
విలన్‌గా ఆర్య?
నటుడు జయం రవికి ఆర్య విలన్‌గా మారనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాక్ ఇదే. కోలీవుడ్‌లో యువ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న నటుడు ఆర్య. అయితే టాలీవుడ్‌లో విలన్‌గా నటించారు. తాజాగా కోలీవుడ్‌లోనూ తన విలనిజం ప్రదర్శించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జయం రవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తనీ ఒరువన్. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జయం రాజా దర్శకుడు. తిల్లాలంగడి చిత్రం తరువాత జయం బ్రదర్స్ కాంబినేషన్‌లో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది.
ఈ చిత్రంలో నటుడు ఆర్య విలన్‌గా నటిం చనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని దర్శకుడు జయం రవి ధృవపరచలేదు. కోలీవుడ్ హీరో ఒక రు తనీ ఒరువన్ చిత్రంలో విలన్‌గా నటించనున్నారని మాత్రం తెలిపారు. అది ఆర్యనా, లేక మరొకరా? అన్నది ఇంకా నిర్ణయం కాలేదన్నారు. తనీ ఒరువన్ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని తెలిపా రు. ఇప్పటి వరకు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ చేస్తున్నట్లు వెల్లడించా రు. తనీ ఒరువన్ యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం అని వివరించారు. ఒక సామాజిక అంశం గురించిన చిన్న సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుందని చెప్పారు.