wife tortured
-
Wife Tortured: మతం మారలేదని భార్యకు చిత్రహింసలు!
సాక్షి,బళ్లారి: మతం మారడం లేదని భార్యను హత్య చేసేందుకు యత్నించిన భర్త ఉదంతం చిత్రదుర్గలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్రదుర్గకు చెందిన అబ్దుల్ ఖాదర్ శివమొగ్గకు చెందిన ఉమాను ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత మతం మారాలని భార్యను ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించి తీవ్ర మనోవేదనకు గురై అనారోగ్యంపాలైంది. కాళ్లు రెండు పని చేయకుండా పోయాయి. తోడునీడుగా ఉండాల్సిన భర్త ఆమెను హింసించడమేగాక చివరకు గొంతు నులిమి చంపాలని యత్నించాడు. బాధితురాలు తన బంధువు విశ్వనాథ్‌కు జరిగిన విషయాన్ని వెల్లడించడంతో చిత్రదుర్గ మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అబ్దుల్ ఖాదర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
అక్రమ సంబంధంతో భార్యను హతమార్చిన పోలీసు
వదినతో తన వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించిందన్న కోపంతో.. కట్టుకున్న భార్యను సజీవదహనం చేశాడో పోలీసు భర్త. ఈ ఘటన బీహార్‌లోని నలంద జిల్లాలో జరిగింది. మృతురాలి సోదరుడు సింకు కుమార్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరికి బీహార్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసే మహేష్ యాదవ్‌ను ఇచ్చి 2009లో పెళ్లి చేశామని చెప్పాడు. అయితే.. అతడికి తన వదినతో వివాహేతర సంబంధం ఉందని తెలిసి తన సోదరి అందుకు అభ్యంతరం తెలిపిందని సింకు కుమార్ పోలీసులకు చెప్పారు. ఆమెను అతడు తరచు చిత్రహింసలు పెట్టేవాడని, చివరకు ఏకంగా సజీవ దహనం చేసేశాడని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఆరుగురి పేర్లను పేర్కొనగా, అందరూ పరారీలో ఉన్నారు. వారిని అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.