Sri Lanka vs india
-
భారత్‌తో టీ20 సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య
శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ (SLC) సోమవారం ప్రకటించింది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024లో శ్రీలంక దారుణ ఆటతీరుతో గ్రూపు స్టేజిలోనే నిష్కమ్రించింది. దీంతో అప్పటివరకు లంక హెడ్‌కోచ్‌గా పని చేసిన క్రిస్ సిల్వర్‌వుడ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో కొత్త హెడ్‌కోచ్‌ను భర్తీ చేసే పనిలో శ్రీలంక క్రికెట్ బోర్డు పడింది. అయితే కొత్త కోచ్ వచ్చే అంతవరకు లంక తాత్కాలిక హెడ్‌కోచ్‌గా జయసూర్య పనిచేయనున్నాడు. కాగా జయసూర్య ఇటీవల ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో శ్రీలంక కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. డిసెంబర్ 2023 నుండి శ్రీలంక క్రికెట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నా డు. ఇప్పుడు ప్రమోషన్ పొంది హెడ్‌కోచ్‌గా సేవలు అందించున్నాడు ఈ లెజండరీ క్రికెటర్. స్వదేశంలో ఈ నెల 27 నంచి భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో లంక తాత్కాలిక హెడ్‌కోచ్‌గా సనత్ జయసూర్య ప్రయాణం మొదలు కానుంది. లంక పర్యటనలో భాగంగా భారత్ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లలో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. కాగా ఈ పర్యటనతోనే భారత జట్టుకు కూడా కొత్త హెడ్‌కోచ్ వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: #Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా -
Ind Vs Sl 2nd Test: క్లీన్‌స్వీప్ చేసే సమయం ఆసన్నమైంది...
భారత్ టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే సమయం ఆసన్నమైంది...తొలిరోజు బౌలింగ్‌లో కొంతైనా ప్రతాపం చూపిన శ్రీలంక రెండో రోజు ఇటు బ్యాటింగ్‌లో అటు బౌలింగ్‌లో పూర్తిగా కుదేలైంది. వంద పరుగులు దాటిన కాసేపటికే తొలి ఇన్నింగ్స్‌ను ముగించుకున్న లంక తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయింది. దీంతో కొండంత లక్ష్యం ముందు లంక ఓడేందుకు చేరువవుతోంది. పంత్ మెరుపు బ్యాటింగ్, అయ్యర్ మరో చక్కటి ఇన్నింగ్స్ రెండో రోజు హైలైట్‌గా నిలిచాయి. బెంగళూరు: రెండో టెస్టులో విజయానికి అవసరమైన ఏర్పాట్లన్నీ భారత్ రెండో రోజే చేసేసింది. ప్రత్యర్థి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే ముగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి తోడు రెండో ఇన్నింగ్స్‌లో పటిష్టమైన స్కోరుతో భారీ లక్ష్యాన్ని నిర్మించింది. ఆదివారం హాయిగా స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులకు రిషభ్‌పంత్ (31 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) పసందైన బ్యాటింగ్ విందు ఇచ్చాడు. రెండో రోజుకు సరిపడే వినోదం అతనిదైతే... మొత్తం మ్యాచ్‌లో భారత్‌ను శ్రేయస్ అయ్యర్ (87 బం తుల్లో 67; 9 ఫోర్లు) పటిష్ట స్థితిలో నిలిపాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 303/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసి శ్రీలంక ముందు 447 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. బుమ్రా వేసిన మూడో బంతికే తిరిమన్నె (0) అవుట్ కాగా, కరుణరత్నే (10 బ్యాటింగ్), కుశాల్ మెండిస్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక 109 ఆలౌట్ రెండో రోజు లంకను ఆలౌట్ చేసేందుకు భారత్‌కు ఎక్కువ సేపు పట్టలేదు. ఆదివారం మరో ఆరు ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయిన ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 35.5 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌ టైంది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 23 పరుగులు మాత్రమే జోడించి జట్టు మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. బుమ్రా కెరీర్లో 8వ సారి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యం లభించింది. అయ్యర్ మళ్లీ సూపర్ రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (79 బంతుల్లో 46; 4 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (22; 5 ఫోర్లు) నిలకడగా ఆడారు. వీళ్లిద్దరి తర్వాత హనుమ విహారి (35; 4 ఫోర్లు) కాస్త మెరుగనిపించగా, కోహ్లి (13) విఫలమయ్యాడు. మరో వైపు శ్రేయస్ అయ్యర్ మళ్లీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐదో వికెట్‌కు పంత్, అయ్యర్ 6.2 ఓవర్లలోనే 45 పరుగులు జోడించారు. జడేజాతో కలిసి శ్రేయస్ కుదురుగా బ్యాటింగ్ చేశాడు. డిన్నర్ బ్రేక్ పూర్తయిన వెంటనే జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ఆరో వికెట్‌కు వీళ్లిద్దరు 63 పరుగులు జత చేశాక జడేజా (22) అవుటయ్యాడు. ఆ తర్వాత 69 బంతుల్లో అయ్యర్ అర్ధ సెంచరీ పూర్తయింది. వరుసగా రెండు రోజుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను ఫిఫ్టీలతో అదరగొట్టాడు. స్కోరు 300 దాటి 9వ వికెట్ పడగానే భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 252; శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 109; భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ (సి) ధనంజయ (బి) ఎంబుల్డెనియా 22; రోహిత్ (సి) మాథ్యూస్ (బి) ధనంజయ 46; విహారి (బి) జయవిక్రమ 35; కోహ్లి (ఎల్బీ) (బి) జయవిక్రమ 13; పంత్ (సి) అండ్ (బి) జయవిక్రమ 50; అయ్యర్ (ఎల్బీ) (బి) ఎంబుల్డెనియా 67; జడేజా (బి) ఫెర్నాండో 22; అశ్విన్ (సి) డిక్వెలా (బి) జయవిక్రమ 13; అక్షర్ (బి) ఎంబుల్డెనియా 9; షమీ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (68.5 ఓవర్లలో) 303/9 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1–42, 2–98, 3–116, 4–139, 5–184, 6–247, 7–278, 8–278, 9–303. బౌలింగ్: లక్మల్ 10–2–34–0; ఎంబుల్డెనియా 20.5–1–87–3, ఫెర్నాండో 10–2–48–1, ధనంజయ 9–0–47–1, జయవిక్రమ 19–2–78–4. -
Ind Vs Sl 2nd Test: విహారికి ఛాన్స్.. మరి సిరాజ్?
India Vs Sri Lanka 2nd Test- బెంగళూరు: మూడు రోజుల్లోపే తొలి టెస్టులో శ్రీలంక ఆట ముగించిన భారత్ ఇప్పుడు అదే ప్రదర్శనను పునరావృతం చేసేందుకు సిద్ధమైంది. నేటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. తాజా ఫామ్, బలాబలాల దృష్ట్యా ప్రత్యర్థికంటే ఎంతో పటిష్టంగా ఉన్న టీమిండియాకు ఇక్కడా అడ్డు ఉండకపోవచ్చు. తొలి పోరులో ఘోర వైఫల్యం తర్వాత రెండో టెస్టులో లంక ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి. ఫ్లడ్ లైట్ల వెలుగులో ‘డే అండ్ నైట్’గా గులాబీ బంతితో జరగనున్న ఈ మ్యాచ్‌కు మైదానంలో ప్రేక్షకులను 100 శాతం అనుమతిస్తుండటం చెప్పుకోదగ్గ విశేషం. సిరాజ్‌కు అవకాశం ఇస్తారా! మొహాలీలో భారత జట్టు ప్రదర్శన చూసిన తర్వాత సహజంగానే తుది జట్టులో మార్పులకు అవకాశం కనిపించదు. రోహిత్‌తో పాటు సొంతగడ్డపై మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. మూడో స్థానంలో హనుమ విహారికి మళ్లీ అవకాశం ఖాయం కాగా... కోహ్లి ఈ మ్యాచ్‌లోనైనా సెంచరీ సాధించి సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతాడా చూడాలి. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాలతో మిడిలార్డర్ పటిష్టంగా ఉండగా ఆ తర్వాత అశ్విన్ కూడా సత్తా చాటగలడు. బుమ్రా, షమీ ఖాయం కాగా... మూడో స్పిన్నర్‌గా జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడించడంపై టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. అయితే ‘పింక్ బంతి’ బాగా స్వింగ్ అయ్యే అవకాశం ఉండటంతో దాదాపు సొంత మైదానంలాంటి చిన్నస్వామిలో మూడో పేసర్‌గా హైదరాబాద్ బౌలర్ సిరాజ్‌కు చాన్స్ లభిస్తుందేమో చూడాలి. తుది జట్టులో ఎవరు? మొదట టి20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయి తొలి టెస్టులోనూ ఓడిన శ్రీలంక ఇప్పుడు రెండో మ్యాచ్ కోసం తుది జట్టును సిద్ధం చేసుకోవడమే కష్టంగా మారింది. గత మ్యాచ్‌లో ఆడిన కుమార, నిసాంకా గాయాలతో దూరం కాగా, ఆడే అవకాశం ఉన్న చమీరా కూడా గాయపడ్డాడు. కుశాల్ మెండిస్ కోలుకోవడం ఆ జట్టుకు ఊరట. అసలంక స్థానంలో చండిమాల్‌కు అవకాశం దక్కవచ్చు. మరోసారి టీమ్ బ్యాటింగ్ సీనియర్లు కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్లపైనే ఆధారపడి ఉంది. ఎంబుల్డెనియాతో పాటు కొత్తగా వస్తున్న చమిక కరుణరత్నే భారత్‌ను ఏమాత్రం కట్టడి చేయగలరో చూడాలి. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న సురంగ లక్మల్ ఆటపై అందరి దృష్టీ ఉంది. 4:భారత్‌కు ఇది నాలుగో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్... స్వదేశంలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లపై గెలిచిన భారత్ ఆస్ట్రేలియా గడ్డపై ఓడింది. 400: మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్‌కిది 400వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. #TeamIndia vice-captain @Jaspritbumrah93 on the mental changes that need to be made for a Pink Ball Test.@Paytm #INDvSL pic.twitter.com/PCfrY6sJe7 — BCCI (@BCCI) March 11, 2022 -
సందిగ్ధంలో టీమిండియా- లంక వన్డే సిరీస్!
కొలంబొ: భారత్, శ్రీలంకల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ సందిగ్ధంలో పడింది. తాజాగా శ్రీలంక జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనను ముగించుకొన్న లంక ఆటగాళ్లు మంగళవారం సాయంత్రం శ్రీలంకకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రాంట్ ఫ్లవర్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలడం, అతనితో పాటు ఆటగాళ్లంతా ఒకే విమానంలో రావడంతో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం గ్రాంట్ ఫ్లవర్‌ను ఐసోలేషన్‌కు పంపగా.. మిగిలిన జట్టు సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికి పాజిటివ్‌గా తేలలేదు. దీంతో ఆటగాళ్లందరిని క్వారంటైన్‌కు తరలించారు. కాగా జూలై 13 నుంచి టీమిండియా, శ్రీలంక మధ్య సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. కాగా సిరీస్ ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉండడంతో సిరీస్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే శిఖర్ ధావన్ సారధ్యంలోని టీమిండియా శ్రీలంక చేరుకొని ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. -
'బాగా ఆడినా ఎంపిక చేయలేదు.. నా గుండె పగిలింది'
ముంబై: జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా గురువారం బీసీసీఐ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యంలో టీమిండియా రెండో జట్టు లంకతో సిరీస్ ఆడనుంది. ఐపీఎల్, ఇతర దేశవాలీ టోర్నీలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా జట్టులో చోటు కల్పించారు. రుతురాజ్, దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా వంటి యువ ఆటగాళ్లు ఎంపికయ్యారు. ఇటీవలే రంజీ ట్రోపీలో దుమ్మురేపిన సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్ జాక్సన్ లంకతో పర్యటనకు కచ్చితంగా ఎంపికవుతానని భావించాడు. కానీ అతని ఆశలు తలకిందులయ్యాయి. ఈ సందర్భంగా తాను ఎంపికకాకపోవడంపై స్పందించిన షెల్డన్ జాక్సన్.. '' ఎంత బాగా ఆడినా ఎంపిక చేయలేదు.. నా గుండె పగిలింది'' అంటూ ఎమోజీ షేర్ చేశాడు. ''ఇప్పుడు నా వయసు 34 ఏళ్లు.. కానీ బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాను. ఒక 22-23 ఏళ్ల కుర్రాడిలో దూకుడైన ఆటతీరు ఎలా ఉంటుందో అలా సాగుతుంది నా ఆటతీరు. ఆటకు వయసు అడ్డుగా కనిపిస్తే నేను ఏం చేయలేను.. లేటు వయసులో జాతీయ జట్టులోకి ఎంట్రీ లేదని క్రికెట్ పుస్తకాల్లో ఎక్కడా లేదు. ఒక ఆటగాడిని ఎంపిక చేయలాంటే అతని ఆటతీరు చూడాలని నేను నమ్ముతా. వరుసగా మూడు సీజన్ల పాటు రంజీ ట్రోపీలో 800-900 పరుగులు చేశానంటే ఫిట్‌గా ఉండడమే కదా అర్థం. అతని వయస్సు 30 కంటే ఎక్కువ.. అందుకే సెలక్ట్ కాలేదు..ఈ పదం నేను చాలాసార్లు విన్నా'' అంటూ ఆవేదన చెందాడు. ఇక షెల్డన్ జాక్సన్ రంజీ ట్రోపీలో వరుసగా మూడుసార్లు 700కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 76 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 5634 పరుగులు, 60 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 2096 పరుగులు, 59 దేశవాలీ టీ20ల్లో 1240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు.. 44 అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా శ్రీలంక పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న టీమిండియా జూలై 13న తొలి వన్డే ఆడనుంది. చదవండి: కెప్టెన్‌గా గబ్బర్.. వైస్‌కెప్టెన్‌గా భువీ దంచికొట్టిన రషీద్ ఖాన్.. ఆఖరి బంతికి విజయం 💔 — Sheldon Jackson (@ShelJackson27) June 10, 2021 -
జడేజా స్థానంలో యువ స్పిన్నర్‌కు పిలుపు!
కొలంబో: ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్సర్ పటేల్ భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించాడు. శ్రీలంకతో జరగనున్న మూడు టెస్టులో అతను ఆడనున్నాడు. శనివారం నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడో టెస్టు పల్లెకేలేలో జరగనుంది. కొలంబోలో జరిగిన రెండో టెస్టులో ఐసీసీ ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించినందుకు రవీంద్ర జడేజాపై ఒక టెస్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో జట్టుకు దూరమైన అతని స్థానంలో అక్సర్ పటేల్‌ను జట్టులోకి తీసుకోవాలని ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 12 నుంచి జరగనున్న మూడో టెస్టు కోసం జట్టు ఇలా ఉండనుంది. విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, ఆర్. అశ్విన్, అక్సర్ పటేల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, హర్థిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్. -
ఇదే నా బెస్ట్ ఇన్సింగ్స్: భారత బ్యాట్స్‌మన్
కొలంబో: శ్రీలంక బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టానని టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. శ్రీలంకతో రెండో టెస్టులో 132 పరుగుల మాస్టర్ ఇన్నింగ్స్ నేపథ్యంలో అతను విలేకరులతో మాట్లాడాడు. రెండో టెస్టులో అత్యంత ఓపిగ్గా ఆడిన రహానే 222 బంతుల్లో 14 బౌండరీలతో 132 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర పూజారా (133)తో కలిసి 217 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని రహానే నెలకొల్పడంతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ 622/9 భారీ స్కోరు నమోదుచేసిన సంగతి తెలిసిందే. 'స్పిన్నర్లపై నా బెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఇదొకటి. బౌలర్లను డామినేట్ చేయడంపైనే నేను ఫోకస్ చేశాను. బ్యాటింగ్‌కు వెళ్లేముందే వికెట్ ఎలా ప్రవర్తిస్తుందో నేను గ్రహించాను. ఎంతో బౌన్స్ ఉంది.. నా గేమ్‌కు పిచ్ సూట్ అవుతుందా? లేదా? అన్నది అంచనా వేశాను. నాకు-పూజారాకు మధ్య కమ్యూనికేషన్ బాగా కుదిరింది. దాదాపు ఒక్క ఓవర్ కూడా మెయిడెన్ కాకుండా చూశాం. కాబట్టి బౌలర్లపై ఒత్తిడి పెంచగలిగాం. మ్యాచ్ ముందుకుసాగుతున్నకొద్దీ ఈ వికెట్‌పై పరుగులు రాబట్టడం కష్టమవుతుంది' అని రహానే తెలిపారు. శ్రీలంక బౌలర్ హెరాత్, ఇతర స్పిన్స్ బౌలర్లను ఎదుర్కోవడం ఫుట్‌వర్క్ చాలా ముఖ్యమని, ఫుట్‌వర్క్ ఆధారంగానే ఎక్కువ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశామని చెప్పాడు. పూజారాతో కలిసి రెండువందల పరుగులకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పడం టీమ్ వ్యూహంలో భాగమేనని, దానిని తాము అమలుచేశామని రహానే చెప్పాడు.