Jayasuriya
-
భారత్‌తో టీ20 సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య
శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ (SLC) సోమవారం ప్రకటించింది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024లో శ్రీలంక దారుణ ఆటతీరుతో గ్రూపు స్టేజిలోనే నిష్కమ్రించింది. దీంతో అప్పటివరకు లంక హెడ్‌కోచ్‌గా పని చేసిన క్రిస్ సిల్వర్‌వుడ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో కొత్త హెడ్‌కోచ్‌ను భర్తీ చేసే పనిలో శ్రీలంక క్రికెట్ బోర్డు పడింది. అయితే కొత్త కోచ్ వచ్చే అంతవరకు లంక తాత్కాలిక హెడ్‌కోచ్‌గా జయసూర్య పనిచేయనున్నాడు. కాగా జయసూర్య ఇటీవల ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో శ్రీలంక కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. డిసెంబర్ 2023 నుండి శ్రీలంక క్రికెట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నా డు. ఇప్పుడు ప్రమోషన్ పొంది హెడ్‌కోచ్‌గా సేవలు అందించున్నాడు ఈ లెజండరీ క్రికెటర్. స్వదేశంలో ఈ నెల 27 నంచి భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో లంక తాత్కాలిక హెడ్‌కోచ్‌గా సనత్ జయసూర్య ప్రయాణం మొదలు కానుంది. లంక పర్యటనలో భాగంగా భారత్ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లలో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. కాగా ఈ పర్యటనతోనే భారత జట్టుకు కూడా కొత్త హెడ్‌కోచ్ వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: #Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా -
మాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అనుష్క శెట్టి.. ఆకట్టుకుంటోన్న గ్లింప్స్!
మలయాళ పరిశ్రమలో తొలి అడుగు వేశారు హీరోయిన్ అనుష్కా శెట్టి. దాదాపు ఇరవయ్యేళ్ల సుదీర్ఘ కెరీర్లో అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తొలి మలయాళ సినిమా ‘కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’. ఫ్యాంటసీ హారర్ జానర్లో రూపొందుతున్న ఈ సినిమాలో జయసూర్య హీరోగా నటిస్తుండగా, రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో జయసూర్య (సెప్టెంబర్ 2) బర్త్ డే సందర్భంగా ‘కథనార్’ సినిమా గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. వీడియోలో అనుష్క కనిపించకపోయినా, ఆమె పేరును కన్ఫార్మ్ చేశారు మేకర్స్. వాస్తవ ఘటనల ఆధారంగా కేరళలోని కడమట్టు ప్రాంతంలో గల ఓ చర్చి ఫాదర్ జీవితం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని టాక్. ఈ చిత్రం పద్నాలుగు భాషల్లో విడుదల కానుందట. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా తొలి భాగం 2024లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే... ‘కథనార్’ గ్లింప్స్ వీడియోను బట్టి ఈ చిత్రంలో ‘అరుంధతి’ తరహా పాత్రను అనుష్క చేస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
భారత్ మాకు పెద్దన్న: సనత్ జయసూర్య
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం కొనసాగుతోంది. నిత్యవసర ధరలు చుక్కలనంటుతున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా వందల్లో, వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై లంకేయులు ఆందోళనలకు దిగారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ప్రస్తుతం లంకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ తన వంతు సాయం అందిస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో బియ్యం, డిజిల్, మందులను శ్రీలంకకు భారత్ సరఫరా చేసింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తమ దేశానికి చేస్తున్న ఈ సాయంపై శ్రీలంక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కష్టకాలంలో తమకు సాయం చేసిందుకు భారత్‌కు, ప్రధాని మోదీకి శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జయసూర్య మాట్లాడుతూ.. భారత్ ఎల్లప్పుడూ తమ దేశానికి సహాయం చేస్తూనే ఉందని ప్రశంసించారు. మా పెద్దన్న ఇండియానే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో పాటు ఇతర దేశాల సాయంతోనే సమస్యల నుంచి శ్రీలంక బయటపడుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా స్పందించకుంటే రానున్న రోజుల్లో పెను విపత్తును ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీలంకలో బతకడం అంత ఈజీ కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు. విద్యుత్ సరఫరా లేకపోవడం, ఆహార కొరత, పెట్రోల్, డీజిల్ కొరత వల్ల లంకేయులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని అన్నారు. ఇది చదవండి: ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా టీసీఎస్ ఉద్యోగి.. ఆ తర్వాత ఏమైందంటే..? -
ఓ డ్రైవర్ ప్రేమకథ
మంజునాథ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మా ఊరి ప్రేమకథ’. తనిష్క్ తివారి కథానాయిక. శ్రీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్‌పై లక్మిదేవి, మహేంద్రనాథ్ నిర్మించా రు. లక్ష్మిదేవి, మహేంద్రనాథ్ మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా గ్రామీణ నేపథ్యంలో నిర్మించిన చిత్రమిది. కథ, కథనాలు ఆకట్టుకుంటాయి. సెంటిమెంట్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్.. ఇలా అన్నీ ఉన్నాయి. ఆగస్టులో సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నీళ్ల ట్యాంకర్ డ్రైవర్‌గా నటించాను. నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన ఒక అమ్మాయిని ప్రేమిస్తాను. డ్రైవర్ ప్రేమని ఆ అమ్మాయి ఒప్పుకుందా? లేదా? అనేది కథ. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. జయసూర్య మంచి మ్యూజిక్ ఇచ్చాడు’’ అన్నారు మంజునాథ్. -
మహింద రాజపక్సేకు భారీ షాక్
కొలంబో: శ్రీలంకలో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మహింద రాజపక్సేకు బుధవారం గట్టి షాక్ తగిలింది. నేడు అత్యవసరంగా సమావేశమైన ఆ దేశ పార్లమెంట్ రాజపక్సేకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న అనుహ్య నిర్ణయాలతో శ్రీలంక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో దేశ ప్రధానిగా విక్రమసింఘేను తొలగించి.. ఆ స్థానంలో రాజపక్సేను నియమిస్తూ సిరిసేన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన విక్రమసింఘే తను ప్రధాని బంగ్లాను ఖాళీ చేసేందుకు నిరాకరించారు. పార్లమెంట్ స్పీకర్ జయసూరియ కూడా సిరిసేన నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని.. ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. కానీ సిరిసేన మరో అడుగు ముందుకేసి దేశ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరిలో దేశంలో మధ్యంతర ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా, సిరిసేన నిర్ణయాలపై పలువురు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం పార్లమెంట్ రద్దు చేస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయం చెల్లదని మంగళవారం పేర్కొంది. ఎన్నికల ఏర్పాట్లకు చేస్తున్న ఏర్పాట్లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. పార్లమెంట్ రద్దు చెల్లదని కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో స్పీకర్ బుధవారం అత్యవసరంగా పార్లమెంట్‌ను సమావేశపరిచారు. ఈ సందర్భంగా రాజపక్సపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని మెజారిటీ సభ్యులు మద్దతు తెలిపినట్టు స్పీకర్ ప్రకటించారు. -
మహిళతో క్రికెటర్ ప్రైవేట్ వీడియో లీక్!
శ్రీలంక మాజీ కెప్టెన్, క్రికెటర్ సనత్ జయసూర్యకు చెందిన ఓ ప్రైవేట్ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. మాజీ ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న ఈ వీడియో శ్రీలంకలో సంచలనంగా మారింది. క్రికెటర్‌గా ఉన్న సమయంలో జయసూర్యకు ఆమెతో పరిచయం ఏర్పడింది. కొద్దికాలం తర్వాత అది ప్రేమగా మారింది. ఇద్దరూ మానసికంగా, భౌతికంగానూ దగ్గరయ్యారు. అయితే, కొన్ని విభేదాలతో ఒకరికొకరు దూరమయ్యారు. జయసూర్య నుంచి విడిపోయిన ఆమె ఓ బడా వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. ఆమె ఇప్పుడు శ్రీలంకలో మీడియా సంస్ధకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతీకారంతోనే జయసూర్య స్వయంగా ఆ వీడియోని లీక్ చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఆమె ఏమందంటే ‘ఇది ప్రతీకారమే! ఆ వీడియో అతనే రికార్డు చేశాడు. మేం గతంలో ప్రేమికులుగా ఉన్నప్పుడు తీశాడు.' అని ఆ మహిళ చెప్పిన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వీడియోను ఎవరు లీక్ చేశారనే విషయాన్ని కనిపెట్టేందుకు శ్రీలంక జాతీయ సైబర్ సెక్యూరిటీ కేంద్రం ప్రయత్నిస్తోంది. -
మరింత సంక్షోభంలో ప్రపంచ పర్యావరణం
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సెల్ఫోన్ల సవ్వడితో పిచ్చుకలు అంతరించి పోతున్నాయి. గద్దల సంఖ్య రాబందుల సంఖ్య కంటే త్వరి తంగా క్షీణిస్తోంది. పర్యావరణ విధ్వంసం కారణంగా పక్షు లూ, కీటకాలూ, వృక్షాలూ, జంతువులూ, సహచర జీవ వైవి ధ్యం పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న భూ తాపం భూగోళాన్ని నిప్పుల కొలిమిగా మార్చివేస్తోంది. మానవ మనుగడకే ముప్పు వాటిల్లే విపత్కర పరిణామాలు పర్యావరణంలో నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో 21వ శతాబ్దం నడుస్తోంది.దైనందిన వ్యవహారాలలో కూడా ప్రతిక్షణం పర్యావరణాన్ని దృష్టిలో పెట్టు కొనవలసిన పరిస్థితులు ఇప్పుడు నెల కొని ఉన్నాయి. పర్యావరణ కార్యాచరణ పిలుపును అనుసరించి ప్రతి ఏటా ఐక్యరాజ్యసమితి జూన్ 5 తేదీని మేలుకొలుపు దినంగా మాత్రం గుర్తు చేసుకొం టోంది. కానీ ఈ ఏటి నినాదం ప్రత్యేకమైనది. పెరిగిన సము ద్ర నీటిమట్టాలు చిన్న ద్వీపాల మీద, ఇతర ప్రాంతాల మీద విరుచుకు పడి సృష్టించే జల ప్రళయ నివారణను ఈ సంవ త్సర నినాదంగా ఐక్యరాజ్యసమితి స్వీకరించింది. 1972 నాటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సు మొదలు, నాలుగు దశాబ్దాలుగా భూగోళాన్ని రక్షించుకోవలసిన అవసరం గు రించి ఐరాస ప్రపంచ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. కర్బన కాలుష్య ఉద్గారాలను ప్రణాళికాబద్ధంగా క్షీణింప జేసే, ‘గ్రీన్ ఎకానమీ’ లక్ష్యానికి అన్ని దేశాలు కట్టుబడి భూమిని రక్షించుకోవాలని యు.ఎన్.ఇ.పి. హెచ్చరిస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య ఉద్గారాలను విడుదల చేయాలంటూ 194 దేశాలు చేసుకున్న క్యొటో ప్రొ టోకాల్ ఒప్పందాన్ని అమెరికా వంటి సంపన్న దేశం కూడా ఆమోదించినా, అక్కడి ‘సెనేట్’ సమ్మతించలేదు. 2011 డి సెంబర్‌లో యు.ఎన్. క్లైమేట్ అంతర్జాతీయ సదస్సు క్యొటో ఒప్పందం పొడిగింపుతో ఆశలను చివురింప చేసింది. ‘నేచర్ క్లైమేట్ ఛేంజ్’ చేసిన ఇటీవలి అధ్యయనం ప్రకారం 12 దేశాలకు సంబంధించిన 1.3 బిలియన్ జనావళి తాగు, సాగు నీటి అవసరాలకు ఆధారపడిన ఇండస్, గంగ, బ్రహ్మ పుత్ర, సల్వీన్, మెకాంగ్ నదీ ప్రవాహాలూ, హిమాలయ సానువులలోని గ్లేసియర్స్ అతివృష్టి, వరద ఉద్ధృతి కార ణంగా పెను జల ప్రళయాలను సృష్టించనున్నాయి. 2050 నాటికి, సమీప భవిష్యత్తులోనే ఈ పెను బీభత్సం ఆయా ప్రాంత జనావళి ఎదర్కోవలసి ఉంటుందని శాస్త్రవేత్తల అధ్యయన పత్రాలు హెచ్చరిస్తున్నాయి. కార్బన్ కాలుష్య ఉద్గారాల విడుదల మిలియన్‌కు 400 పార్ట్స్ వంతున పెరగటం వలన ఈ సంవత్సరం ప్రపంచం న్యూ డేంజర్ జోన్లోకి అడుగు పెట్టిందని యునెటైడ్ నేషన్స్ క్లైమేట్ సంస్థ అధిపతి క్రిస్టియానా ఫిగ్లెస్ హెచ్చరిం చారు. పారిశ్రామిక విప్లవ ఆరంభానికి ముందుకార్బన్ డై ఆక్సైడ్ 280 పిపిఎమ్లు ఉండేది. గత అరవై సంవత్సరా లలో చమురు, బొగ్గు, గ్యాస్ వంటి ప్రకృతి వనరులను విచ్చ లవిడిగా మండించిన కారణంగా ఇప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ ప్రపంచ మానవాళి మనుగడకు ప్రమాద హెచ్చరికలను జారీ చేయగల స్థాయికి చేరుకుంది. కార్బన్ ఉద్గారాలు ఈ విధంగా పెరిగినట్లయితే ఈ శతాబ్దం అంతానికే భూతాపం తో ప్రపంచం అట్టుడికిపోవలసి ఉంటుందని ఇంటర్ గవర్న మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ హెచ్చరించింది. మన మహోన్నత హిమవత్పర్వత ప్రాంతాలలో గత 40 సంవత్సరాలలో కరిగిన 13 శాతం గ్లేసియర్స్(హిమ నదా లు) ఇప్పటికే పెను ప్రళయాలు సృష్టిస్తున్నాయి. ‘కరెంట్ సైన్స్’ ఇటీవల ఇచ్చిన నివేదిక దీనిని నిర్ధారిస్తున్నది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ 2007లో ఇచ్చిన వివరణ ప్రకారం 2035 నాటికి హిమాలయాలు ఎదుర్కొనే పెను ప్రమాదాన్ని ఊహాజనితమని కొందరు కొట్టిపారే సినా, ఆ వివరణ పరిగణనలోనికి తీసుకోవలసినదేనని చార్ధామ్, కేదార్నాధ్లలో 2013 జూన్‌లో సంభవించిన జల ప్రళయం గుర్తు చేసిన మాట వాస్తవం. సెల్ఫోన్ల నిరంతర సవ్వడితో పిచ్చుకలు అంతరించి పోతున్నాయి. గద్దల సంఖ్య రాబందుల సంఖ్య కంటే త్వరి తంగా క్షీణిస్తోంది. పర్యావరణ విధ్వంసం కారణంగా పక్షు లూ, కీటకాలూ, వృక్షాలూ, జంతువులూ, సహచర జీవ వైవి ధ్యం పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. మనిషి అవస రాలను తృప్తి పరిచే తీరులో వినియోగపడవలసిన ప్రకృతి వనరులను నాగరిక ప్రపంచం దురాశతో కొల్లగొడుతున్నది. జీవవైవిధ్యంతో సుజలాం, సుఫలాం, మలయజ శీతలంగా విలసిల్లవలసిన భారతావని ప్రకృతి వైపరీత్యాలతో విలవిల లాడుతోంది. భవిష్యత్తు తరాల వారికి వారసత్వంగా, రుణం తీర్చుకొనే విధంగా అందించవలసిన ప్రకృతి సంప దను నవ నాగరిక జీవన వ్యామోహంతో యథేచ్ఛగా కొల్లగొ ట్టడమంటే మన గొయ్యిను మనం తవ్వుకోవడమే. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) జయసూర్య -
అభ్యర్థుల పరువుకు పరీక్ష నోటా
త్వరలో జరిగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో నోటా బటన్ వినియోగం నిస్సందేహంగా అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేయగలదని చెప్పవచ్చు. నోటా వినియోగంపై సామాన్య ప్రజానీకానికి అవగాహన కల్పించవలసిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఏ అభ్యర్థీ నచ్చనపుడు ‘నన్ ఫర్ ది ఎబౌ’(నోటా) సౌలభ్యాన్ని వినియోగించుకునే అవకాశాన్ని పొందడం భారతీయ ఓటర్ల హక్కులలో ఒక మలుపు. తాజాగా ఈ హక్కుకు మన రాష్ర్ట హైకోర్టు ఇంకొంచెం తీక్షణతను పెంచింది. నోటాకు కూడా ఒక గుర్తును కేటాయించవలసిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడి, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. వీలైతే ఈ ఎన్నికలలో లేదా వచ్చే ఎన్నికలకైనా ఇలాంటి గుర్తును కేటాయించవలసిందని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల సారాంశం. మన ప్రజాస్వామ్యం ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు. కానీ రాను రాను రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టడం తీవ్రం కావడంతో సంస్కరణలు అవసరమవుతున్నాయి. కొన్ని పార్టీలు సృష్టిస్తున్న ఈ కాలుష్యం వల్లనే విద్యావంతులు, మేధావులు ఎన్నికలకు దూరమయ్యారు. నగరాలలో ఇటీవలి వరకు జరిగిన ఎన్నికలలో పోలింగ్ శాతాన్ని గమనిస్తే ఈ అంశం అర్థమవుతుంది. ఈ వైముఖ్యం ప్రమాదకరం. అదీకాక బ్యాలెట్-బులెట్ ఆలోచన ప్రభావంతో హింస, అశాంతి నేటికీ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులలో ప్రజాస్వామిక వ్యవస్థకు ప్రాణప్రదమైన ఓటింగ్‌ను తిరస్కరించడం కంటె, అభ్యర్థికి అర్హత లేదని ఓటరు భావించినట్లయితే, ఓటింగ్‌లో పాల్గొని అసమ్మతి వ్యక్తం చేయటానికి ‘నోటా’ బటన్(నన్ ఆఫ్ ది ఎబౌ) ప్రవేశించింది. గడచిన సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు ఆదేశానుసారం ఈ అవకాశం లభించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం బ్యాలెట్ యూనిట్లో 16 మంది పేర్లకే అవకాశం ఉన్నప్పటికీ ఆఖరున నోటా బటన్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ అవకాశం 16వ లోక్‌సభ ఎన్నికల నుంచి పూర్తి స్థాయిలో ఆరంభమవుతోంది. ఇంతకుముందు ఏ పార్టీకీ, ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేని వారు ఎన్నికల అధికారి ముందు బాహాటంగా దరఖాస్తు ఇవ్వవలసి రావడంతో, రహస్య ఓటు హక్కు నీరుగారేది. నోటాతో అది తప్పుతుంది. ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’(పీయూసీఎల్), సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై, ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివమ్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ, ఓటర్లకు తమ మీద ఉన్న అభిప్రాయం ఎలా ఉన్నదో పార్టీలకూ, అభ్యర్థులకూ ప్రతికూల ఓటింగ్ వల్ల తెలిసే అవకాశం కలుగుతుందని వ్యాఖ్యానించింది. ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, బంగ్లాదేశ్, యునెటైడ్ స్టేట్స్, ఫిన్లాండ్, స్వీడన్, కొలంబియా, స్పెయిన్ వంటి దేశాలలో తటస్థంగా ఉండే, అభ్యంతరం తెలిపే, వ్యతిరేకత వ్యక్తం చేసే ప్రక్రియ ఉంది. కానీ, భారత ఎన్నికల కమిషన్ ఈ విషయం గురించిన ప్రచారానికి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. 2013లో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలలోనే ఓటర్లకు నోటా వినియోగించే అవకాశం తొలిసారి లభించింది. నక్సల్ ప్రభావిత బస్తర్, సర్గూజా, రాయపూర్, కనార్థా, ఖైరఘర్, ఖల్లారి, డోంగార్గన్ నియోజకవర్గాలలో గెలిచిన, ఓడిన అభ్యర్థుల మధ్య పోలయిన ఓట్ల తేడా కంటె, అధికంగా నోటాకు ఓట్లు పడ్డాయి. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే 46వేల మంది ఓటర్లు నోటాను వినియోగించారు. మధ్యప్రదేశ్‌లో పాన్మిమల్ ఎస్టీ నియోజకవర్గంలో 9,228, మెహగాన్లో 136, ఛత్తీస్‌గఢ్, బస్తర్‌లోని చిత్రకోట్‌లో భారీగా 10,848 నోటా ఓట్లు నమోదైనాయి. దేశ రాజధానిలో ఆప్ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అభ్యర్థి షీలా దీక్షిత్‌లు పోటీ పడిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో కూడా 460 మంది నోటా నొక్కారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికలలో ఓటింగ్ యంత్రాలలో నోటా బటన్ సౌకర్యం లేకపోవడంతో తిరస్కృతి తెలిపే అవకాశం ఓటర్లకు లభించలేదు. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో నోటా బటన్ వినియోగం నిస్సందేహంగా అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేయగలదని చెప్పవచ్చు. నోటా వినియోగం పట్ల సామాన్య ప్రజానీకానికి కూడా అవగాహన కల్పించవలసిందిగా సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో పోలింగ్‌ను తిరస్కరించడానికి బదులు, పోటీ చేసే అభ్యర్థులను తిరస్కరించే సౌలభ్యం కల్పిస్తున్న నోటా ఏర్పాటు గొప్ప ముందడుగు. సామాన్య ప్రజలలో, విద్యావంతులలో కొంతమేరకైనా నిరాశా నిస్పృహలను, అనాసక్తిని పోగొట్టే ఆయుధంగా నోటాను భావించవచ్చు. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) -
గ్రేట్‌బ్యాచ్ ఆపిల్...
జయసూర్యలు, ఆఫ్రిదిలు, సెహ్వాగ్‌లు రాక ముందే పవర్ ప్లేలో మెరుపు బ్యాటింగ్ ఏమిటో చూపించిన మార్క్ గ్రేట్‌బ్యాచ్ గుర్తున్నాడా...పించ్ హిట్టర్ పదానికి తొలి సారి గుర్తింపు తెచ్చిన ఈ న్యూజిలాండ్ క్రికెటర్ 1992 వరల్డ్ కప్‌లో చెలరేగిన తీరు ఎవరు మరచిపోగలరు. కివీస్ తరఫున 41 టెస్టులు, 84 వన్డేలు ఆడిన ఈ క్రికెటర్ ఆ తర్వాత తనకిష్టమైన వ్యాపారంలోకి దిగిపోయాడు. ఆటగాళ్లు వ్యాపారం చేయడం కొత్త కాదు కానీ గ్రేట్‌బ్యాచ్ ఇందులోనూ తన ప్రత్యేకత చూపించాడు. అతనికి ఆపిల్ పళ్లంటే మహా ఇష్టం. ఆ ఇష్టంలోనే అతను తన బిజినెస్‌నూ చూసుకున్నాడు. అందుకే పెద్ద సంఖ్యలో ఆపిల్ తోటలు కొనేశాడు. అక్కడ స్వయంగా ఆపిల్స్ పండిస్తూ తన వ్యాపారం కొనసాగించాడు. ఫెర్న్ రిడ్జ్ అనే కంపెనీతో కలసి దీనిని విస్తరించాడు. క్రికెటర్ల ఫొటోలతో... గ్రేట్‌బ్యాచ్ కంపెనీ మొత్తం 12 రకాల ఆపిల్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. అయితే వీటిలో రాయల్ గాలా ఆపిల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడే గ్రేట్‌బ్యాచ్ తన క్రికెట్ తెలివి చూపించాడు. ఈ ఆపిల్స్కు ప్రచారం కల్పించేందుకు క్రికెటర్లనే వాడుకున్నాడు. ఈ బ్రాండ్ ఆపిల్స్‌పై స్టిక్కర్లు ముద్రించి ఉంటాయి కదా. 1992 వరల్డ్ కప్ ఆడిన న్యూజిలాండ్ క్రికెటర్ల ఫొటోలతోనే ఈ స్టిక్కర్లు తయారు చేయించాడు. ఆ టోర్నీ జెర్సీలోనే స్వయంగా గ్రేట్బ్యాచ్తో పాటు కెప్టెన్ మార్టిన్ క్రో, దీపక్ పటేల్, ఇయాన్ స్మిత్ తదితర ఆటగాళ్లు మనకు కనిపిస్తారు. అన్నట్లు భారత్‌లో కూడా రాయల్ గాలాకు మంచి గిరాకీ ఉంది ‘భారతీయులు క్రికెట్‌ను ప్రేమించినంతగా మా ఆపిల్స్‌ను కూడా ప్రేమిస్తారు‘ అనే క్యాప్షన్‌తో ఇక్కడికి ఎగుమతి చేస్తున్నాడు గ్రేట్‌బ్యాచ్. మీరెప్పుడైనా ఈ రకం ఆపిల్స్ తింటుంటే 1992 ప్రపంచకప్‌లో కివీస్ జోరు గుర్తుకొస్తుందేమో చూడండి.