బంపర్ ఆఫర్!
ఈ మధ్యకాలంలో వెండితెరకు పరిచయమైన తారల్లో కీర్తి సురేశ్ మంచి మార్కులు సంపాదించుకోగలిగారు. ‘రైజింగ్ స్టార్’గా తమిళ, మలయాళ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి ‘నేను శైలజ’ ద్వారా తెలుగు తెరకు పరిచయమై, ఇక్కడివారిని కూడా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కీర్తిని ఓ బంపర్ ఆఫర్ వరించింది. తంతే బూరెల బుట్టలో పడ్డట్లు ఏకంగా తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించే అవకాశం దక్కించేసుకున్నారు. ‘‘విజయ్ సార్ సరసన సినిమా చేసే చాన్స్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ ఎప్పుడెప్పుడు ఆరంభం అవుతుందా?’’ అని ఎదరు చూస్తున్నా అని కీర్తీ సురేశ్ పేర్కొన్నారు.