Malayalam industry
-
కన్నడ పరిశ్రమలోనూ హేమా తరహా కమిటీ కావాలి
‘‘మలయాళ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కన్నడంలోనూ ఓ కమిటీ ఉండాలి. సుప్రీమ్ కోర్టు లేక హై కోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆ కమిటీని ఏర్పాటు చేయాలి’’ అంటూ కర్ణాటకకు చెందిన ‘ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్విటీ’ (ఫైర్) కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. కన్నడ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై నివేదిక తీసుకు రావాలని ‘ఫైర్’ సభ్యులు కోరారు. బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు తమ డిమాండ్లను తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ వినతి పత్రంలో పలువురు నటీనటులు, రచయితలు.... ఇలా మొత్తం 153 మంది సంతకం చేశారు. వీరిలో నటుడు కిచ్చా సుదీప్, నటీమణులు రమ్య, ఆషికా రంగనాథ్, శ్రద్ధా శ్రీనాథ్, ‘ఫైర్’ అధ్యక్షురాలు, దర్శకురాలు, రచయిత కవితా లంకేశ్ వంటివారు ఉన్నారు. ‘‘కేఎఫ్ఐ’ (కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ)లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై సమగ్ర విచారణ జర΄ాలి. కర్ణాటక పరిశ్రమలో పని చేస్తున్న మహిళలకు సురక్షితమైన, సమానమైన పని వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి, వారిపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టడానికి సమగ్రమైన చర్యలు చేపట్టాలి’’ అని ఆ వినతి పత్రంలో ‘ఫైర్’ పేర్కొంది. కాగా ‘మీటూ’ ఉద్యమం ఊపందుకున్న సమయంలో 2018లో ‘ఫైర్’ సంస్థ ఆరంభమైంది. దేశంలోనే మొట్టమొదట ‘ఐసీసీ’ (పరిశ్రమలో జరుగుతున్న అంతర్గత ఫిర్యాదుల కమిటీ)ని స్థాపించడంలో ‘ఫైర్’ కీలక ΄ాత్ర ΄ోషించింది. లైంగిక వేధింపులకు గురైనవారికి న్యాయ సహాయం అందించడానికి ‘ఫైర్’ కృషి చేస్తూ వస్తోంది. అందరం మాట్లాడుకుంటున్నాము కానీ... – సమంతమలయాళ చిత్ర పరిశ్రమలోని జస్టిస్ హేమా కమిటీ తరహాలో తెలుగులోనూ ఓ కమిటీ రావాలని, తెలుగు ఇండస్ట్రీలో మహిళల కోసం ఏర్పాటు చేయబడిన 2019 సబ్ కమిటీ నివేదికను బయట పెట్టాలని సమంత ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. తాజాగా సమంత ఇన్‌స్టాలో షేర్ చేసిన మరో ΄ోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘ఆగస్టు నెల గడిచి΄ోయింది. 2012లో జరిగిన హత్యాచార ఘటన తరహాలోనే ఇటీవల కోల్‌కతాలోనూ జరిగింది... ఘటనలు జరుగుతున్నాయి. వీటి గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం. ఈ ఘటనల హైప్ మెల్లిగా తగ్గి΄ోతుంది. మనం కూడా మన పనులతో ముందుకెళ్తుంటాం. మళ్లీ ఘటన జరుగుతుంది’’ అంటూ సమంత ఆ ΄ోస్ట్‌లో షేర్ చేశారు. ఇదిలా ఉంటే... తాను గాయపడ్డ విషయాన్ని తెలియజేస్తూ సమంత ఇన్‌స్టాలో మరో ΄ోస్ట్ షేర్ చేశారు. ‘‘గాయాలు లేకుండా నేను యాక్షన్ స్టార్ కాలేనా?’’ అంటూ సమంత ఆ ΄ోస్ట్‌లో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఆమె ఏదో సినిమా సెట్లో గాయపడి ఉంటారని ఊహించవచ్చు. -
తారల వెనుక చీకటి సర్దుబాట పడితేనే కెరీర్ దారిలోకి?
‘పనికి తగ్గ జీతం’ అనేది కామన్. అయితే పనితో పాటు ‘వేరే పనులు’ కూడా చేయాలి... లేకపోతే పని పోయే అవకాశం ఉంది. సినిమా పరిశ్రమకి చెందిన పలువురు నటీమణులు అంటున్న మాట ఇది. అయితే తాము ఎదుర్కొంటున్న ఈ రకమైన ఒత్తిడి గురించి నటీమణులు అంత త్వరగా బయటపెట్టరు. ‘మీటూ’లో భాగంగా ఆ మధ్య కొందరు పెదవి విప్పితే, ఇప్పుడు మలయాళంలో ‘హేమా కమిటీ’ వల్ల ఎందరో తారలు ధైర్యంగా తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ఆ విషయాల్లోకి....చాలా అవకాశాలు కోల్పోయా!: చార్మిలా‘‘నా కెరీర్లో చేదు అనుభవాలు చాలా ఉన్నాయి. దర్శకుడు హరిహరన్, నిర్మాత ఏంపీ మోహనన్ నా పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఇంకా ఓ 28 మంది నాతో అభ్యంతరకరంగా వ్యవహరించారు’’ అని నటి చార్మిలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏయన్నార్, లక్ష్మీ జంటగా నటించిన ‘్రపాణదాత’ (1992)లో వీరి కూతురిగా నటించిందామె. భానుమతీ రామకృష్ణ స్వీయదర్శకత్వంలో రూ΄÷ందించిన ‘అసాధ్యురాలు’లో నటించారు. ‘ప్రేమ ఖైదీ’లో మాలాశ్రీ ఫ్రెండ్‌గా నటించారు. తమిళంలో పలు చిత్రాల్లో నటించిన చార్మిలా మలయాళంలో దాదాపు 40 చిత్రాల్లో నటించారు. తాజాగా ఓ మలయాళ మీడియాతో చార్మిలా మాట్లాడుతూ – ‘‘హరిహరన్ డైరెక్షన్లో మలయాళ చిత్రం ‘పరిణయం’ (1994) అంగీకరించా.అదే సినిమాలో నటుడు విష్ణు కూడా నటించాల్సింది. ‘చార్మిలా అడ్జెస్ట్మెంట్కి ఒప్పుకుంటుందా’ అని విష్ణు ద్వారా హరిహరన్ అడిగించారు. ‘ఒప్పుకోదు’ అని విష్ణు చెప్పడంతో తనని, నన్ను ఆ సినిమా నుంచి తీసేశారు. అడ్జస్ట్ కాకపోవడంతో చాలా సినిమాలు కోల్పోయాను. నేను చాలామంది పేర్లు బయటపెట్టకపోవడానికి కారణం నాకో కొడుకు ఉన్నాడు. తల్లిగా నా బాధ్యతలు నాకున్నాయి కాబట్టి ఈ ఘటనలకు సంబంధించి యాక్షన్ తీసుకోవాలని కూడా అనుకోవడంలేదు’’ అన్నారు. ఇంకా మలయాళ నిర్మాత ఎంపీ మోహనన్ గురించి చెబుతూ– ‘‘అర్జునన్ పిళ్లయుమ్ అంజు మక్కళుమ్’ (1997) నిర్మాత ఎంపీ మోహనన్ ఆ సినిమా చివరి రోజు షూటింగ్ పూర్తయ్యాక తన హోటల్ గదికి రమ్మంటే, నా స్టాఫ్‌తో కలిసి వెళ్లాను. మోహనన్, అతని ఫ్రెండ్స్ నాపై అత్యాచారం జరపడానికి ట్రై చేశారు. నేను తప్పించుకుని బయటపడ్డాను. నేనైతే బయటపడ్డాను కానీ వాళ్లు జూనియర్ ఆర్టిస్టులపై అత్యాచారం జరిపారు. నేను నాలుగు భాషల్లో (మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ) సినిమాలు చేశాను. కానీ ఇలాంటి ఘటనలు మలయాళ పరిశ్రమలోనే ఎక్కువ’’ అని చార్మిలా పేర్కొన్నారు.ఇది వేకప్ కాల్ – సోమీ అలీ 1990లలో తాను హిందీ సినిమాలు చేసినప్పుడు లైంగిక దాడులు ఎదుర్కొన్నానని ఇటీవల సోమీ అలీ పేర్కొన్నారు. ‘‘కెరీర్లో కొనసాగాలంటే రూమ్‌కి వెళ్లాల్సిందే, లేకపోతే కుదరదు లాంటి హెచ్చరికలు నాకొచ్చాయి. కెరీర్ కోసం కొందరమ్మాయిలు అలా రూమ్‌లకు వెళ్లి, మర్నాడు ఉదయం ఇబ్బందిగా, సిగ్గుపడుతూ బయటకు వచ్చిన ఘటనలు చూశా. కానీ ఆ వ్యక్తులు మాత్రం ‘ఫ్యామిలీ మేన్’లా చలామణీ అవుతుంటారు. నాకు ఎదురైన చేదు అనుభవాల వల్లే ‘నో మోర్ టియర్స్’ ఫౌండేషన్ ఆరంభించా. ఇక మలయాళ పరిశ్రమలోని హేమా కమిటీ ఓ వేకప్ కాల్ లాంటిది’’ అని సోమీ అన్నారు. ఎవరూ ఎవర్నీ బలవంత పెట్టరు: కామ్యా పంజాబీ‘‘గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ప్రస్తుతం టీవీ రంగం క్లీన్‌గా ఉంది. ఇక్కడ (హిందీ టెలివిజన్ రంగాన్ని ఉద్దేశించి) ఏ మురికి (మహిళలపై లైంగిక దాడులు, క్యాస్టింగ్ కౌచ్‌లను ఉద్దేంచి) లేదు. ఎవరు ఎవర్నీ ఫోర్స్ చేయడం లేదు. స్క్రిప్ట్‌లోని రోల్‌కు సరిపోయి, మనలో నటించే ప్రతిభ ఉంటే చాలు. చాన్స్‌లు వస్తాయి’’ అని బుల్లితెర ఫేమ్ కామ్యా పంజాబీ పేర్కొన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘వినోద రంగంలో ప్రస్తుతం మహిళలకు సేఫ్టీ ప్లేస్ ఏదైనా ఉందంటే అది టీవీ విభాగంలోనే. ఒకవేళ ఏదైనా జరుగుతుందంటే అది పరస్పర అంగీకారంతోనే. అమ్మాయి సమ్మతించకపోతే ఏదీ జరగదు. ఎవరూ ఎవర్నీ బలవంతపెట్టరు. కొందరు పురుషులు ఉమనైజర్స్గా ఉండొచ్చు.. కాదనడం లేదు’’ అన్నారు కామ్య.మలయాళంలో అత్యంత ప్రతిభ గల దర్శకుడిగా హరిహరన్‌కి పేరుంది. జాతీయ అవార్డు సాధించిన పలు చిత్రాలను తెరకెక్కించారు. వాటిలో చార్మిలా కోల్పోయిన ‘పరిణయమ్’ ఒకటి. ‘శరపంచరమ్, పంచాగ్ని, ఒరు వడక్కన్ వీరగాథ, సర్గమ్’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు హరిహరన్. మలయాళ సినిమాకి చేసిన కృషికిగాను కేరళ అత్యున్నత పురస్కారం అయిన ‘జేసీ డేనియల్ అవార్డు’ని కూడా అందుకున్నారు ఈ దర్శకుడు.దర్శకుడు హరిహరన్పై చార్మిలా చేసిన ఆరోపణలను మలయాళ నటుడు విష్ణు ధ్రువీకరించారు. ఓ మలయాళ మీడియాతో మాట్లాడుతూ – ‘‘తను సర్దుబాటుకి ఒప్పుకుంటుందా? అని చార్మిలాని అడిగి, తెలుసుకోమని డైరెక్టర్ నాతో అన్నారు. చార్మిలా తిరస్కరించిన విషయాన్ని నేను హరిహరన్‌తో చె΄్పాను. దాంతో ‘పరిణయం’ సినిమా చాన్స్‌ని చార్మిలా కోల్పోయారు’’ అని విష్ణు పేర్కొన్నారు.ఆరు సినిమాలు చేస్తేనే సభ్యత్వం వచ్చింది: మినూ మునీర్ మలయాళ తార మినూ మునీర్ తన పట్ల నటులు జయసూర్య, ఇడవెల బాబు, నటుడు–నిర్మాత మణియన్‌పిల్ల రాజు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్)లో సభ్యత్వం ΄÷ందాలంటే 3 చిత్రాల్లో నటిస్తే చాలట. కానీ తాను 6 సినిమాల్లో నటించినా సభ్యత్వం ఇవ్వలేదని మిను పేర్కొన్నారు. ‘అమ్మ’లో వివిధ పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించిన ఇడవెల బాబుకి ఫోన్ చేసి, సభ్యత్వం గురించి అడిగారట మిను. ‘‘మెంబర్షిప్ ఫామ్ పూర్తి చేయడానికి తన ఫ్లాట్‌కి రమ్మన్నాడు ఇడవెల. వెళ్లి, ఫామ్ పూర్తి చేస్తుండగా నా మెడపై ముద్దు పెట్టాడు. నేను వెంటనే అక్కణ్ణుంచి వెళ్లిపోయా’’ అన్నారు మినూ మునీర్.నాపై ఆరోపణలు అవాస్తవం – నివిన్ పౌలి మలయాళ పరిశ్రమలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఇప్పటికే 15 మందికి పైగా నటులపై కేసులు నమోదు అయినట్లు వార్తలు ఉన్నాయి. తాజాగా నివిన్ పౌలి పేరు తెరపైకి వచ్చింది. ఓ మూవీలో చాన్స్ ఇప్పిస్తామని మోసం చేసిన ఆరుగురిలో నివిన్ పౌలి కూడా ఉన్నారని, ఇది 2023 నవంబరులో దుబాయ్‌లో జరిగిందని ఓ మహిళ కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసిందనే వార్త వినిపిస్తోంది. దాంతో ‘‘నాపై తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చినట్లుగా నా దృష్టికి వచ్చింది. ఆమె ఎవరో నాకు తెలియదు. నాపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. నా లీగల్ టీమ్ చూసుకుంటుంది’’ అని నివిన్ పౌలి తెలిపారు.కన్నడంలోనూ హేమా కమిటీలాంటిది కావాలి: శ్రుతీ హరిహరన్మలయాళంలో ఉన్నట్లుగా కన్నడ పరిశ్రమలోనూ హేమా లాంటి కమిటీ ఉండాలని కన్నడ నటి శ్రుతీ హరిహరన్ అంటున్నారు. ‘‘హేమా కమిటీ ఇచ్చిన నివేదిక మలయాళ పరిశ్రమ గౌరవాన్ని దిగజార్చేలా ఉందన్న కొందరి మాటలతో ఏకీభవించను. సినిమా అనేది మంచి కళ. ఆ కళలో ఉన్న కొన్ని విషయాలను మార్చే టైమ్ వచ్చింది. మన ఇంటిని మనమే శుభ్రపరచుకోవాలి’’ అని శ్రుతీ హరిహరన్ పేర్కొన్నారు. ఇక గతంలో నటుడు అర్జున్‌పై శ్రుతీ హరిహరన్ కొన్ని ఆరోపణలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే తాను అలాంటి పనులు చేయలేదంటూ అర్జున్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు.మహిళా నాయకత్వం ఉండాలి: ఏక్తా కపూర్కరీనా కపూర్ లీడ్ రోల్లో హన్సల్ మెహతా దర్శకత్వంలో రూ΄÷ందిన హిందీ చిత్రం ‘ది బకింగ్హమ్ మర్డర్స్’ ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన ఈవెంట్లో చిత్రనిర్మాత ఏక్తా కపూర్ మాట్లాడుతూ– ‘‘ప్రతి రంగంలో మహిళలకు కూడా నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి. అప్పుడు వారు మహిళల భద్రతను గురించి కొంత ఆలోచన చేస్తారు. అలాగే నాయకత్వం బలంగా ఉండేలా తోటి మహిళలు తోడ్పాటు అందించాలి. నివేదికలు వచ్చినప్పుడు చదువుతాం... చాలా తెలుసుకుంటాం. కానీ మహిళల సాధికారికత, భద్రత విషయాల్లో పని ప్రదేశాల్లో మహిళలకు మెరుగైన వాతా వరణం నెలకొల్పాలి’’ అన్నారు. ‘‘మహిళలకు మెరుగైన పని వాతావరణం ఉండేలా పురుషులు కూడా బాధ్యతగా చొరవ తీసుకోవాలి’’ అని హన్సల్ అన్నారు. -
మలయాళ ఇండస్ట్రీని నాశనం చేయకండి: మోహన్‌లాల్
మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడులకు సంబంధించి కేరళ ప్రభుత్వానికి హేమా కమిటీ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 17 మంది మలయాళ సినీ ప్రముఖులపై కేసులు నమోదైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అధ్యక్షుడు మోహన్‌లాల్, ‘అమ్మ’ కమిటీ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఈ వివాదంపై మోహన్‌లాల్ మాట్లాడలేదు. హేమా కమిటీ నివేదిక, ఇండస్ట్రీలో జరుగుతున్న తాజా పరిణామాల గురించి కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్‌లాల్ ఈ విధంగా మాట్లాడారు. ఏ పవర్ గ్రూప్‌లోనూ లేను: హేమా కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. నేను కూడా కమిటీ ముందు హాజరై, నాకు తెలిసిన అన్ని విషయాలను పంచుకున్నాను. వాటిని ఇక్కడ చర్చించలేను. అలాగే కమిటీ నివేదికలో పేర్కొన్న ఏ పవర్ గ్రూప్‌లోనూ నేను లేను. అయినా నివేదికలో చాలా అంశాలు ఉన్నాయి. అన్నింటికీ ‘అమ్మ’నే కారణం అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదు. మలయాళ పరిశ్రమ అంతా కలిసి స్పందించాల్సి ఉంది (ఇండస్ట్రీలో ఉండే పలు విభాగాల దర్శక–నిర్మాతలు, నటీనటులు వంటి సంఘాలు). నిజంగా తప్పులు చేసిన వారిని కోర్టు శిక్షిస్తుంది. ప్రభుత్వం, పోలీసులు నివేదిక అంశాల పైనే పని చేస్తున్నారు.అందుకే కేరళ నుంచి బయటకు వెళ్లాను: సమాజంలో సినిమా అన్నది ఓ భాగమే. హేమా కమిటీ నివేదిక ప్రస్తావనల పైనే దృష్టి సారిస్తూ మలయాళ పరిశ్రమను నాశనం చేయకండి. మద్రాసులో ఉండి నేను సినిమాలు చేసే సమయంలో సరైన సౌకర్యాలు కూడా లేవు. చిన్న పరిశ్రమగా మొదలైన మలయాళ ఇండస్ట్రీ ఎదుగుతోంది. ఇతర భాషల్లో మలయాళ చిత్ర పరిశ్రమ కళకు గుర్తింపు లభిస్తోంది. దక్షిణాది సినిమాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తోంది.ఇలాంటి తరుణంలో ఇండస్ట్రీ నాశనం కాకూడదు. చాలామంది ఉపాధి కోల్పోతారు. కొందరు ‘అమ్మ’ ఇలా చేయకూడదు.. అలా చేయకూడదు అంటున్నారు. ‘అమ్మ’ కోసం జరిగే ఎన్నికల్లో సభ్యులెవరైనా పోటీ చేయొచ్చు. ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేసిన తర్వాత మీడియాకు కావాలని దూరంగా ఉన్నానన్న వార్తలు అవాస్తవం. నా భార్య సర్జరీ, నేను హీరోగా చేసిన సినిమాకు చెందిన పనుల్లో బిజీగా ఉండి కేరళ నుంచి బయటకు వెళ్లాను. -
మాలీవుడ్ ‘తెర’ వెనుక కన్నీటి చార
మలయాళ పరిశ్రమలో కథలు ఎంత వినూత్నంగా ఉన్నా స్త్రీల విషయంలో వేధింపులు అంతే అమానవీయంగా ఉన్నాయి. బలం ఉన్నవాళ్లు, పలుకుబడి ఉన్నవాళ్లు కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చే మహిళా ఆర్టిస్టులను తాము చెప్పినట్టుగా వినాలని శాసిస్తున్నారు. ‘ఎస్’ అంటే మేకప్... ‘నో’ అంటే ప్యాకప్ అని బెదిరిస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తూ సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషనే తేల్చి చెప్పింది. మలయాళ పరిశ్రమ ఈ కమిషన్ రిపోర్టుతో కుదుపునకు లోనవుతోంది.‘వినీల ఆకాశంలో ఎన్నో రహస్యాలు... చందమామ అందంగా ఉంటుందని.. నక్షత్రాలు మెరుస్తాయని అనుకుంటాం. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి. మీరు చూసేదంతా నిజమనుకోకండి. ఒక్కోసారి ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. మలయాళ సినీ పరిశ్రమ కూడా అంతే. పైకి కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో చీకటి కోణాలు. వాటిని వింటుంటే గుండె తరుక్కు పోతుంది. రంగుల ప్రపంచంలో జీవితాలను కోల్పోతున్న ఎంతోమంది మహిళల ఆవేదనను అక్షరబద్ధం చేశాం’ అంటూ నివేదికను మొదలు పెట్టారు జస్టిస్ హేమ. ఉత్తమ అభిరుచి, ప్రజాదరణ ఉన్న సినిమాలు తీస్తూ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న మలయాళ పరిశ్రమలో తెర వెనుక కన్నీటి చారను జస్టిస్ హేమ రిపోర్ట్ బట్టబయలు చేసింది. ఇండస్ట్రీలోని 15 మంది పెద్దలు ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకుని స్త్రీల జీవితాలను శాసిస్తున్నారని ఈ కమిటీ పేర్కొనడం గమనార్హం. ఇదీ నేపథ్యందాదాపు ఏడేళ్ల కిందట 2017లో మలయాళనటి భావనా మీనన్‌పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్‌స్టార్ దిలీప్ పేరు రావడంతో గగ్గోలు రేగింది. ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్‌ను నియమించింది. మన సీనియర్ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు. విచారణ ముగించిన కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. తాజాగా ‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. దాంతో నిన్న (సోమవారం) మధ్యాహ్నం ఆ రిపోర్టు జర్నలిస్టులకు అందింది. 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు. ఈ నివేదికపై పినరయి విజయన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని మాలీవుడ్ తో పాటు భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.కమిటీ నివేదికలో సంచలన విషయాలు‘శరీరాలను అర్పించుకోవాలి.. ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి.. సహకరించిన వాళ్లకు అవకాశాలు. ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు.. ఇదీ 233 పేజీలతో జస్టిస్ హేమా కమిటీ నివేదిక సారాంశం. ‘ఆయన నన్ను చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. నేను లొంగలేదు. అందుకే ఓ సినిమాలో కౌగిలించుకునే పాత్రను సృష్టించి 17 సార్లు రీషూట్ చేశారు. ఆ విధంగా అతను నన్ను మరింత వేధించడం మొదలు పెట్టాడు’ అని జస్టిస్ హేమా కమిటీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ సీనియర్ నటి వ్యక్తం చేసిన ఆవేదన ఇది. అడపాదడపా కాకుండా ఈ తరహా వేధింపు ఘటనలు పరిశ్రమలో సర్వసాధారణంగా జరుగుతున్నాయని కమిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది. ‘కొత్తగా వచ్చే నటీమణులకు గతంలో పేరు ప్రతిష్టలు సాధించిన నటీమణులంతా కోరిన విధంగా నడుచుకునే పైకి వచ్చారనే భావన కల్పించడంలో ఇండస్ట్రీ పెద్దలు సఫలం అయ్యారు’ అని కమిటీ తెలిపింది. ‘సినిమా వాళ్లు వేషం ఇస్తామని మహిళలకు ఫోన్ చేస్తే పర్లేదు. అదే మహిళలు తమంతట తాము ఫోన్ చేస్తే ‘ఫేవర్’ చేయాల్సిందే’ అని కమిటీ తెలిపింది.ఆ 15 మందికొంతమంది హీరోలు... మరికొంతమంది దర్శకులు... ఇంకొందరు నిర్మాతలు... ఇలా 15మంది మగ మహారాయుళ్లు సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, వాళ్లు చెప్పినట్టే అందరూ నడుచుకుంటున్నారని నివేదిక తేల్చింది. ఈ 15 మందికి సహకరిస్తే ఇండస్ట్రీలో అపారంగా అవకాశాలు లభిస్తాయి. సహకరించని వాళ్ల జీవితాలు నాశనమైపోతాయని చెప్పింది. ఆ 15మంది పేర్లు బయటకు రావాల్సి ఉంది.ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటేసర్దుకుపోండి... రాజీపడండి.. మలయాళ సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే మహిళలకు పరిశ్రమ పెద్దలు చెప్పే రెండు మాటలు ఇవే. వీటికి సిద్ధపడి జీవితాలను అర్పించుకుంటేనే భారీ పారితోషకాలతో మెండుగా అవకాశాలు కల్పిస్తారు. కాదు... కూడదని ఎదురు తిరిగితే మాత్రం వాళ్ల జీవితాలను నాశనం చేయడానికి కూడా వెనుకాడరు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు ముందుకు రారంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.– ఫణికుమార్ అనంతోజుకమిటీ సిఫార్సులు→ సినీ పరిశ్రమలో మహిళల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చట్టాలు చేయాలి.→ అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి మహిళలను న్యాయం చేయాలి.→ నేరచరిత్ర ఉన్న వాళ్లపై సినీ ఇండస్ట్రీ నిషేధం విధించాలి→ షూటింగ్ జరిగే ్రపాంతాల్లో మద్యం, మాదకద్రవ్యాలపై నిషేధం విధించాలి.→ ఫ్యాన్ క్లబ్స్ మహిళలను వేధించకుండా చర్యలు తీసుకోవాలి.→ పరిశ్రమలో పనిచేసే మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందించాలి. -
మాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అనుష్క శెట్టి.. ఆకట్టుకుంటోన్న గ్లింప్స్!
మలయాళ పరిశ్రమలో తొలి అడుగు వేశారు హీరోయిన్ అనుష్కా శెట్టి. దాదాపు ఇరవయ్యేళ్ల సుదీర్ఘ కెరీర్లో అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తొలి మలయాళ సినిమా ‘కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’. ఫ్యాంటసీ హారర్ జానర్లో రూపొందుతున్న ఈ సినిమాలో జయసూర్య హీరోగా నటిస్తుండగా, రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో జయసూర్య (సెప్టెంబర్ 2) బర్త్ డే సందర్భంగా ‘కథనార్’ సినిమా గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. వీడియోలో అనుష్క కనిపించకపోయినా, ఆమె పేరును కన్ఫార్మ్ చేశారు మేకర్స్. వాస్తవ ఘటనల ఆధారంగా కేరళలోని కడమట్టు ప్రాంతంలో గల ఓ చర్చి ఫాదర్ జీవితం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని టాక్. ఈ చిత్రం పద్నాలుగు భాషల్లో విడుదల కానుందట. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా తొలి భాగం 2024లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే... ‘కథనార్’ గ్లింప్స్ వీడియోను బట్టి ఈ చిత్రంలో ‘అరుంధతి’ తరహా పాత్రను అనుష్క చేస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
మలయాళ ఇండస్ట్రీకి మైత్రీ మూవీ మేకర్స్, టొవినో థామస్ హీరోగా..
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలతో పలు బ్లాక్ బస్టర్లను అందించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మలయాళంలో అడుగుపెట్టింది. తొలి ప్రాజెక్ట్‌గా ‘గాడ్ స్పీడ్’ అనే బ్యానర్‌తో కలిసి ‘నడికర్ తిలగం’ సినిమాకి శ్రీకారం చుట్టారు. టొవినో థామస్ హీరోగా లాల్ జూనియర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నవీన్ యర్నేని, వై. రవిశంకర్, అల్లన్ ఆంటోని, అనూప్ వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం కొచ్చిలోప్రారంభమైంది. ‘‘టొవినో థామస్ ఈ చిత్రంలో అనేక సవాళ్లతో కూడిన సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ పాత్రను పోషిస్తున్నారు. బుధవారమే రెగ్యులర్ షూటింగ్‌ప్రారంభించాం’’ అన్నారు. భావన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆల్బీ, సంగీతం: యక్జాన్ గారి పెరీరా, నేహా నాయర్. -
Movie News: మాలీ కాలింగ్
తెలుగులో తెలుగు అమ్మాయిలు తప్ప ఇతర భాషల బ్యూటీలు ఎక్కువగా సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా అటు ముంబై ఇటు కేరళ భామల హవా ఎక్కువగా ఉంటుంది. అయితే తెలుగులో బాగా పాపులార్టీ తెచ్చుకున్న నాయికలు ఇప్పుడు మలయాళంకి వెళుతున్నారు. ఇద్దరు సీనియర్ హీరోయిన్లకు, ఒక యువ హీరోయిన్‌కు మాలీవుడ్ నుంచి కాల్ వెళ్లింది. మలయాళంలో ఈ ముగ్గురి తొలి చిత్రం గురించి తెలుసుకుందాం. ఇండస్ట్రీకి వచ్చి పదిహేను సంవత్సరాలు దాటినా ఇంకా అగ్రకథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నారు తమన్నా. ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన తమన్నా వీలైనప్పుడు కన్నడ తెరపైనా మెరిశారు. అయితే మలయాళ వెండితెరపై మాత్రం కనిపించలేదు. ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్ల తర్వాత తమన్నా ఫస్ట్ టైమ్ ఓ మాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దిలీప్ హీరోగా అరుణ్ గోపీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాంద్రా’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారామె. ఈ సినిమాలో తమన్నా మహారాణి పాత్రలో కనిపించనున్నారట. సో.. మాలీవుడ్‌కి రాణిలా ఎంటర్ అవుతున్నారన్న మాట. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. కాగా దిలీప్ హీరోగా నటిస్తున్న మరో సినిమాతో టాలీవుడ్ బాపు బొమ్మగా ప్రేక్షకులు చెప్పుకునే కన్నడ భామ ప్రణీత కూడా మాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాకు రతీష్ రఘునందన్ దర్శకుడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్ పాత్రల్లోనే కనిపించిన ప్రణీత ఈ సినిమాలో మాత్రం కాస్త మాస్‌గా కనిపించనున్నారట. క్యారెక్టర్ దృష్ట్యా ప్రణీత పాత్రకు కాస్త అహంకారం ఉంటుందట. సో.. ప్రణీత మాలీవుడ్ ఎంట్రీ మమమ్మాస్ అన్నమాట. ఈ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక ఓ బిడ్డకు (కుమార్తె ఆర్నా) జన్మనిచ్చిన తర్వాత ప్రణీత ఒప్పుకున్న తొలి సినిమా ఇదే. మరోవైపు టాలీవుడ్ బేబమ్మ (‘ఉప్పెన’లో కృతీ శెట్టి పేరు), యంగ్ బ్యూటీ కృతీ శెట్టికి కూడా మాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా మూవీ ‘అజయంటే రందం మోషణం’లో కృతీ శెట్టి ఓ హీరోయిన్గా నటిస్తుండగా, ఐశ్వర్యా రాజేష్, సురభి లక్ష్మీ కూడా హీరోయిన్లుగా చేస్తున్నారు. మూడు యుగాల కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. -
చిన్మయి ఆసక్తికర ట్వీట్.. సమాజం రేపిస్టులను ప్రేమిస్తుందని
Singer Chinmayi Society Loves Only Rapist Tweet Viral: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తుంటుంది కూడా. కొన్నిసార్లు పలు అంశాల్లో తనదైనా శైలిలో స్పందించి వివాదాలు కూడా ఎదుర్కొంది. సోషల్ మీడియా ద్వారా తమ బాధలను చెప్పుకునే అమ్మాయిలకు సలహాలు, సూచనలు ఇస్తూ ధైర్యం చెప్తుంటుంది. ఆమెకు పలువురు అబ్బాయిలు కూడా మద్దతు పలుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. 2017లో జరిగిన ఈ ఘటనపై అనేక మంది హీరోయిన్లు, ప్రముఖలు తమ గొంతు ఎత్తి బాధిత హీరోయిన్‌కు మద్దతుగా నిలిచారు. వారిలో మలయాళ ప్రముఖ నటి పార్వతి తిరువోత్ ఒకరు. ఘటన తర్వాత మహిళా సంఘాలతో కలిసి పార్వతి ఒక పోరాటం చేశారు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ పోరాటం వల్ల తాను ఏం కోల్పోవాల్సి వచ్చిందో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పార్వతి. తాను ఇదివరకు నటించిన సినిమాలు హిట్ అయినా తనకు సినిమా అవకాశాలు తగ్గాయని పేర్కొంది. నిజాన్ని మాట్లాడినందుకు తనను, పోరాటంలో ఉన్నవారిని ఎలా బెదిరించారో కూడా తెలిపింది. ప్రస్తుతం రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నట్లు ఆమె వెల్లడించింది. ఈ వార్త చూసిన చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. 'నిజం మాట్లాడినందుకు పార్వతి వంటి ఒక మంచి నటి పని కోల్పోయింది. అలాంటి నటి, లైంగిక వేధింపుల నుంచి తప్పించుకున్న వారి తరఫున మాట్లాడటం వల్ల మాత్రమే తన పని కోల్పోయిందని చెప్పడం నిజం. చాలా మంది మహిళలు మౌనంగా ఉన్నారు. రేపిస్టులను మాత్రమే సమాజం ప్రేమిస్తుంది.' అని చిన్మయి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2017 ఫిబ్రవరిలో 17న జరిగిన నటి కిడ్నాప్, అత్యాచార వేధింపుల కేసులో నటుడు దిలీప్ కుమార్ జైలుకు వెళ్లి బెయిల్‌పై తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అతనికి జనవరి 18 వరకు అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించింది కేరళ హైకోర్టు. Actor Parvathy Thiruvoth on paying a price for speaking up. The fact that hyper talented actors such as she lost work JUST because they stood for a survivor of sexual assault in Kerala says a LOT! So many women silenced. Rapist loving society only. 🤮https://t.co/YINgJRux0L pic.twitter.com/OZFNV4ohg1 — Chinmayi Sripaada (@Chinmayi) January 15, 2022 ఇదీ చదవండి: చిన్మయికి ఆ ఇద్దరి మద్దతు.. స్క్రీన్ షాట్స్ వైరల్ -
సీ యూ సూన్
లాక్డౌన్ వల్ల అన్ని ఇండస్ట్రీ వాళ్లు షూటింగ్స్ ఆపేస్తే మలయాళ ఇండస్ట్రీలో ఓ బృందం ఈ పరిస్థితిని చాలెంజ్‌గా తీసుకుని లాక్‌డౌన్‌లోనే ఓ సినిమా ప్రారంభించి పూర్తి చేసింది కూడా. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, రోషన్ మాథ్యూస్, దర్శనా రాజేంద్రన్ ముఖ్య పాత్రల్లో మహేశ్ సి. నారాయణ్ దర్శకత్వంలో ‘సీ యూ సూన్’ అనే చిత్రం తెరకెక్కింది. 70 నిమిషాల నిడివి ఉండే ఈ సినిమాను పూర్తిగా ఐ ఫోన్లో చిత్రీకరించారు. చిత్రీకరణ మొత్తం లాక్డౌన్ సమయంలోనే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ చేశారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా అమేజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. -
యమా స్పీడు
కెరీర్లో కూల్‌గా, కామ్‌గా దూసుకెళ్తున్నారు మలయాళ బ్యూటీ కల్యాణీ ప్రియదర్శన్. దుల్కర్ సల్మాన్‌తో ‘వాన్’, శివ కార్తీకేయన్ సరసన ఓ సినిమాలో ఆల్రెడీ హీరోయిన్ చాన్స్‌ను కొట్టేశారీ మలయాళ కుట్టి. తాజాగా శింబుకు జోడీగా నటించేందుకు ఒప్పుకున్నారట కల్యాణి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా ‘మానాడు’ అనే పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా కల్యాణి నటించనున్నారని తెలిసింది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా రాశీ ఖన్నా పేరు వినిపించింది. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లదనే పుకార్లకు ఇటీవల ఫుల్స్టాప్ పెట్టారు నిర్మాత ఎస్ఆర్. ప్రభు. ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నామని వెల్లడించారు. ఈ సినిమా సంగతి పక్కన పెడితే... శర్వానంద్ హీరోగా రూపొందిన ఓ సినిమాలో, సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’లో కథానాయికగా నటించారు కల్యాణి. అలాగే మలయాళంలో ‘మరక్కార్: ది అరేబియన్ కడలింటే సింహం’ చిత్రంలోనూ కల్యాణి ఓ కీలక పాత్ర చేశారు. ఇలా తమిళ, తెలుగు, మలయాళం ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తూ కల్యాణి యమా స్పీడ్‌తో ముందుకు వెళ్తున్నారు. -
యువ డైరెక్టర్ అనుమానాస్పద మృతి
తిరువనంతపురం : మలయాళ యువ దర్శకురాలు నయన సూర్యన్(28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం రాత్రి ఆమె తన ఫ్లాట్‌లో శవమై కనిపించారని పోలీసులు తెలిపారు. వివరాలు... కేరళలోని అలప్పాడ్కు చెందిన నయన.. సినిమా రంగంపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. లెనిన్ రాజేంద్రన్, కమల్, జీతూ జోసెఫ్, డాక్టర్ బిజు తదితర ప్రముఖ మలయాళ దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. రెండేళ్ల క్రితం ‘క్రాస్‌వర్డ్’ అనే సినిమా ద్వారా మాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లోకి రాకముందు నాటక రంగంపై దృష్టి పెట్టిన నయన.. పలు అడ్వర్టైజ్మెంట్లకు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆత్మహత్య చేసుకున్నారా? ఆదివారం తన కూతురు ఫోన్ ఎత్తకపోవడంతో నయన తల్లి.. ఆమె స్నేహితులకి ఫోన్ చేశారు. ఈ క్రమంలో వారు తిరువనంతపురంలోకి నయన ఫ్లాట్‌లోకి వెళ్లి చూడగా.. ఆమె ప్రాణాలతో లేరు. ఈ విషయం గురించి ఆమె స్నేహితురాలు ఒకరు మాట్లాడుతూ... నయన గత కొంతకాలంగా డయాబెటిస్తో బాధ పడుతున్నట్లు తెలిపారు. అలాగే దర్శకత్వంలో తనకు మెళకువలు నేర్పిన డైరెక్టర్ లెనిన్ రాజేంద్రన్ ఆకస్మిక మృతి(జనవరి 14న)ని తట్టుకోలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాగా పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే నిజానిజాలు బయటపడతాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసును లోతుగా విచారిస్తున్నామని.. త్వరలోనే ఆమె మృతికి గల కారణాలు వెల్లడిస్తామని తెలిపారు. -
మాలీవుడ్ కాలింగ్
సన్నీ లియోన్.. నేషనల్ వైడ్‌గా ఫాలోయింగ్ ఉన్న హాట్ స్టార్. బాలీవుడ్ మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ భాషల్లో స్పెషల్ సాంగ్స్‌తో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ‘వీర మహాదేవి’లో హీరోయిన్గా చేస్తున్నారు. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీ సన్నీకి స్వాగతం పలికిందట. ‘ఒరు అడార్ లవ్’ రూపొందించిన ఒమర్ లులూ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట. ప్రియా ప్రకాశ్ వారియర్ కొంటెగా కన్ను కొట్టి నేషనల్ పాపులారిటీ వచ్చేసింది ‘ఒరు అడార్ లవ్’ సినిమాకే. రంజాన్ పండుగకే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. అనుకోని కారణాల వల్ల లేట్ అవుతూ వస్తోంది. ఒమర్ తెరకెక్కించే తదుపరి చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్నారట సన్నీ. జయరామ్, హనీ రోస్ ముఖ్య తారలు. -
అమ్మ వద్దంటున్న అమ్మాయిలు
అస్తిత్వం, స్థిరత్వం.. నాణేనికి రెండు వైపులు. స్థిరత్వాన్ని కోరుకుంటే.. అస్తిత్వం పోవచ్చు! అయినా సరే మహిళ ఇవాళ.. స్థిరత్వం కన్నా అస్తిత్వాన్నే కోరుకుంటోంది. స్నేహంలో.. ఉద్యోగంలో.. వివాహంలో.. అనుబంధాల్లో.. తనకు కావలసింది.. తనకు ఇవ్వవలసిందీ తనకు దక్కాల్సిందీ.. గౌరవంతో కూడిన అస్తిత్వం. ఆమె అస్తిత్వమే సమాజానికి స్థిరత్వం. అమ్మ.. (మలయాళీ ఆర్టిస్టుల అసోసియేషన్) వారి అస్తిత్వాన్ని తేలిక చేసింది. అందుకే.. ‘ఈ అమ్మ మాకు వద్దు’ అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీకీ ‘మా’ ఉన్నట్లే, మలయాళ పరిశ్రమకు ‘అమ్మ’ ఉంది. లేటెస్ట్ న్యూస్.. ఇప్పుడా అమ్మ ఒడి నుంచి ఒక్కో హీరోయిన్ వెళ్లిపోతోంది! రీమా కళింగళ్, రెమ్యా నంబీసన్, గీతూ మోహన్‌దాస్ వెళ్లిపోయారు. ఇంకా కొంతమంది.. ‘అమ్మా.. నీకిది న్యాయమేనా?’ అని ప్రశ్నించి, వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ‘ముఖ్య బాధితురాలు’.. వీళ్లందరికంటే ముందే వెళ్లిపోయారు! ఎందుకు వెళ్లిపోతున్నారు? ఎందుకు వెళ్లిపోతామంటున్నారు? అమ్మ ఒడే కదా! ధైర్యంగా ఉంటుంది కదా. భరోసా ఇస్తుంది కదా! నిజమే. అయితే ఆ తల్లి ఒడిలోకి ‘దారితప్పిన పిల్లవాడు’ ఒకడు మళ్లీ వచ్చి చేరాడు. ఆ పిల్లవాడి పేరు దిలీప్. ఆ పిల్లవాణ్ణి మళ్లీ అమ్మ ఒడిలోకి రానిచ్చిన పెద్ద మనిషి మోహన్‌లాల్. ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’కు (అమ్మ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే మోహన్‌లాల్ చేసిన మొదటి పని దిలీప్‌కి మళ్లీ సభ్యత్వం ఇవ్వడం! మూడు కేసుల్లో నిందితుడు దిలీప్ ఇంచుమించు స్టార్ హీరో అవొచ్చు. కేసు నడుస్తుండగా విడుదలైన అతడి సినిమా ‘రామలీల’ (2017) సూపర్‌హిట్ అయి ఉండొచ్చు. దిలీప్ అరెస్ట్ అయినందువల్ల మలయాళం ఇండస్ట్రీకి 60 కోట్ల నష్టం వచ్చి ఉండొచ్చు. కానీ అతడు కళంకితుడు. బెయిల్ మీద తిరుగుతున్న నిందితుడు. అతడి మీద కుట్ర కేసు ఉంది. కిడ్నాపింగ్ కేసు ఉంది. రేప్ చేయబోయాడన్న కేసు ఉంది. అతడి కుట్ర, కిడ్నాపింగ్, రేప్ అటెంప్ట్ అన్నీ జరిగింది ఎవరి మీదో కాదు. అమ్మ ఒడిలోనే ఉన్న సహ నటి మీద! ఆ నటికో పేరుంది. పేరున్న నటి కూడా. మనం పైన చెప్పుకున్న ‘ముఖ్య బాధితురాలు’ ఆమే! సొంత నిర్ణయంపై నిరసన దిలీప్ని ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ బయటికి పంపించగానే, ఎగ్జిబిటర్లు పంపించేశారు. ప్రొడ్యూసర్లు పంపించేశారు. ఫిల్మ్ ఎంప్లాయీస్ కూడా పంపించేశారు. జైల్లో తప్ప ఎక్కడా దిలీప్‌కి చోటు దొరకలేదు. జూలైలో అరెస్ట్ అయి, అక్టోబర్‌లో బయటికి వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ ‘అమ్మ’ ఒడిలోకి వచ్చేశాడు. రావడం కాదు. ‘అమ్మ’ నూతన అధ్యక్షుల వారైన సూపర్‌స్టార్ మోహన్‌లాల్.. దిలీప్‌కి రీ ఎంట్రీ ఇప్పించాడు. ఎవర్నీ అడగలేదు. ‘ముఖ్య బాధితురాలి’ని అసలే అడగలేదు. మోహన్‌లాల్ సొంత నిర్ణయం! ఇక దిలీప్ ఇప్పుడు మీటింగుల్లో కూర్చుంటాడు. విజయగర్వంతో ముఖ్య బాధితురాలిని, ఆమెకు సపోర్ట్ చేసిన హీరోయిన్లను కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తుంటాడు. ఎలా భరించడం? ఎలా సహించడం? అందుకే ఒక్కొక్కరుగా అమ్మాయిలు ‘అమ్మ’ను కాదనుకుని మెట్లు దిగేస్తున్నారు. మోహన్లాల్కి చీమ కుట్టినట్లయినా ఉందా?! తెలుస్తుంది.. నేడో, రేపో మరికొందరు వెళ్లిపోతే. ‘మీటూ’ (నేను కూడా వెళ్లిపోతున్నాను) అని అసోసియేషన్ కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతే.. మోహన్‌లాల్ ఎ1, దిలీప్ ఎ2 అవకుండా ఉంటారా? మరికొన్ని రాజీనామాలు కోళ్ల గంపలోకి పిల్లిని తెచ్చి పెట్టేశాడు మోహన్‌లాల్. అయితే ఆ గంప నుంచి భయపడి బయటికి రాలేదు రీమా, రెమ్య, గీతూ! నిరసనగా వచ్చారు. అతడిని బయటికి పంపించే వరకు లోపలికి అడుగు పెట్టేది లేదని చెప్పి మరీ వచ్చారు. ‘ఇంకా ఇక్కడ ఉండటం అర్థం లేని పని’ అన్నారు ముఖ్య బాధితురాలు. ‘ఎవరికి చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని అడిగారు రెమ్యా నంబీసన్. ‘ఇప్పటికే ఆలస్యం చేశాను.. బయటికి వచ్చేయకుండా..’ అన్నారు గీతూ మోహన్‌దాస్. ‘ఇది ఒక వ్యక్తికో, ఒక అసోసియేషన్కో పరిమితమైనది కాదు. ముందు జనరేషన్వాళ్ల డిగ్నిటీ కోసం మనం బయటికి వచ్చేయాలి’.. అని రీమా పిలుపు ఇచ్చారు. వీళ్లు ముగ్గురూ డబ్లు్య.సి.సి.లో కూడా సభ్యులు. ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’! అందులో సభ్యులుగా ఉన్న పార్వతి, మంజు వారియన్, పద్మప్రియ కూడా బయటికి వచ్చేందుకు పేపర్స్ రెడీ చేసుకుంటున్నారు. ఒకవేళ రాలేదంటే.. లోపలే ఉండి దిలీప్ని బయటికి పంపించాలని వాళ్లు అనుకుంటున్నట్లు! ఆత్మగౌరవమే ముఖ్యం లోపల్నుంచైనా, బయటి నుంచైనా పోరాటం పోరాటమే. మలయాళీ హీరోయిన్లలో అందాన్ని మించిన ఆత్మగౌరవం ఉంది ఆడవాళ్లను కించపరిచే డైలాగ్‌లు ఉన్నందుకు స్క్రీన్‌ని చింపి పోగులు పెట్టిన హిస్టరీ ఉంది. దిలీప్నే తీసుకోండి. 2017 ఫిబ్రవరిలో దిలీప్.. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో నటిస్తున్న ఓ బ్యూటిఫుల్ స్టార్లెట్ని (ముఖ్య బాధితురాలు) కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించడానికి కుట్ర కేసులో అరెస్ట్ అయ్యాడు. కొంతకాలం జైల్లో ఉండి, బెయిల్‌పై బయటికి వచ్చాడు. హీరోకి విలన్ బుద్ధేమిటి అని అభిమానులు తలవంపుగా ఫీల్ అయ్యారు. మనకీ ఖర్మ ఏమిటి అని ‘రామ్‌లీల’ నిర్మాతలు తలలు పట్టుకున్నారు. అందులో దిలీప్‌ది లీడ్ రోల్. పొలిటికల్ కాన్స్పిరసీ థ్రిల్లర్. సరిగ్గా రిలీజ్‌కి రెడీగా ఉన్నప్పుడు దిలీప్ అరెస్ట్ అయ్యాడు. దిలీప్ మీద కోపం సినిమా పైకి మళ్లింది. మహిళా సంఘాలు, రాజకీయ పక్షాలు సినిమా రిలీజ్‌ను అడ్డుకున్నాయి. దిలీప్ని వేరుగా, సినిమాను వేరుగా చూడండి అని ఇండస్ట్రీ ప్రాధేయపడింది. అందరూ క్షమించేశారు. బాధితురాలు, తక్కిన హీరోయిన్లు తప్ప. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే వాళ్లుంటారు. ఉన్న ఇంటి ఆడవాళ్లనే చెరబట్టే వాళ్లు కూడా ఉంటారా?! దిలీప్ మాట వచ్చినప్పుడల్లా వాళ్లు అనుకునే మాట ఇది. వాట్సాప్ గ్రూప్‌లోంచి గూడెం పెద్ద ఎవరైనా ఒక సభ్యుడిని తీసేస్తే.. ‘రిమూవ్డ్’ అని వస్తుంది. కారణం కూడా అక్కడే తెలిసిపోతుంది. చాటింగ్‌లో జరిగిన దానికి పర్యవసానం అయి ఉంటుందది. అదే.. ‘లెఫ్ట్’ అని వస్తే.. వెంటనే తెలిసే అవకాశం లేదు. కానీ ఆ లెఫ్ట్ అయినవాళ్లు బాగా హర్ట్ అయ్యారని తెలిసిపోతుంది. ‘అమ్మ’ నుంచి ఇప్పుడు లెఫ్ట్ అవుతున్న మలయాళీ నటీమణులు కేవలం హర్ట్ మాత్రమే కాలేదు. కోపోద్రిక్తులు అయ్యారు. ఈ ఆగ్రహ జ్వాలలు చివరికి గ్రూపునే దహించి వేసినా ఆశ్చర్యం లేదు. ఈ లోపే గూడెం పెద్ద మోహనల్‌లాల్ నష్ట నివారణ చర్యలేమైనా తీసుకోవాలి. రేష్మ.. పార్వతి రెడీ..! మలయాళం మూవీ ‘అంగమలి డైరీస్’తో అన్నా రేష్మా రాజన్ గత యేడాదే కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చింది. చాలామందికి నచ్చింది. మీడియావాళ్లక్కూడా. ఓ ఇంటర్వ్యూలో రేష్మా ఉన్నది ఉన్నట్లు మాట్లాడింది. అది మమ్ముట్టి, ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్‌లకు కోపం తెప్పించింది. ‘‘మమ్ముట్టి, దుల్కర్ ఇద్దరూ ఒకే సినిమాలో యాక్ట్ చేస్తుంటే.. మీరు ఎవరి పక్కన నటించడానికి ఇష్టపడతారు?’’ అన్నది క్వశ్చన్. వెంటనే రేష్మ.. దుల్కర్ పేరు చెప్పింది. ‘ఎందుకు?’ అనంటే, ‘మమ్ముట్టి తండ్రి పాత్రకు బాగుంటారు’ అంది. అంతే.. ఆమె మీద ట్రాల్స్ మొదలయ్యాయి. ‘మోహన్‌లాల్ కావాలి కానీ, మమ్ముట్టీ వద్దా నీకు..’ అని వల్గర్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. (‘అంగమలి డైరీస్’ తర్వాత ‘వెలిపడింటే పుస్తకం’ అనే సినిమాలో మోహన్‌లాల్ పక్కన యాక్ట్ చేసింది రేష్మ). ఆ సమయంలో రేష్మకు హీరోయిన్లు అంతా తోడుగా ఉన్నారు. ఇప్పుడు రేష్మ మద్దతు ఇవ్వబోతోంది. ‘అమ్మ’నుంచి బయటికి రాబోతోంది. పార్వతి ఇంకో నటి. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. గత ఏడాది కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్యానెల్ మెంబర్‌గా ఆమె మమ్ముట్టి ‘కసాబా’ చిత్రాన్ని విమర్శించింది. అందులో మమ్ముట్టీ పోలీస్ ఆఫీసర్. ఓ సీన్లో అతడు ఉమెన్ పోలీస్ ఆఫీసర్‌ను కించపరిచే డైలాగులు చెప్తాడు. పార్వతికి అది నచ్చలేదు. ‘ఎవరు చేస్తేనేం.. బ్యాడ్ క్యారెక్టర్’ అంది. ఫ్యాన్స్ పార్వతిని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. అప్పుడు ఆమెకు తక్కిన హీరోయిన్లంతా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ‘అమ్మ’నుంచి బయటికి వచ్చి తను సపోర్ట్ ఇవ్వబోతోంది పార్వతి. -
బంపర్ ఆఫర్!
ఈ మధ్యకాలంలో వెండితెరకు పరిచయమైన తారల్లో కీర్తి సురేశ్ మంచి మార్కులు సంపాదించుకోగలిగారు. ‘రైజింగ్ స్టార్’గా తమిళ, మలయాళ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి ‘నేను శైలజ’ ద్వారా తెలుగు తెరకు పరిచయమై, ఇక్కడివారిని కూడా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కీర్తిని ఓ బంపర్ ఆఫర్ వరించింది. తంతే బూరెల బుట్టలో పడ్డట్లు ఏకంగా తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించే అవకాశం దక్కించేసుకున్నారు. ‘‘విజయ్ సార్ సరసన సినిమా చేసే చాన్స్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ ఎప్పుడెప్పుడు ఆరంభం అవుతుందా?’’ అని ఎదరు చూస్తున్నా అని కీర్తీ సురేశ్ పేర్కొన్నారు.