![Sunny Leone in Malayalam - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/4/sunny-leone.jpg.webp?itok=S08FTNSq)
సన్నీ లియోన్
సన్నీ లియోన్.. నేషనల్ వైడ్‌గా ఫాలోయింగ్ ఉన్న హాట్ స్టార్. బాలీవుడ్ మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ భాషల్లో స్పెషల్ సాంగ్స్‌తో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ‘వీర మహాదేవి’లో హీరోయిన్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీ సన్నీకి స్వాగతం పలికిందట. ‘ఒరు అడార్ లవ్’ రూపొందించిన ఒమర్ లులూ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట.
ప్రియా ప్రకాశ్ వారియర్ కొంటెగా కన్ను కొట్టి నేషనల్ పాపులారిటీ వచ్చేసింది ‘ఒరు అడార్ లవ్’ సినిమాకే. రంజాన్ పండుగకే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. అనుకోని కారణాల వల్ల లేట్ అవుతూ వస్తోంది. ఒమర్ తెరకెక్కించే తదుపరి చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్నారట సన్నీ. జయరామ్, హనీ రోస్ ముఖ్య తారలు.
Comments
Please login to add a commentAdd a comment