
మత మార్పిళ్లను ప్రోత్సహించం: వెంకయ్య
న్యూఢిల్లీ: మతమార్పిడిలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించబోదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. మతమార్పిడిలు లేదా మరోసారి మార్పిడిలకు కేంద్రం మద్దతు ఇవ్వబోదని సోమవారం ఆయన లోక్సభలో చెప్పారు.
మతమార్పిడిలను ఆపే బాధ్యత రాష్ట్రాలదే అన్నారు. మతమార్పిడిలను ప్రోత్సహించే వారిపై రాష్ట్రాలు చర్య తీసుకోవాలని సూచించారు. మతమార్పిడిల వ్యవహారంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో ప్రభుత్వం తరపున వెంకయ్య స్పందించారు. ప్రతిపక్షాలు పట్టువీడకపోవడంతో సభలో గందరగోళం రేగింది.