Villain role
-
మహేశ్ ద్విపాత్రాభినయం.. విలన్‌గా కూడా..?
మహేశ్‌బాబు విలన్ పాత్రలో కనిపిస్తే ఎలా ఉంటారు? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం లేకపోలేదు. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేశ్ రెండు పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకటి హీరో పాత్ర అన్నది కన్ఫార్మ్. రెండోది విలన్ అని సమాచారం. కాగా విలన్ పాత్రకు మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ని అనుకున్నారనే వార్త వచ్చింది.ఆ తర్వాత విక్రమ్ పేరు వినిపించింది. అయితే ఈ రెండు పాత్రలనూ మహేశ్‌బాబుతోనే చేయించాలని రాజమౌళి అనుకుంటున్నారట. ఆఫ్రికాలోని అమేజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేశ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ మధ్య కండలు తిరిగిన దేహం, కాస్త లెంగ్తీ హెయిర్, గడ్డంతో కొత్తగా కనిపిస్తున్నారు మహేశ్. రాజమౌళి సినిమా కోసమే ఇలా మేకోవర్ అయ్యారని సమాచారం.త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలని అనుకుంటున్నారు. మరి... ఈ సినిమాలో మహేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారా? అదే నిజమైతే హీరో... విలన్‌గానా? లేక రెండు పాజిటివ్ క్యారెక్టర్సా? అనేది తెలియాల్సి ఉంది. -
బాలీవుడ్ స్టార్ హీరోకు విలన్‌గా విజయ్ సేతుపతి?
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగానే కాదు విలన్‌గానూ సత్తా చాటుతున్నాడు. భాషతో సంబంధం లేకుండా పాత్ర ప్రాధాన్యతను బట్టి అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఉప్పెన మూవీతో తెలుగులో విలన్‌గా పరిచమైన ఆయన త్వరలో బాలీవుడ్ స్టార్ హీరోతో తలపెడేందుకు రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బాద్షా షారుక్ హీరోగా దర్శకుడు అట్లీ దర్శకత్వంతో జవాన్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా చేస్తోంది. ఇప్పుడు ఈ మూవీలో విలన్‌గా విజయ్ సేతుపతి పేరును చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జరుపుకుంటోంది. అయితే ఇందులో పవర్ఫుల్ విలన్ రోల్‌ను అట్లీ డిజైన్ చేశాడట. ఇక ఈ పాత్రకు విజయ్ సేతుపతి అయితేనే బాగుంటుందని దర్శకుడు షారుక్‌ను ఒప్పించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో వెంటనే విలన్ రోల్ కోసం మూవీ టీం ఇప్పటికే విజయ్ సేతుపతిని సంప్రదించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి విజయ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే సినిమా షూటింగు సెట్లో అడుగు పెడతాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి హిందీ చిత్రంలో విలన్‌గా అంటే మంచి ఆఫర్ అని, ఈ సినిమాతో విజయ్ సేతుపతి రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందంటూ ఆయన అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగగా.. సాన్య మల్హోత్రా, ప్రియమణి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. -
మెగా 154: చిరుకి విలన్‌గా ఆ మలయాళ స్టార్ నటుడు?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ ఉన్నాడు. ఇటీవల ఆచార్య సినిమాతో పలకరించిన చిరు ఆ వెంటనే భోళా శంకర్, గాడ్ ఫాదర్‌తో పాటు బాబీ డైరెక్షన్లో ఓ సినిమా లైన్లో పెట్టాడు. ఇటీవల గాడ్ ఫాదర్, బాబీ చిత్రాలు సెట్స్‌పైకి రాగా చిరు ఒకేసారి ఈ రెండు మూవీ షూటింగ్స్ల్లో పాల్గొంటున్నాడు చిరు. ఈ క్రమంలో మెగా 154 మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తిక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలోని ప్రతికథానాయకుడి పాత్ర కోసం చిత్ర బృందం తమిళ హీరో విజయ్ సేతుపతి, నటుడు సముద్రఖనిలను అనుకుంటున్నట్లు ఇప్పటి వరకు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై స్పష్టత లేదు. చదవండి: హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. ఈ క్రమంలో తాజాగా మరో నటుడి పేరు తెరపైకి వచ్చింది. విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ నటుడు బీజూమీనన్ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తుందట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుందని సమాచారం. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’తో బిజు మీనన్ పేరు దక్షిణాదిన మారు మోగిపోయింది. కాగా బిజూ మీనన్ ‘రణం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి ఈ చిత్రంలో అండర్‌కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. విశాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మాస్రాజ రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
పవర్ఫుల్ విలన్ పాత్రలో ఆ హీరో.. అదరగొడుతున్న పోస్టర్
యంగ్ హీరో తేజ సజ్జ, హీరోయిన్ అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తి కలిగించాయి. తాజాగా విడుదలైన మరో పోస్టర్ మరింత ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ మైఖెల్ పాత్రలో హీరో వినయ్ రాయ్ నటిస్తున్నాడు. తాజాగా ఆయన పోస్టర్‌ను రానా దగ్గుబాటి ఆవిష్కరించాడు. పోస్టర్ చూస్తుంటే ఇందులో వినయ్ రాయ్ అత్యంత బాడాస్ ఈవిల్ మ్యాన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ లాంగ్ సూట్లో చుట్టూ డ్రోన్స్‌తో ఉన్న వినయ్ రాయ్ పోస్టర్ థ్రిల్లింగ్‌గా ఉంది. వినయ్ రాయ్ ఇంతకుముందు నీవల్లే నీవల్లే, వాన సినిమాలో హీరోగా అలరించాడు. కాగా ఈ మూవీలో ఓ కీరోల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనున్న విషయం తెలిసిందే. చదవండి: చిరంజీవి బయోపిక్ గురించి నేను అలా అనలేదు: సీనియర్ నటుడు -
ఎన్టీఆర్‌కు విలన్‌గా కమల్ హాసన్ !.. ఇదెక్కడి మాస్ ఐడియా నీల్ మావా..
కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించి యావత్ దేశ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సలార్ చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మరో చిత్రాన్ని ప్రకటించాడు ప్రశాంత్ నీల్. తారక్ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీబర్త్‌డే ఎన్టీఆర్ 31’ ట్యాగ్‌లైన్‌తో ఫస్ట్ పోస్టర్‌ను విడుదల చేశాడు. ఈ పోస్టర్లో తారక్ లుక్ ఎంత మాస్‌గా ఉండబోతుందో రివీల్ చేసి ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అయితే ఎన్టీఆర్ 31వ చిత్రంగా వస్తున్న సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో తారక్‌ను ఢీకొట్టే విలన్ పాత్రలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌ను బరిలోకి దించనున్నాడట. ఇటీవల విడుదలై విక్రమ్ ట్రైలర్లో కమల్ లుక్స్ మాస్‌గా, రఫ్‌గా కనిపించడంతో ఆయన అయితేనే ఈ మూవీలో విలన్ రోల్‌కు సరిగ్గా సరిపోతాడని ప్రశాంత్ భావించినట్లు సమాచారం. అయితే ఈ సినిమా కథను కమల్ హాసన్‌కు వినిపించగా, ఆయన కూడా కథ బాగా నచ్చి ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ 'ఇదెక్కడి మాస్ ఐడియా నీల్ మావా' అనుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇటు ఎన్టీఆర్, అటు కమల్ హాసన్ యాక్టింగ్ చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. చదవండి: నన్ను క్షమించండి..అభిమానులకు ఎన్టీఆర్ ఎమోషనల్ లేఖ 𝑻𝒉𝒆 𝒐𝒏𝒍𝒚 𝒔𝒐𝒊𝒍 𝒕𝒉𝒂𝒕 𝒊𝒔 𝒘𝒐𝒓𝒕𝒉 𝒓𝒆𝒎𝒆𝒎𝒃𝒆𝒓𝒊𝒏𝒈 𝒊𝒔 𝒕𝒉𝒆 𝒐𝒏𝒆 𝒔𝒐𝒂𝒌𝒆𝒅 𝒊𝒏 𝒃𝒍𝒐𝒐𝒅! 𝐇𝐢𝐬 𝐬𝐨𝐢𝐥.... 𝐇𝐢𝐬 𝐫𝐞𝐢𝐠𝐧 ..... 𝐁𝐮𝐭 𝐝𝐞𝐟𝐢𝐧𝐢𝐭𝐞𝐥𝐲 𝐧𝐨𝐭 𝐡𝐢𝐬 𝐛𝐥𝐨𝐨𝐝....@tarak9999 @MythriOfficial @NTRArtsOfficial pic.twitter.com/NNSw3O9zU6 — Prashanth Neel (@prashanth_neel) May 20, 2022 -
విలన్‌గా మారిన 'రాజా రాణి' నటుడు
దర్శకుడు సుందర్ సి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పట్టాం పూచ్చి. ఇందులో ప్రతి నాయకుడిగా జయ్ నటించడం విశేషం. ఈ క్రేజీ చిత్రాన్ని అవ్నీ టెలీ మీడియా పతాకంపై నటి కుష్భు సుందర్ నిర్మిస్తున్నారు. నటి హనీరోస్, ఇమాన్ అన్నాచ్చి, బేబీ మనస్వి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బద్రి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కృష్ణస్వామి చాయాగ్రహణను, నవనీత్ సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం గీత రచయిత ముకుందన్ రామన్ రాసిన పట్టాం పూచ్చి అనే పల్లవితో సాగే తొలి పాటను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేశారు. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ..1980లో జరిగే సైకో థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. తాజాగా విడుదల చేసిన పట్టాం పూచ్చి పాటకు మంచి ఆదర ణ లభిస్తోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. -
#NBK107తో సరికొత్త విలనిజం చూపెడదాం: మాస్ డైరెక్టర్
Duniay Vijay Plays Vilian Role In Balaksrishna Gopichand Malineni Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ' సినిమాతో బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపేసారు. అలాగే ఆహా ఓటీటీలో వస్తున్న 'అన్‌స్టాపబుల్ షో'కి హోస్ట్‌గా చేస్తూ 'ఘట్టమేదైనా.. పాత్రేదైనా.. నేను రెడీ' అంటూ సూపర్ జోష్‌లో ముందుకు సాగుతున్నారు. క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాను #NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. గోపిచంద్ మలినేని మాస్ డైరెక్టర్, బాలకృష్ణ మాస్ హీరో. మరీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో విలన్ ఎవరా అనే ఆసక్తి కచ్చితంగా ఉంటుంది. అందుకే ఈ సినిమాలో విలన్ పాత్రకు ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ గోపిచంద్ ప్రకటించారు. 'వేరీ హ్యాపీ టు వెల్కమ్ ది సాండల్‌వుడ్ సెన్సేషన్ దినియా విజయ్. ఈ సినిమాతో విలనిజానికి సరికొత్త నిర్వచనం ఇద్దాం.' అంటూ ట్వీట్ చేశారు. ఇందులో హీరో విలన్ల మధ్య సీన్లు ఏ రేంజ్లో ఉండబోతున్నాయనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ రాయగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించగా ఈ నెల నుంచి సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది. Very happy to welcome the Sandalwood Sensation #DuniyaVijay on board to #NBK107 🎉😊 Redefines the Villainism with #NBK107 👍🏻 NataSimham #NandamuriBalakrishna @shrutihaasan @officialviji @MusicThaman @MythriOfficial pic.twitter.com/x6mYe37rzu — Gopichandh Malineni (@megopichand) January 3, 2022 ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఈవెంట్‌కు లక్షల్లో అభిమానులు.. 10 ప్రత్యేక రైళ్లు -
ఇప్పటివరకు సునీల్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు...
Sunil First Look as Mangalam Srinu in Pushpa Movie: ఇప్పటివరకు హాస్యనటుడిగా, హీరోగా అలరించిన సునీల్ తొలిసారిగా 'పుష్ప' కోసం విలన్‌గా మారాడు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో సునీల్.. మంగళం శ్రీను అనే పాత్రలో కనిపించనునున్నాడు. దీనికి సంబంధించి సునీల్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో మునుపెన్నడూ లేని విధంగా బట్టతలతో, భయంకరమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చాడు.భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ రానున్న మూడో సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, లిరికల్ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. Presenting the face of evil 😈 Introducing @Mee_Sunil as #MangalamSrinu from #PushpaTheRise 🔥#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/zRSNH9tFnw — Pushpa (@PushpaMovie) November 7, 2021 -
నయనకు విలన్‌గా ప్రభుదేవా?
నటి నయనతారకు ప్రభుదేవా విలన్‌గా మారనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో సంచలనంగా మారిన అంశం ఇదే. నిజా నికి ప్రభుదేవా, నయనతారల ప్రస్థావన రావడమే ఒక సంచలనం. ఎందుకుంటే వీరిద్దరూ ఒకప్పుడు అందుకు కేంద్రబిందువులుగా మారారు కాబట్టి. డీప్‌గా ప్రేమించికుని పెళ్లి దాకా వచ్చి విడిపోయిన మాజీ ప్రేమజంట అన్నది అందరికీ తెలిసిందే. అంతకు ముందు మాజీ ప్రేమికుడు శింబుతో కలిసి ఇదునమ్మఆళు చిత్రంలో నటించి ఎంతగా ఆశ్చర్యం కలిగించారో తెలిసిందే. తాజాగా మరో మాజీ ప్రియుడితో నటిస్తూ మరో షాక్ ఇవ్వనున్నారా? నయనతార ప్రస్తుతం నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కొలైయుధీర్ కాలం ఒకటి. టాలీవుడ్ దర్శకుడు, ఉన్నైపోల్ ఒరువన్, బిల్లా–2 చిత్రాల ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. హారర్ థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న దీన్ని హిందీ లోనూ రీమేక్ చేయనున్నట్లు, అందులో నయనతార పాత్రను నటి తమన్నా పోషించనున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అదే విధంగా హిందీ వెర్షన్లో తమన్నకు విలన్‌గా నటుడు ప్రభుదేవా నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే తమిళంలో ఆ పాత్రను పోషిస్తున్నదెవరన్న ప్రశ్న తలెత్తింది. ఈ అంశాన్ని దర్శక నిర్మాతలు రహస్యంగానే ఉంచారు. ప్రభుదేవాకు హిందీలో మాదిరిగానే దక్షిణాదిలోనూ మంచి మార్కెట్ ఉందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. అందువల్ల తమిళంలో కొలైయుధీర్ కాలం చిత్రంలో నయనతారకు విలన్‌గా ప్రభుదేవానే నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సంచలన చిత్రం ద్వారా ప్రముఖ సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా నిర్మాతగా మారుతున్న విషయం తెలిసిందే. ఆయన గానీ, దర్శకుడు చక్రీ తోలేటిగానీ సరైన వివరణ ఇచ్చే వరకూ ఇలాంటి ఊహాజనిత ప్రచారాలు కొనసాగుతూనే ఉంటాయి మరి. -
నువ్వు బినామీ అయితే... నేను సునామీ!
‘నమస్తే పెద్దిరెడ్డిగారూ...’ ఆహా... పెద్దిరెడ్డి అంటే ఈ భూమారెడ్డికి ఎంత మర్యాదా... ఎంత మర్యాద! అంతేనా? అదిగో... ఈ భూమారెడ్డి వెళ్లి ఆ పెద్దిరెడ్డి కాళ్ల దగ్గర కూర్చొని ఏమంటున్నాడో చూడండి... ‘నిన్న కురిసిన వానకు నేడు మొలకెత్తిన మొలకలం. మేము ఎంత గొప్పవాళ్లమైనా... నీ ముందు ఇంతే కదయ్యా’ వినయం సంగతి అటుంచండి... క్లారిటీ సంగతి చూడండి... హీరో భుజం మీద చెయ్యి వేస్తాడు భూమారెడ్డి... హీరో ఊరుకుంటాడా ఏమిటి? ‘చేయి తీయ్’ అంటాడు. ‘తీయకపోతే?’ అని అడుగుతాడు భూమారెడ్డి. ‘తీస్తాను’ అంటాడు హీరో. ‘ఏ చెయ్యి తీస్తావు? కుడి చెయ్యా? ఎడమ చెయ్యా’ అని క్లారిటీగా అడుగుతాడు భూమారెడ్డి. అలా అని అతని ప్రతి మాటలోనూ క్లారిటీ ఉంటుందని కాదు... ‘లవ్వు సెయ్యెద్దాన్నానుగానీ... పెళ్లి చేసుకోవద్దన్నానా? పెళ్లి చేసుకోవాలిగానీ... లవ్వొద్దు’ అని క్లారిటీ లేకుండా కూడా మాట్లాడగలడు. ఆశుతోష్ రాణా విలనిజానికి ఎన్ని షేడ్స్ ఉన్నాయో ‘బంగారం’ సినిమాలో భూమారెడ్డి పాత్ర చెప్పకనే చెబుతుంది. ‘స్టార్’ కావాలని ఎవరికి మాత్రం ఉండదు. మరి అశుతోష్ అలా అంటాడేమిటి? ఇంతకీ ఏమిటంటాడు? ‘స్టార్’గా కంటే ‘యాక్టర్’గా ఉండడమే ఎక్కువ ఇష్టం అంటున్నాడు. ఒక్కసారి ‘స్టార్’ అయిన తరువాత ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేయాల్సివస్తుంది... అంటాడు ఆశుతోష్. అందుకేనేమో... ‘భిన్నమైన పాత్రలు’ పోషించే నటుడిగా ఆయనకు ప్రేక్షకుల్లో మంచి పేరొచ్చింది. ‘‘చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేస్తున్నానా? అనే సందేహం వచ్చినప్పుడు... ఎవరో వచ్చి... కొద్దిగా రూట్ మార్చమని సలహా ఇవ్వడం కాదు... మనకు మనమే మార్చుకోవాలి.’’ అంటున్నాడు ఆశుతోష్. ఆయన మాటలు కాస్త జాగ్రత్తగా వింటే హీరో, విలన్ అనే కాన్సెప్ట్‌కు కాలం చెల్లిందా? అనే సందేహం కూడా కలుగుతుంది. ‘నటన ముఖ్యం’ అనే సత్యం మది తెర మీద తళుక్కున మెరుస్తుంది. ఆశుతోష్ రాణా రామ్‌నారాయణ్ నిఖ్రా మధ్యప్రదేశ్‌లోని గడర్వార నగరంలో జన్మించాడు. ప్రాథమిక విద్య అక్కడే పూర్తయింది. ‘రామ్‌లీల’లో రావణుడిగా ఎక్కువగా నటించేవాడు. విలన్ పాత్రలో ఉండే మజా ఏమిటో అప్పుడే తెలిసిందేమో! తన ఆధ్యాత్మిక గురువు ప్రభాకర్ శాస్త్రి్త్ర సలహా ప్రకారం ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చేరాడు. మహేష్‌భట్ డెరైక్ట్ చేసిన 500 ఎపిసోడ్ల టీవి సీరియల్ ‘స్వాభిమాన్’లో ‘రోనీ’ పాత్రతో ప్రేక్షకులను పలకరించాడు ఆశుతోష్. ‘రెండవ ఛాన్సు’ కోసం ఎదురుచూడకుండానే అవకాశాలు వెల్లువెత్తాయి. బాలీవుడ్ సినిమా ‘దుష్మన్’లో ‘కోల్డ్ బ్లడెడ్ మర్డరర్’ ‘సైకోపాత్ కిల్లర్’గా తన విలనిజాన్ని వీరలెవెల్లో ప్రదర్శించాడు ఆశుతోష్. కెరీర్ ప్రారంభంలోనే తన నటనతో ‘పాత్ర’కు బలాన్ని ఇచ్చాడు. ‘లక్’ అనేదానికి రాణా ఇచ్చిన నిర్వచనం ఇది... ‘కష్టానికి, అవకాశం తోడైతే... అదే లక్’ అందుకే ‘లక్’ ఉంటే పాత్ర క్లిక్ అవుతుంది. ‘లక్’ ఉంటే అవకాశాలు వస్తాయి. ‘లక్’ ఉంటే కెరీర్ ఊపందుకుంటుంది... ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు ఆశుతోష్ రాణా. అందుకే ‘సాధన’కు ఎప్పుడూ దూరం కాలేదు. దాని ప్రభావం వృథా పోలేదు. ‘ఆశుతోష్ రాణా అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలడు’ అనిపించుకున్నాడు. ‘ఇది నటన’ ‘ఇది మాత్రమే నటన’ అని కొలవడానికి సాధనాలేమీ లేవు అంటున్న రాణా... ప్రతి నటుడిలోని తనదైన వైవిధ్యం ఉంది అంటాడు. ఆ వైవిధ్యం చూపించడమే ‘ప్రతిభ’ అంటాడు. ‘నటనలో దమ్ముంటే... విలన్‌లోనూ హీరోను చూపించవచ్చు’ అని నమ్ముతాడు రాణా. బాలీవుడ్లో ఎన్ని రకాల పాత్రలు చేసినా... దక్షిణాది చిత్రాల్లో మాత్రం... ఆశుతోష్= విలన్! ‘వెంకీ’ ‘బంగారం’ ‘ఒక్క మగాడు’ ‘విక్టరీ’ ‘బలుపు’ ‘తడాఖా’ ‘పటాస్’ ‘చుట్టాలబ్బాయి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందుకే మన ‘ఉత్తమ విలన్’ అయ్యాడు. పోటీలోనే కాదు. జీవితంలోను గెలవనోడు బతకకూడదు. (బంగారం సినిమాలో డైలాగ్) -
విలన్ రోల్ కోసం ఎదురుచూస్తున్న హీరో
అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సుమంత్ రెండేళ్ల విరామం తరువాత ఓ డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్లో ఘనవిజయం సాదించిన విక్కీ డోనర్ సినిమాను తెలుగులో నరుడా డోనరుడా పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం నరుడా డోనరుడా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సుమంత్, నటుడిగానూ తానేంటో నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. అందుకే అవకాశం వస్తే విలన్ రోల్స్‌లో కూడా నటించడానికి రెడీ అంటూ ప్రకటించాడు. తనకు రామాయణంలో రావణుడు, మహాభారతంలో దుర్యోధుడు లాంటి పాత్రలంటే ఇష్టమని ఆ తరహా పాత్రకోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. -
విశాల్‌కు విలన్‌గా ఆర్య?
నటుడు విశాల్‌కు ఆర్యకు మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అరే ఒరే అని పిలుచుకునేంత మిత్రుత్వం వారిది. అలాంటిది ఆర్య విశాల్‌కు విలన్‌గా మారడం ఏమిటన్న సందేహం కలగవచ్చు. అయితే రియల్ జీవితంలో మిత్రులైన వీరు రీల్ జీవితంలో శత్రువులుగా మారనున్నారన్నది కోలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం. వివరాల్లోకెళితే విశాల్ ప్రస్తుతం కత్తిసండై చిత్రాన్ని పూర్తి చేసి మిష్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ చిత్రంలో నటిస్తున్నారు. కత్తిసండై చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు ముందు ప్రకటించినా, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో విడుదలను నవంబర్‌కు వాయిదా వేశారు. కాగా తుప్పరివాలన్ చిత్రం పూర్తి చేసిన తరువాత విశాల్ నవదర్శకుడు పీఎస్.మిత్రన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో నటి సమంత నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇరుంబు కుదిరై అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది. ఇది ఇంతకు ముందు మహానటుడు శివాజీగణేశన్ నటించిన చిత్రం టైటిల్ అన్నది గమనార్హం. ఇందులో విశాల్‌కు విలన్‌గా ప్రముఖ నటుడిని ఎంపిక చేయాలని భావించిన దర్శక నిర్మాతలు నటుడు ఆర్య అయితే బాగుంటుందని ఆయన్ని విలన్‌ను చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆర్యకు తమిళంలో హీరో ఇమేజ్ ఉన్నా ఆయన ఇప్పటికే మలయాళం, తెలుగు భాషల్లో ప్రతినాయకుడిగా నటించారన్నది గమనార్హం. అయితే ఆర్య విశాల్‌కు విలన్ అవుతారా? లేదా?అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇకపోతే ఈ క్రేజీ చిత్రానికి సంగీతాన్ని యువన్ శంకర్‌రాజా, చాయాగ్ర హణం జార్జ్ సీ.విలియమ్స్ అందించనున్నారు. -
విలన్‌గా మారుతున్న కమెడియన్
కమెడియన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్, కెరీర్ మంచి ఫాంలో ఉండగానే హీరోగా మారాడు. అయితే హీరోగా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయినా.. చేతినిండా అవకాశాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తన కెరీర్ మరో భారీ మలుపు కు సిద్ధమవుతున్నాడు ఈ నవ్వుల హీరో. ఇప్పటికే తన కామెడీతో కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన సునీల్, తరువాత హీరోగా మారి సిక్స్ బాడీతో ఆకట్టుకున్నాడు. అదే జోరులో ఇప్పుడు విలన్‌గా కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన సునీల్, విలన్‌గా తెలుగు సినిమా మాత్రం చేయనని తెలిపాడు. తెలుగులో తనకు కామెడీ ఇమేజ్ ఉందని ఇక్కడ విలన్ పాత్రలో నటిస్తే వర్క్ అవుట్ కాదన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపాడు. వచ్చే ఏడాది సునీల్ విలన్ గా నటించే సినిమా ప్రారంభం కానుంది. సునీల్ హీరోగా వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈడు గోల్డ్ ఎహె సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
రోబో 2.0లో నేను కాకినా?
ఇప్పటివరకూ హిందీ చిత్రాల్లో హీరోగా విలన్లను రఫ్ఫాడించిన అక్షయ్‌కుమార్ ఇప్పుడు తానే విలన్ అయిపోయారు. రజనీకాంత్ ఇచ్చే పంచ్‌లను ఆనందంగా స్వీకరిస్తున్నారు. ‘రోబో’కి సీక్వెల్‌గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రోబో 2.0’లో అక్షయ్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ కాంబినేషన్లో నటించడం ఆనందంగా ఉందని అక్షయ్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఆయన కాకిగా మారే పిచ్చి శాస్త్రవేత్తగా కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. కాకి గెటప్‌లో ఓ ఫొటో కూడా బయటి కొచ్చింది. ‘‘నేను పిచ్చి సైంటిస్ట్నా? కాకినా? ఇది నాకు కొత్త న్యూస్. ఎవరేమైనా ఊహించుకోండి. అందరి ఊహలకు భిన్నంగా కనిపిస్తా’’ అని అక్షయ్ అన్నారు. ఈ చిత్రంలో ఆయన మేకప్‌కే ఆరు గంటలు పట్టిందట. విచిత్రంగా కనిపిస్తారనే టాక్ కూడా ఉంది. ఇదే విషయాన్ని అక్షయ్ ముందుంచితే - ‘‘ఇప్పుడా వివరాలేవీ చెప్పను. ఒకే ఒక్క విషయం చెబుతాను. ఈ మధ్య నేనో హోటల్కెళ్లాను. మేకప్ వేసుకునే వెళ్లాను. ఎవరూ నన్ను విచిత్రంగా చూడలేదు. అంటే చూడ్డాని కి విచిత్రంగా లేననే కదా అర్థం. ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు కూడా. దాంతో హాయిగా ఫుడ్‌ని ఎంజాయ్ చేశాను’’ అన్నారు. గెటప్ విచిత్రంగా ఉండదంటున్నారు.. ఎవరూ గుర్తుపట్టలేదంటున్నారు. మరి.. ‘రోబో 2.0’లో అక్షయ్ ఎలా కనిపిస్తారో చూడాలి. -
ధనుష్‌కు విలన్‌గా విజయ్‌సేతుపతి?
నటుడు ధనుష్‌కు విజయ్‌సేతుపతి విలన్‌గా మారతారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన అంశం ఇదే. దనుష్ తొడరి, కొడిచిత్రాల షూటింగ్‌ను పూర్తి చేశారు. వీటిలో ప్రభుసాల్మన్ దర్శకత్వం వహించిన తొడరి చిత్ర గీతాలు ఇటీవలే మార్కెట్లో విడుదలయ్యాయి. కీర్తీసురేశ్ నాయకిగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానున్నట్లు సమాచారం. కాగా ధనుష్ తాజా చిత్రం వడచెన్నైకి రెడీ అయ్యారు. ఇందులో ఆయనకు జంటగా మొదట సమంతను నాయకిగా ఎంపిక చేసినా, ప్రేమ,పెళ్లి కారణాలతో తను చిత్రం నుంచి వైదొలగడంతో తాజాగా ఆ పాత్రను నటి అమలాపాల్ దక్కించుకున్నారు. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర చాలా బలమైందట. ఈ పాత్రకు మొదట నటుడు జీవాను నటింపజేసే ప్రత్నాలు జరిగాయి. అయితే అందుకు జీవా నిరాకరించడంతో తాజాగా విజయ్‌సేతుపతిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ధనుష్‌కు విజయ్‌సేతుపతికి మధ్య మంచి స్నేహం ఉంది. ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీదాన్ చిత్రంలో విజయ్‌సేతుపతికి హీరో అవకాశం కల్పించారు. ఆ చిత్రం విజయ్‌సేతుపతి కెరీర్‌కు చాలా హెల్ప్ అయ్యింది. అయితే హీరోగా మంచి సక్సెస్ బాటలో పయనిస్తున్న విజయ్‌సేతుపతి ఈ పరిస్థితుల్లో ధనుష్‌కు విలన్‌గా మారడానికి అంగీకరిస్తారా? అన్నదే చర్చనీయాంశంగా మారింది. దీని గురించి స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. -
విలన్‌గా నటిస్తున్న టాలీవుడ్ హీరో
హైదరాబాద్: మొదటిసారిగా బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నానని సినీ హీరో సుధీర్‌బాబు వెల్లడించారు. హిందీలో తాను విలన్‌గా నటించిన భాగీ సినిమా విశేషాలను రేడియో సిటీ శ్రోతలతో ఆయన పంచుకున్నారు. గురువారం ఆయన బంజారాహిల్స్‌లోని రేడియో సిటీలో శ్రోతలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. హిందీలో నటించడం కొత్త అనుభూతి అని చెప్పారు. టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో తనది విలక్షణమైన విలన్ పాత్ర అన్నారు. బాలీవుడ్లో నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మళ్లీ విలన్‌గా చేస్తా..!
‘‘ఇప్పటివరకూ నేను హీరోగానే చేస్తూ వచ్చాను. బోయపాటి శ్రీను కథ చెప్పగానే కొత్తగా అనిపించింది. అందుకే విలన్‌గా చేయడానికి ఒప్పుకున్నా’’ అని హీరో ఆది పినిశెట్టి అన్నారు. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ‘సరైనోడు’లో ఆది విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. శనివారం పాత్రికేయులతో ఆది మాట్లాడుతూ - ‘‘ఇందులో వైరం ధనుష్ పాత్రను నేను ఊహించినదాని కన్నా తెర మీద బోయపాటి శ్రీను బాగా తీర్చిదిద్దారు. జస్ట్ ఆయన చెప్పినది ఫాలో అయిపోయానంతే. తమిళనాడులో కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను చేసిన పాత్ర బన్నీకి కూడా బాగా నచ్చేసింది. అందుకే వేరే భాషలో రీమేక్ చేస్తే తానే హీరోగా చేస్తానని చెప్పాడు. ఈ సినిమా చూసి, చిరంజీవిగారు, వీవీ వినాయక్‌గారు ఫోన్ చేసి నా లుక్, స్టయిల్‌ను మెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు వస్తే విలన్‌గా చేయడానికి వెనకాడను. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నేను హీరోగా రెండు చిత్రాలు రూపొందనున్నాయి. త్వరలో ఓ ఇంటి వాణ్ణి కాబోతున్నా. అమ్మా, నాన్నలు చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నా’’ అన్నారు. -
ఇళయదళపతి చిత్రంలో విలన్‌గా జగపతిబాబు
తమిళ నటులు తెలుగులో, తెలుగు నటులు తమిళంలో నటించడం కొత్తేమీకాదు. అయితే ఇక్కడి హీరోలు అక్కడ విలన్లుగా నటించడం కచ్చితంగా అరుదే. సీనియర్ నటుడు సత్యరాజ్, కన్నడ స్టార్ నటుడు సుదీప్ లాంటి కొందరు మాత్రమే పర భాషల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో జగపతిబాబు కూడా ఇదే బాట పట్టడం గమనార్హం. ఈయన ఇంతకు ముందు కుచేలన్ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆప్తమిత్రుడిగా నటించారు. ఆ తరువాత లింగా చిత్రంలో విలన్‌గా మారారు. ఇప్పుడు ఇళయదళపతికి ప్రతినాయకుడిగా మారనున్నారన్నది తాజా సమాచారం. తెరి చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ చిత్రంలో విజయ్ నటించనున్నారన్న విషయం తెలిసిందే. ఇది విజయ్‌కి 60వ చిత్రం అన్నది గమనార్హం. ఇంతకు ముందు గిల్లీ, వీరం చిత్రాలకు మాటలను,అళగియ తమిళ్ మగన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన భరతన్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యువ నటి కీర్తీసురేష్ విజయ్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఆయనకు ప్రతినాయకుడిగా నటించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.చిత్రం షూటింగ్ మే నెల తొలి వారంలో మొదలవుతుందని సమాచారం. -
తేజ అహం...రాజశేఖర్ విలన్!
‘యాంగ్రీ యంగ్‌మ్యాన్’ పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో రాజశేఖర్ ఇప్పుడు పూర్తిస్థాయి విలన్‌గా కనిపించను న్నారు. ఇందుకు రంగం సిద్ధమవుతోంది. ‘నువ్వు-నేను’, ‘జయం’ లాంటి బ్లాక్బస్టర్లు తీసిన తేజ దర్శకత్వంలో త్వరలో ‘అహం’ పేరుతో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో విలన్‌గా రాజశేఖర్ నటించనున్నారు. తేజ చెప్పిన స్క్రిప్ట్‌కు ఇంప్రెసైన రాజశేఖర్ వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇందులో ఓ యంగ్ హీరో చేయనున్నారు. రాజశేఖర్‌కు జోడీగా ప్రముఖ కథానాయికను ఎంపిక చేయనున్నారు. ఇటీవలి కాలంలో హీరో జగపతిబాబు కూడా విలన్‌గా మారి, వరుస విజయాలు అందుకుంటున్న నేపథ్యంలో రాజశేఖర్ విలన్‌గా ఎంట్రీ ఇవ్వడంపై తెలుగు సినీ సీమలో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. రాజశేఖర్ తన కెరీర్ తొలినాళ్ళలో ‘తలంబ్రాలు’ చిత్రంలో నెగిటివ్ రోల్ చేశారు. ‘అహం’లో రాజశేఖర్ పాత్రను విభిన్నంగా ఆవిష్కరించడానికి తేజ సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి అధికారిక సమాచారం త్వరలోనే తెలియనుంది. -
ప్రతినాయకుడుగా సూర్య
హీరోగా కంటే విలన్‌గా నటించడమే కష్టం అంటారు. అలాగే విలన్ పాత్ర బలంగా ఉంటేనే హీరో పాత్ర ఎలివేట్ అవుతుంది. ఇక ప్రముఖ హీరోలు సైతం విలన్‌గా నటించాలన్న ఆసక్తిని చూపుతుంటారు. నటుడు సూర్య విషయానికి వస్తే వైవిధ్యం కోసం తపించే నటుల్లో ముందు వరుసలో ఉంటారు. ఆయన ఇప్పుడు తన నటనా తృష్ణను తీర్చుకుంటున్నారనే చెప్పవచ్చు. ఇటీవల సరైన సక్సెస్ లేక కాస్త అసంతృప్తితో ఉన్న సూర్య ఇప్పుడు విభిన్న చిత్రాలతో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. అందులో ఒకటి పసంగ-2 కాగా రెండవది 24. పసంగ -2లో చిన్నారి బాలలతో కలిసి చక్కని సందేశాన్ని పిల్లలకు, పెద్దలకు అందించడానికి డిసెంబర్ 4న తెరపైకి రానున్నారు. ఇక 24 అనే చిత్రంలో ఏకంగా మూడు పాత్రలతో తన నట విశ్వరూపం చూపించడానికి ముస్తాబవుతున్నారు. ఇందులో ఒక పాత్రలో విలనీయం ప్రదర్శించనున్నారన్నది గమనార్హం. ప్రముఖ మలయాళ దర్శకుడు విక్రమన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. అందులో సూర్య విలన్ గెటప్, హీరో గెటప్‌లతో కూడిన పోస్టర్లు సూర్య అభిమానుల్ని విపరీతంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా విలన్ గెటప్‌లో సూర్య గంభీరంగా సమ్‌థింగ్ స్పెషల్‌గా కనిపించడం విశేషం. ఇందులో సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నటుడు సత్యన్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్య 2డి ఎంటర్టైన్మెంట్ సంస్థ, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తమిళ ఉగాది సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
అందాల రాక్షసి
గ్లామర్ విలన్స్ మీ డ్రీమ్‌రోల్ ఏంటి అని అడిగితే నెగిటివ్ రోల్ చేయాలి అంటుంటారు హీరోయిన్లు. ఎందుకంటే నిజమైన ప్రతిభని అలాంటి పాత్రలే వెలికి తీస్తాయని. అది ముమ్మాటికీ నిజమే అని నిరూపించారు ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మలు. విలనీని అద్భుతంగా పండించి వారేవా అనిపించుకున్నారు వీరంతా! ప్రియాంకాచోప్రా ప్రియాంక ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమెకు ఓ నెగిటివ్ రోల్ ఉపయోగపడిందన్న విషయం చాలా మందికి తెలియదు. ‘ఐత్రాజ్’లో అక్షయ్ కుమార్‌ని ప్రేమించి మోసగించి, అతడికి పెళ్లైపోయినా మళ్లీ ఎంటరై ముప్పు తిప్పలు పెడుతుంది. ఆ పాత్రలో ఆమె నటన అద్భుతం. ఊర్మిళ ఊర్మిళ అనగానే గ్లామర్ డాల్ అనేస్తారు చాలామంది. కానీ ‘ప్యార్ తూనే క్యా కియా’ సినిమా చూస్తే అలా అనడానికి నోరు రాదు. తాను కోరుకున్నవాణ్ని దక్కించుకోవడం కోసం ఎంతకైనా తెగించే అమ్మాయిగా అందులో తన నటన ఆ రేంజ్లో ఉంటుంది మరి! కాజోల్ సాత్వికమైన నటనకు కేరాఫ్ అడ్రస్‌లా కనిపిస్తుంది కాజోల్. అమాయకమైన ప్రేయసిగా, అన్ని విధాలా అనుకూలమైన అర్ధాంగిగా అతికినట్టు సరిపోతుంది. అలాంటి కాజోల్ ‘గుప్త్’ సినిమాలో తన స్వార్థం కోసం హత్యలు సైతం చేస్తుంది. అందరినీ హడలెత్తిస్తుంది. పోలీసుల్ని పరుగులెత్తిస్తుంది. అలాంటి పాత్రలో ఆమెను చూసి మొదట షాకైన ఆడియెన్స్, విలనీని ఇంత బాగా పండించగలదా అంటూ ఆశ్చర్యపోయారు. బిపాసాబసు అందాలు ఒలికించడంలో బిపాసాను కొట్టేవాళ్లే లేరు. అలాగే... బాలీవుడ్ హీరోయిన్లలో నెగిటివిటీని పండించడంలో కూడా బిప్స్‌ని బీటవుట్ చేసేవాళ్లు లేరు. భర్త ఆస్తిని దక్కించుకోవడానికి ఓ అమాయక లాయర్ని ప్రేమలోకి లాగి, పిచ్చివాణ్ని చేసే మాయలాడిగా ‘జిస్మ్’లో అదరగొట్టేసింది. కోరుకున్నది సాధించుకోవడానికి ఆత్మలతో సైతం సావాసం చేసి, చెల్లెలి జీవితాన్నే చిన్నాభిన్నం చేసే క్రూరురాలిగా ‘రాజ్ 3’లో దుమ్ము రేపింది. -
విలన్‌గా..?
హీరో సుధీర్‌బాబు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారా? అవుననే అంటున్నారు కృష్ణానగర్ జనం. ప్రభాస్, త్రిష, గోపీచంద్ నటించిన ‘వర్షం’ చిత్రం గుర్తుంది కదూ! ఈ చిత్రం ‘భాగీ’ పేరుతో ిహిందీలో రీమేక్ అవుతోంది. టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ నాయకా నాయికలుగా నటిస్తున్నారు. తెలుగు ‘వర్షం’లో గోపీచంద్ చేసిన విలన్ పాత్రను హిందీలో సుధీర్‌బాబు చేస్తున్నార ని సమాచారం. -
రజనీకి విలన్‌గా కమలహాసన్?
కోలీవుడ్‌లో ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే తాజా సమాచారం. అదే గనుక జరిగితే తమిళ తెరపైనే కాదు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైనే వండర్ క్రియేట్ అవుతుంది. అంత బ్రహ్మాండమైన విషయం ఏమిటంటారా? తమిళ చిత్ర పరిశ్రమలో ధృవ నక్షత్రాలైన ఆ ఇద్దరినీ కలసి నటించే ప్రయత్నాలు మొదలయ్యాయని కోలీవుడ్ టాక్. ఆ దిగ్గజాలు విశ్వనాయకుడు కమలహాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్. వీరిని ఒకే చిత్రంలో హీరో, విలన్‌గా చూపే భగీరథ ప్రయత్నం జరుగుతోంది. వారిలో ఎవరు హీరో? ఎవరు విలన్ అని ఊహించగలరా? సకల కళా వల్లభుడు కమలహాసన్ హీరోగా నటిస్తే పెద్దగా విశేషం ఏముంటుంది. అందుకే ఆయన్ని ప్రతి నాయకుడిగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక సూపర్‌స్టార్ ఈ రోజుల్లో విలన్‌గా ఉంచలేం. ఎందిరన్లో నటించారుగా అంటారా? ఆ చిత్రంలో హీరో, విలన్ రెండూ ఆయనే. ఇంతకీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ప్రయత్నిస్తున్న సత్తా వున్నా దర్శకుడు శంకర్. కాస్త విపులంగా చెప్పాలంటే లింగా చిత్రం సృష్టించిన సమస్యలతో తలబొప్బి కట్టిన సూపర్‌స్టార్ తన కో చిత్రం చేయమని శంకర్‌ను కోరినట్లు సమాచారం. అందుకు అంగీకరించిన ఈ స్టార్ డెరైక్టర్ ఒక బ్రహ్మాండమైన కథను వినిపించారట. అది రజనీకి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందట. ఆ కథలో మరో సూపర్ విలన్ పాత్ర ఉంటుందట. ఆ పాత్రలో కమలహాసన్ నటిస్తే బాగుంటుందని శంకర్ ఆలోచన. ఈ మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి మొదట నో చెప్పిన కమల్ ఆ తరువాత ఆలోచించి చెబుతానని మాటిచ్చారట. ఒకవేళ కమల్ గనుక రజనీకి విలన్ అవ్వడానికి అంగీకరిస్తే ఆ చిత్రం ఒక సంచలనం అవుతుంది. కమల్, రజనీ చివరిగా నినైత్తాల్ ఇనిక్కుమ్ చిత్రంలో కలసి నటించారు. ఆ చిత్రం తెరపైకి వచ్చి 36 ఏళ్లు అవుతోంది. -
విజయ్‌తో ఢీ
పట్రా చిత్రంతో అనూహ్యంగా సినీ రంగ ప్రవేశం చేసిన నటుడు శ్యామ్‌పాల్. ఈ చిత్రంలో ఈయన పండించిన విలనిజానికి పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారట. ఆ వివరాలను ఈ వర్ధమాన నటుడి మాటల్లోనే... ఇంజనీరింగ్ చదివిన నేను నా జీవితంలో ఎదుర్కొన్న ఒక సంఘటన కారణంగా న్యాయవాద పట్టా పొందాల్సి వచ్చింది. అయితే నాకిది ఫ్యాషనే. అదే విధంగా నేనొక బాక్సర్‌ను కూడా. ఇందుకు కారణం మాత్రం నాన్న స్టాలిన్పాల్నే. ఆయన పెద్ద బాక్సర్. నన్ను కూడా బాక్సర్ చేయాలన్నది ఆయన కోరిక. ఆ కారణంగా నిత్యం కఠిన శరీర వ్యాయామంతో బాక్సర్నయ్యాను. బాస్కెట్‌బాల్, వాలీబాల్ క్రీడల్లోనూ జాతీయ స్థాయిలో కప్‌లు గెలుచుకున్నాను. మాకు పాండిచ్చేరిలో నాలుగు కళాశాలలు, చెన్నైలో మరికొన్ని వ్యాపారాలు ఉన్నాయి. కళాశాల నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్న నాకు సినిమాలు చూసే అలవాటు ఉంది. ఎక్కువగా ఆంగ్ల చిత్రాలు చూస్తుంటాను. ఆ చిత్రాలను తమిళంలో తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు వస్తుంటాయి. అయితే సినిమాలో నటించాలనే ఆసక్తి మాత్రం లేదు. అలాంటిది ఒకసారి పట్రా చిత్ర దర్శకుడు జయందాన్ లొకేషన్ చూడటానికి పాండిచ్చేరిలోని మా కాలేజీకు వచ్చారు. అక్కడ నన్ను చూసి ఒక చిన్న పాత్ర ఉంది చేస్తారా? అని అడగారు. చిన్న పాత్రే కదా అని ఓకే అన్నాను. అయితే చిత్రం పూర్తి అయ్యే వరకు నా పాత్ర ఏమిటన్నది స్పష్టంగా వివరించలేదు. ఆయన చెప్పినట్టు చేశాను. పట్రా చిత్రం విడుదలైన తరువాత ప్రముఖ దర్శక నటుడు కె.భాగ్యరాజ్ లాంటి పలువురు అభినందిస్తుంటే సంతోషం పట్టలేకపోతున్నాను. ఎలాగు చిత్ర రంగ ప్రవేశం చేశాను కనుక ఇకపై ఇళయదళపతి విజయ్‌తో విలన్‌గా ఢీ కొనడానికైనా సిద్ధమే. మరో పక్క దర్శకుడు ఎ ఎల్ విజయ్‌తో కలసి షట్టర్ అనే చిత్రం కూడా నిర్మిస్తున్నాను అని శ్యామ్‌పాల్ చెప్పారు. -
విలన్‌గా బ్రహ్మానందం
బ్రహ్మానందం ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి, ప్రేక్షకుల్ని నవ్వించేస్తారు. మరి.. ఆయన విలన్‌గా చేస్తే? ఎలా ఉంటుందో ‘లవకుశ’ చిత్రంలో చూడొచ్చు. వరుణ్ సందేశ్ హీరోగా జయశ్రీ శివన్ దర్శకత్వంలో సంగారెడ్డి పేట ప్రకాశ్, వి. సత్యమోహన్‌రెడ్డి, పండుబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం కోసం బ్రహ్మానందం, ప్రభాస్ శ్రీను తదితరులపై చిత్రీకరించిన ప్రచార గీతాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ - ‘‘నేను తొలిసారి రెండు పాత్రలు చేసిన చిత్రం ఇది. ఈ చిత్రం నాకు మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘బ్రహ్మానందంగారిని సంప్రదించినప్పుడు ఇప్పటికి వెయ్యి సినిమాలకు పైగా చేశా.. ఏదైనా వెరైటీ కారెక్టర్ ఉంటే చెప్పమన్నారు. ఈ పాత్ర గురించి చెప్పగానే అంగీకరించారు’’ అని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ వేడుకలో శేఖర్ విఖ్యాత్, కాసర్ల శ్యామ్, రామ్‌నారాయణ్ తదితర చిత్రబృందం పాల్గొన్నారు.