Bihar: మరో ప్రశ్నాపత్రం లీక్‌.. సీహెచ్‌ఓ పరీక్ష రద్దు | Bihar cho Exam Cancelled After Raids at Online Centres | Sakshi
Sakshi News home page

Bihar: మరో ప్రశ్నాపత్రం లీక్‌.. సీహెచ్‌ఓ పరీక్ష రద్దు

Published Mon, Dec 2 2024 11:04 AM | Last Updated on Mon, Dec 2 2024 11:57 AM

Bihar cho Exam Cancelled After Raids at Online Centres

పట్నా: బీహార్ రాష్ట్ర ఆరోగ్య కమిటీ  డిసెంబర్‌ ఒకటిన నిర్వహించిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌ఓ) పరీక్ష రద్దయ్యింది. ఈరోజు (డిసెంబర్ 2)న  జరగాల్సిన పరీక్ష కూడా రద్దయింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ పరీక్షల తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తారు.

సీహెచ్‌ఓ పరీక్ష పేపర్ లీక్‌కు కొన్ని ముఠాలు పాల్పడినట్లు పట్నా పోలీసులకు ఇన్‌పుట్ అందింది. వీటి ఆధారంగా పట్నా పోలీసులు ఆదివారం అర్థరాత్రి పలు ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలపై దాడి చేశారు. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ తర్వాత  ఈ పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. పట్నా పోలీసు బృందం ఆదివారం ఏకకాలంలో 12 ఆన్‌లైన్ కేంద్రాలపై దాడులు చేసింది. రామకృష్ణనగర్‌తో పాటు పలు కేంద్రాలకు చెందిన 12 మందిని ఈ బృందం అదుపులోకి తీసుకుంది. రెండు కేంద్రాలను పోలీసులు సీజ్ చేశారు.

పోలీసులు ఈ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి నలుగురిని విచారిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ పరీక్షకు సంబంధించిన ఆడియో, వాట్సాప్ చాట్ వైరల్ గా మారింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ఆరోగ్య కమిటీ ఎస్‌ఎస్‌పీకి లేఖ రాసి దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో ఆదివారం పరీక్షకు ముందు నుంచే పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. బీహార్‌లో గతంలో పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్‌ అయ్యాయి.

ఇది కూడా చదవండి: Pollution Control Day: భోపాల్ గ్యాస్ లీకేజీ విషాదాన్ని గుర్తు చేస్తూ..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement