
కొలంబొ: భారత్, శ్రీలంకల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ సందిగ్ధంలో పడింది. తాజాగా శ్రీలంక జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనను ముగించుకొన్న లంక ఆటగాళ్లు మంగళవారం సాయంత్రం శ్రీలంకకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రాంట్ ఫ్లవర్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలడం, అతనితో పాటు ఆటగాళ్లంతా ఒకే విమానంలో రావడంతో ఆందోళన మొదలైంది.
ప్రస్తుతం గ్రాంట్ ఫ్లవర్‌ను ఐసోలేషన్‌కు పంపగా.. మిగిలిన జట్టు సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికి పాజిటివ్‌గా తేలలేదు. దీంతో ఆటగాళ్లందరిని క్వారంటైన్‌కు తరలించారు. కాగా జూలై 13 నుంచి టీమిండియా, శ్రీలంక మధ్య సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. కాగా సిరీస్ ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉండడంతో సిరీస్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే శిఖర్ ధావన్ సారధ్యంలోని టీమిండియా శ్రీలంక చేరుకొని ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment