కన్నడ పరిశ్రమలోనూ హేమా తరహా కమిటీ కావాలి | Kannada film body asks CM Siddaramaiah to form Hema Committee | Sakshi
Sakshi News home page

కన్నడ పరిశ్రమలోనూ హేమా తరహా కమిటీ కావాలి

Published Thu, Sep 5 2024 5:32 AM | Last Updated on Thu, Sep 5 2024 5:32 AM

Kannada film body asks CM Siddaramaiah to form Hema Committee

ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు ‘ఫైర్‌’ వినతి పత్రం  

‘‘మలయాళ పరిశ్రమలో జస్టిస్‌ హేమా కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కన్నడంలోనూ ఓ కమిటీ ఉండాలి. సుప్రీమ్‌ కోర్టు లేక హై కోర్టు రిటైర్డ్‌ జడ్జి ఆధ్వర్యంలో ఆ కమిటీని ఏర్పాటు చేయాలి’’ అంటూ కర్ణాటకకు చెందిన ‘ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఫర్‌ రైట్స్‌ అండ్‌ ఈక్విటీ’ (ఫైర్‌) కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. కన్నడ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై నివేదిక తీసుకు రావాలని ‘ఫైర్‌’ సభ్యులు కోరారు. బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు తమ డిమాండ్లను తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు.

 ఈ వినతి పత్రంలో పలువురు నటీనటులు, రచయితలు.... ఇలా మొత్తం 153 మంది సంతకం చేశారు. వీరిలో నటుడు కిచ్చా సుదీప్, నటీమణులు రమ్య, ఆషికా రంగనాథ్, శ్రద్ధా శ్రీనాథ్, ‘ఫైర్‌’ అధ్యక్షురాలు, దర్శకురాలు, రచయిత కవితా లంకేశ్‌ వంటివారు ఉన్నారు. ‘‘కేఎఫ్‌ఐ’ (కన్నడ ఫిల్మ్‌ ఇండస్ట్రీ)లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై సమగ్ర విచారణ జర΄ాలి. కర్ణాటక పరిశ్రమలో పని చేస్తున్న మహిళలకు సురక్షితమైన, సమానమైన పని వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి, వారిపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టడానికి సమగ్రమైన చర్యలు చేపట్టాలి’’ అని ఆ వినతి పత్రంలో ‘ఫైర్‌’ పేర్కొంది. కాగా ‘మీటూ’ ఉద్యమం ఊపందుకున్న సమయంలో 2018లో ‘ఫైర్‌’ సంస్థ ఆరంభమైంది. దేశంలోనే మొట్టమొదట ‘ఐసీసీ’ (పరిశ్రమలో జరుగుతున్న అంతర్గత ఫిర్యాదుల కమిటీ)ని స్థాపించడంలో ‘ఫైర్‌’ కీలక ΄ాత్ర ΄ోషించింది. లైంగిక వేధింపులకు గురైనవారికి న్యాయ సహాయం అందించడానికి ‘ఫైర్‌’ కృషి చేస్తూ వస్తోంది.  

అందరం మాట్లాడుకుంటున్నాము కానీ... 
– సమంతమలయాళ చిత్ర పరిశ్రమలోని జస్టిస్‌ హేమా కమిటీ తరహాలో తెలుగులోనూ ఓ కమిటీ రావాలని, తెలుగు ఇండస్ట్రీలో మహిళల కోసం ఏర్పాటు చేయబడిన 2019 సబ్‌ కమిటీ నివేదికను బయట పెట్టాలని సమంత ఇప్పటికే సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు. తాజాగా సమంత ఇన్‌స్టాలో షేర్‌ చేసిన మరో ΄ోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ‘‘ఆగస్టు నెల గడిచి΄ోయింది. 2012లో జరిగిన హత్యాచార ఘటన తరహాలోనే ఇటీవల కోల్‌కతాలోనూ జరిగింది... ఘటనలు జరుగుతున్నాయి. వీటి గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం. ఈ ఘటనల హైప్‌ మెల్లిగా తగ్గి΄ోతుంది. మనం కూడా మన పనులతో ముందుకెళ్తుంటాం. మళ్లీ ఘటన జరుగుతుంది’’ అంటూ సమంత ఆ ΄ోస్ట్‌లో షేర్‌ చేశారు. ఇదిలా ఉంటే... తాను గాయపడ్డ విషయాన్ని తెలియజేస్తూ సమంత ఇన్‌స్టాలో మరో ΄ోస్ట్‌ షేర్‌ చేశారు. ‘‘గాయాలు లేకుండా నేను యాక్షన్‌ స్టార్‌ కాలేనా?’’ అంటూ సమంత ఆ ΄ోస్ట్‌లో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఆమె ఏదో సినిమా సెట్‌లో గాయపడి ఉంటారని ఊహించవచ్చు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement