Conversion
-
హైదరాబాద్‌లో ‘కేరళ స్టోరీ’ ఉదంతం.. కూతురు జాడ చెప్పాలంటూ..
సాక్షి, హైదరాబాద్: తన కుమార్తె ఆచూకీ తెలుసుకోవాలని లేకపోతే మరో శాలినీ ఉన్నికృష్ణన్ అయ్యే అవకాశం ఉందని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితురాలు సుమన్ జాదవ్, హైకోర్టు న్యాయవాది మౌనిక సుంకరతో కలిసి మాట్లాడుతూ... తన కూతురు సోనీజాదవ్(21) ఎంబీఏ పూర్తిచేసిందన్నారు. భర్త చనిపోవడంతో చిన్న టిఫిన్ బండి పెట్టుకుని కూతురు, ఇద్దరు కొడుకులను పోషించుకుంటున్నానని తెలిపారు. 10వ తరగతి వరకు కార్వాన్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తన కూతురు సోని చదువుకుందని, అప్పుడే అమ్రన్ బేగం అనే మరో యవతితో పరిచయం ఏర్పడి ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారన్నారు. గత నెల 7వ తేదీన అమ్రాన్ బేగం మా ఇంటికి వచ్చి సోనీని తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిందన్నారు. రాత్రి అయినా రాకపోవడం ఇద్దరికీ ఫోన్ చేసినా స్పందన లేదని.. దీంతో లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. పోలీసులు వెతికి 11వ తేదీన వారిని మెజిస్ట్రేట్ ముందుకు తీసుకువచ్చారని తెలిపింది. అప్పటివరకు నాకు తెలియదన్న అమ్రాన్ బేగం తన కూతురు సోనీని, న్యాయవాదులను తీసుకుని వచ్చిందన్నారు. సోనీ పోలీసులకు తాను మేజర్‌ను అని సర్టిఫికెట్లు చూపించి తన ఇష్టం ఉన్నచోట ఉంటానని పోలీసులకు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయిందన్నారు. తాము ఎంతసర్ది చెప్పాలని చూసినా వినిపించుకోకుండా వెళ్లిపోయిందన్నారు. అప్పటి నుంచి తన కూతురు సోనీ ఆచూకీ లేదని చెప్పింది. తనకు ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రిలో అడ్మిట్ ఉన్నానని చెప్పినా కనీసం స్పందించడం లేదని, అమ్రన్ బేగం తనకు తెలియదు తన ఇంటికి రావద్దు అని హెచ్చరిస్తుందన్నారు. సోనీ 21 సంవత్సరాలు వచ్చిన రెండు నెలలకే ఈ పనిచేశారని, రెండు నెలల ముందే పాస్‌పోర్టు కూడా తీయించినట్లు తెలిసిందని ప్రస్తుతం తన కూతురు ఎక్కడ.. ఎలా ఉందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తన కూతురు ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
మతమార్పిడులు చేస్తే జైలుకే.. ఇద్దరు అరెస్టు
డెహ్రాడున్: కిచ ప్రాంతంలోని సోనేరా బెంగాలీ కాలనీలో ఆ గ్రామ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మత మార్పిడులకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు కిచ పోలీసులు. ఉత్తర్ ప్రదేశ్, బరేలీకి చెందిన వికాస్ కుమార్, అంకిత్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు కిచలో కొంతమందిని బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారని కిచ పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ మత స్వేచ్ఛ చట్టంలోని సెక్షన్-3, సెక్షన్-5 ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 30న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఈ మత స్వేచ్ఛకు సంబంధించిన చట్టాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మతమార్పిడులను నిరోధించడానికే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారమే నిందితులపై కేసును నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిచ ప్రాంతంలోని సోనేరా బెంగాలీ కాలనీలో జూన్ 7న గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఒక అద్దె ఇంట్లో మూడు రోజులుగా మతమార్పిడులకు పాల్పడుతున్నారని స్థానిక గ్రామ పెద్ద ఒకరు సమాచారమందించారు. మాకు అందిన వివరాల ప్రకారం శనివారమే కేసును నమోదు చేసి అదే రోజున వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నామని అన్నారు కిచ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ధీరేంద్ర కుమార్. ఇది కూడా చదవండి: శరద్ పవార్ కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు -
లవ్ జిహాద్‌ను వ్యతిరేకిస్తూ వీహెచ్‌పీ పోరు
న్యూఢిల్లీ: అక్రమ మతమార్పిడి, లవ్ జిహాద్‌లను తీవ్రంగా ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) కొత్త ప్రజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనైతిక మత మార్పిడి, లవ్ జిహాద్‌లను అంతం చేసేందుకు మహిళలు, అమ్మాయిలు, యువతతో ‘శక్తివంత సేన’ ఏర్పాటే లక్ష్యంగా నెల రోజులపాటు దేశవ్యాప్తంగా ‘జన్ జాగ్రణ్ అభియాన్’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. ఇందులోభాగంగా వీహెచ్‌పీ యువజన విభాగమైన బజ్రంగ్ దళ్ పదో తేదీ దాకా బ్లాక్ స్థాయిలో ‘శౌర్య యాత్ర’ కొనసాగించనుందని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్పారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో డిసెంబర్ 21 నుంచి 31 దాకా ధర్మ రక్షా అభియాన్ నిర్వహిస్తారు. మతమార్పిడి వలలో పడకుండా అవగాహన కల్పించేందుకు వీహెచ్‌పీ మహిళా విభాగం దుర్గావాహిని సైతం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా జైన్ మాట్లాడారు. అక్రమ మతమార్పిడిని నిరోధించేలా కేంద్రం చట్టం తెచ్చేలా మద్దతు కూడగట్టేందుకు ఈ కార్యక్రమాన్ని వీహెచ్‌పీ ఉపయోగించుకోనుంది. -
Wife Tortured: మతం మారలేదని భార్యకు చిత్రహింసలు!
సాక్షి,బళ్లారి: మతం మారడం లేదని భార్యను హత్య చేసేందుకు యత్నించిన భర్త ఉదంతం చిత్రదుర్గలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్రదుర్గకు చెందిన అబ్దుల్ ఖాదర్ శివమొగ్గకు చెందిన ఉమాను ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత మతం మారాలని భార్యను ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించి తీవ్ర మనోవేదనకు గురై అనారోగ్యంపాలైంది. కాళ్లు రెండు పని చేయకుండా పోయాయి. తోడునీడుగా ఉండాల్సిన భర్త ఆమెను హింసించడమేగాక చివరకు గొంతు నులిమి చంపాలని యత్నించాడు. బాధితురాలు తన బంధువు విశ్వనాథ్‌కు జరిగిన విషయాన్ని వెల్లడించడంతో చిత్రదుర్గ మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అబ్దుల్ ఖాదర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
66 ఏళ్లుగా సర్వసాధారణం.. ఇప్పుడెందుకు వివాదం!
అక్టోబర్ అయిదవ తేదీన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, మిషన్ జై భీం సంస్థల ఆధ్వర్యంలో పదివేల మందికి పైగా న్యూఢిల్లీలోని అంబేడ్కర్ భవన్లో బౌద్ధ ధమ్మ దీక్ష స్వీకరించారు. అందులో ధమ్మ దీక్ష సంప్రదాయం ప్రకారం, బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన 22 ప్రతిజ్ఞలను పఠించారు. గత 66 ఏళ్లుగా ఎక్కడ బౌద్ధ ధమ్మ దీక్షా సమ్మేళనాలు జరిగినా ఇది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం అయ్యింది. ఇప్పుడు దాన్ని బీజేపీ వివాదాస్పదం చేసి రాజకీయ ప్రయోజనాలను పొందాలనుకుంటోంది. 1950 అక్టోబర్ 14 విజయదశమి నాడు అంబేడ్కర్ నాయకత్వంలో ఐదున్నర లక్షల మంది బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించినప్పుడు... అంబేడ్కర్ రూపొందించిన 22 ప్రతిజ్ఞలను అనుసరిస్తామని అందరూ శపథం చేశారు. అందులో నైతిక సూత్రాలు, నైతిక జీవన విధానంతో పాటు దేవీ దేవతలను పూజించం అనే అంశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, బుద్ధుడు ప్రభోదించిన అష్టాంగ మార్గాన్ని అవలంబిస్తామనే విషయం కూడా ఉంది. అక్టోబర్ 5న జరిగిన బౌద్ధ ధమ్మ దీక్షా స్వీకార ఉత్సవానికి ఢిల్లీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్ కూడా హాజరయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీ భారతీయ జనతాపార్టీ నాయకులు వివాదాస్పదం చేశారు. అక్కడ హిందూ దేవుళ్ళని కించపరిచారనీ, దూషించారనీ, అందులో రాజేంద్ర గౌతమ్ భాగమయ్యారనీ ఆరోపించారు. రాజేంద్ర గౌతమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని, హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నమే ఇది. అందులో భాగంగానే రాజేంద్ర గౌతమ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో గుజరాత్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఈ అంశాన్ని ఆప్‌కు వ్యతిరేకంగా వాడుకోవాలని చూస్తున్నదని భావించిన రాజేంద్ర గౌతమ్ తనకు తానుగానే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘ఈ వివాదాన్ని సృష్టించి, ఆప్‌ను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ భావించింది. అంతే కాకుండా బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను దోషిగా నిలబెట్టాలనీ చూశారు. పదవి, బాబాసాహెబ్ అంబేడ్కర్ అనేవి రెండు విషయాలు నా ముందున్నప్పుడు అంబేడ్కర్ మహోన్నతా శయం మాత్రమే నాకు కనిపించింది. పదవిని వదులుకున్నాను. భవిష్యత్‌లో మరింత శక్తిమంతంగా అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా గౌతమ బుద్ధుని మార్గంలోనే నడవడానికి నిశ్చ యించుకున్నాను’ అన్నారు. అసలు బాబాసాహెబ్ అంబేడ్కర్ కులాన్ని పెంచి పోషిస్తున్న హిందూ మతాన్ని వీడి, సమత, కరుణ, ప్రేమతో నిండిన బౌద్ధాన్ని స్వీకరించడానికి, ఇప్పటికీ ఈ దేశంలోని దళితులు, ఇతర మానవతావాదులు బౌద్ధాన్ని స్వీకరించడానికీ ఎవరు కారకులు? ఏంటి కారణాలు? అనేది ఆలోచించాలి. అంబేడ్కర్ 1935, అక్టోబర్ 13వ తేదీన పదివేల మంది అణగారిన కులాల పేరుతో పిలవబడే అంటరాని కులాల ప్రజలు పాల్గొన్న సమావేశంలో మాట్లాడుతూ... ‘దురదృష్టవశాత్తూ నేను హిందువుగా జన్మించాను. కానీ హిందువుగా మరణించను. అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. హిందూ సమాజంలోని ఆధిపత్యకులాలు పెడుతున్న బాధలు భరించడం ఇంకా అవసరం లేదు. అయితే ఒక మతాన్ని వీడి, మరో మతాన్ని స్వీకరించాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. సమానత్వ హోదా, భద్రత, గౌరవప్రదమైన జీవితం లభించగలిగే ధర్మంలోకి వెళ్ళాలి’ అన్నారు. అదే సందర్భంలో అప్పటికే ఐదేళ్లుగా సాగుతున్న నాసిక్‌లోని కాలారామ్ దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని అంబేడ్కర్ ప్రస్తావించారు. ఏ మతంలోని దేవాలయాలలోకి మనకు ప్రవేశం లేదో, ఆ మతంలో ఉండాల్సిన అవసరం ఉందా అని బహిరంగంగా ప్రశ్నించారు. అంతేకాకుండా, 1922 మార్చి 20వ తేదీన మహద్‌లోని చౌదర్ చెరువు నీళ్ళను తాగడానికి సాగించిన సత్యాగ్రహం, ఆ సందర్భంగా మహర్లపై జరిగిన దాడి ఆయన మనస్సులో బలంగా నాటుకుపోయింది. మహద్ చెరువులోని నీళ్లు తాగ డానికి అందరికీ హక్కు ఉన్నదని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆధిపత్య కులాలు ఆనాటి మహర్లను చాలా క్రూరంగా కొట్టి, గాయపరిచారు. ఈ ఘటనలు కూడా అంబే డ్కర్‌ను పెద్దగా బాధించలేదు. కానీ ఆయన 1919 నుంచి 1932 వరకు దాదాపు 13 ఏళ్లపాటూ పోరాడిన ఫలితంగా ప్రకటించిన ‘కమ్యూనల్ అవార్డు’ వల్ల సాధించిన ప్రత్యేక ఎన్నికల హక్కుని వదులు కోవలసి వచ్చినప్పుడు ఎంతో క్షోభ అనుభవించారు. 1932 ఆగస్టు 16వ తేదీన ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సె మెక్‌డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటిస్తే, పూనాలోని ఎరవాడ జైలులో ఉన్న మహాత్మాగాంధీ దానిని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ‘ఇది హిందువులను విభజించడమే’ అనే వాదనను గాంధీజీ ముందుకు తీసుకొచ్చారు. అణగారిన వర్గాల ప్రత్యేక ఎన్నికల విధానాన్ని అంగీకరించనని మొండికేశారు. దీనిని అంబేడ్కర్ తీవ్రంగా ప్రతిఘటించారు. చివరకు హిందూ సంస్థలు, సంఘాలు అంబేడ్కర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. గాంధీజీ ప్రాణానికి ఏమైనా జరిగితే, అణగారిన కులాల భద్రత ప్రమా దంలో పడగలదని భావించిన అంబేడ్కర్ 1932, సెప్టెంబర్ 24వ తేదీన ‘పూనా ఒడంబడిక’కు ఒప్పుకున్నారు. దానివల్ల దళితులు తమ ప్రతినిధులను తాము మాత్రమే ఎన్నుకునే హక్కును కోల్పోయారు. ఈ రోజు మనం చూస్తున్న రిజర్వుడు సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సంఘటన అంబేడ్కర్‌ను తీవ్రంగా కదిలించింది. ఆలోచింపజేసింది. ఫలితంగా కుల నిర్మూలన ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అంటరానివారెవరు, శూద్రులెవరు వంటి అంశాలతో పాటూ ఇంకా హిందూ మతంపైన అనేక రకాలైన అధ్యయనాలూ, బౌద్ధంపైన పరిశోధనలూ చేశారు. 1956 అక్టోబర్ 14వ తేదీన బౌద్ధాన్ని స్వీకరించారు. ఇప్పుడు చెప్పండి... బాబా సాహెబ్ అంబేడ్కర్ హిందూ మతం మీదగానీ, కుల వ్యవస్థ మీదగానీ పోరాటాన్ని తీవ్రంగా పదునెక్కించడానికి ఆనాటి హిందూ పెద్దలు, ప్రత్యేకించి గాంధీ లాంటి వాళ్ళు కారణం కాదా? ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకుంటేనే అంబేడ్కరిస్టుల పోకడలు అర్థం అవుతాయి. (క్లిక్: భరత జాతికి ఒక ఆంగ్ల నాడి) రకరకాల కారణాలతో గత 75 సంవత్సరాల్లో 30 వేల మంది దళితులను పొట్టనపెట్టుకున్నారు. 50,000 మందికి పైగా దళిత మహిళలు అత్యాచారాలకు, హత్యలకు గురయ్యారు. ఇప్పటికైనా హిందూ మత పెద్దలు తమ మతాన్ని సంస్కరించుకోకపోతే దళితులకు, కుల అణచివేతకు గురవుతున్న ఇతర బలహీన వర్గాలకు అంబేడ్కర్ 22 ప్రతిజ్ఞలు మాత్రమే మార్గం అవుతాయనడంలో సందేహం లేదు. (క్లిక్: రూపాయి విలువ తగ్గింది, ఎందుకు?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
ఒక్క చార్జింగ్‌తో గంటకు 40 కి.మీ: హొంమేడ్ ఎలక్ట్రిక్ సైకిల్ మేకింగ్ వీడియో
సాక్షి,హైదరాబాద్: మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కార్బన ఉద్గారాలను తగ్గించే లక్క్ష్యంతోపాటు, ఇంధన భారాని తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు రానురాను ఆదరణ పెరుగుతోంది. ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ వేవ్ టూవీలర్, త్రీవీలర్ సెగ్మెంట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. సైకిళ్లు ఎలక్ట్రిక్ మోడ్‌లో వచ్చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు హై రేంజ్లోఉండటంతో, కార్లు , బైక్స్‌తో సహా అన్ని రకాల ఆటోమొబైల్స్ కోసం ఇటువంటి కన్వర్షన్ కిట్లను చూశాం. దీంతో ప్యాసింజర్ కార్ సెగ్మెంట్, టూవీలర్ సెగ్మెంట్లో ఈ-వాహనాల భారాన్నిమోయలేని వారు కన్వర్షన్ కిట్వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ట్రెండ్ లో భాగంగానే స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకునే ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ విశేషంగా నిలుస్తోంది. ఇంట్లో తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ ప్రముఖ యూట్యూబర్ ఇలాంటి వీడియోనొకదాన్ని అప్లోడ్ చేశారు. కన్వర్షన్ కిట్ సహాయంతో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వీడియోను పబ్లిష్ చేశాడు. ఎలక్ట్రిక్ మోటారు, 36 V 7.5 Ah లిథియం-అయాన్ బ్యాటరీ, కంట్రోలర్, పెడల్ అసిస్ట్, కొత్త థొరెటల్, బ్రేక్ లివర్లు ఇలా ప్రతి భాగం ఎలా మరియు ఎక్కడ అమర్చాడో యూట్యూబర్ వివరించాడు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పూర్తి ఛార్జింగ్‌తో గంటకు 40 కిమీ వేగంతో దూసుకుపోవచ్చట. మరి ఈ ఇంట్రస్టింగ్ వీడియోను మీరు కూడా ఒకసారి చూసేయండి. అయితే దీనికి నిపుణుల పరిశీలన అవసరమని గుర్తించండి. కేవలం సమాచారం కోసమే ఈ వీడియోను అందిన్నామని గమనించగలరు. -
మతం మారితే బహిరంగపరచాలి
ధార్వాడ్: మత మార్పిడుల్ని నిరోధించాలని, ఒకవేళ ఎవరైనా మతం మారితే బహిరంగంగా వెల్లడించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభిప్రాయపడింది. మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఏ రాష్ట్రమైనా తీసుకువస్తే తాము స్వాగతిస్తామని స్పష్టం చేసింది. అఖిల భారతీయ కార్యకారి మండల్ (ఏబీకేఎం) మూడు రోజుల సమావేశం ముగిసిన అనంతరం ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే శనివారం మీడియాతో మాట్లాడారు. మతమార్పిడుల్ని నిరోధించాలన్నదే ఆరెస్సెస్ విధానమన్నారు. ఒకవేళ ఎవరైనా మతం మార్చుకుంటే దానిని బహిరంగంగా వ్యక్తపరచాలని డిమాండ్ చేశారు. మతం మారిన తర్వాత కూడా బయటపెట్టకపోతే వారు రెండు రకాలుగా లబ్ధిని పొందుతున్నారని అన్నారు. బలవంతపు మత మార్పిడుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని అన్నారు. అందుకే మత మార్పిడి నిరోధక చట్టాన్ని మైనార్టీలు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. బలవంతగా మత మార్పిడిని ఆరెస్సెసే కాదు మహాత్మా గాంధీ కూడా వ్యతిరేకించారని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు పదికి పైగా రాష్ట్రాలు మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీసుకువచ్చాయన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో వీరభద్ర సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ చట్టాన్ని తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. -
మధ్యప్రదేశ్‌లోనూ మత స్వేచ్ఛ బిల్లు
మధ్యప్రదేశ్: వివాహం ద్వారా గానీ లేదా ఇతర తప్పుడు పద్ధతుల్లో మత మార్పిడికి పాల్పడడాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశించిన మత స్వేచ్ఛ(ఫ్రీడం ఆఫ్ రిలిజియన్) బిల్లు 2020ని మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదించిందని ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. ఇది అమల్లోకి వచ్చి చట్టరూపం దాలిస్తే, చట్ట ఉల్లంఘనకు అత్యధికంగా పదేళ్ళ జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. ఈ బిల్లు ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ప్రొహిబిషన్ ఆఫ్ అన్‌లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజియన్ ఆర్డినెన్స్, 2020ని పోలి ఉంది. మధ్య ప్రదేశ్‌లో ఇది అమలులోకి వస్తే దేశంలోనే కఠినతరమైన చట్టం అవుతుందని మిశ్రా తెలిపారు. ఈ చట్టం ఉల్లంఘించిన వారు మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ జైలు శిక్ష, రూ. 50,000 జరిమానాకి అర్హులు. మతమార్పిడికి పాల్పడిన వ్యక్తి ఎస్సీ, ఎస్టీ, ౖమైనర్ అయితే, 2 నుంచి 10 ఏళ్ళ జైలు, రూ.50వేల జరిమానా విధించొచ్చు. -
కొద్దిసేపట్లో పెళ్లి..వధువు కిడ్నాప్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో హిందు మహిళలకు రక్షణ కరువైంది. పెళ్లి పందిట్లో నుంచి ఓ హిందూ వధువును అపహరించుకుని వెళ్లి, మత మార్పిడి చేసి, ముస్లిం యువకుడు పెళ్లి చేసుకున్న సంఘటన సంచలనం రేపుతోంది. పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రంలో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి వివాహ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మాటియారి జిల్లాలోని హాలా పట్టణంలో 24 ఏళ్ల హిందు యువతి భారతి బాయ్‌ను ముస్లిం యువకుడు, కొందరు రౌడీలతో కలిసి పోలీసుల సహకారంతో పెళ్లి మండపం నుంచి ఎత్తికెళ్లాడు. అనంతరం ఆమెకు బలవంతంగా ఇస్లాం మతాన్ని స్వీకరింపచేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటనపై భారతి తండ్రి కిషోర్ దాస్ మాట్లాడుతూ..తమ కుమార్తెకి మతియారా జిల్లా చెందిన వ్యక్తితో వివాహాన్ని నిశ్చయించామని..కానీ అంతలోనే తమ కూతురిని షారుఖ్ గుల్ అనే ముస్లిం యువకుడు పోలీసుల సహకారంతో కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. భారతిని బుష్రాగా పేరు మార్చిన సర్టిఫికేట్‌ను ముఫ్తీ అబూబకర్ సయీద్ఉర్ రెహమాన్ అందజేసినట్లు తెలిసింది. కాగా జాతీయ గుర్తింపు కార్డులో భారతి హాలా నగరానికి చెందిన వ్యక్తిగా పేర్కొంటుండగా..కానీ తాత్కాలిక చిరునామాలో మాత్రం కరాచీ నగరం గుల్షాన్ ఇక్బాల్‌లో ఉంటున్నట్లు ఉంది. తమ కుమార్తెని నెల ముందే షారుక్ గుల్ మత మార్పిడి చేశాడని భారతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ షారుక్ గుల్ మాత్రం తనకు బుష్రాతో వివాహం అయిందని..హిందు వ్యక్తితో తన భార్య భారతికి ఆమె తల్లి దండ్రులు వివాహం జరిపిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సింధు ప్రావిన్స్‌లోని హలాలో మత మార్పిడులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా హిందు మైనారిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్‌లో మైనారిటీలైన హిందువులకు రక్షణ కల్పిస్తానన్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
మతం మార్చుకున్న టాప్ హీరో సోదరుడు
సాక్షి, చెన్నై: కోలీవుడ్ టాప్ హీరో శింబు సోదరుడు కురళరసన్ తాజాగా మతం మార్చుకున్నారు. ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించారు. శింబుతోపాటు బాలనటుడిగా కురళరసన్ పలు చిత్రాల్లో నటించారు. ఆ తరువాత సంగీతంపై దృష్టి సారించి శింబు, నయనతార జంటగా నటించిన ‘ఇదునమ్మ ఆలు’ చిత్రంతో సంగీతదర్శకుడిగా మారారు. ఆయన తండ్రి సీనియర్ దర్శక, నిర్మాత, నటుడు టీ. రాజేందర్.. ఆయన ఏ మతమైన సమ్మతమే అంటారు. ఇక, ఆయన పెద్ద కొడుకు శింబు శివభక్తుడు. కూతురు ఇలఖ్య ఆ మధ్య క్రైస్తవ మతంలోకి మారి పెళ్లి చేసుకున్నారు. తాజాగా కురళరసన్ ఇస్లాం మతం స్వీకరించారు. ఆయన శుక్రవారం చెన్నై, అన్నాశాలైలోని మక్కా మసీదులోని ముస్లిం మత గురువుల సమక్షంలో ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కురళరసన్ తల్లిదండ్రులు టీ.రాజేందర్, ఉషా హాజయ్యారు. టీ.రాజేందర్ మాట్లాడుతూ కురళరసన్ చిన్నతనంలోనే ఇస్లాం మతం వైపు ఆకర్షితుడయ్యాడని, తనకు అన్ని మతాలు సమ్మతం కావడంతో తన ఇష్టాన్ని గౌరవించినట్లు తెలిపారు. సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్‌రాజా ఇప్పటికే ఇస్లాం మతాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా కురళరసన్ ఆ కోవలో చేరారు. అయితే కురళరసన్ ఒక ముస్లిం యువతిని ప్రేమిస్తున్నారని, ఆమెను పెళ్లి చేసుకోవడానికే తను మతం మారారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. -
పాక్ లో మతం మారితే శిక్ష ఉండదట!
ఇస్లామాబాద్(పాకిస్తాన్): శిక్ష పడకుండా ఉండాలంటే మతం మారాలని పాకిస్తాన్‌కు చెందిన ఓ ప్రాసిక్యూటర్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న 45 మంది క్రైస్తవులు మతం మారితే చాలు..శిక్ష మాఫీ అవుతుందని సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హెచ్చరించటం కలకలం రేపుతోంది. లాహోర్‌లోని క్రైస్తవులు అధికంగా నివసించే యోహనాబాద్ ప్రాంతంలో 2015లో అల్లర్లు చెలరేగాయి. స్థానికంగా ఉన్న రెండు చర్చిల్లో ఆదివారం ప్రార్థనల సందర్భంగా ఆత్మాహుతి దాడులు జరిగాయి. దాడుల అనంతరం కోపోద్రిక్తులైన క్రైస్తవులు జరిపిన దాడుల్లో ఇద్దరు ముస్లింలు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ముస్లింలుగా మారాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సయ్యద్ అనీస్ తనకు చెప్పారని నిందితుల లాయర్ జోసెఫ్ ఫ్రాన్సి వెల్లడించారు. వారు గనుక మతం మార్చుకుంటే శిక్ష నుంచి బయటపడటానికి తాను గ్యారెంటీదారుగా ఉంటానన్నారన్నారు. అయితే, నిందితులు దీనిపై మౌనంగా ఉన్నారని ఆయన చెప్పారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉన్న నిందితులను బ్లాక్‌మెయిలింగ్ చేయటం ఎంతవరకు సబబన్నారు. ఇటువంటి చర్యల ద్వారా దేశానికి చెడ్డపేరు తెస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై సయ్యద్ అనీస్ స్పందిస్తూ.. నిందితులను మతం మారాలని తాను కోరలేదని, వారికి శిక్ష నుంచి బయటపడేందుకు ఒక అవకాశం ఉందని మాత్రమే అన్నానన తెలిపారు. తమను బలవంతంగా ఇస్లాంలోకి మార్చుతున్నారంటూ క్రైస్తవులు గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నా.. ఏకంగా ఒక ప్రభుత్వ అధికారిపై ఇటువంటి ఆరోపణలు రావటం మాత్రం ఇదే ప్రథమమని భావిస్తున్నారు. -
అత్యాచారం చేసి, మతమార్పిడికి ఒత్తిడి
సుల్తాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. సుల్తాన్‌పూర్‌లో ఓ వ్యక్తి తన భార్య, సమీప బంధువు సాయంతో ఓ దళిత మహిళను ఐదు నెలలుగా బంధించి, అత్యాచారం చేయడంతో పాటు బలవంతపు మతమార్పిడికి ఒత్తిడితెచ్చాడు. బాధితురాలి దుండగుడి బారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తౌహిద్ అనే వ్యక్తి ఉద్యోగం ఇస్తానని ఆశ చూపి బాధితురాలిని తన ఇంటికి తీసుకెళ్లాడు. తౌహిద్ తన భార్య తబాసుమ్, బావమరిది పప్పు సాయంతో ఆమెను బందీని చేశాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడి, మతంమార్చుకోవమని ఒత్తడి చేశాడు. మంగళవారం బాధితురాలు తప్పించుకుని ఓ ఆశ్రమానికి వెళ్లింది. వారి సాయంతో పోలీసులుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించారు. ఈ కేసును త్వరితగతిన విచారణ చేయాల్సిందిగా ఎస్పీ సోనియా సింగ్ ఆదేశించారు. -
ఆర్ఎస్ఎస్ చీఫ్‌పై విమర్శల వెల్లువ
న్యూఢిల్లీ: మదర్ థెరిసా మతమార్పిడి కోసమే పేదలకు సేవ చేశారన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై మంగళవారం పలు క్రైస్తవ సంస్థలు, బీజేపీయేతర పార్టీలు నిప్పులు చెరిగాయి. విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ కూడా దద్దరిల్లింది. జీవితాన్ని పేదల సేవకే అంకితం చేసిన థెరిసాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని కోల్‌కతా మిషనరీస్ ఆఫ్ చారిటీ, జాతీయ మైనారిటీల కమిషన్, తిరువనంతపురం కేథలిక్ చర్చి అధికారులు మండిపడ్డారు. భాగవత్ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు లోక్‌సభలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని విపక్ష సభ్యులు లేవనె త్తగా స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చకు నిరాకరించారు. థెరిసా పేదల ఆశాజ్యోతి అని వాటికన్ పేర్కొంది. -
'మదర్ థెరీసా మతమార్పిడే లక్ష్యంగా పనిచేశారు'
భరత్ పూర్: భారతరత్న మదర్ థెరీసాపై ఆర్సెసెస్ చీఫ్ మోహన్ భగవత్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె పేదలకు చేసిన సేవలకు వెనుక మతమార్పిడి అంశం ముడిపడి ఉందని తాజాగా వ్యాఖ్యానించారు. పేదలకు సేవ చేసి వారిని క్రైస్తవ మతంలోకి మార్చడమే ఆమె ప్రధాన ఉద్దేశమని భగవత్ వ్యాఖ్యానించారు. థెరీసా సేవలు ప్రశంసదగినవే అయినప్పటికీ ఆమె వాటిని మత మార్పిడికి ఒక సాధనంగా వినియోగించుకున్నారన్నారు. రాజస్థాన్ లోని బజేరా గ్రామంలో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ఆపనాఘర్ సమావేశంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. సేవ పేరుతో మతమార్పిడిన కొనసాగించడం ఆ సేవకు విలువ తగ్గించడమే అవుతుందన్నారు. -
మత మార్పిళ్లను ప్రోత్సహించం: వెంకయ్య
న్యూఢిల్లీ: మతమార్పిడిలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించబోదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. మతమార్పిడిలు లేదా మరోసారి మార్పిడిలకు కేంద్రం మద్దతు ఇవ్వబోదని సోమవారం ఆయన లోక్‌సభలో చెప్పారు. మతమార్పిడిలను ఆపే బాధ్యత రాష్ట్రాలదే అన్నారు. మతమార్పిడిలను ప్రోత్సహించే వారిపై రాష్ట్రాలు చర్య తీసుకోవాలని సూచించారు. మతమార్పిడిల వ్యవహారంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో ప్రభుత్వం తరపున వెంకయ్య స్పందించారు. ప్రతిపక్షాలు పట్టువీడకపోవడంతో సభలో గందరగోళం రేగింది. -
'మత మార్పిడులను ఆపాల్సిందే'
హైదరాబాద్:దేశంలో జరుగుతున్న మత మార్పిడులను ఆపాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గతంలో కోట్ల మందిని మత మార్పిడి చేసిన అంశాన్ని ఆయన శాసనసభలో ప్రస్తావించారు. వెంకటేశ్వరస్వామి సన్నిధి తిరుపతిలో కూడా మత మార్పిడులు జరుగుతున్నాయని కామినేని అన్నారు. ఈ మత మార్పిడులను ఆపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో జరిగిన మత మార్పిడులను సమర్ధించిన వారు.. ఇప్పుడు రివర్స్ కన్వర్షన్ లు జరిగితే తప్పుబడుతున్నారని కామినేని తెలిపారు. -
'మతమార్పిడి'పై రాజ్యసభలో దుమారం
న్యూఢిల్లీ: మతమార్పిడుల అంశంపై రాజ్యసభలో మరోసారి దుమారం చెలరేగింది. మంగళవారం మతమార్పిడుల అంశాన్ని సభలో చర్చించాలిన కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ అంశాన్ని ఇప్పుడు చర్చించడానికి ప్రభుత్వం నిరాకరిస్తుండటంతో రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. ఎంతకీ కాంగ్రెస్ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సోమవారం కూడా మతమార్పిడిల అంశాన్ని చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. కాగా, ప్రభుత్వం ఈ అంశాన్ని నేటి సభలో చర్చించడానికి నిరాకరిస్తుంది. డిసెంబర్ 17 వ తేదీన ఇదే అంశం లిస్ట్ అయ్యి ఉన్నందున అప్పటివరకూ మతమార్పిడి అంశాన్ని చర్చకు తీసుకురావడాన్ని సబబు కాదని ప్రభుత్వం వాదిస్తోంది. -
'మాతమార్పిడి' పై రాజ్యసభలో గందరగోళం
న్యూఢిల్లీ: ఈమధ్య తీవ్ర దుమారం రేపిన మతమార్పిడుల అంశంపై రాజ్యసభలో మరోసారి గందరగోళం చోటుచేసుకుంది. మతమార్పిడుల అంశాన్ని సభలో చర్చించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పట్టుపడుతుండగా..అందుకు ప్రభుత్వం నిరాకరిస్తోంది. ప్రశ్నోత్తరాల సమయంలో చోటు చేసుకున్న మతమార్పిడి అంశంపై మరోసారి దుమారం చెలరేగడంతో రాజ్యసభ తిరిగి రెండు గంటల వరకూ వాయిదా పడింది. క్వశ్చన్ అవర్ లో సస్పెన్షన్ పై సభకు ఇప్పటికే నోటీస్ ఇచ్చామని, ఇది దేశంలోనే చాలా కీలక అంశమైనందున దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ తెలిపారు. కాగా, ప్రభుత్వం మాత్రం చర్చకు నిరాకరిస్తుంది. డిసెంబర్ 17 వ తేదీన ఇదే అంశం లిస్ట్ అయ్యి ఉన్నందున అప్పటివరకూ మతమార్పిడి అంశం చర్చ సబబు కాదని ప్రభుత్వం పేర్కొంది.