జడేజా స్థానంలో యువ స్పిన్నర్‌కు పిలుపు! | Axar to replace Jadeja for 3rd Test vs Sri Lanka | Sakshi
Sakshi News home page

జడేజా స్థానంలో యువ స్పిన్నర్‌కు పిలుపు!

Published Wed, Aug 9 2017 11:40 AM | Last Updated on Sun, Sep 17 2017 5:21 PM

జడేజా స్థానంలో యువ స్పిన్నర్‌కు పిలుపు!

జడేజా స్థానంలో యువ స్పిన్నర్‌కు పిలుపు!

కొలంబో: ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా స్థానంలో లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ అక్సర్‌ పటేల్ భారత క్రికెట్‌ జట్టులో చోటు సంపాదించాడు. శ్రీలంకతో జరగనున్న మూడు టెస్టులో అతను ఆడనున్నాడు. శనివారం నుంచి భారత్‌-శ్రీలంక మధ్య మూడో టెస్టు పల్లెకేలేలో జరగనుంది.

కొలంబోలో జరిగిన రెండో టెస్టులో ఐసీసీ ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించినందుకు రవీంద్ర జడేజాపై ఒక టెస్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో జట్టుకు దూరమైన అతని స్థానంలో అక్సర్‌ పటేల్‌ను జట్టులోకి తీసుకోవాలని ఆలిండియా సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 12 నుంచి జరగనున్న మూడో టెస్టు కోసం జట్టు ఇలా ఉండనుంది.

విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, ఆర్. అశ్విన్, అక్సర్ పటేల్, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, హర్థిక్‌ పాండ్య, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్‌ షమి, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement