![Karnataka Man Tortured Wife For Conversion In shivamogga - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/19/husband.jpg.webp?itok=Wod_sPOQ)
సాక్షి,బళ్లారి: మతం మారడం లేదని భార్యను హత్య చేసేందుకు యత్నించిన భర్త ఉదంతం చిత్రదుర్గలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్రదుర్గకు చెందిన అబ్దుల్ ఖాదర్ శివమొగ్గకు చెందిన ఉమాను ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాడు.
వివాహం తర్వాత మతం మారాలని భార్యను ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించి తీవ్ర మనోవేదనకు గురై అనారోగ్యంపాలైంది. కాళ్లు రెండు పని చేయకుండా పోయాయి. తోడునీడుగా ఉండాల్సిన భర్త ఆమెను హింసించడమేగాక చివరకు గొంతు నులిమి చంపాలని యత్నించాడు.
బాధితురాలు తన బంధువు విశ్వనాథ్‌కు జరిగిన విషయాన్ని వెల్లడించడంతో చిత్రదుర్గ మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అబ్దుల్ ఖాదర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment