ఊపేసారు. అలాగే ఆహా ఓటీటీలో వస్తున్న 'అన్‌స్టాపబుల్‌ షో'కి హోస్ట్‌గా చేస్తూ 'ఘట్టమేదైనా.. పాత్రేదైనా.. నేను రెడీ' అంటూ సూపర్‌ జోష్‌లో ముందుకు సాగుతున్నారు. క్రాక్‌ సినిమాతో హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేనితో బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాను  #NBK107 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. గోపిచంద్‌ మలినేని మాస్‌ డైరెక్టర్‌, బాలకృష్ణ మాస్‌ హీరో. మరీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో విలన్‌ ఎవరా అనే ఆసక్తి కచ్చితంగా ఉంటుంది. 

అందుకే ఈ సినిమాలో విలన్‌ పాత్రకు ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా డైరెక్టర్‌ గోపిచంద్‌ ప్రకటించారు. 'వేరీ హ్యాపీ టు వెల్‌కమ్‌ ది సాండల్‌వుడ్‌ సెన్సేషన్‌ దినియా విజయ్‌. ఈ సినిమాతో విలనిజానికి సరికొత్త నిర్వచనం ఇద్దాం.' అంటూ ట్వీట్‌ చేశారు. ఇందులో హీరో విలన్ల మధ్య సీన్లు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్‌ బుర్ర డైలాగ్స్‌ రాయగా తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించగా ఈ నెల నుంచి సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది. 
 

ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఈవెంట్‌కు లక్షల్లో అభిమానులు.. 10 ప్రత్యేక రైళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement