67th National Film Awards: అత్యంత ప్రతిష్ఠత్మకమైన 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో జరిగింది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
‘మణికర్ణిక’ చిత్రానికి గానూ కంగనా రనౌత్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా ధనుష్(అసురన్), మనోజ్ బాజ్‌పాయ్(భోంస్లే) అవార్డులు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)కి అవార్డు దక్కింది.
ఇక జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా 'జెర్సీ' నిలిచింది. ఎడిటింగ్ విభాగంలోనూ జెర్సీ సినిమాకు అవార్డు దక్కింది. బెస్ట్ తెలుగు పాపులర్ ఫిల్మ్‌గా 'మహర్షి' సినిమాకు నేషనల్ అవార్డు వరించింది. మొత్తంగా తెలుగులో జెర్సీ సినిమాకు రెండు అవార్డులు రాగా, మహర్షికి సినిమాకు మూడు అవార్డులు దక్కాయి. బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా రాజుసందరం మాస్టర్‌కు జాతీయ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment