![Jason Gillespie Appointed Pakistan White Ball Coach After Gary Kirsten Resignation](/styles/webp/s3/article_images/2024/10/28/gary.jpg.webp?itok=9zYFtCNP)
పాకిస్తాన్ ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా జేసన్ గిల్లెస్పీ నియమితుడయ్యాడు. పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా చేసిన నేపథ్యంలో గిల్లెస్పీ ఎంపిక జరిగింది. ఆల్ ఫార్మాట్ కోచ్‌గా ఎంపిక కాకముందు గిల్లెస్పీ కేవలం టెస్ట్‌లకు మాత్రమే కోచ్‌గా వ్యవహరించే వాడు.
గిల్లెస్పీ త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటించబోయే పాక్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఆటగాళ్లతో, క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా కిర్‌స్టన్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. హై పెర్ఫార్మెన్ కోచ్‌గా డేవిడ్ రీడ్‌ను నియమించాలని కిర్‌స్టన్ కోరగా.. పాక్ క్రికెట్ బోర్డు అందుకు నిరాకరించినట్లు సమాచారం.
కాగా, ఇటీవలికాలంలో పాక్ క్రికెట్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మూడు నెలల కాలంలో మూడు సార్లు సెలక్షన్ ప్యానెల్‌లో మార్పులు చేసిన పీసీబీ.. తాజాగా గ్యారీ కిర్‌స్టన్ హెడ్ పదవి నుంచి తప్పుకునేలా చేసింది. ఇటీవలే బాబర్ ఆజమ్ పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
దీంతో నిన్ననే బాబర్ స్థానంలో పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్‌ను నియమించారు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చివరి రెండు టెస్ట్‌లకు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షాలను తప్పించారు. ఈ అంశం అప్పట్లో పాక్ క్రికెట్‌ను కుదిపేసింది. అయితే ఈ ముగ్గురు స్టార్లు లేకపోయినా పాక్ ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్‌లో గెలవడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment