ధనుష్‌కు విలన్‌గా విజయ్‌సేతుపతి?
నటుడు ధనుష్‌కు విజయ్‌సేతుపతి విలన్‌గా మారతారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన అంశం ఇదే. దనుష్ తొడరి, కొడిచిత్రాల షూటింగ్‌ను పూర్తి చేశారు. వీటిలో ప్రభుసాల్మన్ దర్శకత్వం వహించిన తొడరి చిత్ర గీతాలు ఇటీవలే మార్కెట్‌లో విడుదలయ్యాయి. కీర్తీసురేశ్ నాయకిగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానున్నట్లు సమాచారం.
కాగా ధనుష్ తాజా చిత్రం వడచెన్నైకి రెడీ అయ్యారు. ఇందులో ఆయనకు జంటగా మొదట సమంతను నాయకిగా ఎంపిక చేసినా, ప్రేమ,పెళ్లి కారణాలతో తను చిత్రం నుంచి వైదొలగడంతో తాజాగా ఆ పాత్రను నటి అమలాపాల్ దక్కించుకున్నారు. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర చాలా బలమైందట. ఈ పాత్రకు మొదట నటుడు జీవాను నటింపజేసే ప్రత్నాలు జరిగాయి. అయితే అందుకు జీవా నిరాకరించడంతో తాజాగా విజయ్‌సేతుపతిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.
ధనుష్‌కు విజయ్‌సేతుపతికి మధ్య మంచి స్నేహం ఉంది. ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీదాన్ చిత్రంలో విజయ్‌సేతుపతికి హీరో అవకాశం కల్పించారు. ఆ చిత్రం విజయ్‌సేతుపతి కెరీర్‌కు చాలా హెల్ప్ అయ్యింది. అయితే హీరోగా మంచి సక్సెస్ బాటలో పయనిస్తున్న విజయ్‌సేతుపతి ఈ పరిస్థితుల్లో ధనుష్‌కు విలన్‌గా మారడానికి అంగీకరిస్తారా? అన్నదే చర్చనీయాంశంగా మారింది. దీని గురించి స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.