మహిళతో క్రికెటర్‌ ప్రైవేట్‌ వీడియో లీక్‌! | A private tape of Sanath Jayasuriya and former girlfriend leaked | Sakshi
Sakshi News home page

మహిళతో క్రికెటర్‌ ప్రైవేట్‌ వీడియో లీక్‌!

Published Sat, May 27 2017 10:48 AM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

మహిళతో క్రికెటర్‌ ప్రైవేట్‌ వీడియో లీక్‌!

మహిళతో క్రికెటర్‌ ప్రైవేట్‌ వీడియో లీక్‌!

శ్రీలంక మాజీ కెప్టెన్‌, క్రికెటర్‌ సనత్‌ జయసూర్యకు చెందిన ఓ ప్రైవేట్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. మాజీ ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న ఈ వీడియో శ్రీలంకలో సంచలనంగా మారింది. క్రికెటర్‌గా ఉన్న సమయంలో జయసూర్యకు ఆమెతో పరిచయం ఏర్పడింది. కొద్దికాలం తర్వాత అది ప్రేమగా మారింది.

ఇద్దరూ మానసికంగా, భౌతికంగానూ దగ్గరయ్యారు. అయితే, కొన్ని విభేదాలతో ఒకరికొకరు దూరమయ్యారు. జయసూర్య నుంచి విడిపోయిన ఆమె ఓ బడా వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. ఆమె ఇప్పుడు శ్రీలంకలో మీడియా సంస్ధకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  ప్రతీకారంతోనే జయసూర్య స్వయంగా ఆ వీడియోని లీక్‌ చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి.

ఆమె ఏమందంటే
‘ఇది ప్రతీకారమే! ఆ వీడియో అతనే రికార్డు చేశాడు. మేం గతంలో ప్రేమికులుగా ఉన్నప్పుడు తీశాడు.' అని ఆ మహిళ చెప్పిన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వీడియోను ఎవరు లీక్‌ చేశారనే విషయాన్ని కనిపెట్టేందుకు శ్రీలంక జాతీయ సైబర్‌ సెక్యూరిటీ కేంద్రం ప్రయత్నిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement