మాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైన అనుష్క శెట్టి.. ఆకట్టుకుంటోన్న గ్లింప్స్! | Anushka Shetty Kathanar - The Wild Sorcerer Glimpse video release | Sakshi
Sakshi News home page

మాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైన అనుష్క శెట్టి.. ఆకట్టుకుంటోన్న గ్లింప్స్!

Published Sun, Sep 3 2023 4:40 AM | Last Updated on Sun, Sep 3 2023 4:29 PM

Anushka Shetty Kathanar - The Wild Sorcerer Glimpse video release - Sakshi

మలయాళ పరిశ్రమలో తొలి అడుగు వేశారు హీరోయిన్‌ అనుష్కా శెట్టి. దాదాపు ఇరవయ్యేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అనుష్క గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తొలి మలయాళ సినిమా ‘కథనార్‌: ది వైల్డ్‌ సోర్సెరర్‌’. ఫ్యాంటసీ హారర్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో జయసూర్య హీరోగా నటిస్తుండగా, రోజిన్‌ థామస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో జయసూర్య (సెప్టెంబర్‌ 2) బర్త్‌ డే సందర్భంగా ‘కథనార్‌’ సినిమా గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు.

వీడియోలో అనుష్క కనిపించకపోయినా, ఆమె పేరును కన్ఫార్మ్‌ చేశారు మేకర్స్‌. వాస్తవ ఘటనల ఆధారంగా కేరళలోని కడమట్టు ప్రాంతంలో గల  ఓ చర్చి ఫాదర్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని టాక్‌. ఈ చిత్రం పద్నాలుగు భాషల్లో విడుదల కానుందట.  రెండు భాగాలుగా రిలీజ్‌ కానున్న ఈ సినిమా తొలి భాగం 2024లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే... ‘కథనార్‌’ గ్లింప్స్‌ వీడియోను బట్టి ఈ చిత్రంలో ‘అరుంధతి’ తరహా పాత్రను అనుష్క చేస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement