m. venkaiah naidu
-
జూన్‌లో దర్శకులు మధుసూదనరావు శత జయంతి ఉత్సవాలు
ప్రముఖ దివంగత దర్శకులు వీరమాచనేని మధుసూదనరావు (జూన్ 14, 1923లో జన్మించారు) శతజయంతి ఉత్సవాలు జూన్ 11న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన సమావేశంలో దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మధుసూదనరావుగారు మన మధ్య లేకపోయినా దర్శకుడిగా ఆయన ప్రతిభ మరికొన్ని వందల ఏళ్లు బతికే ఉంటుంది. ఆయన దగ్గర శిష్యరికం చేయడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నాన్నగారి శత జయంతి ఉత్సవాలకు సినీ పరిశ్రమ నుంచి అందర్నీ ఆహ్వానిస్తున్నాం’’ అన్నారు మధుసూదనరావు కుమార్తె వాణీదేవి. ‘‘ఈ సంవత్సరం నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావుగారు, సూర్యకాంతంగారు, వి. మధుసూదనరావుగారి శత జయంతి కావడం తెలుగు పరిశ్రమ పులకించి పోయే సంవత్సరం. మన మధ్య లేకపోయినా వారు పరిశ్రమకు చూపించిన మంచి మార్గాన్ని ఎప్పటికీ అనుసరిస్తూనే ఉంటాం’’ అన్నారు శివాజీరాజా. ‘‘మావయ్య విలువలతో జీవించారు. అదే విలువలను తన చిత్రాల ద్వారా పది మందికి పంచటానికి ప్రయత్నించారు’’ అన్నారు నాని (మధుసూదనరావు మేనల్లుడు). ఈ కార్యక్రమంలో మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ డా. జి. కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ అందుకే వెన్నుపోటుకు గురయ్యారు: వెంకయ్య నాయుడు
సాక్షి, గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ అందుకే వెన్నుపోటుకు గురయ్యారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, వెంకయ్యనాయుడు శనివారం తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. కుట్రలు, కుతంత్రాలు ఎన్టీఆర్ గమనించలేకపోయారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ భోళా మనిషి. అందుకే వెన్నుపోటుకు గురయ్యారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో సైలెంట్ విప్లవాన్ని తెచ్చారు. పేదల సంక్షేమానికి అనేక పథకాలు తెచ్చారు అంటూ కామెంట్స్ చేశారు. -
రాష్ట్రపతి కావాలనుకోలేదు.. ఆ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి
రాష్ట్రపతి పదవి కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని వెంకయ్య నాయుడు చెప్పారు. పదవుల్లో లేకపోయినా ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటానని తెలిపారు. సోమవారం రాజ్యసభలో తన వీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడారు. చట్టసభలో అర్థవంతమైన చర్చలు, సంవాదాలు జరగాలని ప్రజలు ఆశిస్తారని గుర్తుచేశారు. అంతేతప్ప ఆందోళనలు, గొడవలు, అంతరాయాలను కోరుకోరని చెప్పారు. సభ గౌరవాన్ని కాపాడేందుకు సభ్యులంతా కృషి చేయాలని సూచించారు. సభలో ఉన్నప్పుడు మర్యాదగా నడుచుకోవాలన్నారు. ఉన్నత ప్రమాణాలను అనుసరించాలన్నారు. పదవీ విరమణ తర్వాత ఇంటికే పరిమితం కాబోనని, అన్నిచోట్లా తిరుగుతూ అందరితో భిన్న అంశాలపై మాట్లాడుతూనే ఉంటానని వెంకయ్య స్పష్టం చేశారు. రాజ్యసభపై గొప్ప బాధ్యతలు ఉన్నాయని, ఈ విషయాన్ని సభ్యులంతా సదా గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పార్లమెంట్ చక్కగా పని చేయాలన్నదే తన ఆకాంక్ష అని వివరించారు. రాజ్యసభ చైర్మన్‌గా సభ గౌరవాన్ని కాపాడేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించానని, అందరికీ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చానని వెల్లడించారు. బీజేపీకి రాజీనామా చేసినప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగాయని అన్నారు. చదవండి: (Venkaiah Naidu: వెంకయ్య భావోద్వేగం) -
రాజ్యసభ సభ్యులుగా 27 మంది ప్రమాణం
న్యూఢిల్లీ: రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన 57 మందిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్ సహా 27 మంది సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామంటూ వారితో ప్రమాణం చేయించారు. 10 రాష్ట్రాలకు చెందిన 27 మంది సభ్యులు తెలుగు తదితర 9 భాషల్లో ప్రమాణం చేశారు. కొత్తగా ఎన్నికైన 57 మందిలో నలుగురు ఇప్పటికే ప్రమాణం చేశారు. మిగతా వారు వర్షాకాల సమావేశాల మొదటి రోజు ప్రమాణం చేయనున్నారు. ఇంకా ప్రమాణం చేయని కొత్త సభ్యులు కూడా 18వ తేదీన జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చైర్మన్ వెంకయ్యనాయుడు అనంతరం స్పష్టతనిచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో విజేతల పేర్లను నోటిఫికేషన్లో ప్రకటించిన నాటి నుంచి వారిని సభ్యులుగానే పరిగణిస్తామన్నారు. సభా కార్యక్రమాలు, కమిటీల సమావేశాల్లో పాల్గొనేందుకు మాత్రం ప్రమాణం చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. తాజాగా ప్రమాణం చేసిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేశ్, వివేక్ కె.తన్ఖా, ముకుల్ వాస్నిక్‌తోపాటు బీజేపీ నుంచి సురేంద్ర సింగ్ నాగర్, కె.లక్ష్మణ్, లక్ష్మీకాంత్ వాజ్‌పేయి తదితర 18 మంది ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న గోయల్ -
పార్లమెంటులో ఆరుగురు నెల్లూరు వాసులు
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యక్తికి పెద్దల సభ రాజ్యసభలో చోటు దక్కనుంది. బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీద మస్తాన్‌రావును వైఎస్సార్సీపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో రాజ్యసభ, లోక్‌సభ కలిపి ఆరుగురు జిల్లా వాసులకు చోటు దక్కినట్టయింది. బీద మస్తాన్‌రావు రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడం లాంఛనమే. ఇప్పటికే జిల్లా నుంచి రాజ్యసభలో ఇద్దరు, లోక్‌సభలో ఇద్దరు ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, విజయసాయిరెడ్డి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. నెల్లూరు ఎంపీ ఆదాల, ఒంగోలు ఎంపీ మాగుంట లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా నెల్లూరు జిల్లా వాసే. చదవండి: (వైఎస్సార్సీపీ నలుగురు రాజ్యసభ అభ్యర్థులు ఖరారు) -
మహారాష్ట్ర తలవంచదు
ముంబై: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడికి శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ లేఖ రాశారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహకరించాలంటూ కొందరు వ్యక్తులు దాదాపు నెల రోజుల క్రితం తనను సంప్రదించాలని లేఖలో పేర్కొన్నారు. సహకరించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారని చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావాలన్నదే వారి ఉద్దేశమని తెలిపారు. అలాగే ట్విట్టర్లో శివసేన గుర్తు పులి ఫొటోను పోస్టు చేశారు. జుఖేంగే నహీ.. జై మహారాష్ట్ర (మహారాష్ట్ర తలవంచదు) అని ట్వీట్ చేశారు. శివసేన నేతృత్వంలోని ఎంవీఏ ప్రభుత్వం పూర్తికాలం.. ఐదేళ్లూ అధికారంలోకి కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలను దురుద్దేశపూర్వకంగా ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎంవీఏ సర్కారు ఏర్పాటైన తర్వాత శివసేన నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఉపరాష్ట్రపతికి రాసిన లేఖలో వెల్లడించారు. రాజ్యసభ సభ్యులపై వేధింపులను అడ్డుకోవాలని కోరారు. ఈ విషయంలో ఉపరాష్ట్రపతి స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని సంజయ్ రౌత్ విన్నవించారు. ఉపరాష్ట్రపతికి తాను రాసిన లేఖ ఒక ట్రైలర్ మాత్రమేనని సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీ క్రిమినల్ సిండికేట్‌ను ముందుండి నడిపిస్తున్న ఈడీ అధికారులు బాగోతం బయటపెడతానని తేల్చిచెప్పారు. మనీ ల్యాండరింగ్ పేరిట వేధింపులు మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద నాతో పాటు మరో ఇద్దరు మహారాష్ట్ర మంత్రులను జైలుకు పంపిస్తామని బెదిరించారని తెలిపారు. రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులందరినీ జైలుకు పంపితే మధ్యంతర ఎన్నికలు వస్తాయని వారు భావించారని చెప్పారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం 2003 జనవరి 17న అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. కానీ, అంతకంటే ముందు జరిగిన డబ్బు లావాదేవీలు కూడా మనీ ల్యాండరింగే అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, వేధింపులకు దిగుతున్నాయని ఆరోపించారు. 2012–13లో తనకు, తన కుటుంబ సభ్యులకు భూమిని విక్రయించిన వారిని ఈడీ బెదిరిస్తోందని, తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని హుకుం జారీ చేస్తోందని ధ్వజమెత్తారు. తన కుమార్తె పెళ్లిలో అలంకరణ పనులు చేసిన వారిని సైతం వెంటాడుతోందని, నేను వారికి రూ.50 లక్షలు ఇచ్చినట్లుగా ప్రకటన చేయాలని భయపెడుతోందని దుయ్యబట్టారు. తనకు సంబం« దించిన ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు 28 మందిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నించాయన్నారు. ఈడీ కనుసన్నల్లో అక్రమాలు స్వేచ్ఛగా భావాలను వెల్లడించే హక్కు తనకుందని, ఆ హక్కుపై దర్యాప్తు సంస్థలు దాడి చేస్తున్నట్లుగా భావిస్తున్నానని సంజయ్ రౌత్ చెప్పారు. సిండికేట్, బ్లాక్‌మెయిలింగ్, మనీ ల్యాండరింగ్ వంటి అక్రమ వ్యవహారాలు ఈడీ కనుసన్నల్లో సాగుతున్నాయని ఆరోపించారు. తనను జైలుకు పంపిస్తే వెళ్తానని, తన తర్వాత బీజేపీ నాయకులు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదని, బీజేపీ నేతలే ఎన్నో పాపాలు చేశారని అన్నారు. తాము భయపడతామని అనుకుంటే అది పొరపాటేనని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎవరు సాయం అడిగారని ప్రశ్నించగా... దానిపై త్వరలో మాట్లాడతానని సంజయ్ రౌత్ బదులిచ్చారు. అది ఢిల్లీ, ముంబైకి చెందిన నాయకుల ఉమ్మడి కుట్ర అని పేర్కొన్నారు. గత ఏడాది ఉప ఎన్నికలో దాద్రా నగర్ హవాలీ ఎంపీ సీటును శివసేన గెలుచుకుందని, అప్పటి నుంచి తమ పార్టీకి ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో మహారాష్ట్రలో బీజేపీదే అధికారం మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. మార్చి 10న ఫలితాలు బహిర్గతమైన తర్వాత మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ రావడం తథ్యమని జోస్యం చెప్పారు. శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. -
నేషనల్ అవార్డ్స్ అందుకున్న విజేతలు వీళ్లే..
అత్యంత ప్రతిష్ఠత్మకమైన 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో జరిగింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే.. ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ ఉత్తమ పాపులర్ చిత్రం- మహర్షి ఉత్తమ నటి -కంగనా రనౌత్ (మణికర్ణిక) ఉత్తమ నటుడు- మనోజ్ బాజ్‌పాయీ (భోంస్లే), ధనుష్ (అసురన్) ఉత్తమ హిందీ చిత్రం- చిచ్చోరే ఉత్తమ తమిళ చిత్రం- అసురన్ ఉత్తమ మలయాళ చిత్రం- మరక్కర్ ఉత్తమ దర్శకుడు- సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ (బహత్తర్ హూరైన్) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: మరక్కర్ (మలయాళం) ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్) ఉత్తమ సహాయ నటి- పల్లవి జోషి(ది తాష్కెంట్ ఫైల్స్) ఉత్తమ కొరియోగ్రాఫర్: రాజు సుందరం (మహర్షి) ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ) ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి.ఇమ్మాన్ (విశ్వాసం) ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు: ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో) ఉత్తమ గాయకుడు: బ్రి. ప్రాక్ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ...’) ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ) ఉత్తమ మేకప్: రంజిత్ (హెలెన్) ఉత్తమ ఎడిటింగ్- నవీన్ నూలి (జెర్సీ) -
67వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..
67th National Film Awards: అత్యంత ప్రతిష్ఠత్మకమైన 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో జరిగింది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ‘మణికర్ణిక’ చిత్రానికి గానూ కంగనా రనౌత్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా ధనుష్(అసురన్), మనోజ్ బాజ్‌పాయ్(భోంస్లే) అవార్డులు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)కి అవార్డు దక్కింది. ఇక జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా 'జెర్సీ' నిలిచింది. ఎడిటింగ్ విభాగంలోనూ జెర్సీ సినిమాకు అవార్డు దక్కింది. బెస్ట్ తెలుగు పాపులర్ ఫిల్మ్‌గా 'మహర్షి' సినిమాకు నేషనల్ అవార్డు వరించింది. మొత్తంగా తెలుగులో జెర్సీ సినిమాకు రెండు అవార్డులు రాగా, మహర్షికి సినిమాకు మూడు అవార్డులు దక్కాయి. బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా రాజుసందరం మాస్టర్‌కు జాతీయ అవార్డు లభించింది. -
వెంకయ్య పర్యటనపై చైనా అభ్యంతరం
బీజింగ్/న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఇటీవల సాగించిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన పట్ల డ్రాగన్ దేశం చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతదేశ నాయకులు అరుణాచల్‌లో పర్యటించడాన్ని తాము కచి్చతంగా, గట్టిగా వ్యతిరేకిస్తామని చెప్పింది. అరుణాచల్ రాష్ట్రాన్ని తాము ఇండియాలో భాగంగా గుర్తించడం లేదని స్పష్టం చేసింది. అది దక్షిణ టిబెట్‌లో ఒక భాగమని పేర్కొంది. వెంకయ్య నాయుడు ఈ నెల 9న అక్కడ పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని, హింసకు తెరపడి, శాంతి నెలకొంటోందని చెప్పారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్‌ను ఏకపక్షంగా, బలవంతంగా, చట్టవిరుద్దంగా ఇండియాలో కలిపేసుకున్నారని ఆరోపించారు. ఆ రాష్ట్రాన్ని తాము గుర్తించడం లేదని, అక్కడ భారత నేతలు పర్యటిస్తే వ్యతిరేకిస్తామని తేలి్చచెప్పారు. చైనా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతినేలా, సరిహద్దు వివాదాలు పెరిగిపోయేలా వ్యవహరించవద్దని భారత్‌కు హితవు పలికారు. అరుణాచల్ మా దేశంలో అంతర్భాగం: భారత్ అరుణాచల్ ప్రదేశ్‌లో వెంకయ్య నాయుడు పర్యటించడం పట్ల చైనా వ్యక్తం చేసిన అభ్యంతరాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. చైనా అభ్యంతరాలను తిరస్కరించింది. అరుణాచల్ తమ దేశంలో విడదీయలేని అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తేలి్చచెప్పారు. భారత్ నేతలు అక్కడ పర్యటిస్తే చైనా అభ్యంతరం చెప్పడం అర్థంపర్థం లేని పని అని కొట్టిపారేశారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటించినట్లుగానే అరుణాచల్‌లోనూ పర్యటిస్తారని, ఇందులో మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు. -
నూతన విద్యావిధానం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి: ఉపరాష్ట్రపతి
-
సంస్కృతికి జానపదమే మూలం
సాక్షి, బెంగళూరు: ఏ దేశ నాగరికత, సంస్కృతికైనా ఆ దేశంలోని జానపద విజ్ఞానమే మూలమని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భాష, కళలు, చేతివృత్తులు, పనిముట్లు, దుస్తులు, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, వైద్యం, పంటలు, సంగీతం, నృత్యం, ఆటలు, హావభావాలన్నింటి సమాహారమే జానపద విజ్ఞానమని ఆయన తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పలువురు జానపద కళాకారులు అంతర్జాల వేదిక ద్వారా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జానపద సంపద లేకుండా భాషాభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి జరగవని.. ఆ రెండింటి పుట్టుక జానపదం నుంచే మొదలైందన్నారు. అమ్మ పాడే లాలిపాటలు, అలసట తెలియకుండా పాడుకునే శ్రామికుల గీతాలు, జీవితాన్ని తెలియజేసే ఆధ్యాత్మిక తత్త్వాలు ఇలా ఏ సాహిత్యాన్ని చూసినా జానపద వాసన స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అలాంటి విలువైన జానపద సంపదను సంరక్షించుకుంటూ భాషా సంస్కృతులను నిరంతరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రామీణ ప్రజల జీవితాల నుంచే జానపద కళలు పుట్టాయని చెప్పారు. వీధినాటకాలు, తోలుబొమ్మలాటలు, బుర్రకథలు, యక్షగానాలు, జముకుల కథలు, పగటి వేషాలు వంటి వందలాది జానపద కళారూపాలు ఆ రోజుల్లో పల్లె ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచాయని చెప్పారు. తన బాల్యంలో పండుగ రాగానే తోలుబొమ్మలాట, కోలాటాలు, సంక్రాంతి సమయంలో హరిదాసులు, గంగిరెద్దులతో ఊరంతా కోలాహలంగా ఉండేదన్నారు. సినిమా, టీవీ, రేడియోల్లో జానపదాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ప్రముఖ జానప ద గాయకుడు దామోదరం గణపతి రావు, జానపద పరిశోధకులు డాక్టర్ సగిలి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
చర్చలు కోసమే చట్ట సభలు: వెంకయ్య
బెంగళూరు: పార్లమెంట్, శాసన సభలు ఉన్నది చర్చలు, నిర్ణయాల కోసమే తప్ప గొడవలు, అంతరాయాల కోసం కాదని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఆయన బుధవారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో మాట్లాడారు.ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో చోటుచేసుకున్న అనుచిత పరిణామాలను వెంకయ్య ప్రస్తావించారు. ప్రజల చేత ఎన్నికైన నేతలు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని హితవు పలికారు. ‘‘పార్లమెంట్లో ఇటీవల ఏం జరిగిందో మీరు చూశారు. సార్.. మీరు ఈ దేశానికి ఉపరాష్ట్రపతి. రాజ్యసభలో మీరెందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు అని కొందరు యువతీ యువకులు అడిగారు. సభలో కొందరు ఎంపీల ప్రవర్తన వల్లే కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందని సమాధానమిచ్చినట్లు చెప్పారు. -
ప్రజల జీవితాలను మార్చేలా పరిశోధనలు
సాక్షి, బెంగళూరు: వాతావరణ సమస్యలు మొదలుకొని వ్యవసాయం, వైద్యం, ఔషధ రంగం వరకు మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్నమైన పరిష్కారాల దిశగా విస్తృతమైన పరిశోధనలు జరపాలని శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. సోమవారం బెంగళూరులోని జవహార్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జేఎన్ సీఏఎస్‌ఆర్)ను ఆయన సందర్శించారు. అనంతరం విద్యార్థులు, శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు, వారి జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చేం దుకు పరిశోధనలు జరగాలన్నారు. శాస్త్రీయ సమాజం, వ్యవసాయరంగంలో నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పని చేస్తూ అద్భుతాలు సృష్టించే దిశగా పని చేస్తున్న స్టార్టప్స్‌ను ప్రోత్సహించడంతో పాటు 300కు పైగా పేటెంట్ హక్కులను సాధించారని జేఎన్సీఏఎస్ఆర్ శాస్త్రవేత్తలను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్, సీఎం బసవరాజ బొమ్మై, జేఎన్సీఏఎస్ఆర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ జీయూ కులకర్ణి, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు పాల్గొన్నారు. -
24 ఏళ్ల తరువాత రాజ్యసభకు దేవెగౌడ
సాక్షి, బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ (87) రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఆదివారం ఆయన రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు సమక్షంలో కన్నడభాషలో ప్రమాణం చేశారు. సుమారు 24 ఏళ్ల తర్వాత ఆయన రాజ్యసభలో అడుగుపెట్టడం విశేషం. గతంలో 1996 జూన్ నుంచి 1997 ఏప్రిల్ వరకు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేవెగౌడ రాజ్యసభ సభ్యునిగానే ఉన్నారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన కర్ణాటక నుంచి ఎన్నికయ్యారు. కరోనా లాక్డౌన్ ఉండడంతో ఆయన ఢిల్లీకి వెళ్లలేదు. -
వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులతో పోలిస్తే ఎగుమతులు నామమాత్రంగానే ఉన్నాయని, దేశం నుంచి ఎగుమతి అయ్యే మొత్తం సరుకులలో వ్యవసాయ ఉత్పత్తుల వాటా సగటున 1 శాతం కూడా ఉండటం లేదని వాణిజ్యానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక పేర్కొంది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాల్సిన తక్షణ అవసరం ఉన్నట్లు కమిటీ అభిప్రాయపడింది. అందుకోసం తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ స్థాయీ సంఘం 154వ నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వ్యవసాయ, మత్స్య, ప్లాంటేషన్, కొబ్బరిపీచు, పసుపు ఉత్పాదనల ఎగుమతులపై స్థాయీ సంఘం జరిపిన అధ్యయనం, సిఫార్సులకు సంబంధించిన 154వ నివేదికను స్థాయీ సంఘం చైర్మన్ వి.విజయసాయి రెడ్డి బుధవారం ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు సమర్పించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, మత్స్య ఉత్పాదనల ఎగుమతుల ప్రోత్సాహానికి నివేదికలో స్థాయీ సంఘం ప్రభుత్వానికి చేసిన కొన్ని ప్రధానమైన సిఫార్సులను వివరించారు. ‘వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు వాణిజ్య శాఖ తక్షణమే నడుం బిగించాలి. వ్యవసాయోత్పత్తుల సప్లై చైన్ సామర్థ్యాన్ని పటిష్టం చేయాలి. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలి. వ్యవసాయోత్పత్తులకు అత్యధిక విలువ చేకూరేలా చర్యలు తీసుకోవాలి..’అని కమిటీ సిఫార్సు చేసినట్లు చైర్మన్ తెలిపారు. శాస్త్రీయ పద్దతుల ద్వారా రైతులు నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదనలు సాధించేందుకు ప్రభుత్వం వారికి తగిన మద్ధతు, ప్రోత్సాహకాలను అందించడం ద్వారా వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను గణనీయంగా వృద్ధి చేయవచ్చునని కమిటీ సిఫార్సు చేసింది. ఈజిప్టు, మెక్సికో, మలేíసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు బియ్యం ఎగుమతుల కోసం మార్కెట్లను అన్వేషించాలని కోరింది. మత్స్య ఉత్పాదనల ఎగుమతులపై దృష్టి సారించాలి... 2010–11 నుంచి 2014–15 వరకు మత్స్య ఉత్పాదనల ఎగుమతులలో కనిపించిన వృద్ధి 2015–16 నుంచి క్షీణించడం మొదలైంది. ఈ పరిస్థితిని అధిగమించి తిరిగి మత్స్య ఉత్పాదనల ఎగుమతులలో వృద్ధి సాధించడానికి కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ‘చేపలు, రొయ్యల సాగులో మితిమీరిన యాంటీబయాటిక్స్ వినియోగాన్ని ఆరికట్టేందుకు శాఖాపరమైన నియంత్రణ, అజమాయిషీ ఉండేలా చర్యలు తీసుకోవాలి. రైతులు యాంటీబయాటిక్స్‌ను నియంత్రిత రీతిలో వినియోగించేందుకు అవసరమైన ఎక్స్టెన్షన్ సేవలను ప్రభుత్వ పర్యవేక్షణలో అందుబాటులోకి తీసుకురావాలి..’అని కమిటీ సిఫార్సు చేసింది. ‘మత్స్య ఉత్పాదనల నాణ్యత, దిగుబడులే లక్ష్యంగా పరిశోధన, అభివృద్ధి చేపట్టాలి. ట్యూనా చేపలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ దృష్ట్యా మత్స్య ఉత్పాదనల ఎగుమతులలో ట్యూనా చేపల వాటా పెంచడానికి చర్యలు తీసుకోవాలి’అని వాణిజ్య శాఖకు కమిటీ సిఫార్సు చేసింది. ఈ విషయంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీతో సంప్రదించి పథకాన్ని రూపొందించాలని కమిటీ సూచించింది. పొగాకు సాగులో ఎఫ్‌డీఐని అనుమతించాలి దేశంలో ఏటా 800 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పొగాకు సాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. పొగాకు ఉత్పాదనల ద్వారా ఏటా (2018–19 గణాంకాల ప్రకారం) సుమారు రూ. 6 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడం జరుగుతోంది. కానీ పొగాకు సాగుకు మాత్రం తగినంత ప్రోత్సాహం అందడం లేదని కమిటీ అభిప్రాయపడింది. పొగాకు పరిశోధనకు అరకొర నిధుల కేటాయింపు కారణంగా ప్రపంచ మార్కెట్లలో దేశీయ పొగాకు ఉత్పాదనలు పోటీకి నిలవలేకపోతున్నాయి. ప్రపంచ ప్రమాణాలకు దీటుగా పొగాకు పండించడానికి పర్యావరణ ప్రతికూలతలను తట్టుకోగల అత్యత్తుమ నాణ్యత, అధిక దిగుబడి సాధించగల వెరైటీలను సాగు చేయడానికి పొగాకు పరిశోధన ఎంతగానో తోడ్పడుతుందని కమిటీ నివేదికలో పేర్కొంది. అందుకు పొగాకు పరిశోధనకు అవసరమైన నిధుల కేటాయింపు జరగాలి. 2017లో ప్రకటించిన ఎఫ్‌డీఏ విధానం ద్వారా కాఫీ, టీ, రబ్బర్, యాలకులు వంటి ప్లాంటేషన్ పంటల సాగులో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించారు. కానీ పొగాకు పంటకు ఆ వెసులుబాటు లేదు. కాబట్టి పొగాకు సాగులో కూడా ఎఫ్‌డీఐకి అనుమతించాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఎఫ్‌డీఐ ద్వారా సాగు చేసే పొగాకును ఆక్షన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా మాత్రమే మార్కెట్ చేయాలన్న నిబంధన ఉండాలని సిఫార్సుల్లో పేర్కొంది. సిగరెట్ల అమ్మకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ 1 శాతం సుంకం విధించి ఆ మొత్తాన్ని పొగాకు మార్కెట్ స్థిరీకరణ కోసం వినియోగించాలన్న టుబాకో బోర్డు సూచనను కమిటీ ప్రశంసిస్తూ ఈ దిశగా చర్యలు తీసుకోవలసిందిగా వాణిజ్య మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. దీని వల్ల మార్కెట్ సంక్షోభ పరిస్థితులలో రైతుల ఉత్పత్తులకు న్యాయమైన ధర లభిస్తుందని చెప్పారు. -
ప్రమాద ఘటనపై వైఎస్ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్
సాక్షి, అమరావతి: విజయవాడ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి ప్రధానికి తెలియజేశారు. ఒక ప్రైవేటు హాస్పిటల్ హోటల్‌ను లీజుకు తీసుకుని అందులో కరోనా పేషెంట్లు ఉంచిందని, అందులో తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. (మృతుల కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా) అధికారులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలను చేపట్టడంతో.. భారీ ప్రాణ నష్టం తప్పిందన్నారు. దురదృష్టవశాత్తూ కొంతమంది మృత్యువాత పడ్డారని మోదీకి జగన్ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా ఇదివరకే అధికారులను ఆదేశించామన్నారు. బాధితులను అన్నిరకాలుగా ఆదుకుంటున్నామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించామని ప్రధానమంత్రికి సీఎం తెలిపారు. (విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం) విజయవాడలో అగ్ని ప్రమాదంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. ‘విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాద ఘటన విచారకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు. -
ఉప రాష్ట్రపతి పీఏనంటూ..!
సాక్షి, సిటీబ్యూరో: ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పీఏనని, ఆయన కార్యాలయంలో ఓఎస్డీనని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు ఫోన్లు చేస్తూ అనేక డిమాండ్లు చేస్తున్న వ్యక్తిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన పసుపులేటి నవీన్‌గా గుర్తించినట్టు డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. అక్కడి ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో సూపర్వైజర్గా పని చేస్తున్న నవీన్ తన బంధువులు, స్నేహితుల వద్ద డాంభికాలకు పోయేవాడు. తనకు ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంచి సంబంధాలు ఉన్నాయని, ఎలాంటి పనినైనా చేయించగలనంటూ ప్రగల్భాలు పలికేవాడు. దీంతో అనేక మంది ఇతడికి వివిధ రకాలైన సహాయాలు కోరేవారు. ఇవి పూర్తి చేయకపోతే తన పరువు పోతుందని భావించిన నవీన్ ఉప రాష్ట్రపతి పీఏ అవతారం ఎత్తాడు. అనేక మంది ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులకు ఫోన్లు చేస్తున్న ఇతగాడు తన పేరు అర్జునరావు అని, తాను ఉప రాష్ట్రపతి కార్యాలయంలో పని చేస్తానంటూ పరిచయం చేసుకునేవాడు. ఆపై వీరిని ఉద్యోగుల బదిలీలు, కాలేజీలు సీట్ల కోసం డిమాండ్ చేసేవాడు. ఈ నేపథ్యంలోనే నవీన్ ఇటీవల బీజేపీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డికి కాల్ చేశాడు. ఇతడి వ్యవహారశైలిపై అనుమానించిన ఆయన ఉప రాష్ట్రపతి కార్యాలయంలో వాకబు చేశారు. అర్జునరావు పేరుతో ఎవరూ పని చేయట్లేదని తేలింది. దీంతో కిషన్‌రెడ్డి సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు చేసిన బృందం నిందితుడు నవీన్‌గా గుర్తిచింది. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సాయంతో నవీన్‌ను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
అందుకే ప్రచారం కూడా చేయలేదు: వెంకయ్య
-
అందుకే ప్రచారం కూడా చేయలేదు: వెంకయ్య
న్యూఢిల్లీ: భారత 13వ ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం శనివారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు పార్లమెంట్ హాలుకు చేరుకున్నారు. సందడి వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఎన్డీఏ అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు తన గెలుపుపై దీమా వ్యక్తం చేశారు. అందరికంటే ముందే పార్లమెంట్‌కు చేరుకున్న ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. తాను పార్టీలకు అతీతుడినన్న వెంకయ్య.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ వ్యక్తిమీదో లేదా పార్టీ మీదో పోటీ చేయడంలేదని అన్నారు. దేశంలోని మెజారిటీ పార్టీలు తన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నాయని గుర్తుచేశారు. ‘ పార్లమెంట్లో నేను ప్రతిఒక్కరికీ తెలిసినవాడినే. అందుకే ప్రచారం కూడా చేయలేదు. అయితే, మద్దతు కోరుతూ ప్రతిఒక్కరికీ మర్యాదపూర్వకంగా లేఖలు రాశాను. వాళ్ల ప్రతిస్పందనను బట్టి గెలుస్తాననే నమ్మకం ఉంది’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు. -
ఈ లెక్కన వెంకయ్యకు 482 ఓట్లు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓట్లను తీసుకుంటే... ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు 522 మంది ఎంపీలు ఓటేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరాకుమార్‌కు 225 మంది ఎంపీల మద్దతు లభించింది. లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి మొత్తం 776 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 771 మంది ఎంపీలు ఓటింగ్‌కు అర్హులు. (మిగతావి ఖాళీలు, కోర్టు తీర్పు కారణంగా ఒక బీజేపీ ఎంపీకి ఓటింగ్ హక్కు లేదు.) రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉన్నవారు, గైర్హాజరైన వారు పోను... 747 మంది ఓటు వేశారు. వీటిలో కోవింద్‌కు 522 ఓట్లుపడ్డాయి. దీన్ని ప్రామాణికంగా తీసుకొని... ఆగష్టు 5వ తేదీన జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడికి ఎన్ని ఓట్లు పడతాయో అంచనా వేయవచ్చు. రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏను కాదని కోవింద్‌కు మద్దతునిచ్చిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఉపరాష్ట్రపతికి మాత్రం విపక్షాల ఉమ్మడి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీని బలపరుస్తామని ప్రకటించింది. అలాగే గోపాలకృష్ణ తన చిరకాల మిత్రుడు కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజూ జనతాదళ్ (బీజేడీ) మద్దతు ఆయనకే ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ప్రకటించారు. అంటే కోవింద్‌కు లభించిన జేడీయూ, బీజేడీ మద్దతు వెంకయ్యకు ఉండదు. ఈ రెండు పార్టీలకు లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి 40 మంది ఎంపీలున్నారు (బీజేడీకి లోక్‌సభలో 20, రాజ్యసభలో 8– జేడీయూకు లోక్‌సభలో 2, రాజ్యసభలో 10 మంది ఎంపీలున్నారు). అంటే కోవింద్‌కు వచ్చిన ఎంపీల ఓట్లలో వెంకయ్యకు 40 తగ్గుతాయి. 482 ఓట్లు ఆయనకు వస్తాయి. గోపాలకృష్ణ గాంధీకి 265 ఓట్లు పడతాయి. గైర్హాజరైన ఎంపీల్లో కొందరు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నా, క్రాస్ ఓటింగ్ జరిగినా ఈ çసంఖ్య కొంచెం అటుఇటూ కావొచు. ఉపరాష్ట్రపతిని ఎంపీలు మాత్రమే ఎన్నుకుంటారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ సంబంధిత వార్త రాజన్‌బాబు నుంచి నేటి వరకూ -
ప్రజల మద్దతుతోనే స్వచ్ఛత
స్వచ్ఛ సర్వేక్షణ్’ కార్యక్రమంలో వెంకయ్య సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ కార్యక్రమాలు ప్రజల మద్దతుతోనే విజయవంతమవుతా యని, కేవలం పీఎం, సీఎం, మంత్రుల వల్ల పరివర్తన రాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. దీన్ని గుర్తించే ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్‌ను రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చార న్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్.. వావ్ హైదరాబాద్’ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... రాజకీయ నాయకులు పారదర్శకతతో ఉంటే ప్రజలు మద్దతిస్తారన్నారు. నిధుల కోసం ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్థానిక సంస్థలే సమకూర్చుకోవాలని, అందుకు గానూ పన్నులు వేయడం అవసరమన్నారు. అయితే... సదుపాయాలు కల్పించాక జరిమా నాలు వేస్తే ఫర్వాలేదు కానీ, అవి లేకుండానే వేస్తే సమయం వచ్చినప్పుడు ప్రజలు రాజకీయ నాయకులకు ఫైన్లు వేస్తారన్నారు. తాత్కాలిక దృష్టితో కాకుండా 25 సంవ త్సరాలకు సరిపడా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని మంత్రి కేటీఆర్‌కు సూచించారు. స్వచ్ఛాగ్రహిలు కావాలి... ‘స్వచ్ఛ కార్యక్రమం కోసం నాడు స్వాతంత్య్ర సమయంలో సత్యాగ్రహం మాదిరిగా నేడు ప్రజలంతా స్వచ్ఛాగ్రహిలుగా మారాలి. చెత్త తొలగించే పని కూడా ప్రభుత్వానిదేనని భావించరాదు. స్వచ్ఛభారత్‌కు బాగా కృషి చేసే కార్పొరేటర్లకు 10శాతం నిధుల్ని ప్రోత్సా హకంగా ఇస్తాం. పనిచేయని వారికి 10 శాతం తగ్గిస్తాం’ అని వెంకయ్యనాయుడు చెప్పారు. మార్పు అంటే కేవలం మ్యాపుల్ని మార్చడం కాదని, ప్రక్షాళన చేయడమని, ప్రధాని మోదీ ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారన్నారు. తొలుత మనసులు పరిశుభ్రమైతే.. తర్వాత భాగ్య నగరం శుభ్రమవుతుందన్నారు. జనాకర్షక పథకాలతో సమస్యలు పరిష్కారం కావని, ప్రజల శక్తిసామర్థా్థ్యలను వినియోగించి ఉత్పాదక శక్తి పెంచాలని పిలుపునిచ్చారు. మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... చెత్త నుంచి విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించేలా సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. కార్పొరేట్ సంస్థల విరాళాలు.. స్వచ్ఛ కార్యక్రమాల అమలుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రామ్కీ సంస్థ రూ.2 కోట్లు, కామినేని కోటి రూపాయల విరాళాలు అందజేశాయి. ఈసారి టాప్–5లో... రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... స్వచ్ఛభారత్ స్ఫూర్తితో స్వచ్ఛహైదరాబాద్ అమలుకు ఏ నగరం చేయని విధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత ఏడాది స్వచ్ఛ ర్యాంకుల్లో 19 స్థానంలో ఉన్న హైదరాబాద్ ఈసారి తొలి ఐదు స్థానాల్లో నిలవగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.తెలంగాణలోని 73 యూఎల్బీల్లో నూ స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టామన్నారు. సమావేశంలో పలువురు మంత్రులు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ తలాక్ తో ముడిపెట్టొద్దు..
న్యూఢిల్లీః ఏకరూప పౌర నియమావళి (యూనిఫాం సివిల్ కోడ్) ను, ట్రిపుల్ తలాక్ విధానం నిలిపివేయడాన్ని ముడి పెట్టవద్దని, ముఖ్యంగా ఇటువంటి విషయాలను రాజకీయం చేయవద్దని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. యూనిఫాం సివిల్ కోడ్, ట్రిపుల్ తలాక్ విషయాల్లో ప్రజలు అయోమయంలో ఉన్నారన్నారు. సమస్యను చర్చించడంలో ఎటువంటి తప్పు లేదని, ప్రజలపై బలవంతంగా రుద్దే అవకాశమే లేదని ఆయన చెప్పారు. యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా వెంకయ్య నాయుడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. యూనిఫాం చట్టాలు ఏకాభిప్రాయం అధారంగా ఉంటాయని, అటువంటి వాటిని తప్పనిసరిగా చర్చించాల్సి అవసరం ఉందని చెప్పారు. అసలు సమస్య మహిళలకు సమాన హక్కులు ఇవ్వడంపైనేనని, ఈ విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోబోమని హామీ ఇచ్చారు. -
దేశ సమైక్యత కోసం పునరంకితం కావాలి
* స్వరాజ్యాన్ని సురాజ్యం చేద్దాం.. రామరాజ్యం దిశగా సాగుదాం * భారతమాత అంటే భారత దేశ ప్రజలంతా... * కవులు, కళాకారుల ఇష్టాగోష్టిలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, హైదరాబాద్: దేశ అభివృద్ధికి, సమైక్యతకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. 70 ఏళ్ల స్వరాజ్యాన్ని సురాజ్యం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆకలి, అవినీతి, అంటరానితం, వివక్ష, పేదరికం వంటి అసమానతలు లేని, ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లే రామరాజ్యం దిశగా సాగాలని సూచించారు. స్వాతంత్య్ర సప్తతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ‘స్వాతంత్య్ర సప్తతి-సాయం సంధ్య’ కవులు, కళాకారుల ఇష్టాగోష్టి కార్యక్రమానికి వెంకయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎంపీ మురళీమోహన్, బీజేపీ నేతలు కె.లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, రామచంద్రారావు, ఇంద్రసేనారెడ్డి, ప్రముఖ సినీదర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ప్రముఖ నటుడు, కవి తనికెళ్ల భరణి, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, ఆచార్య ఎన్.గోపి, గజల్ గాయకుడు శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలను జరుపుకోవడానికి పరిమితం కాకుండా.. 70 ఏళ్ల స్వరాజ్య ఫలితాలను విశ్లేషించుకోవలసిన అవ సరముందని అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్ర కార్యక్రమాల్లో భాగంగా స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని, సమర యోధుల త్యాగాలను, పోరాటాలను స్మరించుకోవలసి ఉందన్నారు. దేశభక్తి అంటే దేశ పటానికి మొక్కడం, భరతమాత చిత్రపటానికి పూలమాల వేయడం మాత్రమే కాదని, దేశంలోని ప్రజలందరి పట్లా ప్రేమను కలిగి ఉండడమని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా.. ఇంకా కులం, భాష, ప్రాంతీయ విబేధాలు, అక్కడక్కడా అంటరానితనం, దళితులు, అణగారిన వర్గాలు, మహిళలపై దాడులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాలు, వరకట్న దురాచారాలు ఇంకా కొనసాగుతున్నాయని, ఇలాంటి సాంఘిక రుగ్మతలను అంతమొందించాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని చీల్చే ఉగ్రమూకలను సమర్థించే శక్తులు, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వారికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కవులు, కళాకారులు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు పసికంటి వీరాస్వామీజీ, డాక్టర్ టీవీ నారాయణ, పీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, రాధాకృష్ణ, రాంచంద్రారెడ్డి, మల్లమ్మ, సుఖ్దేవ్ఆర్య తదితరులను ఘనంగా సన్మానించారు. ఉత్తేజపరిచిన దేశభక్తి గీతాలు కార్యక్రమంలో కవుల కవితలు, పాటలు దేశభక్తిని నింపాయి. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఆవిష్కరించాయి. కీరవాణి ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి’ పాట పాడారు. మేజర్ చంద్రకాంత్ సినిమా తనకు గొప్ప సంతృప్తినిచ్చిందని, గాంధీ సినిమా తీయలేకపోయాననే బాధను పోగొట్టిందని రాఘవేంద్రరావు అన్నారు. మాడుగుల నాగఫణిశర్మ, యూఖూబ్, ఆచార్య ఎన్ గోపీ, తనికెళ్ల భరణి, ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ ముదిగొండ శివప్రసాద్, గంగాధరశాస్త్రీ, డాక్టర్ ఎండ్లూరి సుధాకర్, భారవి, డాక్టర్ కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, శిలాశ్రీ తదితరులు తమ కవితలు వినిపించారు. సామల వేణు ఇంద్రజాల ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
మేము పారిపోవడం లేదు: వెంకయ్య
-
మేము పారిపోవడం లేదు: వెంకయ్య
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు చేయాల్సిదంతా చేశామని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రతిపక్షాలు ఆరోపించినట్టు తాము పారిపోవడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఏపీ ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి అందరూ కలిసి రావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తారో, లేదో స్పష్టంగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంతకుముందు డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వకపోతే ప్రజలు తిరగబడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే అదే విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ తప్ప అన్ని పార్టీలు పోరాడుతున్నాయని సీపీఐ సీనియర్ నేత డి. రాజా విమర్శించారు. ప్రధాని ఇచ్చిన హామీ నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటోందని ఆయన ఆరోపించారు. -
అభివృద్ధికి ఆర్థిక సాయం చేయండి
♦ కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ వినతి ♦ వెంకయ్యనాయుడు, స్మృతీ ఇరానీలతో సమావేశం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు తగిన ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవా రం ఆయన ఇక్కడ కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి స్మృతీ ఇరానీతో భేటీ అయ్యారు. తొలుత వెంకయ్యతో సమావేశమైన కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వం నెల కొల్ప తలపెట్టిన హైదరాబాద్ ఫార్మా సిటీకి భూసేకరణ జరిపేందుకు అవసరమైన నిధుల కోసం హడ్కో నుంచి రూ.785 కోట్ల రుణం ఇచ్చేలా సహకరించాలని కోరారు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా రెండో దశ పనులకు రూ.930 కోట్ల నిధులను నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రణాళిక కింద మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న స్కై వేలు, ఫ్లై ఓవర్ల నిర్మా ణం గురించి ఆయనకు వివరించారు. డ్రైనేజీలు, రోడ్ల ఆధునీకరణకు వివిధ కార్పొరేషన్ల ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నామని, కేంద్రం కూడా ఆర్థికంగా సహకరించాలని కోరారు. హైదరాబాద్‌లో ఫార్మా సిటీని నిర్మిం చనున్నామని వివరించారు. కార్మికుల కష్టాలను వివరించాం.. బుధవారం సాయంత్రం కేంద్ర జౌళీ శాఖ మంత్రి స్మృతీ ఇరానీని ఆమె కార్యాలయంలో కలిసిన.. కేటీఆర్ చేనేత కార్మికుల కష్టాలను, వాస్తవ పరిస్థితులను ఆమెకు వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మిక క్షేత్రాలైన సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్, నారాయణ్‌పేట్‌లోని కార్మికుల సమస్యలను లిఖితపూర్వకంగా కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు. కార్మికుల కష్టాలను తెలుసుకునేందుకు కేంద్రమంత్రి రాష్ట్రానికి వస్తానని తెలిపారని, ఆ పర్యటనలో కార్మికుల సమస్యలపై హైదరాబాద్‌లో సమావేశం కూడా నిర్వహిస్తానని హామీ ఇచ్చారని వివరించారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీకి ఇచ్చిన ప్రతిపాదనలను తమ శాఖకు ఇస్తే టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు తమ శాఖ నుంచి తగిన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చినట్టు కేటీఆర్ తెలిపారు. అంతేకాక కొత్త క్లస్టర్లు, శిక్షణ అంశాలపై కేంద్రమంత్రి సాయం కోరామన్నారు. -
అంత అమాయకుడినా: వెంకయ్య
రాజ్యసభ సీటు కోసం బాబును అడుగుతానా? సాక్షి, విజయవాడ/అమరావతి: ‘1978లో రాష్ట్రంలో ఇందిరాగాంధీ అనుకూల పవనాలు వీస్తున్నప్పుడు, 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో నెల్లూరు జిల్లాలో నేనొక్కడినే బీజేపీ నుంచి గెలుపొందాను. ఓ జాతీయ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన నేను రాజ్యసభ సీటు కోసం చంద్రబాబును అడుగుతానా? అంత అమాయకుడినా?’ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. నాలుగోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి విజయవాడకు వచ్చిన వెంకయ్యను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా సన్మానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా బీజేపీని విస్తరించాలనే ఉద్దేశంతోనే తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని 1985లోనే నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారు. ‘ఒకప్పుడు వాజ్‌పేయి, అద్వానీలకు మైక్ పట్టుకున్న నేను బీజేపీ అధ్యక్షుడినయ్యాను. వారి మధ్యే కూర్చునే స్థాయికి ఎదిగాను. రాష్ట్రం నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి కానీ కేంద్ర మంత్రుల కోసం ఎవరైనా వస్తే నా వద్దకే మంత్రులను పిలిపించి పనులు చేసి పంపిస్తున్నాను. విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి రాజ్యసభలో నేను ఎంత గట్టిగా మాట్లాడానో అందరికీ తెలుసు. దాని వల్ల రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలిగిందో కూడా తెలుసు’ అని అన్నారు. తాను, చంద్రబాబు కష్టపడి పైకి వచ్చామన్నారు. దేశంలో రైతులకు ఆర్థిక పరపతి కల్పించేందుకు రూ.9 లక్షల కోట్ల రుణాలు ఇస్తామన్నారు. ప్రతి కుటుంబానికి రూ.లక్ష విలువైన ఆరోగ్య బీమా పథకాన్ని త్వరలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. అమరావతిని స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చుతామని ప్రకటించారు. అమరావతి పరిసరాల్లోనే అభివృద్ధిని కేంద్రీకృతం చేయొద్దని సూచించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజలను కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయ నిబద్ధత, సమాజం పట్ల బాధ్యత ఉన్న నేత వెంకయ్యనాయుడు అని కొనియాడారు. -
సురేశ్ ప్రభుకు సీటుపై వెంకయ్య హర్షం
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సురేశ్ ప్రభు పోటీ చేస్తున్నందుకు కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. తన మిత్రుడు సురేశ్ ప్రభు అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చిన టీడీపీకి కృతజ్ఞతలు తెలిపారు. -
తెలంగాణలో రాజకీయ శూన్యత
♦ బీజేపీ ఎదగడానికి ఇప్పుడు సానుకూల పరిస్థితులు ♦ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ♦ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన కె.లక్ష్మణ్ ♦ హాజరైన వెంకయ్య, దత్తాత్రేయ, మురళీధర్‌రావు, కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, పార్టీ ఎదగడానికి ఇప్పుడు అత్యంత సానుకూల పరిస్థితులు ఉన్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కె.లక్ష్మణ్ బాధ్యతలను స్వీకరించిన అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ పాలన చరిత్రాత్మక అవసరమన్నారు. తెలంగాణలో రాజకీయ శూన్యత పెరుగుతోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం, కార్యకర్తల బలం కూడా ఉందన్నారు. ఇప్పుడు నాయకులు కూడా అనుభవం, ఓపిక, శ్రమించేతత్వం ఉన్న వాళ్లున్నారని చెప్పారు. తెలంగాణలో నాయకుల సంఖ్య ఎక్కువగా ఉందని, వీరికి బాధ్యతలను అప్పగించి, వినియోగించుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. బీజేపీలో వారసత్వానికి అవకాశం లేదని, అందరికీ అధ్యక్షునిగా అవకాశం వస్తుందన్నారు. అధ్యక్ష బాధ్యతలు శాశ్వతం కాదని, అవకాశం ఉన్నంతకాలం అందరినీ కలుపుకునిపోవాల్సిన బాధ్యత ఉందని వెంకయ్య సూచించారు. గ్రామాల్లో బీజేపీ జెండా ఎగరాలని, నాయకులు హైదరాబాద్‌లో ఎక్కువగా కనిపించకుండా జిల్లాల్లో, గ్రామాల్లో కనిపించాలన్నారు. ప్రజల్లోనే కలసి ఉండాలని, వారితోనే కలసి భోజనాలు, నిద్రలు చేయాలని సూచించారు. ప్రజలతో కలసి అధ్యయనం చేసి, సమస్యలకు పరిష్కారం అన్వేషించాలన్నారు. ఓట్ల కోసం మైనార్టీలను విభజించడానికి మజ్లిస్‌ను ఉపయోగించుకుని కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. మైనారిటీల్లోకి చొచ్చుకుపోయి, పార్టీపై విశ్వాసం పొందాల్సిన అవసరముందని వెంకయ్య అన్నారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీని రద్దు చేయలేదని, ఆ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలకు బీజేపీపై తప్పుడు ప్రచారం చేయొద్దని వెంకయ్య సూచించారు. బడ్జెట్ ఆమోదం పొందే అవకాశం లేకపోవడం వల్ల అక్కడ సంక్షోభం ఏర్పడిందన్నారు. అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉందని, బలం నిరూపించుకునే అవకాశం ఇంకా ఉందన్నారు. అక్కడి పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యం లేదని వెంకయ్య స్పష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన కె.లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ కె.లక్ష్మణ్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. బీజేపీకి ఇప్పటిదాకా అధ్యక్షునిగా ఉన్న జి.కిషన్‌రెడ్డి నుంచి లక్ష్మణ్ బాధ్యతలను స్వీకరించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ కార్యదర్శి పి.మురళీధర్‌రావు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. పార్టీ అగ్రనేతలంతా లక్ష్మణ్‌ను అభినందించారు. -
తమిళనాయుడికి రూ.3,249 కోట్లా?
న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన ప్రెస్ నోట్లో ఘోరమైన తప్పు దొర్లింది. దక్షిణాది రాష్ట్రం తమిళనాడు పేరును తమిళనాయుడు అని పట్టణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొన్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గురువారం అధికారికంగా విడుదల చేసిన ప్రెస్ స్టేట్మెంట్లో ఇలా తమిళనాయుడు అని రెండు సార్లు పేర్కొనడం వివాదాన్ని రేపింది. సీనియర్ బీజేపీ నేత వెంకయ్య నాయుడు సారధ్యం వహిస్తున్న మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో ఈ పొరపాటు చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) ప్రాజెక్టు కింద తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి 3,249 కోట్ల రూపాయల సిఫారసు చేస్తూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు జారీ చేసిన నోట్ ఇది. దీంతో తమిళనాడు కాస్తా తమిళనాయుడు ఎప్పుడయ్యిందబ్బా అని జనాలు తలలు పట్టుకుంటున్నారట. -
'అమర్నాథ్ యాత్రికుల లక్ష్యంగానే ఉగ్రదాడి'
న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రికుల లక్ష్యంగానే పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని కేంద్ర పట్టణాభివృద్ధ్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. గురుదాస్‌పూర్ ఘటనపై రాజకీయం చేయడం సరికాదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం పార్లమెంట్లో ఏ విషయాన్ని అయినా చర్చించడానికి తాము సిద్ధమని తెలిపారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరస్టులే దాడి చేశారని నిర్ధారించినట్టు వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. కాగా, పంజాబ్‌లోని గురుదాస్ పూర్లో ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్‌పై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడుల్లో ఇప్పటివరకు 13మంది మృతిచెందినట్టు సమాచారం. -
'అన్ని వర్గాలకు చేరువైన బీజేపీ'
న్యూఢిల్లీ: తమ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు చేరువయిందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. చిన్ననాటి నుంచే బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితుడనై పార్టీ కోసం పనిచేస్తున్నానని వెల్లడించారు.బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యాంప్రకాశ్ ముఖర్జీకి బీజేపీ నాయకులు నివాళులర్పించారు. -
'తెలుగు రాష్ట్రాలు రెండూ వెనకబడ్డాయి'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ఎన్డీఏ ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు హామీయిచ్చారు. బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీకి గతేడాదికి సంబంధించి రూ.250 కోట్లు నిధులు విడుదల చేశామని తెలిపారు. మార్చి 31లోగా ఈ నిధులు రాష్టానికి అందేలా చూశామన్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో ముఖ్య సమస్యలను గుర్తించామని చెప్పారు. విజయవాడలో సముద్ర, భూగర్భ కాల్వల నిర్వహణకు రూ. 461 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. పోలవరంకు అన్ని అవరోధాలు తొలగిపోయాయని చెప్పారు. ఏపీకి న్యాయం జరగకుండానే విభజన జరిగిపోయింది. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అధ్యయన బృందం నివేదిక ఇచ్చిందన్నారు. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వడానికి కేంద్రం హామీయిచ్చిందని తెలిపారు. విభజన సమస్యల కారణంగా 2013-15లో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని వెల్లడించారు. కేంద్ర నిధులు కూడా వినియోగించుకోలేకపోయాయని వెంకయ్య తెలిపారు. -
ఐఐటీకి పునాది
దీంతోపాటు ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీలకు శంకుస్థాపన హాజరైన కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, స్మృతిఇరానీ ఎడ్యుకేషన్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతాం: బాబు తిరుపతి: రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి పునాదిరాయి పడింది. దీంతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్), ట్రిపుల్ ఐటీలకు కూడా శంకుస్థాపన జరిగింది. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లను తిరుపతి సమీపంలో, ట్రిపుల్ ఐటీని శ్రీ సిటీ సెజ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మూడు జాతీయ విద్యా సంస్థలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ఎం.వెంకయ్యనాయుడు శనివారం తిరుపతి సమీపంలోని ఏర్పేడు మండలం జంగాలపల్లి వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘తిరుపతిని నాలెడ్జి హబ్‌గా తీర్చిదిద్దుతా. ఆంధ్రప్రదేశ్‌ను అన్నివిధాలుగా నంబర్ వన్ చేసే బాధ్యత తీసుకుంటున్నా. ఇందుకు ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహకారం ఉంటుంది. చదువుకున్న యువత ఉపాధికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. మున్ముందు ఏపీ ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుంది’ అని అన్నారు. విద్యతోపాటు పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామన్నారు. తిరుపతి నుంచి వెంకటగిరి వరకు ఉన్న ప్రాంతాన్ని పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే తిరుపతి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. దేశాభివృద్ధికి మోదీ నాయకత్వం అవసరమని, పది నెలల్లోనే దేశ ప్రతిష్టను పెంచారంటూ ప్రధానమంత్రిని కొనియాడారు. మన మేధ స్సును విశ్వానికి పంచేందుకే : వెంకయ్య అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రపంచానికి మన తెలివితేటలను పంచాలనే ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఒకేచోట మూడు విద్యాసంస్థలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. విద్యార్థులు ఈ సంస్థల్లో చదువుకుని ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులుగా ఎదగాలని ఆయన కాంక్షించారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా మాతృ దేశాన్ని, తెలుగు భాషనూ మరచి పోవద్దంటూ యువతకు హితవు పలికారు. రాష్ట్రంలో ఏడు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను త్వరలో నెలకొల్పుతామన్నారు. దీంతోపాటు రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని పేర్కొన్నారు. మన్నవరం ప్రాజెక్టును సైతం ముందుకు తీసుకెళుతామని హామీ ఇచ్చారు. భూ సేకరణతోఅభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. భూమి కోల్పోయిన రైతులకు నాలుగు రెట్ల పరిహారంతో పాటు అక్కడ నెలకొల్పే సంస్థలో కుటుంబంలో ఓ వ్యక్తికి ఉద్యోగం సైతం వస్తుందన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, అందువల్ల కేంద్రం తప్పకుండాసాయం చేస్తుందన్నారు. ఏపీలో త్వరలో సెంట్రల్ యూనివర్సిటీ: స్మృతిఇరానీ అనంతరం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీఇరానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీరామనవమి రోజున రాయలసీమ ప్రాంతంలో ఐఐటీ, ఐఐఈఎస్ఆర్, ట్రిపుల్ ఐటీలకు శంకుస్థాపన చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో దేశవ్యాప్తంగా విద్యార్థులంతా చదువుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ, వెంకయ్యనాయుడులను సన్మానించిన సీఎం బాబు వారికి జ్ఞాపికలను అందజేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నారాయణ, గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, సత్యప్రభ, తలారి ఆదిత్య, ఐఐటీ డెరైక్టర్ భాస్కర్‌రాజు, ఐఐఈఎస్ఆర్ డెరైక్టర్ గణేష్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎండవేడిమికి విద్యార్థులు విలవిల కాగా ఈ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులను తరలించారు. మధ్యాహ్నం సమయం కావడంతో ఎండ వేడిమిని తట్టుకోలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
‘ప్రత్యేక హోదా’పై చర్చించాలని కోరాం: మేకపాటి
* అఖిలపక్ష సమావేశం * అనంతరం మీడియాతో మేకపాటి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అన్ని హామీల అమలుతోపాటు, ఏపీకి ‘ప్రత్యేక హోదా’ అంశంపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్టు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలు, రాజ్యసభలో అప్పటి ప్రధాని డా.మన్మోహన్సింగ్ ఇచ్చిన అన్ని వాగ్దానాల అమలుకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసినట్టు తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన సమావేశానికి మేకపాటి హాజరయ్యారు. అనంతరం సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘బడ్జెట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు అన్ని పార్టీల పార్లమెంటరీ నాయకులతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఏ ఏ అంశం ఎవరు లేవనెత్తాలనేదానికి సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. కేంద్రానికి ముఖ్యంగా మేము చేసిన విజ్ఞప్తి ఏమిటంటే రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి మీరు ఇచ్చిన హామీలతోపాటు ఆ రోజు రాజ్యసభలో అప్పటి ప్రధాని చేసిన అన్ని వాగ్దానాలకు కేంద్రం కట్టుబడి ఉండాలి. కొత్తగా ఏర్పడినందువల్ల ఏపీ ఎన్నో ఇబ్బందుల్లో ఉంది. హుద్‌హుద్ తుపాన్‌తో నాలుగు జిల్లాల ప్రజలు ఇబ్బందులపాలయ్యారు. రాజధానిని నిర్మించుకోవాలి. అనేక ఇబ్బందులు ఉన్నందున విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సి ఉందని గుర్తు చేశాను’ అని అన్నారు. ఏపీకి ‘ప్రత్యేక హోదా’ అంశంపై కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, బీజేడీ, టీడీపీ సహా ఇతర పార్టీల నాయకులు మద్దతు ఇచ్చారన్నారు. కాగా అఖిల పక్ష సమావేశంలో భాగంగా ఆర్డినెన్స్‌లన్నీ బిల్లుల రూపంలోకి వచ్చేలా అన్ని పార్టీలు సహకరించాలని కేంద్రం కోరిందన్నారు. ఆ భూముల సేకరణకు వ్యతిరేకం పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావనకు రానున్న భూసేకరణ ఆర్డినెన్స్ విషయంలో వైఎస్సార్సీపీకి కొన్ని అభ్యంతరాలున్నట్టు చెప్పారు. ‘ ఏడాదిలో ముక్కారు పంటలు పండే భూములను తీసుకుంటామని కేంద్ర ం చెబుతోంది. దీనికి మేం వ్యతిరేకం. భవిష్యత్తులో ఆహారధాన్యాల కొరత దృష్ట్యా, వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూముల సేకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం. కేంద్ర ం సైతం దీనిపై పునరాలోచన చేస్తుందనుకుంటున్నాం. అందరికీ అనుకూలమైన నిర్ణయానికొస్తుందని ఆశిస్తున్నాం’ అని మేకపాటి పేర్కొన్నారు. -
విశాఖకు పండుగ
నేటినుంచి ఉత్సవ్ మూడు రోజుల పాటు నిర్వహణ సర్వాంగ సుందరంగా విశాఖ {పత్యేక కార్యక్రమాల కనువిందు విశాఖ అర్బన్: విశాఖ ఉత్సవ్ వేడుకలకు నగరం సర్వాంగ సుం దరంగా ముస్తాబైంది. సుదీర్ఘకాలం తర్వాత నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను అధికార యంత్రాం గం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుద్‌హుద్ తుపాను ఛాయలు కనిపించని విధంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయిలో వేదికలను ముస్తాబు చేస్తోంది. విశాఖ పర్యాటకాభివృద్ధికి, ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు ఈ విశాఖ ఉత్సవ్‌ను వేదికగా చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు విభిన్న కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. విశాఖ ఉత్సవ్ వేడుకలు జరిగే ప్రాంతాల రూపురేఖలు మార్చేశారు. ప్రతి వేదికను విభిన్నంగా, ప్రత్యేక సెట్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆర్కే బీచ్ వద్ద కైలాసగిరిని తలపించే సెట్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ వేదికపై ఒకేసారి వంద మంది కళాకారులు ప్రదర్శనల్చినా తట్టుకునే స్థాయిలో స్టేజ్‌ను నిర్మించారు. అక్కడే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ప్రముఖమైన ఎనిమిది దేవాలయాల నమూనాలను నిర్మించారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఈ ప్రాంగణాలను తీర్చిదిద్దారు. ఇక్కడ మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, ప్రవచనాలు, వేద పారాయణం, కచేరీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గురజాడ కళాక్షేత్రం, వుడా పార్కు, కైలాసగిరి, మధురవాడలో ఉన్న జాతర ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రతి వేదిక వద్ద తెలుగు వారి సంస్కృతీ, సంప్రదాయాలు చాటి చెప్పే కళలు, నృత్యాలు, కోలాటం, తప్పెటగుళ్లు కార్యక్రమాలతో పాటు సినీతారల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆట, పాటలతో పాటు పర్యాటకులను కడుపుబ్బా నవ్వించే హాస్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవ్‌కు వచ్చే సందర్శకుల కోసం ఆర్కే బీచ్ నుంచి 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడే వివిధ సంస్థలకు చెందిన ప్రదర్శనలు ఉంటాయి. ఒకవైపు షాపింగ్‌తో పాటు ఆహ్లాదాన్ని పంచే కార్యక్రమాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రముఖుల రాక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈ ఉత్సవ్ వేడుకలను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆర్కే బీచ్ వద్ద ప్రారంభించనున్నారు. 24వ తేదీన సినీ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు అనేక మంది సినీ హీరో, హీరోయిన్లు, సంగీత దర్శకులు, గాయనీ, గాయకులు రానున్నారు. ఉత్సవాలు చివరి రోజు 25వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. పతంగుల వేడుక విశాఖపట్నం-కల్చరల్: విశాఖ ఉత్సవ్‌లో భాగంగా గురువారం సాయంత్రం గాలిపటాల వేడుక నిర్వహించారు. ఆర్కే బీచ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ వేడుకలను ప్రారంభించారు. వుడా, రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత, మహిళలకు ఉచితంగా గాలిపటాలను అందజేశారు. అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, వుడా ఉపాధ్యక్షుడు డాక్టర్ టి.బాబూరావునాయుడులు పతంగులను ఎగరవేశారు. నగరానికి చెందిన వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు, మహిళలు, చిన్నారులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ఉత్సవ్‌లో ప్రతి ఒక్కరు భాగస్వాము లై విశాఖ సంస్కృతిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేయాలని సూచించారు. -
ఆశలన్నీ ‘వెంకయ్య’ పైనే..!
తిరుపతి నుంచి తిరుమలకు రూ.3,510 కోట్ల అంచనా వ్యయంతో మోనో రైలు ప్రాజెక్టును చేపట్టే ప్రతి పాదనను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆమోదిస్తారా? తిరస్కరిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్రం సిద్ధం చేస్తోన్న నేపథ్యంలో మోనో రైలు ప్రాజెక్టు ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. చెన్నైలో మోనో రైలు ప్రాజెక్టు చేపట్టేందుకు నవంబర్ 30న కేంద్రం ఆమోదం తెలపడం.. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి తిరుపతిని ఎంపిక చేసిన నేపథ్యంలో అందరి కళ్లు ‘మోనో రైలు ప్రాజెక్టు’పై పడ్డాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల గణతికెక్కింది. రోజూ సగటున 65 వేల మంది భక్తులు తిరుమలకు వచ్చి.. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ రెట్టింపవుతోన్న నేపథ్యంలో.. రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) పూనుకుంది. తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు సాధ్యాసాధ్యాలపై అర్బన్ మాస్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ(యూఎంటీసీ) అనే ప్రైవేటు సంస్థతో సర్వే చేయించింది. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి తిరుమలకు 27 కిమీల దూరం ఉంటుంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డుకు సమాంతరంగా మోనో రైలు మార్గాన్ని నిర్మించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు యూఎంటీసీ తేల్చింది. తిరుపతి బస్‌స్టేషన్, కపిలతీర్థం, అలిపిరి మీదుగా తిరుమలకు 27 కిమీల మేర మోనో రైలు మార్గాన్ని నిర్మించాలని సూచించింది. మోనో రైలు మార్గం.. ఆరు మోనో రైలు ఇంజిన్లు, వంద బోగీలను కొనుగోలు చేయడానికి రూ.3,510 కోట్ల మేర అవసరం అవుతాయని ఆ సంస్థ తుడాకు నివేదిక ఇచ్చింది. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ పక్కనే ఓ రైల్వే స్టేషన్, కపిలతీర్థం, అలిపిరి వద్ద రైల్వే స్టేషన్లు నిర్మించాలని ప్రతిపాదించింది. రోజూ సగటున 65 వేల మంది భక్తులు తిరుమలకు వెళ్తోన్న నేపథ్యంలో మోనో రైలు ప్రాజెక్టు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందని తేల్చింది. ఒక్కో సారి గరిష్ఠంగా 500 మంది భక్తులను మోనో రైలు ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు చేర్చవచ్చు. చిన్నపాటి వర్షం కురిసినా ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడి.. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోన్న నేపథ్యంలో మోనో రైలు ప్రాజెక్టు ఆవశ్యకతను తుడా గుర్తించింది. ఇదే అంశంపై తిరుపతి ఎంపీ వరప్రసాద్ సెప్టెంబర్ 15న తుడా అధికారులతో సమీక్షించారు. మోనో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను తుడా అధికారులు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఆమోదానికి పంపారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసిన నేపథ్యంలో.. మోనో రైలు ప్రాజెక్టును ఆ ప్రణాళికలోనే చేర్చాలని ప్రతిపాదించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో పూనమలై-గిండీ-పోరూర్-వడపళణి మధ్య 20.68 కిమీల మేర రూ.3,267 కోట్ల అంచనా వ్యయంతో మోనో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు నవంబర్ 30న కేంద్ర పట్టణాభివృద్ధికి శాఖ ఆమోదం తెలిపింది. కానీ.. ఆ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని తమిళనాడు ప్రభుత్వమే భరించాలని స్పష్టీకరించింది. తుడా వద్ద ఆ మేరకు నిధులు అందుబాటులో లేని నేపథ్యంలో.. తిరుమల మోనో రైలు ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలని సూచించింది. స్మార్ట్ సిటీలను పీపీపీ(పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం)లో చేపడుతోన్న నేపథ్యంలో మోనో రైలు ప్రాజెక్టునూ అదే పద్ధతిలో చేపట్టేందుకు కేంద్రం అనుమతి ఇస్తుందా? ప్రభుత్వ నిధులతోనే చేపడుతుందా? ఆ ప్రాజెక్టును తిరస్కరిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్రం సిద్ధం చేస్తోన్న నేపథ్యంలో తిరుమల మోనో రైలు ప్రాజెక్టుపై కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆమోదముద్ర వేసి.. నిధులు కేటాయిస్తుందా? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. -
'మంచి నిర్ణయానికి జాప్యం తగదు'
విశాఖపట్నం: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్రమంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. సుపరి పాలన దినోత్సవంలో భాగంగా గురువారం విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంచి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఉండకూడదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. స్మార్ట్ సిటీ అంశంపై త్వరలో విశాఖలో సదస్సు నిర్వహిస్తామన్నారు, విశాఖను నౌకాయాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అమెరికా సాంకేతిక సహకారంతో వైజాగ్ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు. -
మెట్రో రైలులో కేంద్ర మంత్రి వెంకయ్య ప్రయాణం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, టీఆర్ఎస్ ఎంపీలు బి.వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ నగరానికి మెట్రో రైలులో ప్రయాణం చేశారు. ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు, ప్రజా రవాణా వ్యవస్థకు ప్రాచుర్యం పెంచేందుకు ఇటీవల ఎంపీలు తరచుగా మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. -
మత మార్పిళ్లను ప్రోత్సహించం: వెంకయ్య
న్యూఢిల్లీ: మతమార్పిడిలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించబోదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. మతమార్పిడిలు లేదా మరోసారి మార్పిడిలకు కేంద్రం మద్దతు ఇవ్వబోదని సోమవారం ఆయన లోక్‌సభలో చెప్పారు. మతమార్పిడిలను ఆపే బాధ్యత రాష్ట్రాలదే అన్నారు. మతమార్పిడిలను ప్రోత్సహించే వారిపై రాష్ట్రాలు చర్య తీసుకోవాలని సూచించారు. మతమార్పిడిల వ్యవహారంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో ప్రభుత్వం తరపున వెంకయ్య స్పందించారు. ప్రతిపక్షాలు పట్టువీడకపోవడంతో సభలో గందరగోళం రేగింది. -
అన్యాయాన్ని సరిదిద్దడానికే సవరణ
* కేంద్ర మంత్రి వెంకయ్య స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్సీల విషయంలో జరిగిన అన్యాయం, పొరపాటు సరిదిద్దడానికే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు తెస్తామంటున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం తగదని పేర్కొన్నారు. చట్ట సవరణను కొందరు మొండిగా వ్యతిరేకించడమే కాకుండా, దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ విషయంలో వస్తున్న విమర్శలపై వెంకయ్య బుధవారం మీడియాతో మాట్లాడారు. రాజ్యసభలో ఏపీ ఎంపీలు తెలంగాణకు, తెలంగాణ ఎంపీలు ఏపీకి కేటాయింపు జరిగిందన్నారు. ఎమ్మెల్సీల సంఖ్య విషయంలో కూడా అలాగే జరిగిందంటూ.. ప్రభుత్వం వీటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ‘ఏపీ ఎంపీలు తెలంగాణలో, తెలంగాణ ఎంపీలు ఏపీలోనే ఉండాలని, శాసనమండలిలో ఏపీ, తెలంగాణ ప్రజలకు సముచిత ప్రాతినిధ్యం దక్కకూడదని సవరణను వ్యతిరేకించేవారు భావిస్తే చేయగలిగిందేమీ లేదు..’ అని పేర్కొన్నారు. చట్ట సవరణకు, ప్రత్యేక హోదాకు సంబంధం లేదని, ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని జాతీయ అభివృద్ధి మండలి చూసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
రూ.45 లక్షల కోట్లతో వంద స్మార్ట్ సిటీలు
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధికి ప్రణాళిక ‘సీఐఐ-సమ్ ఇన్ఫ్రా’ సదస్సులో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు సాక్షి ప్రతినిధి, తిరుపతి: దేశంలో ప్రభుత్వ, ప్రైవే టు భాగస్వామ్యంతో రూ.45 లక్షల కోట్లతో వంద స్మార్ట్ సిటీల అభివృద్ధికి ప్రణాళిక రచించామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. 500 మేజర్ టౌన్లు, చారిత్రక, వారసత్వ నగరాలను అభివృద్ధి చేయడానికి పథకం రూపొందించామన్నారు. దీనిపై జనవరిలో కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లతో సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. తిరుపతిలో మూడు రోజులుగా జరుగుతున్న ‘సీఐఐ-సమ్ ఇన్ఫ్రా’ సదస్సు శనివారం ముగిసిం ది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంపద సృష్టిస్తేనే పంచడానికి సాధ్యమవుతుందన్నారు. సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ వల్ల సంపదను సృష్టించలేకపోయారన్నారు. రాజకీయపార్టీలు, నాయకులతోపాటు ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజ లకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని పేర్కొన్నా రు. ఉచిత విద్యుత్ ఇచ్చుకుంటూ పోతే చివరకు విద్యుత్తే ఉండదన్నారు. పన్నులు వేస్తేనే పనులు జరుగుతాయని చెప్పారు. దేశంలో కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో పన్నులు వేయకపోవడం, ప్రజ లు కట్టకపోవడం వల్లే ఆ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయన్నారు. విజయవాడ కార్పొరేషన్లో మూడు నెలలకు ఒకసారి వేతనా లు ఇస్తున్నారని కార్మికులు తన వద్దకు వచ్చారని చెప్పారు. అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానమే శరణ్యమన్నా రు. ఆంధ్రప్రదేశ్‌కు సీఎం చంద్రబాబును చూసే పెట్టుబడులు వస్తాయని చెప్పారు. వెయ్యి కిలోమీటర్ల సముద్రతీరం, కశ్మీర్ నుంచి కన్యాకుమారిని కలిపే జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, చెన్నై-విశాఖపట్నం, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లు ఉండటం వల్ల పెట్టుబ డులు పెట్టడానికి, పరిశ్రమలు ఏర్పాటుచేయడానికి రాష్ట్రం అత్యంత అనుకూలమైన ప్రాంతమని వివరించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పన్ను రాయితీలు కల్పించడంపై పార్లమెంటులో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు మాట్లాడుతూ చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌లో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై ఆసియా అభివృద్ధి బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఇచ్చాపురం నుంచి తడ వరకు నౌకాశ్రయాలను అనుసంధానం చేస్తూ నాలుగు వరుసల రహదారి నిర్మిస్తామని చెప్పారు. -
తెలుగు, కన్నడ రాష్ట్రాలకు నిధులివ్వండి
* కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను కోరిన కేంద్ర మంత్రి వెంకయ్య సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కర్ణాటకలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని రెండో విడత నిధులను సమయానుసారంగా విడుదల చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ను కోరారు. ఢిల్లీలో మంత్రి వెంకయ్య సోమవారం బీరేంద్ర సింగ్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. సకాలంలో నిధులు విడుదల చేసి గ్రామీణాభివృద్ధికి సంబంధించి పెండింగు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని రెండో విడత నిధులను, 13వ ఆర్థిక మండలి నిధులను వారంలోపే విడుదల చేయడానికి గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్ సింగ్ హామీ ఇచ్చారు. -
బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం పోరంకిలో ప్రారంభమైంది. కేంద్ర మంత్రులు రాజీవ్ ప్రతాప్ రూడీ, ఎం.వెంకయ్య నాయుడు నుంచి సభ్యత్వం స్వీకరిస్తున్న కె.హరిబాబు విజయవాడ బ్యూరో : త్వరలో జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, వచ్చేసారి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోనూ తమ సర్కార్లు వస్తాయని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాజీవ్ ప్రతాప్ రూఢీ చెప్పారు. తాము కోరిన సీట్లు శివసేన ఇవ్వకపోవడంతో మహారాష్ట్రలో ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నామని తెలిపారు. పోరంకిలో ఆదివారం జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూడీ మాట్లాడుతూ.. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలపై తమకు అమితమైన గౌరవం ఉందని, అంతమాత్రాన ఆ రాష్ట్రాల్లో తమ పార్టీ బలపడడం ఆగదని స్పష్టం చేశారు. ఏపీలో ఈ ఏడాది పది లక్షల మందిని సభ్యులుగా చేర్పించాలని, ఐదేళ్లలో ఆ సంఖ్య 80 లక్షలకు చేరాలని సూచించారు. పార్టీ అంటే జీవిత భాగస్వామి: వెంకయ్య కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, తుళ్లూరులో పచ్చగా కనిపించే పొలాలు పోతున్నాయంటే బాధగానే ఉంటుందని, కానీ రాజధాని కోసం తప్పదని, కానీ లక్షల ఎకరాలు కావాలని తాను అనలేదని చెప్పారు. భూములు తీసుకుంటున్న రైతులకు న్యాయం జరగాలన్నారు. పార్టీని జీవిత భాగస్వామిగా భావించాలని, పార్టీ సభ్యత్వం ఒక పవిత్ర బంధమని నాయకులు, కార్యకర్తలకు ఉద్బోధించారు. బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరైనా పార్టీలోకి రాావచ్చని చెప్పిన వెంకయ్య.. పదవుల కోసం వచ్చే వారిని మాత్రం తాను ఆహ్వానించబోనని స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదని, వ్యక్తిత్వం లేని నాయకులే కులం, మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మాట్లాడుతూ.. ప్రతి మూడేళ్లకోసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. డిసెంబరు 6న అన్ని జిల్లాల్లోనూ ఒకేసారి సభ్యత్వ నమోదును ప్రారంభించాలని నాయకులకు సూచించారు. హరిబాబుకు కేంద్ర మంత్రి రూఢీ సభ్యత్వం ఇవ్వగా మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులకు హరిబాబు సభ్యత్వం ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సత్తా నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షుడు అడపా నాగేంద్ర సహా రాష్ట్రంలోని పలువురు నేతలు బీజేపీలో చేరారు. కల్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి పెనమలూరు : యనమలకుదురులోని శ్రీరామలింగేశ్ర స్వామి ఆలయంలో దాత సంగా నరసింహారావు నిర్మించిన పలు నిర్మాణాలను కేంద్ర మంత్రి వెంకయ్య ప్రారంభించారు. కల్యాణ మండపం, హోమ మండపం, అన్నదాన సత్రాల ప్రారంభోత్సవంగా వైభవంగా నిర్వహించారు. వీరికి పూజారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమ, మాణిక్యాలరావు స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అనురాధ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మేయర్ కోనేరు శ్రీధర్, ఎంపీపీ కనకదుర్గ, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసరావు, సర్పంచి మూడే సుభద్ర ఉన్నారు. మంత్రులకు సన్మానం మంత్రులు వెంకయ్య, ఉమ, మాణిక్యాలరావులను దాత నరసింహారావు సన్మానించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ రీజినల్ డెరైక్టర్ చంద్రశేఖర్‌అజాద్, ఏసీ దుర్గాప్రసాద్, ఆలయ కార్యదర్శి ఎన్.భవాని, మాజీ కార్యదర్శి దూళిపాళ్ల సుబ్రమణ్యం, పూజారి సాగర్, పర్యవేక్షకుడు గంగాధర్ పాల్గొన్నారు. -
మరోసారి కేంద్ర బృందం వస్తోంది: వెంకయ్య
-
మరోసారి కేంద్ర బృందం వస్తోంది: వెంకయ్య
విశాఖపట్నం: హుదూద్ తుపాను బాధిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు మరోసారి కేంద్ర బృందం వస్తోందని కేంద్ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. దెబ్బతిన్న టెలికాం, రైల్వే వ్యవస్థలను నెల రోజుల్లో పునరుద్దరిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తుపాన్ సాయం అందుతూనే ఉందని వెల్లడించారు. దెబ్బతిన్న ఎస్సీ, ఎస్టీ ఇళ్ల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటామన్నారు. హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వెంకయ్య నాయుడు బుధవారం ప్రకటించారు. -
'వెన్నుపోటు పొడవలేదు, పొత్తు వదులుకున్నాం'
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్టాల్లో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే అని చెప్పారు. అయితే శివసేనకు వ్యతిరేకంగా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. శివసేనను తాము వెన్నుపోటు పొడవలేదని, ఆ పార్టీతో పొత్తు మాత్రమే వదులుకున్నామని చెప్పారు. హర్యానాలో కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలని ఓటర్లు నిర్ణయించుకున్నారని అన్నారు. ఎన్నికల తర్వాత హర్యానాలో ప్రభుత్వ పగ్గాలు తమ చేతికే వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, హర్యానాలో ఈనెల 15న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
ఈపీఎఫ్ పింఛన్ పెంపుతో లబ్ధి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేదల జీవన ప్రమాణాలు పెంపే మోదీ లక్ష్యమని ఉద్ఘాటన హైదరాబాద్: ఈపీఎఫ్ పరిధిలోని ఉద్యోగుల కనీస పెన్షన్ రూ.వెయ్యి ఉండాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా 32 లక్షల మంది లబ్ధి పొందబోతున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. హైదరాబాద్ శాఖ పరిధిలోనే 59 వేలమంది లబ్ధి పొందనున్నారని తెలిపారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ పెన్షన్‌దారులను సన్మానించారు. పెన్షన్ పెరుగుదలకు సంబంధించిన సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమానికి ఈపీఎఫ్‌వో హైదరాబాద్ రీజినల్ కమిషనర్ ఎంఎస్‌కేవీవీ సత్యనారాయణ అధ్యక్షత వహించగా, ఈపీఎఫ్ అడిషనల్ సెంట్రల్ కమిషనర్ కేవీ సర్వేశ్వరన్ అతిథిగా హాజరయ్యారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు పూర్తవుతున్నా ఇంకా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కొందరు నెలకు రూ.7 నుంచి రూ.30 చొప్పున పెన్షన్ పొందుతున్నారని తెలిసి ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఇప్పుడు కనీస పెన్షన్‌ను రూ.వెయ్యిగా చేయడం వల్ల ఆ కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగినట్టు కాకపోయినా.. కొంతవరకు వారి పరిస్థితి మెరుగుదలకిది ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పథకంలో వేతన సీలింగ్‌ను నెలకు రూ.15 వేలకు పెంచినందున భవిష్యత్ ఉద్యోగులు అందుకోబోయే పెన్షన్ మొత్తం రూ.7,500 వరకు పెరిగే వీలుంటుందన్నారు. అందరికీ బ్యాంక్ అకౌంట్లు లక్ష్యం: దేశంలోని పేదల కనీస జీవన ప్రమాణాలు పెంచడం ధ్యేయంగా మోదీ పనిచేస్తున్నారని వెంకయ్య తెలిపారు. దేశంలో ఇప్పటికీ 68 శాతం మందికి బ్యాంకు అకౌంట్లు లేవని తెలిసి ప్రధాని జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రథకం ప్రవేశపెట్టిన నెలరోజుల్లో 4.35 కోట్ల మందికి కొత్త ఖాతాలు తెరిపించారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రెడ్డి ఈపీఎఫ్ ఉద్యోగుల పెన్షన్ రూ. 6,500 పెంచాలని మంత్రికి వినపతి పత్రం అందజేశారు. -
బడ్జెట్‌కు ముందు స్మార్ట్ సిటీల ఎంపిక: వెంకయ్య
ముంబై: స్మార్ట్ సిటీలు అభివృద్ధి చేయడానికి నగరాల ఎంపికను వచ్చే బడ్జెట్ సమావేశాల ముందు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు సోమవారమిక్కడ వెల్లడించారు. స్మార్ట్ సిటీల రూపురేఖలకు తుది మెరుగులు దిద్దుతున్నామని.. వచ్చే నవంబర్ నాటికి ఇది పూర్తయ్యే అవకాశముందని అన్నారు. ఒక్కో రాష్ట్రంలో రెండు, మూడు స్మార్ట్ సిటీలు ఉండేలా చూస్తామన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని స్మార్ట్‌సిటీగా నిర్మించాలని భావిస్తున్నానన్నారు. -
రూ.100 కోట్లతో విజయవాడ దూరదర్శన్
కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు ప్రత్యేకంగా దూరదర్శన్ కేంద్రాలు ఉండాలనే ఉద్దేశంతో విజయవాడలో కొత్తగా డీడీ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్లు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. విజయవాడలో కొత్తగా పూర్తిస్థాయి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈనెల 27వ తేదీన విజయవాడలో డీడీ కేంద్రాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ప్రసారభారతి సీఈవో, దూరదర్శన్ డెరైక్టర్ జనరల్‌తో సమావేశమై విజయవాడలో డీడీ ఏర్పాటుపై చర్చించామన్నారు. విజయవాడ దూరదర్శన్ కేంద్రానికి రూ.100 కోట్లు వ్యయం అవుతుందన్నారు. -
‘రక్షణ’లో ఎఫ్‌డీఐలు తెలివైన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలన్నది చాలా తెలివైన నిర్ణయమని కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వావలంబన సాధించడంతోపాటు దేశీయ తయారీ రంగాన్ని కూడా ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్రమోడీ సంకల్పానికి ఈ నిర్ణయం సాయమందిస్తుందని చెప్పారు. హైదరాబాద్ శివార్లలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో సంస్థ రజతోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఏడాదిపాటు జరిగిన ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి వెంకయ్యనాయుడు హాజరై మాట్లాడుతూ రక్షణ రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యంపై ఎలాంటి అపోహలూ అవసరం లేదని పునరుద్ఘాటించారు. రానున్న పదేళ్లలో రక్షణ రంగ దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవడంతోపాటు నాణ్యమైన ఉత్పత్తలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.ప్రధాని మోడీ ‘స్వచ్ఛ భారత్’ ఆకాంక్షను సాకారం చేసేందుకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన బయోటాయిలెట్లను పెద్ద ఎత్తున ఉపయోగిస్తామని వెంకయ్యనాయుడు తెలిపారు. -
28న 'జన-ధనయోజన' ప్రారంభం
హైదరాబాద్: శాస్త్రవేత్తల పరిశోధనలు కేవలం రక్షణ రంగానికే కాకుండా రైతులు, సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఉండాలని కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. డీఆర్డీఓ శాస్త్రవేత్తల సదస్సులో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ నెల 28న ఢిల్లీలో ప్రధానమంత్రి జన-ధనయోజన పథకాన్ని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతిఒక్కరికి బ్యాంక్ అకౌంట్ తెరుస్తామని చెప్పారు. దీని ద్వారా ఖాతాదారుడికి డబ్బుకు భద్రతతో పాటు వడ్డీ లభిస్తుంది. ఖాతాలో కనీస మొత్తాన్ని ఉంచాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి జన-ధనయోజన పథకాన్ని నరేంద్ర మోడీ ఆగస్టు 15న ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కరచాలనమే బ్రేకింగ్ న్యూస్!
* ఇద్దరు సీఎంల కలయికపై వెంకయ్యనాయుడు స్పందన * అలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో బాబు, కేసీఆర్ ఆలోచించుకోవాలి * అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖర్‌రావులు పరస్పరం కరచాలనం చేసుకోవటం పెద్ద వార్త కావటంపై వారిద్దరూ ఆలోచన చేసుకుంటే మంచిదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇద్దరు ముఖ్యమంత్రులు కరచాలనం చేసుకోవడం పెద్ద వార్త కాకూడదు. అయితే అది పెద్ద వార్త అయింది. ఇందుకు దారితీసిన పరిస్థితులపై వారే ఆలోచించాలి. విభేదాలుంటే వాటిని పక్కన పెట్టి కలిసి పనిచేయాలన్నది నా ఆకాంక్ష. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఇద్దరు ముఖ్యమంత్రులకూ సూచించా. పాటిస్తారో లేదో వారి ఇష్టం’ అని చెప్పారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ పలు దేశాల అధ్యక్ష, ప్రధానులతో భేటీ అవడం సాధారణ అంశాలుగానే పరిగణిస్తామన్నారు. విభజన చట్టంలో రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఉద్దేశించిన అంశాల అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఫీజు రీయిం బర్స్మెంట్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 1956 స్థానికత నిబంధనపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకు రానున్నట్లు వెంకయ్యనాయుడు ప్రకటించారు. బిల్డర్ నుంచి ఇళ్లను కొనుగోలు చేసేవారికి ఎక్కువ ప్రయోజనం కలిగించేలా, రియల్ ఎస్టేట్ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేలా బిల్లు ఉంటుందన్నారు. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌తోపాటు కెడ్రాయి లాంటి సంస్థలతోనూ చర్చిస్తున్నట్లు చెప్పారు. వచ్చే శీతకాల సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదానికి వచ్చే అవకాశం ఉందన్నారు. నిధుల సేకరణపై స్థానిక సంస్థలు దృష్టి పెట్టాలి పురపాలక సంస్థలు నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంతంగా వనరులు సమకూర్చుకోవటంపై దృష్టి సారించాలని వెంకయ్య సూచించారు. పనులు వసూలు చేసి పారదర్శకంగా ఖర్చు పెట్టాలన్నారు. ఈ విషయాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. స్థానిక సంస్థలకు సుదీర్ఘ కాలం తరువాత కూడా ప్రభుత్వాలు అధికారాలు అప్పగించకపోవటంపై సమీక్షించటం తన ప్రాధాన్యత అంశాలల్లో ఒక్కటని తెలిపారు. కాలపరిమితి తీరినందున జేఎన్ఎన్యూఆర్ఎం పథకం స్థానంలో కొత్త మిషన్ ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ్హ కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బీమా బిల్లుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలును కోరుతున్నాం. అర్థవంతమైన సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బిల్లుపై చర్చించేందుకు తయారుగా ఉన్నాం. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు నెగ్గేందుకు సహకరించాలి. 2008లో యూపీఏ ప్రభుత్వమే ఈ బిల్లుకు రూపకల్పన చేసింది. తాజా బిల్లులో బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచాం. సవరణ బిల్లులో ఉన్న తేడా అదే. -
ప్రతిపక్ష హోదా అప్పుడుందా: వెంకయ్య
-
ప్రతిపక్ష హోదా అప్పుడుందా: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు సోమవారం నుంచి ప్రారంభం కానున్న సభను సాగనీయబోమన్న ఆ పార్టీ నేతల హెచ్చరికలపై కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తీవ్రంగా మండిపడ్డారు. సభను ఎలా జరపాలో తమకు తెలుసన్నారు. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి.. ఆ తరువాత జాతీయ మీడియా ప్రతినిధులతో వెంకయ్య మాట్లాడారు. సంఖ్యా బలం లేనప్పుడు ప్రతిపక్ష హోదాకోసం స్పీకర్‌పై ఒత్తిడి పెంచాలి తప్పితే మొత్తం సభను అడ్డుకుంటామన్న మాటలు సరికాదని హితవు పలికారు. ప్రతిపక్ష పార్టీల్లో ఎవరికీ తగిన సంఖ్యా బలం లేనందున నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌ల హయాంలో ప్రతిపక్ష హోదా ఇవ్వని సందర్భాలున్నాయని గుర్తు చేశారు. అప్పటి నిర్ణయాలకు జవాబు చెప్పి కాంగ్రెస్ ఈ చర్చను ముందుకు తీసుకెళితే మంచిదని సలహా ఇచ్చారు. మత రిజర్వేషన్లకు బీజేపీ పూర్తి వ్యతిరేకం మతపరంగా రిజర్వేషన్లు ఏర్పాటు చేయడానికి బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని వెంకయ్యనాయుడు చెప్పారు. అలాంటివి తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చినా.. యూపీలో ప్రభుత్వం ఇచ్చినా మంచివి కాదన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తే దేశంలో మతమార్పిడి ఎక్కువయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. -
మన్నవరం ప్రాజెక్టుపై వెంకయ్య ఆరా
న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా మన్నవరంలో ఏర్పాటుచేయతలపెట్టిన ఎన్టీపీసీ-బీహెచ్ఈఎల్ పవర్ ప్రాజెక్టు లిమిటెడ్‌పై కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆరా తీశారు. ప్రాజెక్టులో పురోగతి కనిపించడం లేదన్న కారణంతో వెంకయ్యనాయుడు శనివారం ఎన్టీపీసీ ఎండీ అరూప్ రాయ్‌ను పిలిపించి ప్రాజెక్టు ప్రస్తుత స్థితిని తెలుసుకున్నారు. గతంలో ఆర్థిక మందగమన పరిస్థితుల కారణంగా టర్బయిన్లు, బాయిలర్లకు డిమాండ్ లేకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా మందగించాయని, స్థల సేకరణ పనులు కూడా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని ఎండీ వివరించినట్టు తెలిసింది. మన్నవరం వైఎస్సార్పురంలోని ఎన్టీపీసీ-బీహెచ్ఈఎల్ పవర్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్బీపీపీఎల్) పనులు ముందుకు సాగడం లేదని, వేగవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఢిల్లీలో ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని కలసి విన్నవించిన సంగతి తెలిసిందే. -
'కాంగ్రెస్ పరిస్థితి ఒడ్డున పడ్డ చేప పిల్లలా ఉంది'
ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఒడిపోయి... అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒడ్డున పడ్డ చేప పిల్లలా ఉందని కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతోత్సవం ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మతం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని... అందుకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా కొని చేదు గుళికలు మింగక తప్పదని చెప్పారు. నాటి ప్రధాని నెహ్రూతో వచ్చిన విభేదాలు కారణంగా కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిన మహావ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని ఆయన గుర్తు చేశారు. దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన ఆయన మరింత కాలం జీవించి ఉంటే కాశ్మీర్ సమస్య పరిష్కారమయ్యేదన్నారు. -
ఇళ్ల నిర్మాణ నైపుణ్యంలో సాయం చేయండి
సింగపూర్‌ను కోరిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ: దేశంలో 2022లోగా అందరికీ తక్కువ ఖర్చులో ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న ఎజెండా అమలుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇళ్ల నిర్మాణంలో నైపుణ్యాన్ని పంచుకోవడంలో తమకు సాయం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం స్వయంగా సింగపూర్‌ను కోరగా మరోవైపు ఈ అంశంపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గృహనిర్మాణ మంత్రులతో రెండు రోజుల సమావేశాలను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఢిల్లీలో ప్రారంభించారు. భారత పర్యటనకు వచ్చిన సింగపూర్ విదేశాంగ మంత్రి కె. షణ్ముగంతో భేటీ సందర్భంగా మోడీ ఈ సూచన చేసినట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని మోడీ భావిస్తున్నట్లు పేర్కొంది. ప్రజాకర్షక సబ్సిడీలొద్దు: వెంకయ్య 2022లోగా అందరికీ ఇళ్లు కట్టించాలన్న లక్ష్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్రాల గృహనిర్మాణ మంత్రుల సమావేశంలో వెంకయ్య నాయుడు తెలిపారు. భారీ స్థాయిలో ఆర్థిక వనరులు అవసరమైన ఈ బృహత్తర పథకం కోసం అన్ని రకాల ఆర్థిక మోడళ్లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మెరుగైన సేవల కోసం అయ్యే వ్యయాన్ని భరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని...అందువల్ల పట్టణ ప్రణాళికల్లో ప్రజాకర్షక సబ్సిడీ వైఖరి స్థానంలో ఈ విధానానికి చోటు కల్పించాలన్నారు. -
బీజేపీ గూటికి కిరణ్..?
కేంద్రమంత్రి వెంకయ్యతో మాజీ సీఎం కిరణ్ చర్చలు జేఎస్పీని బీజేపీలో విలీనం చేస్తామంటూ ప్రతిపాదన సాక్షి ప్రతినిధి, తిరుపతి : జేఎస్పీ అధినేత ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీ జెండా పీకేసేందుకు సిద్ధమయ్యారా? బీజేపీలో ఆ పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమయ్యారా? కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో జరిపిన మంత్రాం గం ఫలిస్తే.. పక్షం రోజుల్లోనే కాషాయదళంలోకి కిరణ్ చేరనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి జేఎస్పీ వర్గాలు.. చివరి బంతి వరకూ వేచి చూడండి, రాష్ట్ర విభజనను ఆపుతానంటూ అప్పటి సీఎం కిరణ్ ప్రగల్భాలు పలికిన విషయం విదితమే. తనకు తాను సమైక్య సింహం.. చాంపియన్‌గా అభివర్ణించుకున్న కిరణ్ రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నాక.. సీఎం పదవికి రాజీనామా చేసి జారుకున్నారు. ఆ తర్వాత జైసమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు. ప్రజలు విశ్వసించి జేఎస్పీకి ఓట్లేసి కాస్తోకూస్తో సీట్లను కట్టబెడితే.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి బాగుంటే, ఆపార్టీ అధిష్టానానికి షరతులు పెట్టి పార్టీని విలీనం చేసేలా కిరణ్ అప్పట్లో ప్రణాళిక రచించారనే అభిప్రాయం క్రమంలోనే ఎన్నికల ప్రచారంలోనూ రాష్ట్ర విభజనను ఆపుతానంటూ ఊరువాడ ప్రచారం చేశారు. విజయంపై ధీమా లేని కిరణ్ తాను స్థాపించిన పార్టీ తరఫున పోటీ చేయకుండా ఆదిలోనే కాడి దించారు. తాను ప్రాతినిథ్యం వహించిన పీలేరు నియోజకవర్గంలోనూ కిరణ్ పోటీచేయలేదు. పీలేరు నుంచి ఆయన సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి జేఎస్పీ తరఫున బరిలోకి దిగారు. రాష్ట్రంలో పీలేరు మినహా ఏ ఒక్క చోట కూడా జేఎస్పీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కిన దాఖలాలు లేవు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత కిరణ్ తెరమరుగయ్యారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఎక్కడా కన్పించకపోవడమే అందుకు తార్కాణం. కాంగ్రెస్ పార్టీ కూడా అటు దేశంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ పూర్తిగా బలహీనపడింది. ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్రంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీచేసిన టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కిరణ్ తన వ్యూహాన్ని మార్చారు. జేఎస్పీని కాంగ్రెస్‌లో కాకుండా బీజేపీలో విలీనం చేసి, ఆపార్టీలో కీలకపాత్ర పోషించడం ద్వారా రాజకీయంగా పునర్వైభవం సాధించాలని కలలు కంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ సైతం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బలమైన నేతలను కాషాయదళంలో చేర్చుకోవడానికి బీజేపీ నేతలు ఎత్తులు వేస్తున్నారు. ఇది పసిగట్టిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి, బీజేపీ జాతీయనేత ఎం.వెంకయ్యనాయుడుతో రహస్యంగా సమావేశమయ్యారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డితోనూ కిరణ్ చర్చలు జరిపారు. తనను బీజేపీలో చేర్చుకుని.. ప్రాధాన్యం ఇస్తే జేఎస్పీని విలీనం చేస్తానని వెంకయ్యనాయుడు వద్ద ప్రతిపాదించినట్లు కిరణ్ అనుయాయులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని కిరణ్‌కు వెంకయ్య హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదే అంశంపై పీలేరు నియోజకవర్గంలోని తనకు సన్నిహితులైన నేతలకు కిరణ్ చెప్పినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ అధిష్ఠానం పచ్చజెండా ఊపడమే తరువాయి.. జేఎస్పీని ఆపార్టీలోకి విలీనం చేయడానికి కిరణ్ సిద్ధమైపోయారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌కు దన్నుగా నిలిచిన బీజేపీలోకి సమైక్య చాంపియన్‌గా అభివర్ణించుకున్న కిరణ్ ఇప్పుడు చేరడానికి అర్రులు చాస్తోండటం గమనార్హం. -
తాత చెప్పినట్టే దేశ దిమ్మరినయ్యూ
కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ‘ఓరే బాబూ నీ అరి కాలిపై చక్రం ఉందిరా. దేశ దిమ్మరివవుతావు. అని చాలా చిన్న వయస్సులోనే మా తాత చెప్పారు. అలాగే ఆ నాడు ఆయన చెప్పిన ప్రకారమే దేశదిమ్మరినయ్యూ. దేశమంతా తిరిగి ప్రజలకు సేవ చేయడానికే దేశ దిమ్మరినయ్యా’ అని అన్నారు కేంద్ర పట్టణాభివృద్థి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు. చంద్రబాబు ప్రమాణాస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు నగరంలోని గేట్‌వే హోటల్లో దిగిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయడు ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో కొద్దిసేపు వాకింగ్ చే శారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నడక శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందన్నారు. చేసే పని మంచిదైతే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. తాను రోజూ ఇంటిలో అందుబాటులో ఉన్న డ్రైవర్‌తో, కుక్‌తో ఎవరితోనైనా కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతుంటానన్నారు. తనకిష్టమైన షటిల్ బ్యాడ్మింటన్ ఆడిన తరువాత హుషారుగా, ప్రశాంతంగా ఉంటుందన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ వాకింగ్, సైక్లింగ్ చేసే సంస్కృతి పెరగాలన్నారు. ఇందుకోసమే పట్టణాభివృద్ధిలో భాగంగా దేశంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న స్మార్ట్ సిటీలు, మెట్రో సిటీల్లో రోడ్లపై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. సీమాంధ్ర నగరాల్లో వేసే రోడ్లపై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఐజీఎంసీ స్టేడియంలో అనుకోని అతిథిగా కాషాయ రంగు టీ షర్ట్, లోయర్‌తో సాదాసీదాగా వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు స్టేడియంలో వార్మ్ప్ చేస్తున్న టెన్నిస్ ఆడే చిన్నారులు ‘గుడ్ మార్నింగ్ సార్’ అంటూ స్వాగతం పలికారు. ఇందుకు వెంకయ్యనాయడు తనైదైనశైలిలో ‘మనం భారతీయులం. గుడ్ మార్నింగ్ కాదు నమస్తే అనాలి. మమ్మీ, డాడీ కాదు అమ్మా, నాన్న అని పిలవాలి’ అని సూచించారు. టెన్నిస్ చిన్నారులతో పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న మహిళా క్రికెటర్లకు కుశల ప్రశ్నలువేశారు. స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా వెంకయ్యనాయుడుతో కరచలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ముందు ఒక సారి స్టేడియంలో వాకింగ్ చేసేం దుకు వచ్చానని, మళ్లీ ఇప్పుడు వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి స్టేడియంలో సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు విషయాన్ని ‘న్యూస్‌లైన్’ వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయని వివరించగా వెంకయ్యనాయుడు వెంటనే తన పీఏను పిలిచి ఢిల్లీ వెళ్లగానే సంబంధిత మంత్రితో మాట్లాడేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాకింగ్ అనంతరం స్టేడియం నుంచి బందరు రోడ్డుపై నడుచుకుంటూనే తాను బస చేసిన హోటల్ గేట్‌వేకు చేరుకున్నారు. -
'రాజధాని ఏర్పాటుపై తొందరగా నిర్ణయం'
-
'రాజధాని ఏర్పాటుపై తొందరగా నిర్ణయం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు భరోసాయిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌ను మొదటి సంవత్సరం కేంద్రమే భరిస్తుందని చెప్పారు. రాజధాని ఏర్పాటుపై తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. పోలవరంపై సందేహం అక్కర్లేదన్నారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. విజయవాడ -గుంటూరు- తెనాలి మధ్య మెట్రో రైల్‌కు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. రేపు పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం ఉంటుందన్నారు. 10,11 తేదీల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుందని చెప్పారు. పార్లమెంట్ చర్చ అనంతరం రెండు సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని సమాధానాలిస్తారని తెలిపారు. పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా కోసం కూటమిగా ఏర్పాడాలని కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని వెల్లడించారు. ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నదానిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని వెంకయ్య నాయుడు చెప్పారు. -
ముగిసిన ఎంపీల ప్రమాణం
మంత్రులను పరిచయం చేసిన మోడీ న్యూఢిల్లీ: నూతన లోక్‌సభ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసింది. గురువారం రికార్డు స్థాయిలో ఏకంగా 510 మంది ఎంపీలు ప్రమాణం చేయడం తెలిసిందే. మిగతా వారిలో అత్యధికులు శుక్రవారం ప్రమాణం చేశారు. టీఆర్ఎస్ ఎంపీ బి.వి.పాటిల్, టీడీపీకి చెందిన నరమల్లి శివప్రసాద్ తదితరులు వీరిలో ఉన్నారు. ఆర్జేడీకి చెందిన రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్, ఆయన భార్య రంజిత్ రంజన్ (కాంగ్రెస్) ప్రమాణం కార్యక్రమానికి హైలైట్‌గా నిలిచారు. మొత్తం వ్యవహారాన్ని సజావుగా జరిపించారంటూ ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్, లోక్‌సభ సెక్రటరీ జనరల్ పి.శ్రీధరన్‌లను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అభినందించారు. ఒకే రోజులో ఏకంగా 510 మందితో ప్రమాణం చేయించడం ద్వారా శ్రీధరన్ రికార్డు సృష్టించారన్నారు. స్పీకర్ ఎన్నిక జరిగిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సభ్యులను లోక్‌సభకు పరిచయం చేశారు. విద్యుత్, బొగ్గు శాఖ మంత్రి (స్వతంత్ర హోదా) పీయూష్ గోయల్ మినహా రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్ తదితర 43 మంది మంత్రులనూ పేరుపేరునా పరిచయం చేశారు. ఆ క్రమంలో నిజానికి గోయల్ పేరును కూడా మోడీ పిలిచారు. ఆయన సభలో లేరంటూ కాంగ్రెస్ సభ్యులంతా గట్టిగా అరవడంతో, అలాగైతే ఆయనను మరోసారి పరిచయం చేస్తానన్నారు. పాల్ తడబడ్డ వేళ... బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ ప్రమాణస్వీకారం సందర్భంగా తడబడ్డ వైనం సభలో నవ్వులు పూయించింది. అందరి మాదిరిగానే ఆయనకు కూడా లోక్‌సభ సిబ్బంది ప్రమాణ పాఠం ప్రతిని అందించగా, వద్దంటూ తిరస్కరించి సొంతగానే ప్రమాణం చేయడం మొదలు పెట్టారు. కానీ కొంతమేరకు పలికాక ఆపై గుర్తుకు రాక నీళ్లు నమిలారు. చివరికి సిబ్బందిని పిలిచి ముద్రిత ప్రతిని అడిగి తీసుకుని, దాంట్లో చూస్తూ ప్రమాణం పూర్తి చేయాల్సి వచ్చింది. ఆయన పాట్లను ఇతర సభ్యులు ఆద్యంతం నవ్వుతూ గమనించారు. చాలాకాలం పాటు కాంగ్రెస్‌లో ఉన్న పాల్ ఇటీవలి ఎన్నికల ముందు బీజేపీలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని దోమరియాగంజ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ విషయమై అంతకుముందు ఉదయం కూడా సభలో పలువురు సభ్యులు పాల్‌ను సరదాగా ఆట పట్టించడం కన్పించింది. ‘ఏమండీ పాల్ గారూ! మీరిప్పుడు ఏ పార్టీలో ఉన్నారు?’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ సరదాగా అడిగారు. దానికాయన ‘మీ పార్టీలోనే’ అంటూ అంతే సరదాగా బదులిచ్చారు. ఎంతైనా మీరు ఒక్క రోజు ముఖ్యమంత్రి కదా అంటూ పాల్‌ను బెనర్జీ మరింతగా ఆటపట్టించి అందరినీ నవ్వించారు -
వివక్ష లేకుండా కేంద్రం సాయం: వెంకయ్య
-
వివక్ష లేకుండా కేంద్రం సాయం: వెంకయ్య
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర సాయం ఉంటుందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. వివక్ష లేకుండా రెండు రాష్ట్రాలకు కేంద్రం సాయం అందిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం వంటి సమస్యలు న్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను పేర్కొంటూ పోలవరం, ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేయాలని కోరుతూ ప్రధానికి సోనియా లేఖ రాశారని వెంకయ్య తెలిపారు. వీటిపై అధికారం ఉన్నప్పుడే సోనియా సరైన నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. యూపీఏ నిర్లక్ష్య వైఖరే సమస్యలకు కారణమని విమర్శించారు. విశ్వసనీయత లేక రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి అవసరమయ్యే అన్ని చర్యలు తమ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన హామీయిచ్చారు. -
ఈనెల 6న లోకసభ స్పీకర్ ఎన్నిక: వెంకయ్య
-
ఈనెల 6న లోకసభ స్పీకర్ ఎన్నిక: వెంకయ్య
న్యూఢిల్లీ: లోక్‌సభలో రేపు ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. గోపీనాథ్ ముండేకు సంతాపం తెలిపిన అనంతరం లోక్‌సభ ఎల్లుండికి వాయిదా పడుతుందని చెప్పారు. ఈనెల 5, 6 తేదీల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. 6వ తేదీ మధ్యాహ్నం లోకసభ స్పీకర్ ఎన్నిక నిర్వహించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. 9న లోక్‌సభను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారని చెప్పారు. 10, 11 తేదీల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ ఉంటుందని వెంకయ్య నాయుడు తెలిపారు. కాగా, గోపీనాథ్ ముండే మరణం నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమయింది. ముండే మృతికి సంతాపం తెలిపింది. రేపు, ఎల్లుండి సంతాప దినాలు పాటించాలని కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. -
‘ప్రతిపక్ష నేత’పై 4లోగా నిర్ణయం
కేంద్రమంత్రి జవదేకర్ వెల్లడి న్యూఢిల్లీ: కొత్త లోక్‌సభ కొలువుదీరే జూన్ 4లోగా కాంగ్రెస్‌కు ప్రతిపక్ష నేత హోదా మంజూరు అంశంపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు నిబంధనలు పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే చెప్పిం దని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మం త్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. వచ్చే 4లోగా ఈ అంశాన్ని పరిష్కరిస్తామని అన్నారు. మంత్రిగా పార్లమెంట్ హౌస్‌లో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎగువసభ (రాజ్యసభ)కు సంబంధించిన వ్యవహారాలను జవదేకర్‌కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అప్పగించారు. రాజ్యసభలో ఎన్డీయేకు మెజారిటీ లేకపోవడం, అక్కడ తమ యుద్ధాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియూగాంధీ సంకేతాలిచ్చిన నేపథ్యంలో.. పెద్దల సభలో శాసనపరమైన ఎజెండా ఆమోదం పొందడం కష్టమవుతుందా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి పై సమాధానమిచ్చారు. తగిన సంఖ్యా బలం ఉన్నందున కాంగ్రెస్‌కు రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదా దక్కడంలో ఎలాం టి సమస్యా లేనప్పటికీ.. లోక్‌సభకు సంబంధించి మాత్రం అవసరమైన 55 సీట్లకు గాను ఆ పార్టీకి 44 సీట్లు మాత్రమే లభించడంతో ఈ అంశం ప్రశ్నార్ధకమైంది. ప్రతిపక్ష నేత హోదా కింద ప్రయోజనాలు దక్కాలంటే చట్టపరమైన కొన్ని అవసరతలు ఉండా ల్సి ఉన్నప్పటికీ.. ఏకైక అతిపెద్ద పార్టీ నేతకు లేదా గ్రూపునకు ప్రతిపక్ష నేత హోదా కట్టబెట్టాలని స్పీకర్ భావించినట్టైతే అందుకు న్యాయపరమైన ఆటంకం ఏమీ లేదని నేతలు అభిప్రాయపడుతున్నారు. లోక్‌సభలో విపక్ష నేతగా పార్టీ తరఫునుంచి ఎవరు ఉండాలనేదానిపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలున్నాయి. -
100 రోజుల ఎజండా
* కీలకమైన అంశాలను గుర్తించి లక్ష్యంలోగా పూర్తి చేయండి * మంత్రులకు ప్రధాని మోడీ మార్గనిర్దేశం * అభివృద్ధిలో రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించాలి * దేశాభివృద్ధికి పది సూత్రాల ప్రణాళిక న్యూఢిల్లీ: ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మూడు రోజులకే తన మంత్రివర్గ సహచరులకు నరేంద్రమోడీ 100 రోజుల ఎజెండాను నిర్దేశించారు. తమ మంత్రిత్వశాఖల్లో ప్రాధాన్యతలవారీగా కీలకమైన అంశాలను గుర్తించి 100 రోజుల్లోగా వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. సమర్థ పాలనతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు సక్రమంగా అమలయ్యేందుకు పెద్దపీట వేయాలని సూచించారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యమే ముఖ్యమని చెబుతూ.. రాష్ట్రాలు, ఎంపీలు లేవనెత్తే సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్బోధించారు. గురువారమిక్కడ జరిగిన కేబినెట్ భేటీలో మోడీ ఈ మేరకు మార్గనిర్దేశం చేశారు. దేశాభివృద్ధికి పది సూత్రాల ప్రణాళికలో భాగంగా ప్రధాని ఈ విషయాలను మంత్రులకు వివరించారు. ఈ పది సూత్రాల ప్రణాళికలో... దేశంలో పెట్టుబడులను గణనీయంగా పెంచడం, ఇప్పటికే చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయడం, దేశ పురోగతికి సహజ వనరులను వినియోగించుకోవడం వంటి అంశాలకు మోడీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ 4 నుంచి 11 వరకు జరుగనున్న పార్లమెంట్ సమావేశాల అనంతరం మోడీ తన పది సూత్రాల ప్రణాళికను వివరిస్తూ జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశాలున్నాయి. తొలి వంద రోజుల్లో మంత్రిత్వ శాఖల్లో ముఖ్యమైన అంశాలను గుర్తించి, వాటిని పూర్తి చేయాలని మోడీ చెప్పినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం అయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధరల నియంత్రణ, వ్యవసాయం, మహిళల భద్రతకు సహజంగానే పెద్దపీట వేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వడోదర సీటును వదులుకున్న మోడీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసితోపాటు గుజరాత్‌లోని వడోదర నుంచి నెగ్గిన మోడీ గురువారం వడోదర లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. వడోదరలో ఆయన కాంగ్రెస్ నేత మధుసూదన్ మిస్త్రీపై 5.7 లక్షల రికార్డు మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. చట్టం ప్రకారం రెండుస్థానాల్లో నెగ్గిన ఎంపీ.. ఫలితాలు వెలువడిన 14 రోజుల్లోపు ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాలి. ఈ గడువు గురువారంతో పూర్తికానున్న నేపథ్యంలో మోడీ వడోదర స్థానానికి రాజీనామా చేశారు. చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టినందుకు వడోదర నియోజకవర్గ ప్రజలకు ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి, ఆజాంగఢ్ల నుంచి నెగ్గిన ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ కూడా మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాలు అందినట్లు పార్లమెంట్ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ రెండు చోట్ల ఉప ఎన్నికలు జరగనున్నాయి. పీఎంవో అధికారులతో మాటామంతీ.. ప్రధానిగా మూడోరోజు నరేంద్రమోడీ సౌత్‌బ్లాక్‌లోని తన కార్యాలయంలో కలియదిరిగారు. స్వయంగా సిబ్బంది వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. కార్యాలయంలో పలు విభాగాలు, ఉద్యోగుల విధులు, వసతుల గురించి మోడీ వాకబు చేసినట్లు పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం సిబ్బంది, అధికారులతో కలిసి దిగిన ఫొటోను మోడీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మోడీ 10 సూత్రాల ప్రణాళిక 1. పాలనలో పారదర్శకత, ఈ-వేలంకు పెద్దపీట 2. అధికారవర్గాల్లో విశ్వాసాన్ని పెంపొందించడం 3. అధికారుల నుంచి సృజనాత్మక ఆలోచనలను స్వీకరించడం, పనిలో స్వేచ్ఛ కల్పించడం 4. విద్య, ఆరోగ్యం, తాగునీరు, ఇంధనం, రోడ్లకు ప్రాధాన్యం 5. ప్రజా అనుకూల విధానాల రూపకల్పన 6. మౌలిక వసతులు, పెట్టుబడుల్లో సంస్కరణలు 7. శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక వ్యవస్థ 8. ఆర్థిక ఇబ్బందుల పరిష్కారానికి కృషి 9. నిర్దేశిత గడువులోగా విధానాల అమలు 10. ప్రభుత్వ విధానాల్లో సుస్థిరత మంత్రులకు 7 మార్గదర్శకాలు * కీలకాంశాలను గుర్తించి 100రోజుల్లో పరిష్కరించండి * సుపరిపాలనపై దృష్టి పెట్టండి * పథకాల అమలులో సమర్థంగా వ్యవహరించండి *రాష్ట్రాలు, ఎంపీలు లేవనెత్తిన అంశాలపై తక్షణమే స్పందించండి. వాటిని పెండింగ్‌లో పెట్టొద్దు. * గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను ప్రాధాన్యతలవారీగా చేపట్టండి * నిర్ణయాల్లో సహాయ మంత్రులనూ విశ్వాసంలోకి తీసుకుని, వారికి కూడా పనులు అప్పగించండి * సిబ్బంది నియామకాల్లో బంధుప్రీతి కూడదు -
‘యూటీ’ మాటే లేదు: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్న హైదరాబాద్‌ను ఎన్డీయే ప్రభుత్వ హయాంలో కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేసే అవకాశం లేదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అలాంటి ఆలోచన మంచిది కాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సీమాంధ్రకు దక్కనందున ఇంకొక ప్రాంతానికి దక్కరాదనే ఆలోచన చేయకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ మంచి రాజధాని నిర్మించుకోవడం చక్కని పరిష్కారమవుతుందని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కల్పించిన ఐదేళ్ల ప్రత్యేక హోదా వ్యవధిని మరింతగా పెంచాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. -
కుంభకోణాల కాంగ్రెస్ కనుమరుగు
మదనపల్లె/తిరుపతి: కుంభకోణాల కాంగ్రెస్ కనుమరుగైపోయిందని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు విమర్శించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలోనూ, తిరుపతిలో విలేకరులతోనూ మాట్లాడారు. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థికవనరులను పూర్తిగా దోచుకుందని ధ్వజమెత్తారు. కేంద్రంలో సుస్థిరమైన పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వైఎస్ఆర్, ఎన్టీఆర్ ప్రారంభించిన పోలవరం, వెలుగోడు, పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కేంద్రంలో దృఢమైన నిర్ణయాలు తీసుకునే సుస్థిర ప్రభుత్వం అవసరమన్నారు. రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలను నరేంద్ర మోడీకి అందించగలిగితే విభజన నేపథ్యంలో బీజేపీ ఒత్తిడితో పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎన్డీఏ అమలు చేయగలుగుతుందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం రాగానే ప్రతి చేనుకూ నీరందిస్తామనీ, ప్రతి చేతికీ పని కల్పిస్తామన్నారు. పారిశ్రామిక కారిడార్లు నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఇతర రాష్ట్రాలకు కూలీ కోసం వలసలు నివారిస్తామన్నారు. మదనపల్లెలో నిర్వహించిన రోడ్‌షోను జనం అంతగా రాలేదు. -
కాంగ్రెస్ చచ్చిన పాము: వెంకయ్య
తిరుపతి/నెల్లూరు, న్యూస్‌లైన్: దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని అది ఒక చచ్చిన పాములాంటిదని బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం తిరుపతిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌కు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీజేపీకి ప్రత్యామ్నాయం లేదన్నారు. ఎంఐఎం లాంటి పార్టీలే బీజేపీకి భయపడతాయని, అలాంటిది టీఆర్ఎస్ ఎంత అని ప్రశ్నించారు. అంతకుముందు నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగే సమయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల సంక్షేమం పట్టని సోనియా, రాహుల్‌గాంధీకి ఈ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదని చెప్పారు. నేడు కేసీఆర్‌పై విరుచుకుపడే కాంగ్రెస్ నేతలు రేపు ఆయనతో కలిసిపోవచ్చన్నారు. తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణ గెలుపునకోసం సోమవారం రాత్రి చంద్రబాబునాయుడి సోదరుడి కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ నిర్వహించిన రోడ్ షో జనంలేక వెలవెలబోయింది. -
సీట్లు మాకు.. బీ ఫారాలు మీకా?: వెంకయ్యనాయుడు
టీడీపీ తీరు సరికాదు: వెంకయ్య సాక్షి, విజయవాడ: పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించి తమకు కేటాయించిన స్థానాల్లో బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవాల్సిందేనని బీజేపీ అగ్రనేత ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో బీజేపీకి కేటాయించిన మూడు సీట్లలో టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడం ఆ పార్టీ చేసిన తప్పిదమన్నారు. టీడీపీ నేతలు వారితో నామినేషన్లు ఉపసంహరింపచేయాలని సూచించారు. సోమవారం విజయవాడలో ‘మీట్ ద ప్రెస్’లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ను వీడాకే జగన్‌పై సీబీఐ దాడులు కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ, ఐబీ, ఎలక్షన్ కమిషన్ లాంటి వాటి ప్రతిష్టను దిగజార్చిందని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం ఆయనపై కేసులు పెట్టలేదని, కాంగ్రెస్ నుంచి బయటకు రాగానే ఆయనపై సీబీఐ దాడులు చేయించి అరెస్టు చేయించారని గుర్తు చేశారు. సీబీఐ, ఐబీ సంస్థలను ప్రయోగించి గుజరాత్ సీఎం నరేంద్రమోడీని కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారని చెప్పారు. హైదరాబాద్ అందరిదని, అక్కడ ఉన్నవారంతా హైదరాబాదీయులేనని చెప్పారు. దేశ ప్రజలు ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చన్నారు. ఇటలీకి చెందిన వారు దేశాన్ని ఏలవచ్చు కానీ ఇతర ప్రాంతాల వారు హైదరాబాద్ వచ్చి ఉండకూడదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో దేశం అధోగతి పాలైందన్నారు. రూపాయి విలువ క్షీణించిందన్నారు. దేశంలో తీవ్రవాద ం, చొరబాట్లు పెరిగిపోయి అంతర్జాతీయంగా ప్రతిష్ట దెబ్బతిందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో ఒకే కుటుంబానికి చెందిన వారిపేర్లు 650 ప్రాజెక్టులకు, పథకాలకు పెట్టారని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే వీటిని సమీక్షించి దేశ ప్రముఖుల అందరి పేర్లు వాటికి పెడతామని చెప్పారు. గుంటూరు, విజయవాడ మధ్య ఎనిమిది లైన్ల రహదారితోపాటు కోస్తా తీరం వెంబడి జాతీయ రహదారి, పోర్టులు అభివృద్ధి తదితర ప్రాజెక్టులు తాము చేపడతామని ప్రకటించారు. విలేకరుల సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు సోమసుందరం, ఆంజనేయులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో ఉండాలంటే అనుమతి కావాలా?
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, ఉగ్రవాదం పెచ్చుమీరాయని, నాయకుడే కరవైన ఆ పార్టీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి మల్లారెడ్డి, బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి రాంచందర్‌రావుకు మద్దతుగా ఆదివారం ఆయన ప్రచారం చేశారు. ఆనంద్‌బాగ్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ.. దేశానికి ధైర్యాన్నిచ్చే సత్తా మోడికే ఉందని, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 300 పై చిలుకు సీట్లు సాధిస్తుందన్నారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నట్టే.. దేశానికి అదే పాలన మోడీతో అందుతుందన్నారు. వెయ్యి మంది మరణానికి, తెలంగాణ రాకుండా అడ్డుపడిన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్లేనన్నారు. ఓడిపోతామన్న భయంతోనే టీఆర్ఎస్ నాయకులు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని, తెలంగాణ ఏర్పాటు బీజేపీతోనే సాధ్యమైందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. పాతబస్తీలోని మైనార్టీలకు మజ్లిస్ పార్టీ చేసింది ఏమీలేదని, చివరకు కాంగ్రెస్ కూడా అక్కడి వారిని ఓటు బ్యాంక్‌గానే ఉపయోగించుకుందని ఆయన విమర్శించారు. సెటిలర్ అనే పదానికి అర్థం లేదని, భారత ప్రజలు దేశంలో ఎక్కడైనా జీవించవచ్చన్నారు. హైదరాబాద్‌లో ఉండాలంటే అనుమతికావాలా అని ఆయన టీఆర్ఎస్ను ప్రశ్నించారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా సినీనటులు రాజశేఖర్, జీవిత రోడ్‌షోలో పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు బహిరంగ సభతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
అభివృద్ధికి ఆత్మబంధువు మోడీ: వెంకయ్య
హైదరాబాద్: దేశంలో కాంగ్రెస్ శకం ముగిసి, బీజేపీ శకం ప్రారంభమైందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతోందని చెప్పారు. మోడీ ప్రభంజనాన్ని చూసి కాంగ్రెస్ బెంబేలేత్తుతోందని ఎద్దేవా చేశారు. అభివృద్ధికి ఆత్మబంధువు మోడీయేనని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. మోడీ హవాను ఆపే శక్తి ఎవరికీ లేదని దీమా వ్యక్తం చేశారు. దేశాన్ని అన్ని రకాలు దోచుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కాంగ్రెస్ హుందాగా తప్పుకుని, గౌరవప్రదంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలని వెంకయ్య నాయుడు సూచించారు. -
సమస్యలపై సమాధానమేది?
తెలంగాణ, సీమాంధ్రలో మెజారిటీ స్థానాలు మావే ఎన్డీఏకు 300 సీట్లు ఖాయమని ధీమా ఎన్నికల అనంతర పొత్తులకు వ్యతిరేకం కాదు సీమాంధ్రలో అభ్యర్థుల ఎంపికపై నేడు చర్చ సాక్షి, న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, పాలనా వైఫల్యం, నమ్మక ద్రోహంపై సమాధానం చెప్పకుండా తమ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై వ్యక్తిగత దూషణలకు దిగుతూ కాంగ్రెస్ తన స్వభావాన్ని చాటుకుంటోందని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు మండిపడ్డారు. వ్యక్తిగత అంశాలపై చర్చించాల్సి వస్తే కాంగ్రెస్ నేతలకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ వివాహాన్ని గోప్యంగా ఉంచారంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ప్రస్తావించగా... ‘వివాహ విషయాన్ని మోడీ ఎప్పుడూ రహస్యంగా పెట్టలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్లో పేర్కొన్నారు. బాల్య వివాహం జరిగిన తర్వాత ఆయన జీవితాన్ని పార్టీ, దేశానికి అంకితమిచ్చారు. ఇరు కుటుంబాల వారికీ ఈ విషయం తెలుసు. ఇలాంటి వాటిపై కాంగ్రెస్ చర్చించవద్దు. కాంగ్రెస్‌కు కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి’ అని వెంకయ్య బదులిచ్చారు. దేశానికి, ప్రజాప్రయోజనాలకు హాని కలిగే ప్రమాదముంటేనే వ్యక్తిగత విషయాలపై చర్చించాలన్నారు. మోడీ రాజధర్మాన్ని పాటిస్తున్నారన్నారు. రెబెల్స్‌ను సముదాయిస్తున్నాం: తెలంగాణలో కొన్ని చోట్ల రెండు పార్టీల నుంచి తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు వేశారని, వారిని సముదాయించి ఉపసంహరించే ప్రయత్నం చేస్తున్నామని వెంకయ్య తెలిపారు. అది పూర్తయ్యాక తెలంగాణలో స్పష్టత వస్తుందన్నారు. సీమాంధ్రలో శనివారం ఎన్నికల కమిటీ భేటీ కానుందని, ఆ కమిటీ సిఫార్సు చేసే పేర్లను కేంద్ర కమిటీ ఒక రోజులోనే ఆమోదిస్తుందని పేర్కొన్నారు. సీమాంధ్ర, తెలంగాణలో మోడీ సభలను ఏర్పాటు చేస్తామని, పార్టీ అగ్రనేత అద్వానీ, సుష్మా తదితర నేతలు కూడా హజరవుతారని చెప్పారు. రెండు ప్రాంతాల్లోనూ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పొత్తులు పార్టీల మధ్య తప్పితే వ్యక్తుల మధ్య కాదని, బీజేపీ-టీడీపీల మధ్య పొత్తును వ్యక్తులకు ఆపాదించడం సరికాదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. తెలంగాణలో సుస్థిరతే లేదని, అలాంటిది తమ కూటమితో అస్థిరత ఎలా వస్తుందని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈసారి సొంతంగా 250కి పైగా స్థానాల్లో గెలుస్తుందని, మిత్రులతో కలిసి 300 స్థానాలు ఖాయమని, దక్షిణాది రాష్ట్రాల్లో 50 సీట్లు వస్తాయని వెంకయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతర పొత్తులకు అవసరం ఉండకపోవచ్చునని, అయితే అందుకు తాము వ్యతిరేకం కాదని వెంకయ్య తెలిపారు. ప్రస్తుతానికైతే పార్టీలో అలాంటి చర్చలేమీ జరగడం లేద ని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మోడీ హవా స్పష్టంగా కనిపిస్తోందని, కాంగ్రెస్ ఎంతో వెనుకబడిపోయిందన్నారు. -
కాంగ్రెస్ నుంచి విముక్తి కావాలి
రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గెలుపు ఎన్డీఏ కోసం కాదని... భారత్ కోసమని బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి పొందాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పొత్తుల వల్ల బీజేపీ,టీడీపీలు ఒకదానికొకటి సహకరించుకుంటాయని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ, దేశంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. 10 ఏళ్ల యూపీఏ పాలన 8 అంశాలలో ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీపై వెంకయ్యనాయుడు నిప్పులు చెరిగారు. -
సీమాంధ్రలో ఐఐటీలు పెడతాం: వెంకయ్య
చిత్తూరు: తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వడంలేదని అన్నారు. నాగర్జునసాగర్, దుమ్ముగూడెం నుంచి సీమాంధ్రకు 200 టీఎంసీల నీరు కేటాయిస్తామన్నారు. శ్రీకాకుళం-చెన్నై గంగా కావేరీ జలాలను అనుసంధానం చేస్తామన్నారు. సీమాంధ్రలో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తామని హామీయిచ్చారు. ట్రిపుల్ ఐటీ, ఐఐటీలు సీమాంధ్రలో నెలకొల్పుతామన్నారు. కమ్యునిస్టులు ప్రపంచమంతా ఏకం కావాలంటారు... రాష్ట్రంలో మాత్రం నారాయణ, రాఘవులు మాత్రం కలవరని వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు. -
అప్పుడే ఎందుకు చేయలేదు?
న్యూఢిల్లీ: సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు విమర్శలు గుప్పించారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ లాంటి నగరాలను ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కో కుటుంబానికి ఒక్కో ఉద్యోగం ఎందుకివ్వలేదని నిలదీశారు. టీడీపీ మాత్రమే పెద్ద పార్టీ అనుకోవద్దని చురక అంటించారు. తాము ఎవరికి అంటరాని వాళ్లం కాదని, ఎవరొచ్చినా చేర్చుకుంటామని చెప్పారు. దక్షిణ భారతంలోని తమిళనాడు, కేరళ, ఆంధ్రా, కర్నాటకలో మోడీ ప్రభంజనం అధికంగా ఉందని, మోడీ పీఎం కావడం తథ్యమని వెంకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు. -
బస్సుయాత్ర తర్వాత తీర్థయాత్రే!: వెంకయ్య నాయుడు
* కాంగ్రెస్‌పై బీజేపీ నేత వెంకయ్య వ్యాఖ్య * ఆంధ్ర, తెలంగాణల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టే దేశమంతటా ఉందని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. బస్ యాత్రలు చేసినా, సమ్మేళనాలు పెట్టినా కాంగ్రెస్ కోలుకునే పరిస్థితే లేదన్నారు. బస్ యాత్రల అనుభవంతో ఆ తర్వాత తాపీగా తీర్థయాత్రలు చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, కె.లక్ష్మణ్, ఎన్.రామచంద్రరావులతో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన నిర్ణయానికి కట్టుబడి విశ్వసనీయతను నిలుపుకున్నామని, అదే సమయంలో సీమాంధ్రకు ప్రత్యేకహోదా దక్కేలా చేశామని వివరించారు. ఉభయ రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రధాని అయితే ఉభయ రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు. తాము సుపరిపాలన, అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే రాహుల్‌గాంధీ మాత్రం 2002 అల్లర్ల గురించి లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 1947 నుంచి ఇప్పటి వరకు ఎవరేమి చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. 32 సీట్లున్నప్పుడు ఏమీ చేయలేని కొందరు వ్యక్తులు ఇప్పుడు 25 లోక్‌సభ సీట్లు ఇస్తే ఏదో పొడిచేస్తామనడం ప్రజల్ని మభ్యపెట్టడమేనని అన్నారు. రాష్ట్రంలో పొత్తులపై భావసారూప్యత ఉన్న వ్యక్తులు, పార్టీలతో అరుణ్‌జైట్లీ, ప్రకాశ్ జవదేకర్ సంప్రదిస్తున్నారని చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం మరికొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తుందని చెప్పారు. మూడో ఫ్రంట్ విఫలకూటమని, ప్రజలు మోడీని చూసి కమలానికి ఓటు వేస్తారని చెప్పారు. ఓటమికి భయపడే చిదంబరంలాంటి వాళ్లు పోటీకి దూరంగా ఉంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ చెంచా అని అభివర్ణించారు. మోడీపై కేజ్రీవాల్ సహా ఎవరైనా పోటీ చేయవచ్చని, ఎవరికీ భయపడబోమని చెప్పారు. -
ప్యాకేజీపైనా రాజకీయాలా? : వెంకయ్య
కాంగ్రెస్ తీరుపై వెంకయ్య ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్ర కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపైనా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ సీమాంధ్రలో పర్యటిస్తూ ప్యాకేజీ కాంగ్రెస్ గొప్పతనంగా చెప్పుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బండారు దత్తాత్రేయ వ్యక్తిగత సమాచారంతో రూపొందించిన ప్రత్యేక వెబ్‌సెట్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. లోక్‌సభలో బిల్లుపై చర్చ పూర్తయిన తర్వాత రాజ్యసభలో ఈ అంశాలపై బీజేపీ పట్టుబట్టిన తరువాతనే కాంగ్రెస్ ప్యాకేజీ ఇవ్వడానికి ముందుకొచ్చిందని విడమరచి చెప్పారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ‘హూ ఈజ్ కిరణ్’ అంటూ జైరాం చేసిన వ్యాఖ్యలను వెంకయ్య తప్పుపట్టారు. జూన్ తరువాత సోనియా గాంధీని కూడా ‘హూ ఈజ్ సోనియా’అంటారేమోనని ఎద్దేవా చేశారు. తెలుగు ప్రజలంటే కాంగ్రెస్‌కు ఎప్పుడూ చిన్న చూపని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి తెలుగువారికి దక్కే అవకాశం ఉన్నప్పటికీ, వేరే రాష్ట్రం అధికారికి పొడిగింపు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను సీమాంధ్రలో కలపడంపై అడిగిన ప్రశ్నకు.. ‘విభజన జరుగుతున్నప్పడు సమస్యలు వస్తాయని, చర్చించుకొని పరిష్కరించుకోవాలి’ అని బదులిచ్చారు. పొత్తు కోసం టీఆర్ఎస్ను సంప్రదించే అవకాశాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు ఆ పార్టీ ఎంఐఎం, సీపీఐలతో పొత్తుకు ప్రయత్నిస్తోందన్న వార్తలు వచ్చాయన్నారు. -
పదేళ్లు ప్రత్యేక హోదా: వెంకయ్య నాయుడు
సాక్షి, కాకినాడ: కేంద్రంలో అధికారంలోకి రాగానే సీమాంధ్రకు కల్పించిన ప్రత్యేక హోదాను ఐదేళ్ల నుంచి పదేళ్లకు పొడిగిస్తామని బీజేపీ అగ్రనేత ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. ‘మోడీఫర్ పీఎం’ కార్యక్రమాన్ని సోమవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వెంకయ్య మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేసి ఉంటే కాంగ్రెస్ అధిష్టానం కచ్చితంగా దిగివచ్చేదన్నారు. వారి చేతకానితనం వల్లే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చిందని, ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నందునే అనైతికపద్దతిలో ప్రవేశపెట్టినా బిల్లుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. విభజన అనివార్యం కావడంతో సీమాంధ్రులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఉభయసభల్లో తమ పార్టీ చేసిన పోరాటం ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించిందన్నారు. అయితే వాటిని అమలు చేసే సత్తా కాంగ్రెస్‌కు లేదని, మరో మూడు నెలల్లో అధికారంలోకి రానున్న బీజేపీ ప్రభుత్వం వాటిని సమర్థంగా అమలు చేస్తుందన్నారు. -
పెళ్లైన తర్వాత పెళ్లి చూపులు పెట్టుకున్నట్లు..
న్యూఢిల్లీ: ప్రజలు విభజన గురించి మాట్లాడుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం విలీనం గురించి మాట్లాడుతోందని బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు విమర్శించారు. విభజన నుంచి ప్రజలు తేరుకోకముందే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఒక్కొ రాజధాని పేరు చెబుతున్నారని మండిపడ్డారు. ఎటువంటి ప్రణాళికలు లేకుండానే రాష్ట్ర విభజన చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ విభజన చేపట్టిందన్నారు. కేంద్రం విభజన చేసిన తీరును చూస్తే పెళ్లైన తర్వాత పెళ్లి చూపులు పెట్టుకున్నట్లు ఉందని వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ ఆహ్లువాలియాను వెంకయ్య కలిశారు. సీమాంధ్రకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి ఆహ్లువాలియాతో చర్చించినట్టు ఆయన తెలిపారు. విభజన బిల్లులో పేర్కొన్న వాటిని పరిశీలించడానికి కమిటీ వేస్తామని ఆహ్లువాలియా చెప్పారని వెల్లడించారు. -
అధికారంలోకొస్తే పదేళ్లపాటు ప్రత్యేక ప్రతిపత్తి
బీజేపీ నేత వెంకయ్యనాయుడు సాక్షి, విజయవాడ: భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. మంగళవారం విజయ వాడలో జరిగిన ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం విడిపోవడం బాధాకరమే అయినప్పటికీ రాబోయే రోజుల్లో సీమాంధ్ర ప్రాం తానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక ప్రతిపత్తిగల రాష్ట్రంగా ప్రకటించడంవల్ల అనేక కొత్త పరిశ్రమలు వస్తాయని, కేంద్ర ఇచ్చే నిధుల్లో 90శాతం సబ్బిడీ ఉంటుందని, కేవలం 10శాతం మాత్రమే అప్పు ఉంటుందని చెప్పారు. ఆదాయపన్ను, సెంట్రల్ ఎక్సైజ్ తదితర పన్నులో రాయితీలు కూడా వస్తాయని వివరించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి పెంచడంతోపాటు ఓడరేవులను అభివృద్ధి చేస్తే రాబోయే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉంటుందన్నారు. శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు కారిడార్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో మీడియా ప్రసారాలు నిలిపివేయడంపై తాము అధికారంలోకి రాగానే దానిపై విచారణ చేయిస్తామని తెలిపారు. సమావేశంలో ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
9 ఏళ్ల 9 నెలల పాటు ఏంచేశారు?
న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల పాటు తెలంగాణ సమస్యను నాన్చిన కాంగ్రెస్‌కు ఎన్నికలకు ముందు ఈ విషయం గుర్తొచ్చిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు విమర్శించారు. 9 ఏళ్ల 9 నెలల పాటు తెలంగాణ బిల్లును కాంగ్రెస్ ఎందుకు మర్చిపోయిందని ఆయన ప్రశ్నించారు. విభజనపై కాంగ్రెస్ వ్యవహరించిన తీరును కేంద్ర మంత్రి చిరంజీవి తప్పుబట్టారని గుర్తు చేశారు. తెలంగాణ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభించిందని కమల్‌నాథ్ చెప్పడం విచారకరమన్నారు. బీజేపీ వల్లే రెండు ప్రాంతాలకు న్యాయం జరిగిందన్నారు. సీమాంధ్రకు ప్యాకేజీకి ఒప్పించామన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సహకరిస్తే ఆ ఘనత సోనియాదని ప్రచారం చేసుకుంటున్నారని వెంకయ్య నాయుడు వాపోయారు. -
చిరంజీవి మంచి నటుడు... థ్యాంక్స్
న్యూఢిల్లీ: చిరంజీవి తనకు మంచి మిత్రుడని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. చిరంజీవి మంటి నటుడని కితాబిచ్చారు. తెలంగాణ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఇతర విపక్ష సభ్యులు అడ్డుతగలడంతో చిరంజీవి తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు. ఈ సందర్భంగా వెంకయ్య లేచి చిరంజీవి మంచి నటుడని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం రేగింది. తన వ్యాఖ్యలపై వెంటనే ఆయన వివరణ ఇచ్చారు. తన ఉద్దేశం చిరంజీవి సభలో నటిస్తున్నాడని కాదని, ఆంధ్రప్రదేశ్‌లో ఆయన పాపులర్ నటుడని సవరించారు. కేంద్ర మంత్రి ఉన్న చిరంజీవి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని వెంకయ్య సూచించారు. ఏ మంత్రీ కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించకూడదన్నారు. చిరంజీవి అభ్యంతరాలను పార్టీ, కేబినెట్ వేదికలపై చెప్పాలని సలహాయిచ్చారు. ఓ మంత్రిగా సొంత అభిప్రాయాలు చెప్పకూడదన్నారు. దీనిపై రూలింగ్ ఇవ్వాలని చెప్పి వెంకయ్య కూర్చుకున్నారు. తర్వాత చిరంజీవి తన ప్రసంగాన్ని కొనసాగించారు. తనను సినిమాల్లో తనను మంచి నటుడిగా పేర్కొన్నందుకు వెంకయ్యకు ధన్యవాదాలు తెలిపారు. తనను ప్రకటనను ఎలా చూడాలన్న అరుణ్ జైట్లీ ప్రశ్నకు స్పందిస్తూ... తెలుగు ప్రజల తరపున తాను మాట్లాడుతున్నట్టు చూడాలని చిరంజీవి జవాబిచ్చారు. -
హైదరాబాద్ ఆదాయాన్ని పంచండి: వెంకయ్య
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో ప్రధాన ముద్దాయి కాంగ్రెసేనని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు విమర్శించారు. తెలంగాణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడే లక్షణం కాంగ్రెస్‌కు లేదని దుయ్యబట్టారు. 2004 నుంచి రాజకీయ లబ్దితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ విషయంలో అన్ని పార్టీలు మాట మార్చాయని, బీజేపీ ఒక్కటే నిక్కచ్చిగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రెండు ప్రాంతాలను విభజించండి, ప్రజలను కాదు అని స్పష్టం చేశారు. భద్రత, ఉపాధి, విద్య సహా పలు అంశాలపై సీమాంధ్రులకు ఆందోళన ఉందని చెప్పారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణకు మాత్రమే రెవెన్యు మిగులుందని వెల్లడించారు. హైదరాబాద్ ఆదాయం ఇరు ప్రాంతాలకు కీలకంగా మారిందన్నారు. హైదరాబాద్‌లో మిగులుతున్న ఆదాయాన్ని మిగతా ప్రాంతాలకు పంపిణీ చేయాలని సూచించారు. విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల స్థాయిని పెంచాలన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక రైల్వే జోన్లు కేటాయించాలన్నారు. బిల్లుపై సవరణల గురించి అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవడంలో తప్పులేదన్నారు. -
'పార్లమెంట్ చరిత్రలో చీకటి అధ్యాయం'
న్యూఢిల్లీ: విభజనకు బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంపై సీమాంధ్ర ప్రాంత నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిల్లుకు ఆమోదం తెలిపిన తీరును తప్పుబట్టారు. దేశ ప్రజలను చీకట్లోఉంచి లోక్‌సభ నడిపిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు విమర్శించారు. పార్లమెంట్ చరిత్రలో ఈ రోజు చీకటి అధ్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నిరకుశంగా పనిచేస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్దంగా కాంగ్రెస్ వ్యవహరించిందని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం సీమాంధ్రుల గొంతుకోసిందని టీడీపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు. సీమాంధ్రులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విభజన బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరు తమకు శత్రువులేనని వ్యాఖ్యానించారు. సీమాంధ్రులకు ఈ పార్లమెంట్ ద్రోహం చేసింది, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని చెప్పారు. ఈ పార్లమెంట్లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని మరో ఎంపీ ఎన్ శివప్రసాద్ అన్నారు. -
వెంకయ్యతో సోనియా ఆసక్తికర సంభాషణ
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు మధ్య ఆసక్తికరణ సంభాషణ చోటు చేసుకుంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎదురుపడిన ఇరువురు అగ్రనేతలు తెలంగాణ బిల్లుపై మాట్లాడుకున్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని వెంకయ్య నాయుడిని సోనియా గాంధీ కోరారు. తాము ప్రతిపాదించిన సవరణలను ఆమోదిస్తే విభజన బిల్లు ఆమోదించేందుకు మద్దతు ఇస్తామని వెంకయ్య స్పష్టం చేశారు. ఆ సవరణలేంటో తమకు తెలపాలని సోనియా కోరారు. కాంగ్రెస్ తొలిసారిగా తెలంగాణ బిల్లు గురించి బీజేపీ నేతతో మాట్లాడడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. మరోవైపు తెలంగాణ బిల్లులో సవరణలపై చర్చిచేందుకు బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలతో కేంద్రమంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్ సమావేశమయ్యారు. రేపు తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ వారంలోనే రాజ్యసభలోనూ విభజన ప్రవేశపెట్టాలని యూపీఏ సర్కారు పట్టుదలగా ఉన్నట్టు కనబడుతోంది. -
లోక్‌సభలోనూ గ్యారంటీ లేదు: ఎం.వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో వస్తుందన్న గ్యారంటీలేదని బీజేపీ అగ్రనేత ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ఆవరణలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి గురించి తప్ప యూపీఏ సర్కార్ సరైన హోంవర్క్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. దుర్మార్గమైన రాజకీయం చేస్తున్న కాంగ్రెస్‌కు ఉభయ భ్రష్టత్వం తప్పదని హెచ్చరించారు. ‘అన్ని విషయాలపై న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చాక.. ప్రతిపక్షాన్ని సంప్రదించి ముందుకు వెళ్లి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేదికాద’న్నారు. బిల్లును రాజ్యసభలో పెడుతున్నట్టు హోం మంత్రి షిండే చెప్పి, ఛైర్మన్‌కు ఉత్తరం కూడా రాశారు. బిల్లులో ఆర్థికాంశాలు ఉన్నాయని, లోక్‌సభలో పెట్టాలని న్యాయశాఖ చెప్పే వరకూ వీరికి తెలియదా..? అని ఆయన నిలదీశారు. బిల్లు ఆమోదం పొందకపోతే ఆ నెపాన్ని బీజేపీపై నెట్టాలని ప్రయత్నించారని వెంకయ్య ధ్వజమెత్తారు. ‘‘బిల్లుకు వ్యతిరేకంగా సీఎం, కేంద్రమంత్రులు ఏపీ నుంచి ఢిల్లీ దాకా ప్రకటనలు, దీక్షలు,సభల్లో నినాదాలు చేస్తున్నారు. హైకమాండ్‌కు అత్యంత సన్నిహితులైన వారు కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. బిల్లు తెచ్చేదివారే, వ్యతిరేకించేదీ వారే, అలాంటప్పుడు బీజేపీని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది? కాంగ్రెస్‌కు సిగ్గుంటే మంత్రులు, ఎంపీలను అదుపులో పెట్టుకోవాలి. బీజేపీ ఏ పార్టీతో పొత్తుపెట్టుకుంటే కాంగ్రెస్‌కు ఎందుకు? కాంగ్రెస్ ఎత్తుల గురించి చెప్పాలి. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలను తాము సంతృప్తి పరిచేప్రయత్నాలు చేస్తున్నాం తప్ప షరతులు పెట్టడం లేద’’ని వెంకయ్య స్పష్టం చేశారు. తక్షణం టీ బిల్లు పెట్టండి: అరుణ్ జైట్లీ తెలంగాణకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, యూపీఏ ప్రభుత్వం తక్షణం ఉభయ సభల్లో బిల్లు తేవాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ తెలిపారు. మంగళవారం తన వెబ్సైట్లో ‘తెలంగాణపై యూపీఏ ఆంతర్యమేమిటి?’ అన్న అంశంపై ఒక వ్యాసం రాశారు. ‘‘గడచిన దశాబ్దంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణపై ఊగిసలాట ధోరణి కనబరిచింది. రాష్ట్ర ఏర్పాటుపై 2004లో హామీ ఇచ్చినప్పటికి, 2009 డిసెంబరు 9న సూత్రప్రాయంగా తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించింది. తర్వాత మళ్లీ వెనకడుగు వేసింది. ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని నియమించినప్పటికీ, దానివల్ల ఉపయోగం లేకుండాపోయింది. యూపీఏ 2013లో మరోసారి నిర్ణయం తీసుకుంది. అయితే, మంత్రివర్గం దీన్ని చాలా ఆలస్యంగా ఆమోదించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల వచ్చిన వ్యతిరేక, సానుకూల అభిప్రాయాలను చర్చించాల్సిన ప్రక్రియ ప్రస్తుత సమావేశాల్లో ముందుకు సాగేలా లేదు. సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని మేం కోరాం. అవేమీ కష్టమైనవి, అసాధ్యమైనవీ కావు. కానీ, యూపీఏ ఈ దిశలో ముందుకు సాగలేదు. తెలంగాణ బిల్లు రాజ్యాంగబద్ధంగా, రెండు ప్రాంతాల ప్రయోజనాలను కాపాడేలా ఉండాలి. నేను దానికి మద్దతిచ్చేందుకు చూస్తున్నా. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌ల ఏర్పాటు సమయంలో ఎన్డీయే చాలా సమర్ధంగా వ్యవహరించింది. తెలంగాణపై యూపీఏ అలా వ్యవహరించడంలేదు. పార్లమెంటు సమావేశాలు మరో 8 రోజులు మాత్రమే జరుగుతాయి. వీటిలో రెండు శుక్రవారాలు కేవలం ప్రైవేటు మెంబరు కార్యకలాపాలకు రిజర్వ్ అయి ఉంటాయి. మిగిలింది 6 రోజులే. ఇప్పటికీ యూపీఏ తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు. బిల్లును చూస్తే అసలు ప్రభుత్వం న్యాయపరంగా, రాజ్యాంగపరంగా తెలంగాణ ఏర్పాటు చేసేందుకు తగినట్టుగా వ్యవహరిస్తోందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును యూపీఏ సాగదీస్తోందని అనుమానంగా ఉంది. తెలంగాణ ఏర్పాటు చేయలేని రీతిలో వ్యర్థ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది’’ అని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. -
బిల్లు చూశాకే వైఖరి చెబుతాం
* కాంగ్రెస్ దూతలకు తేల్చిచెప్పిన బీజేపీ * బిల్లుపై పార్టీ ముఖ్యులమంతా చర్చించాకే నిర్ణయం * విభజనకు సూత్రప్రాయ మద్దతు; హైదరాబాద్ తెలంగాణదే * అయితే తెలంగాణ, సీమాంధ్రకు న్యాయం జరగాలి * ఇది మాటలతో కాదు.. చట్టబద్దంగా బిల్లులో ఉండాలి * సీమాంధ్ర లోటును పూడ్చేందుకు ప్రతిపాదనలేంటి? * తెలంగాణలో సీమకు చెందిన రెండు కాదు.. నాలుగు జిల్లాలు కలుపుతారా? * అహ్మద్‌పటేల్, దిగ్విజయ్‌లతో భేటీలో వెంకయ్య ప్రశ్నాస్త్రాలు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు స్వరూపం, స్వభావాన్ని చూసిన తరువాతే తమ వైఖరి చెబుతామని కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తేల్చిచెప్పింది. ‘తెలంగాణకు, సీమాంధ్రకు న్యాయం జరగాలి. అది మాటలతో కాదు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగినట్టు బిల్లులో కనిపించాలి. సీమాంధ్రుల భయాలు, అపోహలు తొలగించాలి. వారిని సంతృప్తిపర్చాలి. అది చూశాక నేనొక్కడినే కాదు.. పార్టీలోని నలుగురు ముఖ్యులం బిల్లుపై సమీక్షిస్తాం. చర్చిస్తాం. ఆ తరువాత మా వైఖరి చెబుతాం’ అని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీ దూతలకు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజ్యాంగపరంగా, రాజకీయంగా, పరిపాలన పరంగా తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపించాలని వారిని గట్టిగా అడిగారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్రమంత్రుల బృందం(జీఓఎం) సభ్యుడు జైరాం రమేశ్ గురువారం రాత్రి వెంకయ్యనాయుడుతో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా సీమాంధ్రులకు సంబంధించిన 13 ప్రధాన సవరణల లేఖను జైరాంకు అందచేసి.. వాటిపై కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలియచేయాలని వెంకయ్యనాయుడు కోరారు. జైరాం భేటీకి కొనసాగింపుగా.. శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌లు వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పైవిధంగా స్పందించారు. భేటీలో బీజేపీ నేత లేవనెత్తిన అంశాల వివరాలు.. * రాష్ట్ర విభజనకు మా పార్టీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే ఇరు ప్రాంతాలకు న్యాయం చేసేలా విభజన జరగాలి. కానీ బిల్లు చూస్తే అలా లేదు. * మేం ప్రతిపాదించిన సవరణల ద్వారా సీమాంధ్రుల్లో భయాలు, అపోహాలు తొలగిపోతాయని భావిస్తున్నాం. * హైదరాబాద్ ఆదాయానికి సంబంధించిన అంశంపై జరిగిన చర్చలో.. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపే ప్రతిపాదనను దిగ్విజయ్ లేవనెత్తినట్టు సమాచారం. రెండు జిల్లాలను కలపడం వల్ల ప్రయోజనం ఏముంటుందని, రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలను కలుపుతారా అంటూ వెంకయ్య ప్రశ్నించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. * ‘ఆదాయం విషయానికి వస్తే.. తెలంగాణలో రూ. 8 వేల కోట్లు, రాయలసీమలో రూ. 7 వేల కోట్లు లోటు ఉంది. తెలంగాణలోనే హైదరాబాద్ ఉంటే.. ఆ ప్రాంతానికి లోటు తగ్గిపోతుంది. మరి రాయలసీమ లోటుకు సంబంధించి ఏం చేస్తున్నారు? దానికి సంబంధించి బిల్లులో గ్రాంట్ ఏమైనా ఇస్తున్నారా?’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. ‘లేక హైదరాబాద్‌ను సీమాంధ్రలో కలుపుతారా?’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారని సమాచారం. హైదరాబాద్‌ను తెలంగాణలోనే ఉంచడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేసినట్లు తెలిసింది. * ‘కొత్త రాష్ట్రం ఏర్పాటైతే సీమాంధ్రలో జీతభత్యాలకు అప్పు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. అందువల్ల సీమాంధ్ర ప్రాంతానికి ఆర్థిక ప్యాకేజ్ ఇస్తున్నారా? ఆ వివరాలేమిటి?’ అని అహ్మద్ పటేల్, దిగ్విజయ్‌సింగ్‌లను వెంకయ్యనాయుడు అడిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. * ‘వెనకబడిన రాయలసీమకు పెట్టుబడులు రావాలంటే పరిశ్రమల్లో రాయితీలకు సంబంధించిన ప్రతిపాదనలు.. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే దానికి నిధులు, ఉపాధికల్పనలకు ప్రతిపాదనలేమైనా పెట్టారా?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. * ఇవేగాక పెండింగు ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై వెంకయ్య ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. * తమ పార్టీ చేసిన సవరణల ప్రతిపాదనలపై హామీలతో సరిపెట్టకుండా చట్టబద్దంగా బిల్లులో పొందుపర్చాలని డిమాండ్ చేశారని సమాచారం. * భేటీ అనంతరం జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ మీతో టచ్‌లో ఉంటారని చెప్పి అహ్మద్‌పటేల్, దిగ్విజయ్‌లు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. -
భద్రాద్రి రామయ్య సీమాంధ్రకే!
-
భద్రాద్రి రామయ్య సీమాంధ్రకే!
* భారీ ఆర్థిక ప్యాకేజీ కూడా * తుది బిల్లులో ఈ రెండింటికీ చోటు? * 134 పోలవరం ముంపు గ్రామాలు కూడా సీమాంధ్రకే * కీలక సవరణలు ప్రతిపాదించిన జీవోఎం * తెలంగాణే ఎజెండాగా నేటి సాయంత్రం కేబినెట్ ప్రత్యేక భేటీ * సవరణలపై నిర్ణయం.. తుది బిల్లుకు ఆమోదం! * పని ముగిసిందన్న జీవోఎం.. ఈ సమావేశాల్లోనే బిల్లు: షిండే * అనంతరం సవరణలపై ప్రధాని, సోనియాలతో మంతనాలు * వెంకయ్య నివాసంలో బీజేపీ నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన జైరాం * గురువారం నాటి కేబినెట్లో ప్రస్తావనకు రాని తెలంగాణ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు తుది ఘట్టంలో హస్తిన వేదికగా నెలకొన్న ఉత్కంఠ ఎడతెగకుండా కొనసాగుతోంది. అయితే ముసాయిదా బిల్లుకు సవరణలు జరగడం మాత్రం దాదాపుగా ఖాయమైంది. సీమాంధ్ర కేంద్ర మంత్రుల నుంచి కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) బుధవారం ప్రత్యేకంగా సవరణ ప్రతిపాదనలు స్వీకరించడం తెలిసిందే. అంతేగాక... తమ పని ముగిసిందని గురువారం మధ్యాహ్నం జీవోఎం ప్రకటించిన అనంతరం, రాత్రి సమయంలో బృందంలోని కీలక సభ్యుడు జైరాం రమేశ్ స్వయంగా బీజేపీ అగ్ర నేత వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి మరీ సవరణల ప్రతిపాదనలను స్వీకరించారు! విభజన బిల్లు పార్లమెంటులో గట్టెక్కాలంటే బీజేపీ మద్దతు కీలకమైనందున ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. వెంకయ్య సమక్షంలో బీజేపీ సీమాంధ్ర నేతలతో జైరాం గంట పాటు సమావేశమయ్యారు. వారు ఆయనకు 13 సవరణ ప్రతిపాదనలు అందజేశారు. ముసాయిదా బిల్లుకు కీలక సవరణలుంటాయని ఈ పరిణామాలతో తేటతెల్లమైంది. ఇటు బీజేపీ, అటు సీమాంధ్ర మంత్రులు డిమాండ్ చేస్తున్న మేరకు భద్రాచలం డివిజన్‌ను, 134 పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణ నుంచి విడదీసి సీమాంధ్రలో కలిపేందుకు కేంద్రం పచ్చజెండా ఊపడం ఖాయమంటున్నారు. దాంతోపాటు సీమాంధ్రకు, ముఖ్యంగా వెనకబడ్డ రాయలసీమకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కూడా తుది బిల్లులో చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. గురువారం సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ అంశాలు చర్చకు రాలేదు. ఈ నేపథ్యంలో విభజన బిల్లుపై చర్చే ఏకైక అజెండాగా కేంద్ర కేబినెట్ శుక్రవారం సాయంత్రం 4.30కు ప్రత్యేకంగా సమావేశం కానుంది. బిల్లుకు ఈ భేటీలోనే ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి. జీవోఎం వరుసగా రెండో రోజు గురువారం మధ్యాహ్నం ఇక్కడి నార్త్‌బ్లాక్‌లోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలో సమావేశమై, పలు కీలక సవరణలను చేరుస్తూ బిల్లుకు తుది రూపునిచ్చింది. భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపడం, సీమాంధ్రకు ఆర్థిక ప్యాకేజీతో పాటు కొత్త రాజధానికి ఆర్థిక సాయం, ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం వంటివి వీటిలో కీలకంగా ఉన్నాయి. అన్ని ప్రతిపాదనల మీదా శుక్రవారం నాటి కేబినెట్ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ పరిగణనలోకి తీసుకోకపోవచ్చంటున్నారు. తెలంగాణ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే ఆస్కారముండటం, బీజేపీతో పాటు ఎంఐఎం కూడా దాన్ని వ్యతిరేకిస్తుండటం ఇందుకు కారణంగా కన్పిస్తోంది. ఇదే చివరి భేటీ! గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు జరిగిన జీవోఎం భేటీలో చైర్మన్ సుశీల్‌కుమార్ షిండే, సభ్యులు పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, జైరాం రమేశ్, నారాయణ సామి పాల్గొన్నారు. అనంతరం నారాయణ సామి మీడియాతో మాట్లాడారు. జీవోఎం సమావేశం ముగిసిందని, ఇదే తుది సమావేశమని పేర్కొన్నారు. గురువారం నాటి కేబినెట్ భేటీలో తెలంగాణ అంశం లేదని మొయిలీ చెప్పారు (అప్పటికింకా కేబినెట్ భేటీ అవలేదు). తెలంగాణ బిల్లు పార్లమెంటుకు ఎప్పుడొస్తుందన్న మీడియా ప్రశ్నకు, ‘ఈ సెషన్ చివర్లో’ అని షిండే బదులిచ్చారు. అనంతరం షిండే, జైరాం నేరుగా ప్రధాని మన్మోహన్సింగ్ను కలిసి తుది సిఫార్సులను ఆయనకు వివరించారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కూడా భేటీ అయ్యారు. సీమాంధ్రకు, ముఖ్యంగా వెనకబడ్డ రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని జీవోఎం సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్యాకేజీ ఎంత ఉండాలన్న అంశంపై ప్రస్తుతం అంచనాలు లేకపోవడం, తగిన సమయమూ లేనందున.. ప్యాకేజీ ఎంతివ్వాలనే అంశంపై బిల్లు ఆమోదం పొందిన వెంటనే 14వ ఆర్థిక సంఘం అంచనాలు తయారు చేస్తుంది. అందుకు అనుగుణంగా కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తుందని సమాచారం. అలాగే కొత్త రాజధాని నిర్మాణానికి కూడా కేంద్రం ఇతోధికంగా సాయం చేయాలని, అందుకవసరమైన నిధులను కూడా బిల్లులో చేర్చాలని సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం దాన్ని యూటీ చేయాలనే ప్రతిపాదనను కూడా కేబినెట్ ముందుంచినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఆదాయంపై కమిటీ! హైదరాబాద్ ఆదాయ పంపిణీపై నెల రోజుల్లో కమిటీ వేసే యోచన కూడా ఉన్నట్టు సమాచారం. అయితే హైదరాబాద్ యూటీతో పాటు ఆదాయ, వ్యయాల పంపిణీపై కమిటీ ఏర్పాటును తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీమాంధ్ర అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు అందజేసినా అభ్యంతరం లేదు గానీ తెలంగాణ విషయంలో షరతులు విధిస్తే మాత్రం రాజకీయంగా ఇబ్బందేనని ఆ ప్రాంత నేతలంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే కేబినెట్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. విభజన బిల్లు విషయంలో కేబినెట్ మంత్రులు కూడా మరిన్ని సూచనలు చేసే అవకాశాలున్నాయి. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందే వరకు సవరణల ప్రక్రియ కొనసాగించనున్నట్లు తెలిసింది. -
ఇదో తుగ్లక్ పాలన
‘ఆధార్’ పేరుతో రూ.3,500 కోట్ల ప్రజాధనం వృథా : వెంకయ్య సాక్షి, బెంగళూరు : ఆధార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ‘తుగ్లక్’ బాట పట్టిందని బీజేపీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్లీనరీ సందర్భంగా తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని టీ అమ్మడానికి రావాల్సిందిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ఆహ్వానించినందుకు నిరసనగా బెంగళూరులో శనివారం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత టీ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. వంట గ్యాస్‌ను సబ్సిడీపై పొందడానికి ఆధార్ విధిగా ఉండాలని చెబుతూ వచ్చిన ప్రభుత్వం, ఉన్నట్లుండి అవసరం లేదంటూ మాట మార్చిందని విమర్శించారు. అలాంటప్పుడు ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన రూ.3,500 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు కాదా అని ప్రశ్నించారు. టీ అమ్మకం ద్వారా జీవితంలో ఎదిగిన మోడీ ప్రధాని కావడంలో తప్పేముందని నిలదీశారు. కాగా భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో తృతీయ ఫ్రంట్‌కు స్థానం లేదన్నారు. ప్రచారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.630 కోట్లు ఖర్చు చేయడం సరికాదన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాల్సి ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి బీజేపీలోకి రావడం, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ నెల 4 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ నియోజక వర్గాల స్థాయిలో సమావేశాలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
'చార్రితక నేపథ్యంలో తెలంగాణకు మద్దతు'
న్యూఢిల్లీ: విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నానని అసెంబ్లీలో సీఎం కిరణ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమా, పార్టీవా అనేది స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కిరణ్ మాట్లాడిన అంశాలు కాంగ్రెస్ అధిష్టానానికి తెలియదా అని ప్రశ్నించారు. తాను చెప్పినా కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు పట్టించుకోలేదో సీఎం కిరణ్ స్పష్టం చేయాలన్నారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చ వక్తృత్వ పోటీ కాదని సభ్యులు గుర్తించాలన్నారు. బిల్లుపై చర్చించారా అని కాంగ్రెస్ పెద్దలను తాను అడిగానని చెప్పారు. చర్చిస్తే సీఎం, పీసీసీ చీఫ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని చిదంబరాన్ని ప్రశ్నించినట్టు వెల్లడించారు. ఇప్పుడు వ్యతిరేకించడంలో అర్థం లేదని తనతో చిదంబరం అన్నారని తెలిపారు. తెలంగాణ బిల్లుకు పార్లమెంట్లో సవరణలు ప్రతిపాదిస్తామని వెంకయ్య నాయుడు చెప్పారు. మెజార్టీయే కావాలంటే దేశంలో ఏ రాష్ట్రం విడిపోదన్నారు. చార్రితక నేపథ్యంతోనే తెలంగాణకు మద్దతిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఇవ్వకపోతే బీజేపీ తెలంగాణ ఇస్తుందన్నారు. సీమాంధ్ర ప్రజలకు బీజేపీ న్యాయం చేస్తుందన్నారు. ఈ నెల 29న మోడీ ఫర్ పీఎమ్ ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. -
తెలంగాణపై మా వైఖరి సుస్పష్టం: వెంకయ్య
బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తాం: వెంకయ్య సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై తమ పార్టీ వైఖరి సుస్పష్టంగా ఉందని, హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణకు కట్టుబడి ఉన్నామని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు కొన్ని సవరణలు ప్రతిపాదిస్తామని, సీమాంధ్ర సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పారు. పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, ఎన్.ఇంద్రసేనారెడ్డి, కె.లక్ష్మణ్, ఎన్.రామచంద్రరావు, అశోక్‌యాదవ్‌తో కలిసి ఆయన మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. బిల్లు పార్లమెంటుకు వస్తుందా.. లేదా? వస్తే ఏమవుతుంది వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ ఇవ్వదలుచుకుంటే తెలంగాణను ఒక్కరోజులో కూడా ఇవ్వొచ్చని చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా నిజాం నవాబు పాలనను కీర్తించడాన్ని తప్పుబట్టారు. రజాకార్ వారసులు నిజాంను సమర్థించడంలో ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు. నిజాంను పొగడటాన్ని టీఆర్ఎస్ నేతలు ఎలా సమర్థిస్తారని ఆక్షేపించారు. 1931లో ప్రకటించిన నిజాం గెజిట్‌ను చూస్తే హిందువులను ఎంత హీనంగా చూశారో అర్థమవుతుందన్నారు. పండక్కీ, పబ్బానికీ, పెళ్లికీ, చివరకు జుట్టుకు కూడా పన్ను విధించిన నిజాంను కీర్తించడం దారుణమని, రజ్వీ దురాగతాలను తెలుసుకోవాలనుకుంటే సురవరం ప్రతాప్‌రెడ్డి రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర చదవాలని సలహా ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పని అయిపోయిందని, ఆ పార్టీ ఆందోళనలు చేయడానికి తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడానికి పనికి రాదని మండిపడ్డారు. కేజ్రీవాల్‌కు తన సత్తా ఏమిటో తెలిసొచ్చిందని, అందుకే ధర్నా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బీజేపీ జాతీయ సమావేశాల్లో నరేంద్రమోడీ ప్రసంగం దేశ భవిష్యత్‌ను ఆవిష్కరించిందని చెప్పారు. -
నిజాం లౌకికవాదా... విడ్డూరం: వెంకయ్యనాయుడు
శాసన సభలో నిజాంను లౌకికవాది అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీర్తించడం విడ్డూరంగా ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. నిజాం పాలనలో రజాకార్ల సృష్టించిన అరచకాలను సభలో ఎందుకు ప్రస్తావించలేదని అక్బరుద్దీన్ ను వెంకయ్య ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికే తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన సుస్పష్టం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన తమ పార్టీ కార్యవర్గ సమావేశాలలో చేసిన ప్రసంగంపై దేశవ్యాప్తంగా చర్చ జరపాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పై వెంకయ్య నాయుడు విమర్శలు సంధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలు మాత్రమే చేయగలదని , పరిపాలన చేతకాదని వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. గతంలో ఆప్‌ను ఆకాశానికి ఎత్తిన వారే నేడు వ్యతిరేకిస్తున్నారని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ టి. బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో సోమవారం సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధి అంతా నిజాం పాలనలో జరిగిందని అక్బరుద్దీన్ కీర్తించారు. అలాగే నిజాం నిజమైన లౌకికవాది అని పేర్కొన్న నేపథ్యంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు వెంకయ్యనాయుడుపై విధంగా స్పందించారు. -
బ్యాట్ పట్టిన వెంకయ్య నాయుడు
నెల్లూరు: మాటల మాంత్రికుడిగా పేరు గాంచిన బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు క్రికెట్ అవతారమెత్తారు. ప్రాస మాటలతో విపక్షాలతో గూగ్లీలు సంధించే ఆయన బ్యాటింగ్‌తో బంతులను ఎదుర్కొన్నారు. తెల్లపంచె, చొక్కాతో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే వెంకయ్య సోమవారం తెల్లట్రౌజర్, తెల్లచొక్కా, బూట్లు, టోపీతో క్రికెట్ క్రీడాకారుడి గెటప్‌లో దర్శనమిచ్చారు. కొద్దిసేపు బ్యాటింగ్ చేసి అందరినీ అలరించారు. ‘ఖేలేంగే యువ- జీతేంగే భారత్’ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు వీఆర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. -
కాంగ్రెస్‌ది చారిత్రక తప్పిదం: వెంకయ్య
నెల్లూరు: ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదం చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు ఆమ్ ఆద్మీ పార్టీకి లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తమ పార్టీలో చేరేందుకు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. మోడీ ప్రధాని కావాలని దేశమంతా కోరుకుంటుందని అంతకుముందు వెంకయ్య అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే సత్తా ఉన్న నరేంద్ర మోడీ ఉందని పేర్కొన్నారు. -
మన్మోహన్ పాలనలో దేశం సర్వనాశనం: వెంకయ్య
దేశ చరిత్రలో అత్యంత బలహీన ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఖ్యాతి గడించారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. మన్మోహన్ పాలనలో దేశం అన్ని విధాల సర్వనాశనం అయిందని వెంకయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోనియా కుటుంబం పట్ల విధేయత ప్రకటించేందుకే ప్రధాని మీడియా సమావేశం నిర్వహించారని ఆయన ఆరోపించారు. ప్రధాని మన్మోహన్ నిర్వహించిన సమావేశంలో ఆయన తీరు ఆత్మస్తుతి, పరనింద తప్ప మరోకటి లేదని పేర్కొన్నారు. సిక్కుల ఊచకోతపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైన ఎందుకు స్పందించదని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా ప్రశ్నించారు. దేశంలో అంతులేని అవినీతి, కుంభకోణాలు, ఆకాశానంటిన ధరలు, నిరుద్యోగం యూపీఏ ప్రభుత్వం యొక్క ప్రత్యేకతలు అని ఎద్దేవా చేశారు. యూపీఏ పాలనలో 9 శాతం ఉన్న వృద్ధిరేటు 4 శాతాని పడిపోయిందన్నారు. అలాగే వ్యవసాయం వృద్ధిరేటు - 1.9 శాతానికి దిగజార్చిన ఘనత యూపీఏదే అని ఆయన ఆరోపించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని చూసి కాంగ్రెస్‌కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.ప్రస్తుతం దేశం అంధకారంలో ఉందని, ఆ అంధకారంలో నరేంద్ర మోడీ ఆశాకిరణమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆసెంబ్లీకి వచ్చిన తెలంగాణ బిల్లుపై చర్చ జరిగాలని వెంకయ్యనాయుడు అభిప్రాపడ్డారు. -
కాంగ్రెస్‌తో చేరేవాళ్లా సలహాలిచ్చేది?: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో చేరేవాళ్లు సల హాలిస్తే ఎలా? అని బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. తమకు లేని పోని ఉచిత సలహాలు ఇచ్చే కన్నా వాళ్ల సంగతి వాళ్లు చూసుకుంటే మంచిదని సూచించారు. పూటకో మాట మార్చే టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించిన నేపథ్యంలో వెంకయ్య ఈ వ్యాఖ్య చేశారు. . కాంగ్రెస్ రహిత భారత్‌ను తమ పార్టీ కోరుకుంటోందన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి 89వ జన్మదినం సందర్భంగా బుధవారమిక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నా యుడు మాట్లాడుతూ అభివృద్ధికి పెద్దపీట వేసిందే వాజ్‌పేయి అని కొనియాడారు. అవినీతికి అగ్రస్థానం కాంగ్రెస్, ఆ పార్టీ అధినేత సోనియా, ప్రధాని మన్మో హన్ అని ధ్వజమెత్తారు. అత్యవసర పరిస్థితి నాటికన్నా ప్రస్తుత పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. ఈ తరుణంలో నరేంద్రమోడీ ఓ వెలుగురేఖగా కనిపిస్తున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పార్టీ వైపు రావడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని, తాము మాత్రం యువతకే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ‘రండి, బీజేపీలో చేరండి’ పేరిట ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. మోడీకి ఓటుతో పాటు పది నుంచి వేయి రూపాయల వరకు నోటూ ఇవ్వాలని కోరుతూ మరో ప్రచారోద్యమాన్ని చేపడుతున్నామన్నారు. సేవాకార్యక్రమాలంటే వాజ్‌పేయికి చాలా ఇష్టమని చెబుతూ పార్టీ రాష్ట్ర శాఖ చేపట్టిన కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రశంసించారు. పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, వి.రామారావు, బి.వెంకటరెడ్డి, అరుణజ్యోతి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డాక్టర్ మల్లారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుమారు 200 మంది మహిళలకు కుట్టు మిషన్లు, మరికొందరికి చీరలు పంపిణీ చేశారు. పలు ఆస్పత్రులలో రోగులకు పాలు, పండ్లు, అనాథలకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. -
రాయల ‘టీ’ని అంగీకరించం: వెంకయ్యనాయుడు
-
రాయల ‘టీ’ని అంగీకరించం: వెంకయ్యనాయుడు
పది జిల్లాల తెలంగాణకే మా ఓటు : వెంకయ్య సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించబోమని, పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే తమకు సమ్మతమని బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. కాంగ్రెస్ తీరు తమాషాగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అడిగితే రాయల తెలంగాణ ప్రతిపాదన తెస్తారా? సరికొత్త రాయల తెలంగాణ ప్రతిపాదన వెనకున్న సహేతుక కారణాలేమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వెంకయ్య మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణకు సరైన కారణాలు చెప్తే అప్పుడు తమ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు చర్చిస్తాయని పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను కాంగ్రెస్ వాళ్లు సజావుగా జరగనిస్తారనేది అనుమానమేనన్నారు. రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేయాల్సిందేనని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. -
సీమాంధ్రులకూ హక్కులుంటాయి: వెంకయ్యనాయుడు
సాక్షి, హైదరాబాద్: దేశ సమైక్యత, సమగ్రతను కాపాడాల్సిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల విభజనలో తన ఇష్టానుసారం వ్యవహరిస్తోందని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేస్తే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కులాలు, మతాలు, జాతుల పేరిట దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటోందని మండిపడ్డారు. గుజరాత్లో తలపెట్టిన సర్దార్ పటేల్ విగ్రహ ఏర్పాట్లపై ఆదివారమిక్కడ జరిగిన దక్షిణాది రాష్ట్రాల అధ్యయన గోష్టిలో ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘రాష్ట్రాన్ని విభజించమంటే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. పోవాల్సిన వాళ్లు ఎలాగూ పాకిస్థాన్ వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లంతా భారతీయులే. వాళ్లందరికీ సమాన హక్కులుంటాయి. ఈ దేశంలో వాళ్లూ (సీమాంధ్రను ఉద్దేశించి)భాగమే. పక్షపాతం చూపకండి. స్నేహితుల్లా మెలిగేలా రాష్ట్రాన్ని విభజించండి’ అని హితవు పలికారు. ఈ సమావేశం సమైక్యతా విగ్రహ దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్త డాక్టర్ కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది. ఇందులో గుజరాత్ రాష్ట్ర మంత్రులు సౌరభ్ పటేల్, ప్రదీప్ జడేజా, రజనీకాంత్ పటేల్, బాబూ భాయ్ బుఖారియా, కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ ధన్కడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, సీహెచ్ విద్యాసాగరరావు, బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, పెన్నార్ గ్రూపు సంస్థల నేత నృపేందర్‌రావు, సినీ నిర్మాత నారా జయశ్రీదేవి, నటి జీవిత, రిటైర్డ్ ఐజీ గోపీనాథ్‌రెడ్డి, పారిశ్రామికవేత్త లక్ష్మీరాజం, రచయిత భారవి, సీహెచ్ హనుమంతరావు పాల్గొన్నారు. బీసీల్లో చేర్చాలని కాపు నేతల వినతి కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న తమ డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతలు విష్ణుమూర్తి, సోము వీర్రాజు తదితరులు కిషన్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. -
కాంగ్రెస్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుతో ఇరు ప్రాంతాల్లో ఆ పార్టీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడవుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. ప్రజలను రెచ్చగొట్టి, కొత్త వాదనలు, కొత్త అనుమానాలు, భయాలు కల్పించి తాత్కాలిక ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ భావిస్తోందని దుయ్యబట్టారు. ఈ తీరును ఇరు ప్రాంతాల ప్రజలు అర్థం చేసుకుంటారని, అప్పడు కాంగ్రెస్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడవుతుందన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని ప్రతిపాదన చేస్తారు. అక్కడి సీఎం కిరణ్ వ్యతిరేకిస్తారు. అంతిమంగా ఏంచేస్తారనేది కాంగ్రెస్, కేంద్రమే నిర్ణయించాలి’ అని చెప్పారు. తెలంగాణకు అనుకూలమని ఏఐసీసీ తీర్మానం చేస్తే, సమైక్యానికి అనుకూలమని పీసీసీ చీఫ్ అనడం ఎవరిని మభ్యపెట్టడానికని ప్రశ్నించారు. కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెట్టకుంటే తాము అధికారంలోకి వచ్చాక బిల్లు పెడతామన్నారు. -
షిండే ఆదేశాలను తుంగలో తొక్కండి
తమ సీఎంలకు బీజేపీ సూచన బెంగళూరు: ఉగ్రవాదం పేరుతో అమాయకులైన ముస్లిం యువతను వేధించవద్దని కేంద్ర హోంమంత్రి షిండే ఇచ్చిన ఆదేశాలను చెత్తబుట్టలో పడవేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాలను ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. షిండే దేశానికి హోం మంత్రా లేక ఒక మతానికి హోంమంత్రా అని బీజేపీ సూటిగా ప్రశ్నించింది. బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు సోమవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ, షిండేపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ విభజించి పాలించే ఎజెండాతో పనిచేస్తున్నదని విమర్శించారు. షిండే ఆదేశాలు లౌకికవాదానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమైనవన్నారు. దేశంలో అమాయకులెవరూ అరెస్ట్ కాకుండా చూడడమే సరైన విధానమన్నారు. షిండే మాత్రం అమాయకులైన ముస్లింలను మాత్రమే అరెస్ట్ చేయవద్దని సూచించడం, పైగా దానిని సమర్థించుకోవడం దారుణమన్నారు. అందుకే షిండే ఆదేశాలను చెత్తబుట్టలో వేయాలని సూచిస్తున్నట్టు వెంకయ్య చెప్పారు. -
టీడీపీతో పొత్తుండదు : వెంకయ్యనాయుడు
తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: వెంకయ్య సాక్షి, హైదరాబాద్: 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో బీజేపీ స్వతంత్రంగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీతో తాము పొత్తు పెట్టుకోబోమని, ఆ ప్రతిపాదన కూడా లేదని అన్నారు. లండన్ పర్యటన నుంచి వచ్చిన ఆయన పార్టీ నేతలు జీ కిషన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కే లక్ష్మణ్‌లతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ సీమాంధ్ర నేతలు కూడా తెలంగాణను వ్యతిరేకించడం లేదన్నారు. రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. కాంగ్రెస్ కీలుబొమ్మగా మారిన సీబీఐ, ఎప్పుడేం చోస్తోందో అర్ధం కావడం లేదని దుయ్యబట్టారు. రెడ్‌కార్నర్ నోటీసు సాకుతో బాబా రాందేవ్‌ను లండన్ విమానాశ్రయంలో 8 గంటల పాటు నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. మోడీ పాదాభివందనాన్ని అద్వానీ పట్టించుకోలేదనే వార్తలను నాయుడు తోసిపుచ్చారు. ‘ఆధార్’పై సుప్రీం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. ఇదిలావుంటే, బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ నేతలు అక్టోబర్ 2న ఢిల్లీ వెళ్లి పార్టీ కేంద్ర నాయకుల్ని కలవనున్నారు. -
టీడీపీతో పొత్తు ప్రతిపాదన లేదు: వెంకయ్య
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేయాలన్న రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు 42 ఎంపీ, 294 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తామని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు స్పష్టంచేశారు. ఇందుకోసం సన్నద్ధమవుతున్నామన్నారు. తెలుగుదేశంతో పొత్తు ప్రతిపాదన లేదని చెప్పారు. ఏవైపు నుంచీ ఇటువంటి అంశం చర్చకు రాలేదన్నారు. మీడియాలో వస్తున్న కథనాలకు తమకు సంబంధం లేదని, ఊహాగానాలు చేసుకునే అధికారం మీడియాకు ఉందని చెప్పారు. లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన గురువారమిక్కడ పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కె లకష్మణ్, ఎన్.రామచంద్రరావు, వై.రఘునాధ్‌బాబు తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పొత్తులతో టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుందేమో ఆ నాయుడే (చంద్రబాబు) చెప్పాలని చమత్కరిస్తూ తమ పార్టీ సొంతంగానే అన్ని సీట్లకు పోటీకి సమాయత్తమవుతుందన్నారు. సీమాంధ్రప్రాంత పార్టీ నాయకులు తమ కేంద్ర నాయకత్వాన్ని కలిసి చర్చలు జరుపుతామన్నారే తప్ప తెలంగాణ బిల్లును వ్యతిరేకించడం లేదని చెప్పారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించాలనే దానికే కట్టుబడ్డామన్నారు. సీమాంధ్ర సమస్యల్ని చర్చించుకోవడంలో తప్పు లేదన్నారు. అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా తయారయిన సీబీఐ ఎప్పుడేమి చేస్తుందో తెలియడం లేదని చెప్పారు. ప్రవాస భారతీయుల సమ్మేళనానికి వస్తున్న బాబా రాందేవ్‌ను రెడ్‌కార్నర్ నోటీసు ఉందన్న సాకుతో లండన్ విమానాశ్రయంలో 8 గంటల పాటు నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్మగ్లర్లు, ఉగ్రవాదులు, దోపిడీ దొంగలకు ఇచ్చే రెడ్‌కార్నర్ నోటీసు రాందేవ్ బాబాకు ఎందుకిచ్చారో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తేలుస్తామన్నారు. భోపాల్‌లో బుధవారం జరిగిన బీజేపీ కార్యకర్తల మహాకుంభ్ గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ గెలుపు ఖాయమన్నారు. మోడీ పాదాభివందనం చేసినా అద్వానీ పట్టించుకోలేదన్న వార్తలను తోసిపుచ్చారు. ఈనెల 29న నరేంద్రమోడీ ఢిల్లీలోని జపనీస్ పార్క్ లో ప్రసంగిస్తారని చెప్పారు. మోడీ పట్ల రోజురోజుకు మరింత మోజు పెరుగుతోందన్నారు. దేశ రహస్యాలను బయటపెడుతున్న వ్యవహారంపై విచారణ జరిపించాలని, నిందితులపై దేశద్రోహ నేరం మోపి శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో ఆదుకున్న వాళ్లను కాపాడేందుకే ‘దోషులు సైతం పోటీ చేయవచ్చన్న’ దానిపై కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స తీసుకువస్తోందని ఆరోపించారు. ఈ ఆర్డినెన్స దేశప్రజలకు తీరని నష్టమన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ కార్డుతో అనుసంధానంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. దావూద్ ఇబ్రహీం సహా ముంబాయి పేలుళ్ల కేసులోని నిందితులందర్నీ భారత్‌కు అప్పగించేంత వరకు పాక్‌తో చర్చలు జరపకూడదన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు తమ చర్చలకు అడ్డుకాదన్న ప్రధాని మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 2న ఢిల్లీకి సీమాంధ్ర నేతలు బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ నేతలు వచ్చేనెల రెండున ఢిల్లీ వెళ్లి పార్టీ కేంద్రనాయకుల్ని కలుస్తారు. విభజన బిల్లులో సీమాంధ్ర ప్రయోజనాలను పరిరక్షిస్తేనే మద్దతు ఇమ్మనికోరనున్నట్టు ఆ కమిటీ ఛైర్మన్ వై.రఘునాధ్‌బాబు తెలిపారు. కాగా, తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాల నాయకుల్ని మూడు బృందాలుగా ఢిల్లీకి తీసుకువెళ్లనున్నట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. -
సుపరిపాలన, అభివృద్ధి మా ఎజెండా: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: సుపరిపాలన, సుస్థిరత, అభివృద్ధి తమ ఎన్నికల ఎజెండా అని బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయు డు తెలిపారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే వారి ఎజెండా ఏమిటో చెప్పాలని సవాల్ చేశారు. అభివృద్ధికి చిరునామా వాజ్‌పేయి అని.. అవినీతి, అసమర్థత, అధిక ధరలు, వారసత్వం, కాంగ్రెస్ విధానమని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు దత్తాత్రేయ, ఎన్.ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, ఎన్.రామచంద్రరావు, అశోక్‌కుమార్ యాదవ్‌తో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, కమ్యూనిస్టులు, కుహనా లౌకికవాదులు గంగవైలెత్తుతున్నారని మండిపడ్డారు. మోడీ గెలుపు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమంటున్న వాళ్లకు అసలీ దేశ ఎన్నికల వ్యవస్థపై నమ్మకం ఉన్నట్టా లేనట్టా? అని ప్రశ్నించారు. మోడీ వ్యాపారవేత్తలు, కార్పొరేట్ల ఏజెంటని సీపీఎం నేత కారత్ చేసిన వ్యాఖ్యను ఖండిస్తూ వాళ్లేమైనా దేశద్రోహులా? ఉత్పత్తి పెంచడం నేరమా? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో తమకు 300కు పైగా సీట్లు వస్తాయని వెంకయ్యనాయుడు ధీమా వ్యక్తంచేశారు. గుజరాత్లో 30 శాతం మంది ముస్లిం మైనారిటీలు మోడీకి అండగా నిలిచినట్టు తెలిపారు. హైదరాబాద్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా భారీ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. 26న తిరుచిరాపల్లిలో జరిగే సభకు రూ.10 రుసుం వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతమూర్తి నిరభ్యంతరంగా వెళ్లొచ్చు! గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయితే భారత్‌లో ఉండనని ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ యూఆర్ అనంతమూర్తి చేసిన వ్యాఖ్యలపై వెంకయ్యనాయుడు ఘాటుగా స్పందించారు. అనంతమూర్తికి శుభాకాంక్షలంటూ ఎద్దేవా చేశారు. రష్యా, చైనా ప్రభావిత వామపక్షవాదంతో బాధ పడుతున్న వారికి మోడీ మింగుడు పడడు గనుక ఆయన వెళ్లిపోవడమే మంచిది అని వెంకయ్య అన్నారు. -
అంత ధీమా ఉంటే.. ప్రజా తీర్పు కోరండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేంద్రంలో మూడోసారి కూడా నూటికి నూరు శాతం అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అంత ధీమా ఉంటే.. ప్రజల తీర్పు కోరాలని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు సవాల్ చేశారు. ‘‘అసమర్ధత, అవినీతి, అక్రమాలలో ఆరితేరినందుకు జనం మళ్లీ పట్టంకడతారా?’’ అని ఆయన ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ నేతలు వై.రఘునాథ్‌బాబు, ఎన్.రామచంద్రరావు, శ్రీధర్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశాన్ని అన్ని విధాలా దివాలా తీయించిన ఘనత యూపీఏకే దక్కిందని ధ్వజమెత్తారు. ధరలు ఆకాశాన్నంటాయని, ఆర్ధిక లోటు ఆందోళనకర స్థాయికి చేరిందని, పారిశ్రామిక ఉత్పత్తి తిరోగమన దిశలో ఉందని, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని.. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని చరిత్రలోనే చూడలేదని విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను వదిలిపెట్టి.. బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ నరేంద్రమోడీని అపఖ్యాతి పాల్జేయటమెలా, లౌకికవాదం ముసుగులో ఓట్లు దండుకోవటమెలా అనే రెండు సూత్రాల కార్యక్రమాన్ని కాంగ్రెస్ అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ ఇచ్చామని చెబుతున్న హక్కులన్నీ ఆదేశిక సూత్రాల్లో ఉన్నవేనన్నారు. అనంతపురంలో పదెకరాలు, మహబూబ్‌నగర్‌లో 15 ఎకరాలున్న రైతులకన్నా.. హైదరాబాద్‌లోని కిళ్లీ బడ్డీ యజమానే నయమన్నారు. రాజ్యసభలో తాను తెలంగాణపై మాట్లాడిన అంశాలపై ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని వెంకయ్య పేర్కొన్నారు. తెలంగాణపై తమ వైఖరిలో మార్పు లేదని, సిద్ధాంతపరమైన నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. ‘టీడీపీతో పొత్తు ఉంటుందా?’ అని ప్రశ్నించగా.. పొత్తులపై చర్చించలేదని.. ఏవైపు నుంచి ఎటువంటి ప్రతిపాదనలు లేవని బదులిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 272కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. బీసీ సబ్‌ప్లాన్‌పై నేటి నుంచి బీజేపీ దీక్ష బీసీ సబ్‌ప్లాన్ కోసం సోమ, మంగళవారాల్లో బీజేపీ నేతలు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద దీక్ష చేపట్టనున్నారు. పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, కె.లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ తదితరులు దీక్షలో పాల్గొంటారు. -
రాష్ట్ర విభజన మీ సొంత వ్యవహారమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీ తన సొంత వ్యవహారంగా చూస్తోందని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర అయినా, ప్రత్యేక తెలంగాణ అయినా తామే చేస్తాం, తామే సభను స్తంభింపజేస్తామన్నట్టుగా కాంగ్రెస్ తీరు ఉందని మండిపడ్డారు. ప్రజల్ని రెచ్చగొట్టి రెండు ప్రాంతాల్లోనూ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది కాంగ్రెస్ వ్యూహమని పేర్కొన్నారు. ఈనెల 11న హైదరాబాద్‌లో జరిగే మోడీ సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన వెంకయ్య.. పలువురు పార్టీ నేతలతో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వివాదాస్పద అంశాలను తేల్చిన తర్వాతే విభజనకు పూనుకోవాలంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘మాట తప్పడం, రెచ్చగొట్టడం కాంగ్రెస్‌కు అలవాటే. సీఎం వ్యాఖ్యలపై మేమేమీ ఆశ్చర్యపోవడంలేదు. కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఒక మాట, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు మరో మాట చెబుతున్నారు. ఎవరు మోసం చేస్తున్నారో, ఎవరు నిజం చెబుతున్నారో తెలియదు. వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ చేయాల్సిన పనేనా ఇది? మీదొక పార్టీయా? మీకొక విధానమా? లేనిపోని హామీలు ఇచ్చి ఎవర్ని మోసగిస్తారు? సీమాంధ్రలో ఉద్యమంపై నోరెందుకు మెదపరు? ఉభయుల్ని సముదాయించాల్సిన పని లేదా? ఇదేమన్నా మీ పార్టీ సొంత వ్యవహారమా? సమస్య తలెత్తిన తర్వాత ఆంటోనీ కమిటీ వేశారు. ముందే ఎందుకు మాట్లాడలేదు? సీఎం, మంత్రులు ఎవరికి వారు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. సోనియా నాటకంలో భాగమే కిరణ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆడిస్తున్న నాటకంలో భాగమే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అధిష్టానం మాటకు కట్టుబడడమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్‌రెడ్డి, కొంపల్లికి చెందిన ఆదిరెడ్డి, కుమార్‌గౌడ్ తదితరులు బీజేపీలో చేరిన సందర్భంగా జరిగిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. పూర్తి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సీహెచ్ విద్యాసాగరరావు, బండారు దత్తాత్రేయ, ఎన్.రామచంద్రరావు, డాక్టర్ కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.