‘పనికి తగ్గ జీతం’ అనేది కామన్. అయితే పనితో పాటు ‘వేరే పనులు’ కూడా చేయాలి... లేకపోతే పని పోయే అవకాశం ఉంది. సినిమా పరిశ్రమకి చెందిన పలువురు నటీమణులు అంటున్న మాట ఇది. అయితే తాము ఎదుర్కొంటున్న ఈ రకమైన ఒత్తిడి గురించి నటీమణులు అంత త్వరగా బయటపెట్టరు. ‘మీటూ’లో భాగంగా ఆ మధ్య కొందరు పెదవి విప్పితే, ఇప్పుడు మలయాళంలో ‘హేమా కమిటీ’ వల్ల ఎందరో తారలు ధైర్యంగా తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ఆ విషయాల్లోకి....
చాలా అవకాశాలు కోల్పోయా!: చార్మిలా
‘‘నా కెరీర్‌లో చేదు అనుభవాలు చాలా ఉన్నాయి. దర్శకుడు హరిహరన్, నిర్మాత ఏంపీ మోహనన్ నా పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఇంకా ఓ 28 మంది నాతో అభ్యంతరకరంగా వ్యవహరించారు’’ అని నటి చార్మిలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏయన్నార్, లక్ష్మీ జంటగా నటించిన ‘్రపాణదాత’ (1992)లో వీరి కూతురిగా నటించిందామె. భానుమతీ రామకృష్ణ స్వీయదర్శకత్వంలో రూ΄÷ందించిన ‘అసాధ్యురాలు’లో నటించారు. ‘ప్రేమ ఖైదీ’లో మాలాశ్రీ ఫ్రెండ్‌గా నటించారు. తమిళంలో పలు చిత్రాల్లో నటించిన చార్మిలా మలయాళంలో దాదాపు 40 చిత్రాల్లో నటించారు. తాజాగా ఓ మలయాళ మీడియాతో చార్మిలా మాట్లాడుతూ – ‘‘హరిహరన్ డైరెక్షన్‌లో మలయాళ చిత్రం ‘పరిణయం’ (1994) అంగీకరించా.
అదే సినిమాలో నటుడు విష్ణు కూడా నటించాల్సింది. ‘చార్మిలా అడ్జెస్ట్‌మెంట్‌కి ఒప్పుకుంటుందా’ అని విష్ణు ద్వారా హరిహరన్ అడిగించారు. ‘ఒప్పుకోదు’ అని విష్ణు చెప్పడంతో తనని, నన్ను ఆ సినిమా నుంచి తీసేశారు. అడ్జస్ట్ కాకపోవడంతో చాలా సినిమాలు కోల్పోయాను. నేను చాలామంది పేర్లు బయటపెట్టకపోవడానికి కారణం నాకో కొడుకు ఉన్నాడు. తల్లిగా నా బాధ్యతలు నాకున్నాయి కాబట్టి ఈ ఘటనలకు సంబంధించి యాక్షన్ తీసుకోవాలని కూడా అనుకోవడంలేదు’’ అన్నారు.
ఇంకా మలయాళ నిర్మాత ఎంపీ మోహనన్ గురించి చెబుతూ– ‘‘అర్జునన్ పిళ్లయుమ్ అంజు మక్కళుమ్’ (1997) నిర్మాత ఎంపీ మోహనన్ ఆ సినిమా చివరి రోజు షూటింగ్ పూర్తయ్యాక తన హోటల్ గదికి రమ్మంటే, నా స్టాఫ్‌తో కలిసి వెళ్లాను. మోహనన్, అతని ఫ్రెండ్స్ నాపై అత్యాచారం జరపడానికి ట్రై చేశారు. నేను తప్పించుకుని బయటపడ్డాను. నేనైతే బయటపడ్డాను కానీ వాళ్లు జూనియర్ ఆర్టిస్టులపై అత్యాచారం జరిపారు. నేను నాలుగు భాషల్లో (మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ) సినిమాలు చేశాను. కానీ ఇలాంటి ఘటనలు మలయాళ పరిశ్రమలోనే ఎక్కువ’’ అని చార్మిలా పేర్కొన్నారు.
ఇది వేకప్ కాల్ – సోమీ అలీ
1990లలో తాను హిందీ సినిమాలు చేసినప్పుడు లైంగిక దాడులు ఎదుర్కొన్నానని ఇటీవల సోమీ అలీ పేర్కొన్నారు. ‘‘కెరీర్‌లో కొనసాగాలంటే రూమ్‌కి వెళ్లాల్సిందే, లేకపోతే కుదరదు లాంటి హెచ్చరికలు నాకొచ్చాయి. కెరీర్ కోసం కొందరమ్మాయిలు అలా రూమ్‌లకు వెళ్లి, మర్నాడు ఉదయం ఇబ్బందిగా, సిగ్గుపడుతూ బయటకు వచ్చిన ఘటనలు చూశా. కానీ ఆ వ్యక్తులు మాత్రం ‘ఫ్యామిలీ మేన్’లా చలామణీ అవుతుంటారు. నాకు ఎదురైన చేదు అనుభవాల వల్లే ‘నో మోర్ టియర్స్’ ఫౌండేషన్ ఆరంభించా. ఇక మలయాళ పరిశ్రమలోని హేమా కమిటీ ఓ వేకప్ కాల్ లాంటిది’’ అని సోమీ అన్నారు.
ఎవరూ ఎవర్నీ బలవంత పెట్టరు: కామ్యా పంజాబీ
‘‘గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ప్రస్తుతం టీవీ రంగం క్లీన్‌గా ఉంది. ఇక్కడ (హిందీ టెలివిజన్ రంగాన్ని ఉద్దేశించి) ఏ మురికి (మహిళలపై లైంగిక దాడులు, క్యాస్టింగ్ కౌచ్‌లను ఉద్దేంచి) లేదు. ఎవరు ఎవర్నీ ఫోర్స్ చేయడం లేదు. స్క్రిప్ట్‌లోని రోల్‌కు సరిపోయి, మనలో నటించే ప్రతిభ ఉంటే చాలు. చాన్స్‌లు వస్తాయి’’ అని బుల్లితెర ఫేమ్ కామ్యా పంజాబీ పేర్కొన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘వినోద రంగంలో ప్రస్తుతం మహిళలకు సేఫ్టీ ప్లేస్ ఏదైనా ఉందంటే అది టీవీ విభాగంలోనే. ఒకవేళ ఏదైనా జరుగుతుందంటే అది పరస్పర అంగీకారంతోనే. అమ్మాయి సమ్మతించకపోతే ఏదీ జరగదు. ఎవరూ ఎవర్నీ బలవంతపెట్టరు. కొందరు పురుషులు ఉమనైజర్స్‌గా ఉండొచ్చు.. కాదనడం లేదు’’ అన్నారు కామ్య.
మలయాళంలో అత్యంత ప్రతిభ గల దర్శకుడిగా హరిహరన్‌కి పేరుంది. జాతీయ అవార్డు సాధించిన పలు చిత్రాలను తెరకెక్కించారు. వాటిలో చార్మిలా కోల్పోయిన ‘పరిణయమ్’ ఒకటి. ‘శరపంచరమ్, పంచాగ్ని, ఒరు వడక్కన్ వీరగాథ, సర్గమ్’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు హరిహరన్. మలయాళ సినిమాకి చేసిన కృషికిగాను కేరళ అత్యున్నత పురస్కారం అయిన ‘జేసీ డేనియల్ అవార్డు’ని కూడా అందుకున్నారు ఈ దర్శకుడు.
దర్శకుడు హరిహరన్‌పై చార్మిలా చేసిన ఆరోపణలను మలయాళ నటుడు విష్ణు ధ్రువీకరించారు. ఓ మలయాళ మీడియాతో మాట్లాడుతూ – ‘‘తను సర్దుబాటుకి ఒప్పుకుంటుందా? అని చార్మిలాని అడిగి, తెలుసుకోమని డైరెక్టర్ నాతో అన్నారు. చార్మిలా తిరస్కరించిన విషయాన్ని నేను హరిహరన్‌తో చె΄్పాను. దాంతో ‘పరిణయం’ సినిమా చాన్స్‌ని చార్మిలా కోల్పోయారు’’ అని విష్ణు పేర్కొన్నారు.
ఆరు సినిమాలు చేస్తేనే సభ్యత్వం వచ్చింది: మినూ మునీర్
మలయాళ తార మినూ మునీర్ తన పట్ల నటులు జయసూర్య, ఇడవెల బాబు, నటుడు–నిర్మాత మణియన్‌పిల్ల రాజు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్)లో సభ్యత్వం ΄÷ందాలంటే 3 చిత్రాల్లో నటిస్తే చాలట. కానీ తాను 6 సినిమాల్లో నటించినా సభ్యత్వం ఇవ్వలేదని మిను పేర్కొన్నారు. ‘అమ్మ’లో వివిధ పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించిన ఇడవెల బాబుకి ఫోన్ చేసి, సభ్యత్వం గురించి అడిగారట మిను. ‘‘మెంబర్‌షిప్ ఫామ్ పూర్తి చేయడానికి తన ఫ్లాట్‌కి రమ్మన్నాడు ఇడవెల. వెళ్లి, ఫామ్ పూర్తి చేస్తుండగా నా మెడపై ముద్దు పెట్టాడు. నేను వెంటనే అక్కణ్ణుంచి వెళ్లిపోయా’’ అన్నారు మినూ మునీర్.
నాపై ఆరోపణలు అవాస్తవం – నివిన్ పౌలి
మలయాళ పరిశ్రమలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఇప్పటికే 15 మందికి పైగా నటులపై కేసులు నమోదు అయినట్లు వార్తలు ఉన్నాయి. తాజాగా నివిన్ పౌలి పేరు తెరపైకి వచ్చింది. ఓ మూవీలో చాన్స్ ఇప్పిస్తామని మోసం చేసిన ఆరుగురిలో నివిన్ పౌలి కూడా ఉన్నారని, ఇది 2023 నవంబరులో దుబాయ్‌లో జరిగిందని ఓ మహిళ కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసిందనే వార్త వినిపిస్తోంది. దాంతో ‘‘నాపై తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చినట్లుగా నా దృష్టికి వచ్చింది. ఆమె ఎవరో నాకు తెలియదు. నాపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. నా లీగల్ టీమ్ చూసుకుంటుంది’’ అని నివిన్ పౌలి తెలిపారు.
కన్నడంలోనూ హేమా కమిటీలాంటిది కావాలి: శ్రుతీ హరిహరన్
మలయాళంలో ఉన్నట్లుగా కన్నడ పరిశ్రమలోనూ హేమా లాంటి కమిటీ ఉండాలని కన్నడ నటి శ్రుతీ హరిహరన్ అంటున్నారు. ‘‘హేమా కమిటీ ఇచ్చిన నివేదిక మలయాళ పరిశ్రమ గౌరవాన్ని దిగజార్చేలా ఉందన్న కొందరి మాటలతో ఏకీభవించను. సినిమా అనేది మంచి కళ. ఆ కళలో ఉన్న కొన్ని విషయాలను మార్చే టైమ్ వచ్చింది. మన ఇంటిని మనమే శుభ్రపరచుకోవాలి’’ అని శ్రుతీ హరిహరన్ పేర్కొన్నారు. ఇక గతంలో నటుడు అర్జున్‌పై శ్రుతీ హరిహరన్ కొన్ని ఆరోపణలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే తాను అలాంటి పనులు చేయలేదంటూ అర్జున్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు.
మహిళా నాయకత్వం ఉండాలి: ఏక్తా కపూర్
కరీనా కపూర్ లీడ్ రోల్‌లో హన్సల్ మెహతా దర్శకత్వంలో రూ΄÷ందిన హిందీ చిత్రం ‘ది బకింగ్‌హమ్ మర్డర్స్’ ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన ఈవెంట్‌లో చిత్రనిర్మాత ఏక్తా కపూర్ మాట్లాడుతూ– ‘‘ప్రతి రంగంలో మహిళలకు కూడా నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి. అప్పుడు వారు మహిళల భద్రతను గురించి కొంత ఆలోచన చేస్తారు. అలాగే నాయకత్వం బలంగా ఉండేలా తోటి మహిళలు తోడ్పాటు అందించాలి. నివేదికలు వచ్చినప్పుడు చదువుతాం... చాలా తెలుసుకుంటాం. కానీ మహిళల సాధికారికత, భద్రత విషయాల్లో పని ప్రదేశాల్లో మహిళలకు మెరుగైన వాతా వరణం నెలకొల్పాలి’’ అన్నారు. ‘‘మహిళలకు మెరుగైన పని వాతావరణం ఉండేలా పురుషులు కూడా బాధ్యతగా చొరవ తీసుకోవాలి’’ అని హన్సల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment