కొలొంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య ఇవాళ (ఆగస్ట్ 2) తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. సోనీ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి ఉత్సాహంతో ఉన్న భారత్ వన్డే సిరీస్‌ను సైతం గెలుపుతో ప్రారంభించాలని భావిస్తుంది. మరోవైపు శ్రీలంక.. భారత్‌ను ఎలాగైనా మట్టికరిపించాలని పట్టుదలగా ఉంది.
ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. శ్రీలంకపై భారత్ సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఈ ఫార్మాట్‌లో ఇరు జట్లు 168 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్ 99, శ్రీలంక 57 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. 11 మ్యాచ్‌ల్లో ఫలితం తేలకపోగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది.
కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఇక్కడ ఇరు జట్లు 38 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. 19 మ్యాచ్‌ల్లో భారత్, 16 మ్యాచ్‌ల్లో శ్రీలంక విజయాలు సాధించాయి. మూడు మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితం రాలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి ఐదు మ్యాచ్‌ల విషయానికొస్తే.. భారత్ ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయాలు నమోదు చేసింది.
జట్ల విషయానికొస్తే.. రోహిత్, కోహ్లి, రాహుల్, శ్రేయస్‌ల రాకతో భారత్ మరింత పటిష్టంగా మారింది. హర్షిత్ రాణా, రియాన్ పరాగ్ తొలి మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేయవచ్చు. శ్రీలంక విషయానికొస్తే.. ఆ జట్టును గాయాల సమస్య వేధిస్తుంది. కీలకమైన పేసర్లు పతిరణ, మధుషంక గాయాల కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యారు.
భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా
Comments
Please login to add a commentAdd a comment