tape
-
అమెరికా విమానంలో వ్యక్తి అలజడి..
వాషింగ్టన్: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అలజడి సృష్టించాడు. విమానం గాల్లో ఎగురుతుండగానే అత్యవసర ద్వారం తెరిచేందుకు ప్రయతి్నంచాడు. తోటి ప్రయాణికులు భయాందోళనతో గట్టిగా అరుస్తున్నా పట్టించుకోలేదు. దాంతో వారంతా అతడిని బంధించి, బలంతంగా సీట్లో కూర్చోబెట్టి, మళ్లీ లేవకుండా టేపుతో కట్టేశారు. అమెరికాలో న్యూమెక్సిలో రాష్ట్రంలోని అల్బుక్విర్కీ సిటీ నుంచి షికాగోకు బయలుదేరిన 1219 విమానంలో(బోయింగ్ 737) ఇటీవలే ఈ ఘటన చోటుచేసుకుంది. అల్బుక్విర్కీ ఎయిర్‌పోర్టు నుంచి విమానం బయలుదేరిన 30 నిమిషాలకు సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులంతా అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి, అల్బుక్విర్కీ ఎయిర్‌పోర్టులో దించారు. గందరగోళానికి కారణమైన ప్రయాణికుడిని కిందికి దించి, పోలీసులకు అప్పగించారు. అతడు ఎందుకలా చేశాడన్నదానిపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. -
కడుపు తరుక్కుపోయే దారుణం.. నోటికి టేప్ వేసి, కుక్కల బోనులో బంధించి
వాషింగ్టన్: ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులకు భారమై అనథాశ్రమంలో చేరారు. ఓ రోజు ఇద్దరు దంపతులు వచ్చి.. ఆ అక్కాచెల్లళ్లను దత్తత తీసుకున్నారు. తల్లిదండ్రుల ప్రేమ, సంరక్షణ దొరికిందని ఆ చిన్నారులు ఎంతో సంతోషించారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేవదు. చిన్నారులను దత్తత తీసుకున్న దంపతులు రాక్షసులు, సైకోలు. ఈ క్రమంలో దత్తత తీసుకున్న వారిలో ఓ చిన్నారిని అత్యంత పాశవీకంగా హత్య చేశారు. ఈ దారుణం అమెరికాలో సంచలనం సృష్టించింది. కనీసం అనాథశ్రమంలో ఉంటేనైనా చిన్నారి బతికి ఉండేది కదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమెరికన్లు. ఆ వివరాలు.. హవాయికి చెందిన దంపతులు ఐజాక్ కలువా (52), లెహువా కలువా (43) దంపతులు హత్య గావించబడిన ఇసాబెల్లాను 2018లో దత్తత తీసుకున్నారు. ఇసబెల్లా కంటే ముందు ఆమె సోదరిని 2009లో దత్తత తీసుకున్నారు కలువా దంపతులు. ఆ తర్వాత ఇసబెల్లా మరో ఇద్దరు తోబుట్టువులను 2018, 2020లో దత్తత తీసుకున్నారు. ఇసాబెల్లా తల్లిదండ్రులు వైమన ప్రాంతంలో నివసిస్తుండేవారు. వారు కటిక పేదరికం అనుభవిస్తుండటంతో పిల్లలను కలువా దంపతులకు దత్తతకు ఇచ్చారు. (చదవండి: అమెరికా జర్నలిస్ట్‌కి 11 ఏళ్లు జైలు శిక్ష) కలువా దంపతులు రాక్షసులకు మారుపేరులాంటి వారు. చిన్నారులను దత్తతకు తీసుకున్న వీరు వారిని చిత్రహింసలకు గురి చేసేవారు. ఈ క్రమంలోనే ఆరేళ్ల ఇసాబెల్లాను అత్యంత దారుణంగా హింసించేవారు. చిన్నారికి సరిగా తిండి పెట్టేవారు కారు. ఆకలికి తట్టుకోలేక రాత్రిళ్లు లేచి ఆహారం కోసం వెదికేది ఇసాబెల్లా. ఈ క్రమంలో కలువా దంపతులు ఇసాబెల్లాను బంధించడం కోసం కుక్కల బోనును ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించారు. చిన్నారిని హత్య జరిగిన నాడు.. రోజు లానే ఇసాబెల్లాకు ఆహారం పెట్టకుండా హింసించారు. రాత్రిళ్లు ఆహారం కోసం వెదకకుండా ఉండేందుకు గాను ఇసాబెల్లా నోటికి, చేతులకు డక్ టేప్ వేసి కుక్కల బోనులో బంధించారు. ఆ తర్వాత బోనును బాత్రూంలో పెట్టారు. (చదవండి: కోట్లలో ఒకరు... ఈ కోర్ట్ని!) ఈ క్రమంలో ఇసాబెల్లా కన్నా ముందు కలువా ఇంటికి దత్తత వచ్చిన ఆమె సోదరి.. చెల్లెలు బెడ్ మీద కనిపించకపోవడంతో ఇల్లంతా వెదికింది. బాత్రూంలో కుక్కల బోనులో ఉన్న ఇసాబెల్లాను గుర్తించి.. బెడ్రూంలోకి తీసుకువచ్చింది. అప్పటికే ఇసాబెల్లా అపస్మారక స్థితిలో ఉంది. దీని గురించి బాధిత చిన్నారి అక్క కలువా దంపతులకు చెప్పింది. వారు వచ్చి ఇసాబెల్లాను బాత్‌టబ్‌లో పడుకోబెట్టి నీరు పెట్టారు. కానీ ఇసాబెల్లా మేల్కొలేదు. చిన్నారి చనిపోయినట్లు నిర్ధారించుకున్న కలువా దంపతులు.. మిగతా పిల్లలకు తెలియకుండా బాలిక మృతదేహాన్ని మాయం చేశారు. దీని గురించి ఎవరికి చెప్పవద్దని ఇసాబెల్లా అక్కను బెదిరించారు. అనంతరం బాత్‌టబ్, కుక్కల బోనును ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఐజాక్ కలువ తనకు కోవిడ్ లక్షణాలు ఉన్నాయని చెప్పి.. ఆస్పత్రిలో చేరాడు. (చదవండి: కాబోయే కోడలు కన్నకూతురని తెలిసింది.. ట్విస్ట్ ఏంటంటే ) 2021, సెప్టెంబర్ 12న ఇసాబెల్లాను హత్య చేసిన నెల రోజుల తర్వాత అనగా అక్టోబర్ 12న కలువా దంపతులు అనుమానం రాకుండా ఉండటం కోసం చిన్నారి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు నెల రోజుల పాటు పోలీసులు దర్యాప్తు చేశారు. ఇసాబెల్లా కోసం వందలాది మంది వలంటీర్లు గాలించారు. చిన్నారి వారి సొంత తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లి ఉంటుందని భావించి.. వైమన ప్రాంతం అంతా గాలించారు. చిన్నారి అదృశ్యానికి సంబంధించి చిన్న ఆధారం కూడా దొరక్కపోవడంతో పోలీసులు డిటెక్టివ్ సాయం కూడా తీసుకున్నారు. విచారణలో భాగంగా ఇసాబెల్లా అక్క జరిగిన దారుణం గురించి డిటెక్టివ్‌కు వివరించింది. ఈ క్రమంలో పోలీసులు కలువా దంపతుల ఆన్లైన్ ఆర్డర్ హిస్టరీ గురించి చెక్ చేయగా కుక్కల బోను ఆర్డర్ చేసినట్లు తెలిసింది. (చదవండి: పిల్లల దత్తత పేరుతో రూ.8.34 లక్షలు వసూలు.. ఆపై) ఆధారులు అన్ని సేకరించిన హోనలులూ పోలీసు డిపార్ట్మెంట్ అధికారులు కలువా దంపతులును అరెస్ట్ చేశారు. విచారణలో కోర్టు కలువా దంపతులు క్షమాభిక్షకు అనర్హులని తేల్చింది. చిన్నారి కనీసం అనాథశ్రమంలో ఉంటే బతికి ఉండేదని.. ఈ హింస తప్పేదని కోర్టు విచారణ వ్యక్తం చేసింది. కలువా దంపతులు కఠిన శిక్షకు అర్హులని తేల్చింది. చదవండి: ఆమెకు గర్భసంచితోపాటు.. ప్రేమ సంచి కూడా ఉంది.. -
కుక్క నోటికి ప్లాస్టర్ చుట్టి..
తిరువనంతపురం : కేరళలో గర్భిణీ ఏనుగు చనిపోయిన ఘటన మరువక ముందే త్రిశూర్‌లో మరో ఉదంతం చోటుచేసుకుంది. మూడేళ్ల వయసున్న కుక్కను హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాని నోటికి ప్లాస్టర్ చుట్టడంతో దాదాపు రెండు వారాలుగా తిండి, నీళ్లు కూడా తీసుకోకపోవడంతో సొమ్మసిల్లి పడిపోయింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ మూగజీవిని పీపుల్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ సర్వీసెస్ సభ్యులు కాపాడారు. స్థానికుల సమాచారంతో త్రిశూర్ లోని ఒల్లూర్ జంక్షన్ వద్ద ఈ కుక్కను కనుగొన్నారు. కుక్క నోటికి అనేక పొరలతో ప్లాస్టర్ చుట్టి ఉండటంతో చర్మం పూర్తిగా దెబ్బతింది. ఎముకలపై కూడా తీవ్ర ప్రభావం చూపిందని పీపుల్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ సర్వీసెస్ కార్యదర్శి రామచంద్రన్ తెలిపారు. కుక్కకు ఉంచిన టేప్ తీయగానే దాదాపు రెండు లీటర్ల నీరు తాగిందని పేర్కొన్నారు. రెండు వారాలుగా ఆహారం, నీళ్లు కూడా తీసుకోవడానికి వీల్లేనందున బాగా నీరసించిందని వివరించారు. (అట్ట పెట్టెలో యువతి మృతదేహం!) This is really devastating. They are living organisms too. I hope karma get back this people real hard. Dog with tape tied around its mouth for almost two weeks rescued in Kerala https://t.co/GzpLMqi6WA -via @inshorts — Gaurya (@iamgaurya) June 8, 2020 కేరళలో గర్భిణీ ఏనుగు ఉదంతం తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. అది మరువకముందే హిమాచల్ ప్రదేశ్‌లో ఆవు నోట్లో బాంబు పేలి చనిపోయింది. తాజాగా మూడేళ్ల వయసున్న కుక్క నోటికి ప్లాస్టర్ చుట్టడంతో చావు అంచుల దాకా వెళ్లింది. వరుస ఉదంతాలు జంతు ప్రేమికులను తీవ్ర కలవర పాటుకు గురిచేస్తున్నాయి. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. (కేరళ ప్రభుత్వంతో టచ్‌లో ఉన్నాం: పర్యావరణ శాఖ ) -
మహిళతో క్రికెటర్ ప్రైవేట్ వీడియో లీక్!
శ్రీలంక మాజీ కెప్టెన్, క్రికెటర్ సనత్ జయసూర్యకు చెందిన ఓ ప్రైవేట్ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. మాజీ ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న ఈ వీడియో శ్రీలంకలో సంచలనంగా మారింది. క్రికెటర్‌గా ఉన్న సమయంలో జయసూర్యకు ఆమెతో పరిచయం ఏర్పడింది. కొద్దికాలం తర్వాత అది ప్రేమగా మారింది. ఇద్దరూ మానసికంగా, భౌతికంగానూ దగ్గరయ్యారు. అయితే, కొన్ని విభేదాలతో ఒకరికొకరు దూరమయ్యారు. జయసూర్య నుంచి విడిపోయిన ఆమె ఓ బడా వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. ఆమె ఇప్పుడు శ్రీలంకలో మీడియా సంస్ధకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతీకారంతోనే జయసూర్య స్వయంగా ఆ వీడియోని లీక్ చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఆమె ఏమందంటే ‘ఇది ప్రతీకారమే! ఆ వీడియో అతనే రికార్డు చేశాడు. మేం గతంలో ప్రేమికులుగా ఉన్నప్పుడు తీశాడు.' అని ఆ మహిళ చెప్పిన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వీడియోను ఎవరు లీక్ చేశారనే విషయాన్ని కనిపెట్టేందుకు శ్రీలంక జాతీయ సైబర్ సెక్యూరిటీ కేంద్రం ప్రయత్నిస్తోంది. -
కెమెరా, ఆడియోజాక్ లపై టేప్ అంటించిన జుకర్ బర్గ్..
లక్షలమంది వినియోగదారులు ఉపయోగిస్తున్న ఫేస్ బుక్ కు చెందిన ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఓ హాస్యాస్పద ఫోటోను పోస్ట్ చేశారు. ఆ చిత్రంలో ఆయన మ్యాక్ బుక్ పై కెమెరా, ఆడియో జాక్ లను టేప్ తో కవర్ చేయడం కనిపించింది. తన సామాజిక ఖాతాల పాస్వర్డ్ లు హ్యాక్ అయిన తర్వాత ఆయన మ్యాక్ బుక్ కెమెరా, ఆడియో జాక్ లపై టేప్ అటించినట్లు కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియా సైట్లతోపాటు, నెట్ బ్యాంకింగ్ ఖాతాలు ఇటీవల హ్యాకర్ల చేతుల్లోకి వెడుతున్నాయని సెక్యూరిటీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అటువంటి బాధితుల జాబితాలో సామాన్యులే కాక, ఏకంగా ప్రపంచ దిగ్గజాలు కూడ ఉంటున్నారు. అదే విషయంలో సోషల్ మీడియా దిగ్గజం మార్క్ జుకర్ బర్గ కూడ నిర్లక్ష్యం వహించి తన ట్విట్టర్, పింటరెస్ట్ ఖాతాలకు ఒకేరకమైన పాస్వర్డ్ పెట్టడంతో ఆయన ఖాతాలుసైతం హ్యాక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఇన్ స్టాగ్రామ్ నెలవారీ వినియోగదారులు 500 మిలియన్లు దాటిన సంతోషకర సందర్భంలో జుకర్ బర్గ్ ఓ హాస్యాస్పద చిత్రాన్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ చిత్రంలో జుకర్ బర్గ్ చేతిలో ఓ చెక్క ఫ్రేమ్ పట్టుకొని ఉండగా, ఆయన వెనుక ఆయన ల్యాప్ ట్యాప్ కనిపిస్తుంది. ఆ సన్నివేశం చూస్తే ఆయనేదో సందేశం ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. కాగా ఆ ఫోటోను పరీక్షగా చూసిన ట్విట్టర్ వినియోగదారుడు క్రిస్ ఓల్సెన్.. జుకర్ బర్గ్ ల్యాప్ టాప్ కెమెరాను, టేప్ ప్ తో కవర్ చేశారంటూ కామెంట్ చేశాడు. అధునాతన హ్యాకర్లు కెమెరాద్వారా ల్యాప్ టాప్ ను నియంత్రిస్తారు. అందుకే జుకర్ బర్గ్ ఆయన మ్యాక్ బుక్ కెమెరా, ఆడియోజాక్ లను టేప్ తో చుట్టేశారంటూ మరో వినియోగదారుడు గిజ్మోడో తన కామెంట్లో జుకర్ బర్గ్ పై ఛలోక్తి విసిరాడు. ముఖ్యంగా వినియోగదారుల ప్రైవేట్ సంభాషణలు, ప్రైవసీని కాపాడే బాధ్యత తీసుకోవాల్సిన ఫేస్ బుక్ సీఈవో.. ఇలా తన ప్రైవసీని కాపాడుకోవడానికి పడుతున్నతాపత్రయం అందరికీ ఆసక్తికరంగా కనిపిస్తోంది. జుకర్ బర్గ్ తన వెబ్ క్యామ్ కు కూడ టేప్ వేసి ఉంచినట్లు తాను ఇదివరకే ఓ సందర్శంలో గమనించాని ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ చెప్తుండగా...కొన్నేళ్ళ క్రితంనుంచే ఆమెరికా ప్రభుత్వం సీక్రెట్ గా తమ పౌరులను వెబ్ క్యామ్ ల ద్వారా పరిశీలిస్తోందని క్వాంటికోలోని ఎఫ్ బీ ఐ ఆపరేషనల్ టెక్నాలజీ డివిజన్ లో మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మార్కస్ థామస్ చెప్తున్నారు. సో... తనదాకా వస్తే కానీ అన్న సామెత ఇక్కడ జుకర్ బర్గ్ కు కూడ వర్తింస్తోందన్న మాట. -
ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో..!
ముందు జాగ్రత్త ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. మరి ఈ కిట్‌లో ఏమేమి ఉండాలంటే... ఫస్ట్ ఎయిడ్ మాన్యువల్(ఇందులో ప్రథమ చికిత్స ఎలా చేయాలో వివరంగా రాసి ఉంటుంది, దానిని క్షుణ్ణంగా చదవాలి), స్టెరిలైజ్ చేసిన గాజ్ రోల్, అతికించడానికి టేప్, చిన్న గాయాలకు వేసే రెడీమేడ్ బ్యాండేజ్‌లు (వాటికే జిగురు కూడా ఉంటుంది. రేపర్ తీసి గాయం మీద అతికించేవి), ఎలాస్టిక్ బ్యాండేజ్, స్ల్పింట్ (చేతివేళ్లను కదిలించడానికి వీలుగా ఉండే బ్యాండేజ్), యాంటీ సెప్టిక్ వైప్స్, యాంటీ బయాటిక్ ఆయింట్మెంట్ లేదా యాంటీ బయాటిక్ పౌడర్, హైడ్రోజెన్ పెరాక్సైడ్ లేదా ఏదైనా యాంటీ సెప్టిల్ సొల్యూషన్, సబ్బు, హైడ్రోకార్టిజోన్ క్రీమ్, బ్రూఫెన్ వంటి నొప్పి నివారణ మాత్రలు (నెలకోసారి వీటి ఎక్స్పైరీ డేట్ చూసి అవసరమైనప్పుడు కొత్తవి చేర్చాలి), కత్తెర, సేఫ్టీ పిన్నులు, ట్వీజర్స్, వాడిపారేయడానికి వీలుగా పేపర్ టవల్స్ లేదా ఇన్స్టంట్ కోల్డ్ ప్యాక్స్, కేలమైన్ క్రీమ్, ధర్మామీటర్, గ్లవ్స్, చిన్న పుస్తకంలో ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ నంబర్లు, ఫ్లాష్‌లైట్, దానికి బ్యాటరీలు. ఇవన్నీ ఇంట్లో ఉండాల్సిన ప్రథమచికిత్స పెట్టెలో ఉండాల్సినవి. ప్రయాణాలలో వీటితోపాటు జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలు, వాంతులు తగ్గించే మందులు కూడా ఉండాలి. అలాగే రక్తపోటు, మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి వాటికి రోజూ మందులు వాడేవారు ఆ మందులను కూడా కలుపుకోవాలి.