ఇళయదళపతి చిత్రంలో విలన్‌గా జగపతిబాబు | Jagapathi Babu To Play Vijay's Villain | Sakshi
Sakshi News home page

ఇళయదళపతి చిత్రంలో విలన్‌గా జగపతిబాబు

Published Sun, Mar 13 2016 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

ఇళయదళపతి చిత్రంలో విలన్‌గా జగపతిబాబు

ఇళయదళపతి చిత్రంలో విలన్‌గా జగపతిబాబు

తమిళ నటులు తెలుగులో, తెలుగు నటులు తమిళంలో నటించడం కొత్తేమీకాదు. అయితే ఇక్కడి హీరోలు అక్కడ విలన్లుగా నటించడం కచ్చితంగా అరుదే. సీనియర్ నటుడు సత్యరాజ్, కన్నడ స్టార్ నటుడు సుదీప్ లాంటి కొందరు మాత్రమే పర  భాషల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో జగపతిబాబు కూడా ఇదే బాట పట్టడం గమనార్హం. ఈయన ఇంతకు ముందు కుచేలన్ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆప్తమిత్రుడిగా నటించారు. ఆ తరువాత లింగా చిత్రంలో విలన్‌గా మారారు. ఇప్పుడు ఇళయదళపతికి ప్రతినాయకుడిగా మారనున్నారన్నది తాజా సమాచారం.
 
 తెరి చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ చిత్రంలో విజయ్ నటించనున్నారన్న విషయం తెలిసిందే. ఇది విజయ్‌కి 60వ చిత్రం అన్నది గమనార్హం. ఇంతకు ముందు గిల్లీ, వీరం చిత్రాలకు మాటలను,అళగియ తమిళ్ మగన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన భరతన్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యువ నటి కీర్తీసురేష్ విజయ్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఆయనకు ప్రతినాయకుడిగా నటించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.చిత్రం షూటింగ్ మే నెల తొలి వారంలో మొదలవుతుందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement