
శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ (SLC) సోమవారం ప్రకటించింది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024లో శ్రీలంక దారుణ ఆటతీరుతో గ్రూపు స్టేజిలోనే నిష్కమ్రించింది.
దీంతో అప్పటివరకు లంక హెడ్‌కోచ్‌గా పని చేసిన క్రిస్ సిల్వర్‌వుడ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో కొత్త హెడ్‌కోచ్‌ను భర్తీ చేసే పనిలో శ్రీలంక క్రికెట్ బోర్డు పడింది. అయితే కొత్త కోచ్ వచ్చే అంతవరకు లంక తాత్కాలిక హెడ్‌కోచ్‌గా జయసూర్య పనిచేయనున్నాడు.
కాగా జయసూర్య ఇటీవల ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో శ్రీలంక కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. డిసెంబర్ 2023 నుండి శ్రీలంక క్రికెట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నా డు. ఇప్పుడు ప్రమోషన్ పొంది హెడ్‌కోచ్‌గా సేవలు అందించున్నాడు ఈ లెజండరీ క్రికెటర్.
స్వదేశంలో ఈ నెల 27 నంచి భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో లంక తాత్కాలిక హెడ్‌కోచ్‌గా సనత్ జయసూర్య ప్రయాణం మొదలు కానుంది. లంక పర్యటనలో భాగంగా భారత్ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లలో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. కాగా ఈ పర్యటనతోనే భారత జట్టుకు కూడా కొత్త హెడ్‌కోచ్ వచ్చే ఛాన్స్ ఉంది.
చదవండి: #Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా