bumper offer
-
ఇవి నా కార్డు డీటైల్స్.. నచ్చింది కొనుక్కోండి
పక్కవాళ్ళకు ఒక్క రూపాయి ఇవ్వడానికే చాలామంది ఆలోచిస్తారు. అలాంటి ఈ రోజుల్లో బ్యాంక్ కార్డు డీటైల్స్ పెట్టి, నచ్చింది కొనుక్కోండి అంటూ ఓ వ్యక్తి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఇందులో నిజమెంత ఉంది? అనే మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.బోల్డ్ కేర్ కో-ఫౌండర్ 'రాహుల్ కృష్ణన్' సోమవారం (సెప్టెంబర్ 2)న తన బ్యాంక్ కార్డు వివరాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. నచ్చింది కొనుక్కోండి అంటూ.. రూ.1000 లిమిట్ పెట్టారు. ఇది చూసినవారు మొదట్లో నమ్మలేదు, కానీ రాహుల్ కృష్ణన్ ఓటీపీలను కూడా షేర్ చేశారు. ఈ విషయం తెలిసి చాలామంది ఆ కార్డు వాడటం మొదలు పెట్టారు. లెక్కకు మించిన జనం ఆ కార్డును వాడటం వల్ల బ్యాంక్ దానిని బ్లాక్ చేసినట్లు సమాచారం.రాహుల్ కృష్ణన్ మరో ట్వీట్ చేస్తూ.. నా నెంబర్ బ్లాక్ చేశారు అని వెల్లడించారు. అయితే ఐదు గంటల్లో సుమారు 200 మంది ఈ కార్డును ఉపయోగించుకున్నట్లు సమాచారం. ఇందులో ఎక్కువమంది స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్ వంటి వాటిలో కొనుగోళ్లు చేసినట్లు తెలుస్తోంది.I think my number is blocked so no more otps unfortunately :(( https://t.co/qR2LeGdWom— Rahul Krishnan (@oneandonlyrk) September 2, 2024 -
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు బంపరాఫర్.. ఐడియా వర్కవుట్!
Tulsa Remote program: వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు అమెరికాలోని ఓ నగరం కొన్నాళ్ల క్రితం బంపరాఫర్ ప్రకటించింది. యూఎస్‌లోని ఎక్కడ వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగులైనా తమ నగరానికి వచ్చి నివాసం ఉంటే 10,000 డాలర్లు (సుమారు రూ.8 లక్షలు) డబ్బులిస్తామని వెల్లడించింది. ఇప్పుడా ఐడియా వర్కవుట్ అయినట్లు కనిస్తోంది. అమెరికాలో ఒక్లహామా రాష్ట్రంలో ఉన్న తుల్సా (Tulsa) అనే నగరం ఈ ఆఫర్ ప్రకటించింది. ‘తుల్సా రిమోట్’ అనే ప్రోగ్రామ్ ద్వారా అందించిన ఈ ఆఫర్ యూఎస్‌లోని ఇతర ప్రాంతాల నుంచి రిమోట్‌గా పూర్తి సమయం పని చేయగల నిపుణులను తమ నగరానికి ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని వెనుక ఆలోచన ఏమిటంటే ఉద్యోగులు ఇక్కడికి స్థిరపడతారు. ఇక్కడే ఖర్చు చేస్తారు. తుల్సా నగరం తుల్సా రిమోట్ ప్రోగ్రామ్ పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రోగ్రామ్ ఎకనమిక్ ఇంపాక్ట్ రిపోర్ట్ ప్రకారం.. 2022 డిసెంబర్ నాటికి తుల్సాకు 2,000 మందికి పైగా మకాం మార్చారు . 2022 చివరి నాటికి, తుల్సా రిమోట్ దాదాపు 307 మిలియన్ డాలర్ల ప్రత్యక్ష కార్మిక ఆదాయాన్ని ఆర్థిక వ్యవస్థకు తీసుకువచ్చింది. నగరానికి వచ్చిన ప్రతి ఇద్దరు తుల్సా రిమోట్ సభ్యులతోపాటు పాటు మరో ముగ్గురు వచ్చారు. 2019 నుంచి ఇప్పటి వరకు అక్కడ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న వారిలో 76 శాతం మంది ఇక్కడే స్థిరపడిపోయారు. -
బంపర్ ఆఫర్
మలయాళంలో ‘హెలెన్’ (2019), ‘కప్పెలా’ (2020) వంటి సినిమాల్లో నటించిన అన్నా బెన్ను ఓ బంపర్ ఆఫర్ వరించినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ముఖ్య పాత్రధారులు. రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మలయాళ బ్యూటీ అన్నా బెన్ పేరు తెరపైకి వచ్చింది. ‘కల్కి 2898 ఏడీ’ వంటి పాన్ వరల్డ్ మూవీలో చాన్స్ అంటే.. అది బంఫర్ ఆఫర్ అనొచ్చు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. -
పవన్ కళ్యాణ్ కి ఇదే చివరి అవకాశం.. కేఏ పాల్ మంచి మనసు
-
పవన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కేఏ పాల్
-
చంద్రబాబుని నమ్ముకుని మీరు పిచ్చోళ్ళు అవ్వొద్దు..
-
బంపర్ ఆఫర్..నేనే పీఎం, నేనే సీఎం
-
మద్యం వ్యాపారులకు బంపర్ ఆఫర్
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్).. మద్యం వ్యాపారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రెడిట్ రూపంలో మద్యం సరఫరా చేశారు. ఇదివరకు ఎంత చలానా చెల్లిస్తే అంతమొత్తం మద్యం డిపో నుంచి అందించేవారు. పోస్ట్ పెయిడ్ చెక్కులతో సరుకు తీసుకెళ్లారు. సిద్దిపేటలోని డిపో లో గురువారం అర్ధరాత్రి వరకు బిల్లింగ్ చేశారు. ఒక్కరోజే రూ14.14కోట్ల మద్యం అందించారు. వారం రోజుల్లో రూ. 36.23కోట్ల మద్యం గత నెల 25 నుంచి 31వ తేదీ వరకు చలానా ద్వారా రూ22.09కోట్ల మద్యం లిఫ్ట్ అయ్యింది. 25న రూ.3.73 కోట్లు, 26న రూ.2.98 కోట్లు, 27న సెలవు, 28న రూ.6.52కోట్లు, 29న రూ.2.95 కోట్లు, 30న రూ.5.91కోట్లు, 31న రూ.2.96కోట్లు మద్యం డిపో నుంచి వ్యాపారులు స్టాక్‌ను కొనుగోలు చేశారు. అదే క్రెడిట్ ఇవ్వడంతో ఒక్కరోజే 14.14కోట్లు స్టాక్‌ను వ్యాపారులు తీసుకెళ్లారు. చలానా, పోస్ట్ పెయిడ్ చెక్కులతో కలిపి వారం రోజుల్లో రూ.36.23కోట్ల మద్యం లిఫ్ట్ చేయడం గమనార్హం. ఎకై ్సజ్ శాఖ నిర్ణయించిన తేదీలోగా క్రెడిట్‌పై తీసుకున్న మద్యం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. -
ఎంబాపెకు బంపరాఫర్.. ఏకంగా రూ. 2,716 కోట్లు!
సిడ్నీ: సమకాలీన ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న కిలియాన్ ఎంబాపె కోసం సహజంగానే క్లబ్‌లు క్యూ కడతాయి. 2018 వరల్డ్‌కప్‌ను ఫ్రాన్స్ గెలవడంతో పాటు 2022లో తమ జట్టు ఫైనల్ చేరడంలో కూడా అతను కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఎంబాబెకు సౌదీ అరేబియా క్లబ్ అల్–హిలాల్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతనితో ఒప్పందం కోసం 332 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2 వేల 716 కోట్లు) ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఎంబాపె పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) టీమ్‌తో ఉన్నాడు. ఈ టీమ్‌తో అతను కాంట్రాక్ట్ పొడిగించుకునే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో అల్–హిలాల్ ముందుకు వచి్చంది. ప్రస్తుతం దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. -
పిల్లల్ని కంటే రూ.5.6 లక్షలు.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్!
ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న చైనా ఇప్పుడు యువత జనాభా తగ్గి వయసు మళ్లిన వారి సంఖ్య పెరిగిపోవడంతో ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల్ని కనాలని ఆ దేశ ప్రభుత్వం కూడా అక్కడ జంటలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో చైనాలో అతిపెద్ద ట్రావెల్ ఏజెన్సీ ట్రిప్ డాట్ కామ్ తమ ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. ఐదేళ్లలో రూ.5.6 లక్షలు కంపెనీలో పనిచేసే ఉద్యోగులు పిల్లల్ని కంటే ఒక్కో శిశువుకు ఏడాదికి 10,000 యువాన్లు (రూ.1.1 లక్షలు) చొప్పున ఐదేళ్లపాటు అందిస్తామని ట్రిప్ డాట్ కామ్ సంస్థ ప్రకటించింది. అంటే ఒక్కో బిడ్డకు ఐదేళ్లలో మొత్తంగా 50,000 యువాన్లు (రూ.5.6 లక్షలు) లభిస్తాయి. జూన్ 30న ప్రకటించిన ఈ ఆఫర్ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. వారికి మాత్రమే.. ఈ చైల్డ్ కేర్ బినిఫిట్లు కంపెనీలో మూడేళ్లకు పైగా పని చేస్తున్న ఉద్యోగులకు మాత్రమే. "మా ఉద్యోగులు వారి వృత్తిపరమైన లక్ష్యాలు, సాధనలపై రాజీ పడకుండా వారి కుటుంబాలను పోషించుకునేలా ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంగా ఈ చైల్డ్‌కేర్ బెనిఫిట్‌ను ప్రవేశపెట్టాం" అని ట్రిప్ డాట్ కామ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జేమ్స్ లియాంగ్ చెప్పినట్లుగా సీఎన్ఎన్ వార్తా కథనం పేర్కొంది. కాగా చైల్డ్ కేర్ బినిఫిట్ల కోసం కంపెనీకి సుమారు 1 బిలియన్ యువాన్ (దాదాపు రూ.1131 కోట్లు) ఖర్చు అవుతుంది. చైనాలో ఒక ప్రైవేట్ కంపెనీ ఈ తరహాలో చైల్డ్ కేర్ బినిఫిట్లు ప్రారంభించడం ఇదే తొలిసారి. చైనా జననాల రేటు గత ఏడాది 1,000 మందికి గానూ 6.77 జననాలకు పడిపోయింది. ఇది 2021లో 7.52 జననాలుగా ఉండేది. ఇది రికార్డ్ స్థాయి అత్యంత తక్కువ జననాల రేటు. కొత్త తరం జనాభాను ప్రోత్సహించేందుకు 2021లో చైనా ప్రభుత్వం ప్రతి జంట ముగ్గురు పిల్లలను కనేందుకు అవకాశం ఇచ్చారు. కోవిడ్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నప్పటికీ పిల్లలను కనడంపై జంటలు ఆసక్తి చూపించలేదు. తక్కువ ఆదాయం, పెరిగిన పిల్లల సంరక్షణ, విద్యా ఖర్చులు వంటివి ఇందుకు కారకాలుగా ఉన్నాయి. ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. డబుల్ డిజిట్ బాటలో వేతన ఇంక్రిమెంట్లు -
విక్టరీ వెంకటేష్ దక్షిణ భారత స్టార్ నుండి పాన్ ఇండియన్ స్టార్ గా...
-
కేఏ పాల్ పెద్ద మనసు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్
-
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్: ఐఫోన్ 14 పై రూ. 44వేల భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: యాపిల్ ఐఫోన్ 14పై భారీ తగ్గింపు లభిస్తోంది.ఈ రోజు (మార్చి 31) ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో అనేక ఉత్పత్తులపై స్మార్ట్డీల్స్ అందిస్తోంది. ముఖ్యంగా ఖరీదైన ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్న వారికి బంపర్ ఆఫర్. దాదాపు రూ. 44,901 తగ్గింపు తర్వాత కేవలం రూ. 34,999కి అందుబాటులో ఉంది. (సంక్షోభ సమయంలో హెచ్‌సీఎల్ టెక్ గుడ్‌న్యూస్) మార్చి 31 నుండి ఏప్రిల్ 3 వరకు జరిగే బిగ్ బచత్ ధమాల్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మొబైల్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,901 తగ్గింపుతో రూ.68,999కి విక్రయిస్తోంది. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.4000 తక్షణ తగ్గింపు, స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్లో రూ. 30,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అలా రూ. 44,901 తగ్గింపు తర్వాత యాపిల్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 34,999కి లభించనుంది. (ఇదీ చదవండి: హయ్యస్ట్ సాలరీతో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టేసిన అవని మల్హోత్రా) యాపిల్ ఐఫోన్ 14లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే 12 ఎంపీ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా,12 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (అచ్చం యాపిల్ స్మార్ట్‌వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!) -
ఐటీ ఉద్యోగులకు TSRTC బంపర్ ఆఫర్
-
బిగ్’సి’ దీపావళి డబుల్ ధమాకా ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైలర్ బిగ్ ‘సి’ దీపావళి పండుగ సందర్భంగా కస్టమర్లకు ‘‘డబుల్ ధమాకా ఆఫర్’’ ఆఫర్లను ప్రకటించింది. ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1,999 విలువైన ఇయర్ బడ్స్‌ను కేవలం రూ.199లకే లేదా రూ.3,999 విలువైన గిగ్మోర్ కాలింగ్ స్మార్ట్ వాచ్‌ను కేవలం రూ.999లకే అందించనుంది. ప్రతిస్మార్ట్ ఫోన్‌పై రూ.7900 వరకు తక్షణ డిస్కౌంట్ కూడా ఇస్తుంది. ప్రతి ల్యాప్‌ట్యాప్ కొనుగోలుపై రూ.3వేల తక్షణ డిస్కౌంట్‌తో పాటు ల్యాప్‌టాప్ బ్యాగ్ ఉచితంగా ఇస్తుంది. ఏటీఎం కార్డుపై ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండానే మొబైల్, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే ఆకర్షణీయమైన సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. బిగ్ సి అందిస్తున్న ఈ దీపావళీ పండుగ ఆఫర్లను కస్టమర్లు అందరూ వినియోగించుకోవాలని కంపెనీ సీఎండీ బాలు చౌదరి తెలిపారు. -
యూట్యూబ్ క్రియేటర్స్‌కి బంపర్ ఆఫర్
-
బరువు తగ్గితే రూ.10 లక్షలు.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్
ముంబై: జెరోడా అనే ఆన్లైన్ బ్రోకరేజీ కంపెనీ ఉద్యోగులకు సీఈఓ నితిన్ కామత్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బరువు తగ్గితే మంచి ఇన్సెంటివ్‌లు ఇస్తారట. అంతేకాదు, ఒక లక్కీ విజేతకు ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. ఇందుకోసం వారు రోజుకు కనీసం 350 క్యాలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా ఏడాది పాటు శ్రమించి లక్ష్యంలో 90 శాతం సాధించిన వారందికీ నెల వేతనం బోనస్‌గా ఇస్తారు! దీనికి తోడు రూ.10 లక్షల బంపర్ బొనాంజా ఉండనే ఉంది! దాంతో ఈ ఫిట్నెస్ చాలెంజ్‌ను సీరియస్‌గా తీసుకుని ఉద్యోగులంతా గట్టిగానే శ్రమిస్తున్నారట. అన్నట్టూ, ఎవరు ఏ మేరకు కొవ్వు కరిగిస్తున్నదీ కంపెనీ తాలూకు ఫిట్నెస్ ట్రాకర్ గమనిస్తుంటుందట. ఉద్యోగుల ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఈ కంపెనీకి కొత్తేమీ కాదట. 25 కంటే తక్కువ బీఎంఐ ఉన్న ఉద్యోగులకు ఇప్పటికే సగం నెల వేతనం బోనస్‌గా ఇస్తోంది!! వర్క్ ఫ్రం హోం వల్ల స్థూలకాయం తెచ్చుకుని అనారోగ్యం పాలు కావొద్దన్నదే తమ ఉద్దేశమంటున్నారు కామత్. కరోనా కాలంలో పెరిగిన బరువును తానెలా తగ్గించుకున్నదీ చెబుతూ ఉద్యోగులను మోటివేట్ చేస్తున్నారు. -
వీవీఎస్ లక్ష్మణ్ కు బంపర్ ఆఫర్
-
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్
-
ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏకు బంపర్ ఆఫర్
సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏ బాలాజీకి వయోజన విద్యాశాఖ ఉన్నతాధికారులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. విధులకు గైర్హాజరయినా ప్రతి నెలా ఠంచనుగా వేతనం ఖాతాలో వేశారు. పేకాటలో దొరికి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినా... చర్యలు తీసుకోకుండా అండగా నిలుస్తున్నారు. సగటు ఉద్యోగి ఏ చిన్న తప్పుచేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్ చేసే ఉన్నతాధికారులు... బాలాజీకి అండగా నిలవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: మళ్లీ బాలకృష్ణ పీఏగా మారిన బాలాజీ.. గృహప్రవేశమని చెప్పి ఆఫీస్‌కు డుమ్మా కొట్టి హాజరుతో సంబంధం లేకుండా జీతం.. వయోజన విద్య పెనుకొండ డివిజన్ సూపర్వైజర్గా పనిచేసే బాలాజీ డిప్యుటేషన్‌పై ఆరేళ్ల క్రితం బాలకృష్ణ పీఏగా నియమితులయ్యారు. అయినప్పటికీ అతను ప్రతి నెలా బాలకృష్ణ వద్ద విధులు నిర్వహిస్తున్నట్లు హాజరుపట్టిక, టూర్గైడ్ను విధిగా వయోజన విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపాలి. కానీ రెండేళ్లుగా టూర్‌గైడ్, హాజరు పట్టిక పంపకపోయినా వయోజన విద్యాశాఖ అధికారులు ప్రతి నెలా బాలాజీకి జీతం మంజూరు చేశారు. పేకాట ఆడినా చర్యలు శూన్యం.. ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ బాలాజీ టీడీపీ నాయకుడిలా వ్యవహరించేవారు. టీడీపీ కార్యక్రమాలు, ఆ పార్టీ సమాచారాన్ని నేరుగా వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ పంపేవాడు. అయినప్పటికీ అతనిపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ ఏడాది మార్చి 20న గౌరీబిదనూరులో పేకాట ఆడుతూ పట్టుబడగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయడంతో పాటు రిమాండ్‌కు పంపగా.. అతను బెయిల్ తెచ్చుకున్నాడు. దీంతో అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ... బాలాజీని సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తూ వయోజన విద్యాశాఖకు ఉత్తర్వులు ఇచ్చారు. బాలకృష్ణ పీఏగా రిలీవ్ చేసి వయోజన విద్యాశాఖకు సరెండర్ చేశారు. కానీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు బాలాజీని సస్పెండ్ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. భోజనం చేస్తుంటే కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారని... పేకాట ఆడలేదని తప్పుడు నివేదికను వయోజన విద్యాశాఖ డైరెక్టర్‌కు పంపి.. కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినా... అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, మభ్యపెట్టి చర్యలు తీసుకోకుండా కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లు వయోజన విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. -
Hyderabad: ప్రయాణికులకు మెట్రో రైలు బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు మెట్రో రైలు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వ సెలవు రోజున రూ.59 చెల్లించి అపరిమితంగా ప్రయాణించేందుకు ‘సూపర్ సేవర్ హాలిడే కార్డు’ను ప్రవేశపెట్టింది. ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి గురువారం అమీర్‌పేట మెట్రో స్టేషన్లో దీనిని ప్రారంభించారు. ఈ కార్డుతో సెలవు రోజున కేవలం రూ.59తో మెట్రోలో ప్రయాణించవచ్చని ఆయన వెల్లడించారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగవచ్చు. ఉగాది పండగ రోజు (ఏప్రిల్ 2) నుంచి మెట్రో రైల్ టికెట్ కౌంటర్ల వద్ద ఈ కార్డులు విక్రయిస్తారని ఆయన తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ముందుగా ప్రకటించిన 100 ప్రభుత్వ సెలవు దినాల్లోనే ఈ రాయితీ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. లక్కీ డ్రా విజేతలకు బహుమతుల ప్రదానం మెట్రో సువర్ణ ఆఫర్లో భాగంగా నెలవారీ పాసులు కొనుగోలు చేసిన ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపికచేశారు. గెలుపొందిన 5 మంది విజేతలకు బహుమతులను అందజేశారు. మెట్రో సువర్ణ ఆఫర్ విజేతలకు ప్రతి నెల లక్కీ డ్రా తీసి బహుమతులను అందజేస్తున్నట్లు కేవీబీ రెడ్డి తెలిపారు. చదవండి: (రీజినల్ రింగ్ రోడ్డు తొలి గెజిట్ విడుదల) -
బడిలో చేరేందుకు బంపర్ ఆఫర్లు..
-
Xiaomi Bumper Offer: రూ.15,999 స్మార్‌వాచ్.. రూ.7,999లకే.. ఇంకా మారెన్నో..
Mi Accessories Bonanza : ఇండియాలో నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ సెల్లర్ కంపెనీగా రికార్డ్ సృష్టించిన షావోమీ ఎంఐ సంస్థ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. యాక్ససరీస్ బొనాంజా పేరుతో తగ్గింపు ధరలకే స్మార్ట్‌వాచ్, ఇయర్‌ఫోన్స్, స్మార్ట్బ్యాండ్స్ తదితర యాక్సెసరీస్‌ని అందిస్తోంది. యాక్సెసరీస్ బొనాంజా స్మార్ట్ఫోన్లతో ఇండియా మార్కెట్లోకి ఎంటరైన షావోమి సంస్థ ఇక్కడ బలంగా పాతుకుపోయింది. స్మార్ట్ఫోన్లతో పాటు ల్యాప్‌ట్యాప్స్, బ్యాగ్స్, స్మార్ట్‌వాచెస్, ఇయర్‌ఫోన్స్, పాకెట్ స్పీకర్స్ తదితర యాక్సెసరీస్‌ని ఇక్కడి ప్రజలకు పరిచయం చేసింది. తక్కువ ధరకే నాణ్యమైన ప్రొడక్టులు అందిస్తుండంతో ఎంఐకి ఇండియాలో భారీ కస్టమర్ బేస్ ఏర్పడింది. ఈ కస్టమర్ల కోసం యాభై శాతం డిస్కౌంట్‌తో యాక్సెసరీస్ అందిస్తోంది. ఈ మేరకు నవంబరు 13, 14 తేదీల్లో ప్రత్యేకంగా యాక్సెసరీస్ బొనాంజా సేల్స్ ప్రకటించింది. ఎంఐ వాచ్ రివాల్వ్ యాక్సెసరీస్ బొనాంజా సేల్స్‌లో స్మార్ట్‌వాచ్ రివాల్వ్‌పై అత్యధికంగా రూ. 8000ల వరకు తగ్గింపు ఎంఐ అందిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ ఎంఆర్పీ ధర రూ.15,999లు ఉండగా ఈ ఆఫర్లో కేవలం రూ.7,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్ ఫీచర్లు ఇలా ఉన్నాయి. - 3.53 అమోల్డ్ డిస్ప్లే, సింగిల్ ఛార్జ్‌తో 14 రోజలు బ్యాటరీ బ్యాకప్ - పీపీజీ బయో సెన్సార్స్‌తో 24 గంటల రియల్‌టైమ్ మానిటరింగ్, - లైఫ్‌క్యూ సాయంతో స్లీప్ట్రాకింగ్, వైటల్ సైన్, స్ట్రెస్, బ్రీత్, హార్ట్‌రేట్ మానిటరింగ్ ఫీచర్లు - 10 ప్రొఫెషనల్ స్పోర్ట్స్ , 117 స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్ - ఆటోమేటిక వర్క్అవుట్ డిటెక్షన్ - జీపీఎస్, గ్లోనాస్, గాలిలియో, బీడీఎస్ సపోర్ట్ - అమెజాన్ అలెక్సా సపోర్ట్, వాటర్ రెసిస్టెంట్ - ఈ రివాల్వ్ స్మార్ట్‌వాచ్‌లో మరో వేరియంట్ అమెజాన్‌లో రూ.6,999లకే లభిస్తోంది. ఇతర ఆఫర్లు - ఎంఐ ఇయర్‌ఫోన్ ఎంఆర్పీ ధర రూ.999 ఉండగా ప్రత్యేక తగ్గింపుగా రూ.199కే వస్తోంది - ఎంఐ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ బేసిక్ ధర రూ.1799 ఉండగా ఈ ఆఫర్లో రూ.499కే వస్తోంది - ఎంఐ స్మార్ట్‌బ్యాండ్ 4 ధర రూ.2499 ఉండగా యాక్సెసరీస్ బొనాంజా సేల్స్‌లో రూ.1,599కి అందిస్తోంది - రెడ్మీ స్మార్ట్‌బ్యాండ్ ధర రూ.2099లు కాగా ఈ ఆఫర్లో రూ.1299కే వస్తోంది - ఎంఐ పాకెట్ స్పీకర్ ధర రూ.1499 ఉండగా ఇప్పుడు రూ.799కే లభిస్తోంది. - ఎంఐ ప్రొటెక్టివ్ గ్లాస్ ధర రూ.599 కాగా ఈ ఆఫర్లో రూ.49కే అందుబాటులో ఉంది. చదవండి:షావోమీదే పైచేయి.. శాంసంగ్ వెనుకంజ -
‘బుల్లెట్టు బండి’ వధువుకు అద్భుత అవకాశం
తెలంగాణ యాసలో ఎంతో మధురంగా ఉన్న ‘బుల్లెట్టు బండి’ పాటకు ఓ వధువు తన పెళ్లి బరాత్‌లో అద్భుతంగా డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఒక జానపదం పాటకు చేసిన డ్యాన్స్ వీడియో ట్రెండింగ్‌లోకి వెళ్లింది. ఆ డ్యాన్స్ చేసిన యువతికి ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ఏ పాటకైతే డ్యాన్స్ చేసిందో ఆ పాటను నిర్మించిన సంస్థ తమ తదుపరి పాటకు డ్యాన్స్ చేసే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ నిర్వాహకురాలు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్ఓ రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె సాయి శ్రీయ వివాహం రామకృష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఈనెల 14వ తేదీన జరిగింది. అప్పగింతల సమయంలో సాయిశ్రీయ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. (చదవండి : బుల్లెట్ బండి పాట: ఎవరీ మోహన భోగరాజు?) అయితే ఆమె డ్యాన్స్ చేసిన పాటను నిర్మించిన సంస్థ బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్. రచయిత లక్ష్మణ్ సాహిత్యానికి ఎస్కే బాజి సంగీతం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఆ పాటను అద్భుతంగా తెరకెక్కించిన బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్వాహకులు నిరూప స్పందించారు. సాయిశ్రీయతో నిరూప ఫోన్లో మాట్లాడారు. (చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా ‘బుల్లెట్టు బండి’ వధువు) ‘మా సంస్థలో నిర్మించే తదుపరి పాటకు నువ్వే క్యాస్ట్‌గా (నటించడం) చేయాలి’ అని చెప్పగా సాయిశ్రీ ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. అంత పెద్ద అవకాశం రావడంతో సాయిశ్రీయ కాదనలేకపోయింది. దీంతో సాయిశ్రీయ త్వరలోనే ఆమె ప్రధాన పాత్రలో ఓ పాట రాబోతోంది. బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆవిర్భవించి దాదాపు రెండేళ్లవుతోంది. ఈ సంస్థ గతంలో అనేక పాటలు రూపొందించింది. రాహుల్ సిప్లిగంజ్, నోయల్‌తో పాటలు పాడించింది. ‘బుల్లెట్ బండి’ పాటతో ఆ సంస్థకు మంచి క్రేజ్ ఏర్పడింది. చదవండి: చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’ -
ఇకపై చాను ఐనాక్స్‌లో ఎక్కడైనా ఫ్రీగా సినిమా చూడొచ్చు..
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో దేశానికి రజత పతకం అందించిన మీరాబాయి చానుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. దీంతో పాటు ఆమెకు భారీ స్థాయిలో అవార్డులు, రివార్డులు క్యూ కట్టాయి. ఈ క్రమంలో తాజాగా ఆమెను మరో బంపర్ ఆఫర్ వరించింది. చానుకు జీవితకాలం పాటు సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తామని ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రకటించింది. టోక్యోలో పతకం గెలిచే ప్రతి భారత అథ్లెట్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. వీరితో పాటు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్రతి అథ్లెట్‌కు ఏడాది పాటు టికెట్లు ఫ్రీగా టికెట్లు ఇస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని ఐనాక్స్ తమ ట్విటర్లో పోస్ట్ చేసింది. కాగా, దేశంలో ఐనాక్స్కు మొత్తం 648 మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. INOX takes immense pride in all the endeavors of #TeamIndia at #Tokyo2020 🌟✨We are happy to announce free movie tickets for lifetime for all the medal winners🏅& for one year for all the other athletes🎟️🎟️#AayegaIndia #INOXForTeamIndia #EkIndiaTeamIndia #Respect #JaiHind 🇮🇳 pic.twitter.com/evaAAJbgKx— INOX Leisure Ltd. (@INOXMovies) July 27, 2021 ఇదిలా ఉంటే, అంతకుముందు డొమినోస్ ఇండియా పిజ్జా వారు కూడా చానుకు లైఫ్‌టైం ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. చాను.. జీవితకాలం ఎన్ని పిజ్జాలు తిన్నా ఫ్రీ ఆఫర్ ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఒలింపిక్స్ పతకం అందుకుంటున్న సందర్భంగా పిజ్జా తినాలనుందని చాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డొమినోస్ ఈ మేరకు స్పందించింది. ఇక విశ్వవేదికపై భారతీయ జెండాను రెపరెపాలాడించిన చానుపై కానుకల వర్షం కురుస్తోంది. ఇప్పటికే భారత రైల్వేశాఖ రూ. 2కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించడంతో పాటు ప్రమోషన్ కూడా ఇచ్చింది. ఈశాన్య రైల్వేలో పని చేస్తున్న ఆమెను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (స్పోర్ట్స్)గా ప్రమోట్ చేసింది. మరోవైపు మణిపూర్ సర్కార్ కూడా చానుకు కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం అందించింది. -
5 పైసలకే నోరూరించే బిర్యానీ.. ఎగబడ్డ జనం
మధురై (తమిళనాడు): బిర్యానీ పేరు చెబితేనే మన నోరూరుతుంది. బిర్యానీ నచ్చని భోజనప్రియులు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి బిర్యానీని కేవలం ఐదంటే ఐదు పైసలకు అందిస్తే ఇంకేం ఎగబడి తింటారు. ఇలాగే ఓ హోటల్ ప్రారంభ ఆఫర్‌గా ప్రకటిస్తే జనాలు ఎగబడి తిన్నారు. ఆ ఆఫర్ కొన్ని షరతులతో విధించినా కూడా అనూహ్య స్పందన రావడంతో ఆ హోటల్ కిటకిటలాడింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. సెల్లూర్‌లో బిర్యానీ కోసం ఎగబడిన ప్రజలు తమిళనాడులోని మధురై జిల్లా సెల్లూర్‌లో సుకన్య బిర్యానీ హోటల్ ప్రారంభమైంది. ప్రారంభ ఆఫర్‌గా 5 పైసల నాణెం తీసుకొస్తే బిర్యానీ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. చెల్లని ఐదు పైసల నాణెం ఎవరి వద్ద ఉంటాయని భావించిన హోటల్ యాజమాన్యానికి ఊహించని రీతిలో స్పందన ఎదురైంది. పెద్ద ఎత్తున జనాలు ఐదు పైసల నాణెం తీసుకుని వచ్చి హోటల్ ముందు వరుస కట్టారు. చిన్నాపెద్దా అందరూ ఎగబడడంతో ఆ హోటల్ తాకిడిని తట్టుకోలేకపోయింది. 300 మందికి ఆ నాణెలు తీసుకొచ్చారు. అయితే బిర్యానీ ధ్యాసలో పడి కరోనా సోకే విషయాన్ని మరిచి ఎగబడ్డారు. అంతమంది తరలిరావడంతో యాజమాన్యం హోటల్ షట్లర్లు మూసేసింది. ఆలస్యంగా వచ్చిన కొందరు నాణెం ఇచ్చి బిర్యానీ అడగ్గా ఇవ్వలేదు. గతంలో దిండిగల్ పట్టణంలో కూడా ఇలాంటి ఆఫర్ ప్రకటించారు. జనాల తాకిడికి దుకాణం మూసివేసిన నిర్వాహకులు -
జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో భాగమైన జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోనున్న కంపెనీ సంస్థ సిబ్బందికి ఫోన్ లేదా ఐప్యాడ్ లేదా ల్యాప్‌టాప్‌ను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా నగదును సైతం చెల్లించేందుకు ప్రతిపాదించింది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అనుమతించిన రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా జెట్ ఎయిర్వేస్ సిబ్బందిలో కనీసం 95 శాతం టేకోవర్‌కు అనుకూలంగా ఓటింగ్ చేయవలసి ఉంటుంది. ఇలాగైతేనే జెట్ ఎయిర్వేస్ కొనుగోలు బిడ్‌కు క్లియరెన్స్ లభించనుంది. జలాన్ కల్రాక్ కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసేందుకు బిడ్‌ను గెలుపొందిన సంగతి తెలిసిందే. కంపెనీ సిబ్బంది(ఉద్యోగులు, కార్మికులు) ప్రయోజనాల నేపథ్యంలో టేకోవర్ ప్రక్రియకు ఈ నెల 5న ప్రారంభమైన వోటింగ్ ఆగస్ట్ 4వరకూ కొనసాగనుంది. గత నెల 22న ఎన్సీఎల్టీ కొన్ని షరతులతో జలాన్ కల్రాక్ కన్సార్షియంకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా కంపెనీ సిబ్బందికి కొన్ని రకాల లబ్ధిని చేకూర్చేందుకు కన్సార్షియం ఆమోదించింది. ఈ అంశాలను జెట్ ఎయిర్వేస్ వెబ్సైట్లో పొందుపరిచారు. రుణ భారం, నష్టాలతో కుదేలైన జెట్ ఎయిర్వేస్ 2019 ఏప్రిల్ 17న మూత పడింది. తదుపరి 2019 జూన్ 20న దివాలా చర్యలు ప్రారంభమయ్యాయి. ఆఫర్ ఇలా..: జెట్ ఎయిర్వేస్ సిబ్బంది(కార్మికులు)కి టేకోవర్ కంపెనీ ఫోన్ లేదా ఐప్యాడ్ లేదా ల్యాప్‌టాప్‌ను ఇచ్చేందుకు సన్నద్ధమైంది. అంతేకాకుండా రూ. 22,800 చొప్పున నగదును చెల్లించనుంది. ఇక ఉద్యోగులకు ఒక్కొక్కరికీ రూ.11,000 చొప్పున అందించనుంది. జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకునేందుకు జలాన్ కల్రాక్ కన్సార్షియం మొత్తంగా నగదు రూపేణా రూ. 1,375 కోట్లను వెచ్చించనుంది. -
బంపర్ ఆఫర్: కోవిడ్ టీకా తీసుకుంటే రూ.13 వేలు
ఏథెన్స్: గ్రీస్‌లోని 26 ఏళ్లలోపు యువతకు ఆ దేశ ప్రధానమంత్రి బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించారు. కరోనా టీకా వేయించుకున్న వారికి 150 యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.13,288. తొలి డోసు తీసుకున్న వారికి జూలై 15 నుంచి ఈ బహుమతిని అందజేస్తామన్నారు. గ్రీస్ దేశానికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. దేశంలో అర్హులందరికీ కరోనా టీకా ఇచ్చి, పర్యాటకాన్ని పట్టాలెక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, వ్యాక్సినేషన్‌పై యువత ఆసక్తి చూపడం లేదు. (చదవండి: కిమ్ బరువు తగ్గడం వెనక కారణమిదేనట..!) -
క్రీడాకారులకు బంపర్ ఆఫర్.. పసిడి గెలిస్తే రూ.3 కోట్లు, వెండికి రూ.2 కోట్లు..
టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే తమిళ క్రీడాకారులకు సీఎం ఎంకే స్టాలిన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. బంగారు పతకం సాధిస్తే రూ.3 కోట్లు, వెండికి రూ.2 కోట్లు, కాంస్య పతకానికి రూ.కోటి బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్రంలో నాలుగు చోట్ల ఒలింపిక్స్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. క్రీడాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సాక్షి, చెన్నై(తమిళనాడు): క్రీడాకారులకు కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌కు శనివారం శ్రీకారం చుట్టారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం ఎంకే స్టాలిన్ పాల్గొని తమిళనాడు నుంచి ఒలింపిక్స్ వెళ్తున్న ఏడుగురు క్రీడాకారులకు తలా రూ.ఐదు లక్షల ప్రోత్సాహకాన్ని అందించారు. ఆయన మాట్లాడుతూ క్రీడను ఆటగా కాకుండా సత్తా చాటాలన్న ఆకాంక్షతో ముందుకు సాగితే పతకం విజయం సాధించవచ్చని తెలిపారు. రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. క్రీడాకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. పతకంతో వస్తే నజరానా.. రాష్ట్రంలో నాలుగు చోట్ల ఒలింపిక్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల్ని ప్రోత్స హిస్తూ రవాణాతో సహా అన్ని ఖర్చులు భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. క్రీడల్లో మెరుగైన శిక్షణ ఇస్తామన్నారు. క్రీడాకారులు పతకాలు సాధించి రాష్ట్ర గౌరవాన్ని ఎలుగెత్తి చాటాలని పిలుపునిచ్చారు. చెన్నైలో క్రీడా నగరం ఏర్పాటు చేయనున్నామని, ఇక్కడ అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రం నుంచి టోకియో ఒలింపిక్స్‌కు వెళ్తున్న క్రీడాకారులు పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఒలింపిక్‌లో బంగారు పతకం సాధిస్తే రూ.3 కోట్లు, వెండి పతకానికి రూ.2 కోట్లు, కాంస్య పతకానికి రూ.కోటి నగదు బహుమతి ఇస్తామని వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణ్యం, క్రీడాశాఖ మంత్రి మయ్యనాథన్, దేవాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఇంగ్లాండ్‌కు పయనమా? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని శాఖల్లో సాగుతున్న అభివృద్ధి, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షించాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. మొదట శనివారం పరిశ్రమల శాఖ వర్గాలతో సమావేశమయ్యారు. పెట్టుబడుల ఆహ్వానం, ప్రస్తుతం పెట్టుబడులు పెట్టిన సంస్థలు, సాగుతున్న పనులపై సమీక్షించారు. రాష్ట్రంలోకి పెట్టుబడుల్ని ఆహ్వానించడమే లక్ష్యంగా జూలై లేదా ఆగస్టులో స్టాలిన్ ఇంగ్లాండ్‌కు పయనమయ్యేలా చర్చ సాగినట్టు సమాచారం. ఇక తన నియోజకవర్గం కొళత్తూరులో సాయంత్రం స్టాలిన్ పర్యటించారు. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించారు. అలాగే రంగు చేపల పెంపకం, ఉత్పత్తి, విక్రయదారులతో సమావేశమయ్యారు. చదవండి: Delta Variant:: రేపటి నుంచి మళ్లీ కఠిన ఆంక్షలు -
కరోనా వ్యాక్సిన్: టీకా వేయించుకుంటే రూ.7 కోట్లు మీవే..
వాషింగ్టన్: కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ రూపొందించారు. కరోనా కట్టడికి ఏకైక పరిష్కారం వ్యాక్సినేషనే. ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ వేయించేందుకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నాయి. వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని కొన్ని దేశాలు, రాష్ట్రాలు బహుమతులు, ప్రోత్సహాకాలు, సహాయం వంటివి చేస్తున్నాయి. తాజాగా అమెరికాలోని ఒహియో రాష్ట్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ వేయించుకుంటే అక్షరాల 7 కోట్లకు పైగా డబ్బులు మీ సొంతమే. అమెరికాలోని ఒహియో రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యాక్సిన్ వేయించుకుంటే లాటరీలో పాల్గొనవచ్చు. అందులో గెలిస్తే ఒక మిలియన్ డాలర్లు గెలుచుకోవచ్చు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘మనం ఎన్నో సాధించాం. ఈరోజు మనం సురక్షితంగానే ఉన్నాం. భవిష్యత్‌లో మెరుగైన సమాజం కోసం.. కరోనాపై పోరాడేందుకు వ్యాక్సిన్ వేయించుకోండి’ గవర్నర్ పిలుపునిచ్చారు. మే 26వ తేదీన తేదీన లాటరీ ఓపెన్ చేసి విజేతను ప్రకటిస్తామని గవర్నర్ మైక్ డివైన్ తెలిపారు.. 18 ఏళ్లు పైబడిన వారికి లాటరీలో ఒక మిలియన్ డాలర్ల నగదు అందిస్తామని వెల్లడించారు. మే 18వ తేదీ నుంచి పెద్ద వారికి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని వివరించారు. ఇక 17ఏళ్లలోపు వారందరూ వ్యాక్సిన్ వేసుకుంటే గెలిచిన వారికి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నాలుగేళ్ల ఉపకార వేతనం అందిస్తామని ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. చదవండి: ‘కోవిషీల్డ్’ డోసుల వ్యవధిలో కీలక మార్పులు చదవండి: కంగారొద్దు.. రెమిడిసివిర్ కొరత లేదు Also starting May 26th, we will announce the winner of a drawing of all those 17 years-old and under who are vaccinated. The winner will receive a full, four-year scholarship to our state universities. We will do this every Wednesday, for five straight Wednesdays. — Governor Mike DeWine (@GovMikeDeWine) May 13, 2021 -
12 ఏళ్ల తర్వాత సాయిరామ్ శంకర్‌కు మళ్లీ ‘బంపర్ ఆఫర్’
పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన 'బంపర్ ఆఫర్' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. సాయిరామ్ శంకర్ కెరీర్లోనే అది బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు ఆయనే హీరోగా అదే పేరును కొనసాగిస్తూ ‘బంపర్ ఆఫర్ – 2’ పేరుతో ఓ చిత్రం రాబోతుంది. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగుంది. ‘బంపర్ ఆఫర్’ విడుదలైన 12 సంవత్సరాల తర్వాత అదే పేరు మీద రెండవ భాగం చేస్తున్నారు. అయితే ఇది సీక్వెల్ కాదు, రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నారు. ‘బంపర్ ఆఫర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన జయ రవీంద్ర ఈ రెండో భాగాని కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేశ్ యల్లంరాజుతో కలిసి సాయిరామ్ శంకర్ నిర్మిస్తుండటం విశేషం. అశోక స్క్రిప్ట్ అందించాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఉగాది శుభాకాంక్షలతో ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతుంది. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత సురేష్ యల్లంరాజు వెల్లడించారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా పప్పు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించబోతున్నారు. చదవండి: చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న కాజల్ -
ప్రపంచాన్ని మార్చేయాలని ఉంది
ప్రతీరోజు కృతజ్ఞతగా మొదలెడదాం. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేద్దాం. సంతోషం మనలోనే ఉందని తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకుందాం. పాత కాలపు ఆలోచనల్ని బద్దలు కొడదాం అంటున్నారు కాజల్ అగర్వాల్. ఏదైనా అడగండి, జవాబు చెబుతా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు కాజల్. అంతే.. వాళ్లు ప్రశ్నల వర్షం కురిపించారు. కాజల్ తన ఆలో చనల్ని జవాబులుగా ఇచ్చారు. అందులో కొన్ని ఇక్కడ ఉంచాం. ► మీ రోజు ఎలా ప్రారంభం అవుతుంది? లేవగానే ఇంకో రోజు వచ్చిందని చాలా కృతజ్ఞతగా ఉంటాను. పెద్ద గ్లాస్ వేడినీళ్లలో పసుపు, అల్లం వేసుకుని తాగుతాను. మహా మంత్రాన్ని జపించి, కాసేపు థ్రెడ్ మిల్ మీద పరిగెడతాను. అలానే మా ఆయనకో పెద్ద హగ్ ఇస్తాను. ► నటిగా మీకు సంతృప్తిని కలిగించే విషయం? దర్శకుడు అనుకున్న షాట్‌ను అనుకున్నట్టు వచ్చేలా నేను నటించడం. కెమెరా ముందు ఉండటం అంటే నాకు ధ్యానం చేస్తున్నట్టే. ► కొత్త ఏడాదిలో తీసుకున్న నిర్ణయాలేంటి? వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని బ్యాలెన్స్ చేయడం. జీవితంలో ప్రతీ విషయంలో ఏదో విధంగా వృద్ధి చెందడం. ► ఏ విషయంలో మీకు కోపం వస్తుంది? హిపోక్రసీ. అబద్ధాలు. ఈ రెండు విషయాలు గతంలో చాలా కోపం తెప్పించేవి. కానీ ఇప్పుడు మాత్రం హిపోక్రసీ ఉన్నవాళ్లను, అబద్ధాలు ఆడేవాళ్లను చూస్తే పాపం అనిపిస్తుంది. ► యాక్టింగ్ కాకుండా మీకు మరేదైనా డ్రీమ్ ఉందా? ప్రపంచాన్ని మార్చేయాలని ఉంది. మనం మన లాగా.. ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఉండేలాగా. చాలా దయగా ఉండే ప్రపంచాన్ని సృష్టించాలని ఉంది. ► అతిగా ఆలోచించడం నుంచి బయటపడటం ఎలా? ఏ విషయంలో అయినా సరే అందులోని పాజిటివ్ విషయాలేంటో చూడటం నేర్చుకోవాలి. బెనిఫిట్ ఆఫ్ డౌట్‌ని అలవాటు చేసుకోవాలి. ధ్యానం చేస్తుండాలి. ► పెళ్లికి ముందు.. తర్వాత మీలో మీరు గమనించిన మార్పు? బాధ్యత పెరిగినట్టు అనిపించింది. అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత నా పార్టనర్‌కే ఇవ్వాలనుంది. అటు వైపు నుంచి కూడా అలానే ఉండాలనుంది. ► మీ చిన్నప్పటి గోల్ ఏంటి? వ్యోమగామి అవ్వాలనుకున్నాను. స్క్రీన్ మీద అయినా ఆస్ట్రోనాట్ అవ్వాలనుంది. చూద్దాం! ► మీ సంతోషం ఎందులో ఉంటుంది? నాకే కాదు, ఎవ్వరికైనా వాళ్ల సంతోషం వాళ్ల మనసులోనే ఉంటుంది. సంతోషంగా ఉండాలని బలంగా నిశ్చయించుకోవాలి. ప్రతీ క్షణాన్ని సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. ► మీ ఫ్యాన్స్ గురించి చెప్పండి? వాళ్లు ది బెస్ట్. నేను ఈ రోజు ఇలా ఉండటానికి, ఇంకా కష్టపడి పని చేయడానికి ముఖ్య కారణం వాళ్లే. ► ‘మోసగాళ్ళు’ సినిమాలో మీ పాత్ర గురించి? చాలా ఆసక్తికరమైన పాత్ర అది. ఎంతో ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను. ► సినిమాలు చేయడం మానేస్తారా? అస్సలు లేదు. సినిమా నా ఫస్ట్ లవ్. సినిమాలు చేస్తూనే ఉంటాను. ► ‘ఆచార్య’లో మీ పాత్ర ఎలా ఉంటుంది? చాలా పవర్ఫుల్ పాత్ర. ఈ మధ్య కాలంలో అలాంటి పాత్ర చేయలేదు. ► మీ ఫేవరెట్ డ్రింక్ ఏంటి? నిమ్మకాయ రసం. ఎర్ల్ గ్రే టీ. -
నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్
కొన్ని రోజులుగా సినిమా అభిమనులను నెట్‌ఫ్లిక్స్ ఊరిస్తూ బంపర్ ఆఫర్ అంటూ ప్రచారం చేస్తున సంగతి తెలిసిందే. సినిమా ప్రేమికుల ఎదురుచూపులకు తెరదించతూ రెండు రోజుల ఫ్రీ ఆఫర్‌ను ప్రకటించింది. స్ట్రీమ్ ఫెస్ట్‌లో భాగంగా భారత దేశమంతటా నేడు, రేపు ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ను వినియోగించుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఈ రెండు రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్ లో ఉచితంగా వీడియోలను వీక్షించవచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ 5 అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ ఆఫర్‌ను మొదటగా మనదేశంలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో ఇటువంటి ఆఫర్ పెట్టడం ఇదే మొదటిసారి. దీంతో ఈ ఆఫర్‌ను వినియోగించుకుంటున్న నెట్‌ఫ్లిక్స్ యూజర్లు తమ ఆనందాలను ట్విట్టర్ వేదికగా రకరకాల మీమ్స్ పెడుతూ నలుగురితో పంచుకుంటున్నారు. -
జియో గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: కరోనావైరస్ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రముఖ టెల్కో రిలయన్స్ జియో తన వినియోగదారులకు శుభవార్త అందించింది. ముఖ్యంగా లాక్ డౌన్ , ఇతర ఆంక్షల కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్న వారికోసం రిలయన్స్ జియో 'వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాక్' ను ప్రారంభించింది. తాజాగా లాంచ్ చేసిన రూ. 251 ప్లాన్ లో వినియోగదారులు రోజుకు జీబీ 4జీ డేటాను పొందవచ్చు. అంతేకాదు 100 శాతం డేటా వినియోగం పూర్తయిన తర్వాత, వినియోగదారులు 64 కేబీపీఎస్ తక్కువ వేగంతో ఇంటర్నెట్ డేటాను అపరిమితంగా మిగిలిన రోజులో కూడా ఉపయోగించడం కొనసాగించవచ్చు. అయితే లిమిట్ దాటిన తరువాత డేటా బ్రౌజింగ్ కుమాత్రమే పరిమితం. వీడియోలు ప్లే కావు. 120 జీబీ దాకా డేటాను వాడుకోవచ్చు. 51 రోజుల పాటు ఈ ప్లాన్ చెల్లుబాటులో వుంటుంది. అయితే దీనికి వాయస్ కాల్స్, ఎస్ ఎంఎస్ సేవలు లభించవు. కాగా కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తగా మత్యు ఘంటికలు మోగిస్తోంది. దేశంలో ఇప్పటికే 430 పాజిటివ్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా కఠినమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఐటీ, కార్పొరేట్, బ్యాంకింగ్ తదితర రంగాలు ఉద్యోగులు ఎక్కువగా ఇంటినుంచే తమ విధులను నిర్వరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ వినియోగదారులకు నెల రోజుల పాటు బ్రాండ్ సేవలను ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా డేటా వాడకం అత్యంత గరిష్టానికి చేరుకుంది. చదవండి: ఎయిర్టెల్ కాదు.. జియోనే టాప్ -
కరోనా ఎఫెక్ట్: ఓ పోర్న్‌సైట్ బంపర్ ఆఫర్!
రోమ్ : కరోనా పేరు వినగానే ప్రపంచ దేశాల వెన్నులో వణుకుపుడుతోంది. దాదాపు 115 దేశాల్లో రెండున్నర లక్షల కేసులు నమోదు కాగా, 4వేలకు పైగా మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా ఇటలీలో కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. నిన్నటి వరకు 189 ఉన్న మృతుల సంఖ్య 24గంటల్లోనే 1,016కు చేరింది. దాదాపు 15వేల మంది కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పోర్న్‌సైట్ ‘‘పోర్న్‌హబ్’’ తన ఉదారతను చాటుకుంది. తమ అనుబంధ సైట్ ‘‘మోడల్ హబ్’’ నుంచి వచ్చే మార్చి నెల ఆదాయాన్ని కరోనా బాధితుల సహాయార్థం విరాళంగా ఇవ్వనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా ఇటలీలోని వారు పోర్న్‌హబ్ సైట్ ప్రీమియమ్ కంటెంట్‌ను ఈ నెలమొత్తం ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపింది. కాగా, పోర్న్‌హబ్‌ను వీక్షిస్తున్న టాప్ 20 దేశాల్లో ఇటలీ 7వ స్థానంలో ఉన్నట్లు గతంలో ఓ సర్వే వెల్లడించింది. పోర్న్‌హబ్ సైట్లో గతకొద్దిరోజులుగా హజ్మట్ స్యూట్లు, మాస్క్‌లు ధరించిన పోర్న్ వీడియోలు ట్రెండింగ్ అవుతుండటం గమనార్హం. చదవండి : ప్రపంచంపై కరోనా పడగ ఇటలీలో తెలంగాణ విద్యార్థుల గగ్గోలు కరోనాతో గాయకుడి హనీమూన్ రద్దు! -
వైరల్: 2,3,4.. మగాళ్ల కోసం బంపర్ ఆఫర్!!
-
ఈ మారుతీ కారుపై లక్ష రూపాయల తగ్గింపు
సాక్షి, ముంబై: దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ కస్టమర్లకు శుక్రవారం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన బాలెనో మోడల్ కారుపై లక్ష రూపాయలు తగ్గించి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఢిల్లీలో బాలెనో మోడల్ ధర 5,58,602 ఉంది. ఎంపిక చేసిన పది మోడల్స్‌పై రెండో రోజుల క్రితం 5000 రూపాయల వరకు తగ్గింపు ప్రకటించిన విషయం తెలిసిందే. పండుగ సీజన్‌కు ముందు ఇలాంటి ఆఫర్లతో అమ్మకాలు పెరుగుతాయని తద్వారా కొత్త కస్టమర్లు పెరిగే అవకాశం ఉన్నట్లు మారుతి సుజుకి తెలిపింది. ఇటీవల కాలంలో ఆర్థిక మాంద్యం ప్రభావంతో అన్ని కంపెనీల కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో అన్ని కంపెనీలు కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మారుతీ సుజకీ బంపర్ ఆఫర్లు ప్రకటించడం విశేషం. సియామ్ గణాంకాల ప్రకారం ఆగస్టులో వాహనాల అమ్మకాలు 31.57 శాతం వరకు పడిపోయాయి. (చదవండి: మందగమనంపై సర్జికల్ స్ట్రైక్!) -
రుణం కావాలా : ఎస్బీఐ బంపర్ ఆఫర్
ముంబై : రిటైల్ బ్యాంకింగ్ ఖాతాదారులకు ఎస్బీఐ పండుగ సీజన్ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యక్తిగత, గృహరుణాలపై తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేయడంతో పాటు ఈఎంఐ భారాన్ని తగ్గించే వెసులుబాటు కల్పించనున్నట్టు ప్రకటించింది. రూ 20 లక్షల లోపు వ్యక్తిగత రుణం తీసుకునేవారికి కనిష్ట స్ధాయిలో 10.75 శాతం నుంచి వడ్డీ రేటును ఆఫర్ చేస్తామని వెల్లడించింది. కస్టమర్లపై ఈఎంఐ భారాన్ని తగ్గించేందుకు వ్యక్తిగత రుణాలను తిరిగి చెల్లించే గడువును ఐదేళ్ల నుంచి ఆరు సంవత్సరాలకు పొడిగించింది. ఇక ఖాతాదారులకు ఆన్లైన్ సేవలు అందించే తన యోనో యాప్ ద్వారా రూ 5 లక్షల వరకూ వ్యక్తిగత రుణం అందించనున్నట్టు పేర్కొంది. ఈ యాప్ ద్వారా కేవలం నాలుగు క్లిక్‌లతోనే రుణం మొత్తం వారి ఖాతాల్లోకి చేర్చనున్నట్టు తెలిపింది. మరోవైపు రూ 50 లక్షల వరకూ విద్యా రుణాలను 8.25 శాతం వడ్డీరేటుతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎడ్యుకేషనల్ లోన్ కస్టమర్లు 15 ఏళ్ల వ్యవధిలో రుణ మొత్తం తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించడంతో వారిపై ఈఎంఐ భారం తగ్గుతుందని తెలిపింది. మరోవైపు సెప్టెంబర్ 1 నుంచి గృహ రుణాలపై కేవలం 8.05 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. -
బంపర్ ఆఫర్ ఇచ్చిన దొంగ!
నెల్లూరు (క్రైమ్): ఇదొక వింతైన దోపిడీ. ఓ ఇంట్లో గుర్తుతెలియని దుండగుడు తల్లి, కుమార్తెను బెదిరించి రూ.2.50 లక్షల విలువైన 76 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. తనకు రూ.లక్ష అవసరమని, ఆ నగదు ఇస్తే ఆభరణాలు ఇస్తానని దుండగుడు బాధితులతో బేరం పెట్టాడు. వారు డబ్బులు లేవనడంతో నగలతో పరారయ్యాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున బాలాజీనగర్ రాంజీనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కోటకు చెందిన పి.వెంకటకృష్ణారెడ్డి, శ్రీలత దంపతులు. వెంకటకృష్ణారెడ్డి బియ్యం వ్యాపారి. ఆరు నెలల కిందట కుమార్తె అన్వేషకి వివాహ నిమిత్తం రాంజీనగర్‌కు వచ్చారు. కుమార్తె వివాహానంతరం వెంకట కృష్ణారెడ్డి కోటకు వెళ్లారు. కుమార్తె ఆషాఢ మాసం కావడంతో తల్లితో కలిసి రాంజీనగర్‌లోనే ఉంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగుడు కిటికీ నుంచి కర్ర సాయంతో ఇంటి తలుపు గడియ తొలగించి ఇంట్లోకి వచ్చాడు. కప్బోర్డును తెరచి చూడగా అందులో ఏమీ కనిపించక పోవడంతో పడక గదిలో నిద్రిస్తున్న శ్రీలత, ఆమె కుమార్తెను నిద్రలేపి బంగారు ఆభరణాలు ఇవ్వాలని లేని పక్షంలో చంపుతామని బెదిరించాడు. శ్రీలత దిండుకింద ఉంచిన మూడున్నర సవర్ల బంగారు గొలుసు, ఆమె కుమార్తె మెడలోని 6 సవర్ల బంగారు గొలుసును లాక్కున్నాడు. రూ.లక్ష ఇస్తే నగలిచ్చేస్తా.. ఘటనలో నిందితుడు బాధితులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనకు వ్యక్తిగత పనుల నిమిత్తం రూ.లక్ష అవసరమని, ఆ నగదు ఇస్తే దొంగిలించిన ఆభరణాలను తిరిగి ఇచ్చేస్తానని చెప్పుకొచ్చాడు. అయితే డబ్బులు లేవని చెప్పడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితులు బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కన్నడ పిలుస్తోంది!
‘అంతకు ముందు ఆ తర్వాత’తో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు తెలుగమ్మాయి ఈషా రెబ్బా. ఆ తర్వాత ‘అమీ తుమీ, అ!’ వంటి హిట్ చిత్రాల్లో భాగమయ్యారు. తాజాగా ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీర రాఘవ’లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ తెలుగు భామ కన్నడంలో కాలు పెట్టనున్నారు. కన్నడ నుంచి బంపర్ ఆఫర్ కొట్టేశారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సరసన హీరోయిన్గా ఎంపికయ్యారు. శివరాజ్ కుమార్ హీరోగా లక్కీ గోపాల్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ఈషా కాలేజ్ ప్రొఫెసర్‌గా కనిపిస్తారట. కన్నడంలో వచ్చిన ఈ భారీ ఆఫర్ ఈషా కెరీర్‌కు ఎంత ప్లస్ అవుతుందో చూడాలి. -
నల్లకుబేరుల జాబితా ఇస్తే బంపర్ ఆఫర్
-
ఉత్తర కొరియా అథ్లెట్లకు కిమ్ బంపర్ ఆఫర్
-
జనవరి 1న జన్మించే వారికి బంపర్ ఆఫర్
బెంగళూరు: కొత్త సంవత్సరం రోజున జన్మించే మొదటి ఆడపిల్లకు బెంగళూరు పాలికె బంపర్ ఆఫర్ అందించనుంది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని పాలికె ఆసుపత్రుల్లో జన్మించే మొట్టమొదటి ఆడపిల్లపై కనకవర్షం కురియనుంది. 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటలు, ఆ తరువాత కళ్లుతెరిచే ఆడకూతురికి రూ.5 లక్షల నగదు బహుమతి అందజేస్తామని మేయర్ సంపత్‌రాజ్ గురువారం ప్రకటించారు. ఆ చిన్నారి పేరుతో బీబీఎంపీ కమిషనర్ ఉమ్మడి ఖాతా తెరిచి ఆ నగదును డిపాజిట్ చేస్తామని తెలిపారు. ఆడపిల్లకు 18 ఏళ్లు నిండిన తరువాత ఆమె విద్యాభ్యాసం కోసం ఈ నగదును వినియోగించవచ్చునని మేయర్ చెప్పారు. సిజేరియన్ కాకుండా, సాధారణ ప్రసవం ద్వారా జన్మించిన ఆడపిల్లకు మాత్రమే ఈ అదృష్టం వరించనుంది. నేటి పరిస్థితుల్లో ఆడపిల్ల అంటే నిర్లక్ష్యం చేస్తున్నారని కానీ ఆడపిల్లలు అందరితో సరిసమానంగా నిలబడి పనిచేస్తారని అన్నారు. అలాంటి ఆడపిల్లలు ఎంతో ముఖ్యమని భావించి వారిని ప్రోత్సహించడానికి నజరానా ప్రకటించామని తెలిపారు. -
మందుబాబులకో బంపర్ ఆఫర్!
షాంఘై: చైనాలో మందుబాబులకు అక్కడి మద్యం కంపెనీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. 1675 డాలర్లు చెల్లిస్తే జీవితాంతం మద్యాన్ని ఉచితంగా అందిస్తామని తెలిపింది. నవంబర్ 11న జరిగే షాపింగ్ ఫెస్టివల్లో 11,111 యువాన్లు(1675డాలర్లు) చెల్లించి ఈ ఆఫర్ పొందొచ్చని జియాంగ్ షియాబా అనే మద్యం తయారీ కంపెనీ తెలిపింది. ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా వెబ్సైట్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. సైట్లో ఉండే స్టోర్ కూపన్లు, డిస్కౌంట్లను వాడుకుంటే ఈ రేటు ఇంకా తగ్గే వీలుంది. ఈ ఆఫర్ 99 మంది లక్కీ కస్టమర్లకు మాత్రమే. ‘బైజియు’ మద్యాన్ని జీవితాంతం ప్రతీ నెల 12 బాక్సుల్లో లక్కీ కస్టమర్లకు అందిస్తామని తెలిపింది. ఈ ఆఫర్ పొందిన ఐదేళ్లలోపు ఎవరైనా చనిపోతే కుటుంబంలోని ఒక వ్యక్తికి ఇదే ఆఫర్‌ను ఇస్తారు. -
చెబితే నవ్వుతారేమో..!
‘నన్నేమైనా అడగాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు?’ అంటూ ఫ్యాన్స్‌కి త్రిష బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతే.. ఫ్యాన్స్ ట్విట్టర్లో బోలెడన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి త్రిష షార్ట్ అండ్ స్వీట్‌గా సమాధానాలిచ్చారు. ⇒ రొమాంటిక్ ఫిల్మ్స్ ఇష్టమా..? యాక్షన్ మూవీసా? ♦ రొమాంటిక్ ఫిల్మ్స్. ⇒ మీకు ఇష్టమైన ఫెస్టివల్? ♦ దీపావళి. ⇒ ఫిజికల్‌గా, మెంటల్‌గా మీరు ఎంత స్ట్రాంగ్? ♦ మెంటల్లీ 90, ఫిజికల్లీ 70. ⇒ జయలలిత, కల్పనా చావ్లా, మార్లిన్ మన్రో.. ఈ ముగ్గురులో ఎవరి బయోపిక్‌లో నటించడం ఇష్టం ♦ జయలలిత. ఆమె అంటే నాకు ఎంతో అభిమానం. ⇒ కమల్‌హాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఎవర్ని సపోర్ట్ చేస్తారు? ♦ వారు అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవర్ని సపోర్ట్ చేస్తానో అప్పుడు చెబుతాను. ⇒ మీకు స్ట్రీట్ ఫుడ్ ఇష్టమేనా..? ♦ ఫుల్‌గా లాగించేస్తా.. ⇒ మీ ఫిజిక్, మీ అందం గురించి మాట్లాడితే మా ఆవిడకు అసూయ... ♦ నవ్వుతూ... ఆడవాళ్లను అసూయపడేలా చేయకండి. అది అంత మంచిది కాదు. ⇒ వర్షంలో ఆడుకోవడం అంటే మీకు ఇష్టమేనా? ♦ నెవర్ ఎవర్... ⇒ మీకు కోపం తెప్పించే విషయం? ♦ అబద్ధాలు చెప్పడం. ⇒ మీ ఫేవరెట్ ఫుడ్? ♦ నాకు ఫుడ్ అంటే ఇష్టం... చెబితే నవ్వుతారేమో... నేను తినడం కోసమే పుట్టాను. ⇒ మీలా ఉండాలనుకునేవారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ♦ మీరు మీలా ఉండండి. అద్భుతాలు జరుగుతాయి. ⇒ మీ దృష్టిలో స్నేహానికి నిర్వచనం? ♦ లాయల్టీ అండ్ ఫన్. ⇒ లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌ను నమ్ముతారా? ♦ నమ్ముతాను. కానీ ఓన్లీ విత్ యానిమల్స్. ⇒ మీరు నాకు హాయ్ చెబితే మరో పదేళ్ల వరకూ హ్యాపీగా ఉంటా? ♦ హాయ్.. పదేళ్లు సంతోషంగా ఉండండి. ⇒ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ♦ ⇒మీరు మళ్లీ డేటింగ్ మొదలుపెట్టినప్పుడు. -
జియో మరో బంపర్ ఆపర్
న్యూఢిల్లీ: సంచలనానికి మారుపేరుగా నిలిచిన రిలయన్స్ జియో ఖాతాదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచిత డేటా ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయాలనుంచి టారిఫ్ లలోకి ఎంట్రీ ఇచ్చిన జియో ఇపుడు ప్రైమ్ మెంబర్ షిప్ ను కూడా ఉచితంగా అందించే ప్లాన్ ను ఒక దాన్ని తన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. హ్యాపీ న్యూ ఆఫర్లో రూ.99 ల చార్జితో ప్రైమ్ మెంబర్ షిప్ ద్వారా మార్చి 2018 వరకు జియో సేవలు ఉచితం. అయితే జియో మనీ ద్వారా ప్రత్యేక ఆఫర్లో ఉచితంగా ప్రైమ్ మెంబర్ షిప్ పొందే అవకాశాన్ని కల్పించింది. ఎలా అంటే.. 15 మార్చి నుండి ప్రారంభమైన ఈ ఆఫర్ పరిమిత కాలానికి అందుబాటులో ఉంది. జియోమనీ వాలెట్ లేదా మై జియో యాప్ లేదా www.jio.com లాగిన్ ద్వారా రూ.99+303 చెల్లించాలి. అనంతరం యాప్ లోరూ.50 డిస్కౌంట్ వోచర్ లభిస్తుంది. ఈ వోచర్ రూ.303లు, ఆ పైన విలువగల తరువాతి రీచార్జ్ సమయంలో వినియోగించుకోవచ్చు. 25 మార్చి నుంచి జూన్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ పరిమిత కాలంలో ఇలా యూజర్ 5 సార్లు మాత్రమే ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి వీలవుతుంది. సో.. ఇలా రెండుసార్లు రీచార్జ్ చేసుకొని, రెండు సార్లు 50 క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందడం ద్వారా ప్రైమ్ మెంబర్ షిప్‌ను ఉచితంగా పొందవచ్చన్నమాట. కాగా 303 రూపాయల ప్లాన్‌లో ప్రైమ్ మెంబర్స్‌కు 30జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 2.5జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, 499 రూపాయల ప్లాన్ లో 28 రోజుల వ్యాలిడిటీతో 58జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 5జీబీ డేటా, 999 రూపాయల రీచార్జ్‌పై ప్రైమ్ మెంబర్స్‌కు 60జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 12.5జీబీ డేటా, 60రోజుల వ్యాలిడిటీ, 1999 రూపాయల ప్లాన్‌లో ప్రైమ్ మెంబర్స్‌కు 125 జిబి 90 రోజుల వ్యాలిడిటీ, నాన్ ప్రైమ్ యూజర్లకు 30 రోజుల వ్యాలిడిటీ 30 జీబీ ఆఫర్ సంగతి తెలిసిందే. -
ఏపీ శాస్త్రవేత్తలకు చంద్రబాబు బంపర్ ఆఫర్
-
అభిమానులకి సల్లుభాయ్ బర్త్ డే ఆఫర్
-
ఆక్రమణదారుల బంపర్ ఆఫర్
ఆదెమ్మ దిబ్బ వాసులకు ఆశ చూపిస్తున్న ఆక్రమణదారులు మార్కెట్ విలువ రూ.లక్షకు పై మాటే రూ.13,500కు ఇవ్వడంలో మతలబేమిటో? ఇంత జరుగుతున్నా సంబంధితాధికారులది ప్రేక్షకపాత్రే.. ప్రభుత్వం స్వా«ధీనం చేసుకోవాలని వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ షర్మిలా రెడ్డి డిమాండ్ సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం నడిబొడ్డున కంబాల చెరువు ప్రాంతంలో ఉన్న ఆదెమ్మ దిబ్బ స్థలాన్ని తాము కొనుగోలు చేశామని చెబుతున్న ఆసాములు అక్కడ ఉంటున్న పేదలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గుడిసెలు ఖాళీ చేస్తే రూ.50 వేల నుంచి రూ.70 వేలు ఇస్తామని ఓ వైపు చెబుతూ అక్కడే ఉండాలని అనుకుంటే గజం రూ.13,500లకే విక్రయిస్తామని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న రమణ అనే వ్యక్తి తాను రూ.13,500 లెక్కన 200 గజాలు కొన్నానని ’సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. తనకు రెండు రేకుల షెడ్లున్నాయని రూ.1.4 లక్షలు ఇవ్వడంతో పక్కనే తనకు ఉన్న వాంబే గృహాల్లోకి చేరిపోయానని తెలిపారు. రాజమహేంద్రవరం నగర నడిబొడ్డున ఉన్న ఈ స్థలం ఖరీదు ప్రస్తుతం మార్కెట్ ప్రకారం గజం రూ.లక్ష వరకూ ఉంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఇంత విలువైన స్థలాన్ని కొనుగోలు చేశానని చెబుతున్న వ్యక్తి గజం రూ.13,500లకే అమ్ముతుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు తాను 4000 గజాల స్థలాన్ని సత్యవోలు శేషగిరిరావు వద్ద కొనుగోలు చేశానని రెవెన్యూ అధికారుల వద్ద పేర్కొన్నారు. సాధారణంగా రియల్ వ్యాపారులు లాభాలకే ప్రాధాన్యమిస్తారు. స్థలం కొనుగోలు చేసిన వ్యక్తి అక్కడ ఉన్న అక్రమణదారులను ఖాళీ చేయించడానికి భారీ మొత్తంలో నగదు ఇవ్వాల్సిన అవసరమేమిటన్న ప్రశ్న నగరవాసుల మొదడును తొలిచేస్తోంది. స్థలం కొనుగోలు చేసినప్పుడు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కోర్టుకు చూపించి చట్ట ప్రకారం వారిని ఖాళీ చేయించవచ్చు. గుడిసెల తొలగింపునకే రూ. 50 లక్షలు నగరంలోని 36, 38 డివిజన్ల పరిధిలో ఆదెమ్మదిబ్బ ప్రాంతంలోని 3.54 ఎకరాల స్థలంలో 110 మంది పేదలు గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు. ఖాళీ చేస్తే ఒక్కొక్కరికీ రూ.50 నుంచి రూ.70 వేలు చొప్పున చెల్లిస్తూ ఇప్పటికే రూ.50 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిసింది. ఓ వైపు ఎదురు చెల్లింపులు ... ఇంకోవైపు బంపర్ ఆఫర్లు ఇస్తుండడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒకరి వెంట ఒకరు చెల్లాచెదురై... ఆదెమ్మదిబ్బ స్థలంలో ఉంటున్నవారందరూ అక్కడ తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని అరవై ఏళ్లుగా నివసిస్తున్నవారే. ఇందులో పలువురికి వాంబే గృహాలు కూడా వచ్చాయి. గృహాలు వచ్చిన వారు ఖాళీ చేయకుండా గుడిసెలను ఆద్దెకు ఇచ్చారు. ఇప్పడు ఆక్రమణదారులు రావడంతో ఎంత డబ్బులిచ్చినా తీసుకొని ఖాళీ చేసేస్తామని చెప్పడంతో నిజమైన పేదలు ఇబ్బందులు పడుతున్నారు. -
ఈ-పేమెంట్ చేసేవారికి నీతిఆయోగ్ బొనాంజా!
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలు చేస్తున్న వారికి బంపర్ ఆఫర్ ఇచ్చే ఆలోచనను నీతి ఆయోగ్ పరిశీలిస్తోంది. అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం ఎలక్ట్రానిక్ పేమెంట్లను చేస్తున్న వినియోగదారులకు ఈ ఆఫర్ ను వర్తింపజేయాలనే నిర్ణయానికి వస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ ప్రత్యేక పథకం రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇందులో రూ.కోటి నగదు బహుమతితో పలు రకాల ఆకర్షణీయ ఆఫర్ లు ఉన్నట్లు సమాచారం. పథకం రూపొందించడంలో కీలక భూమిక పోషించాలని నేషనల్ పేమెంట్ కార్పొరరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ)ను నీతి ఆయోగ్ కోరినట్లు తెలిసింది. అంతేకాకుండా నేషనల్ ఫైనాన్షియల్ ఇంక్లూసన్ ఫండ్ నుంచి రూ.125కోట్లను ఎన్ పీసీఐకు నీతిఆయోగ్ కేటాయించింది. ఎస్ బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, సిటీ బ్యాంకు, హెచ్ఎస్ బీసీ బ్యాంకుల రీటైల్ పేమెంట్లన్నీ ఎన్ పీసీఐ పరిధిలోనే జరుగుతాయి. గ్రామీణ, చిన్న పట్టణాల ప్రాంతాల ప్రజలను ప్రోత్సహించేందుకే ఈ పథకాన్ని ప్రవేశపెడుతన్నట్లు పేరు తెలపడానికి ఇష్టపడని ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు. దేశంలో జరిగిన అన్ని నగదు రహిత లావాదేవీల ఐడీలను ప్రతి మూడు నెలలకు ఒకసారి డ్రా తీసి రూ.కోటి బహుమతిని, ప్రతి వారం తీసే డ్రాలో రూ.10లక్షల బహుమతిని అందజేస్తారని తెలిపారు. ప్రతివారం పది మంది వినియోగదారులకు, పది మంది వ్యాపారులకు బహుమతులు ఇస్తారని చెప్పారు. డిసెంబర్ నెలాఖరులోగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని తెలిసింది. -
పాత నోట్లు తీసుకుంటాం
తాడేపల్లిగూడెం : ఏం కొనడానికి వెళ్లినా.. ’చిల్లర ఉందా’ 13 రోజులుగా జిల్లాలో ఏ దుకాణానికి వెళ్లినా ఇదే ప్రశ్న వినిపిస్తోంది. తాడేపల్లిగూడెంలోని ఓ వ్యాపారి మాత్రం రండి బాబూ.. రండి. పాత నోట్లు ఎన్నయినా తీసుకురండి. మీకు నచ్చిన సరుకులు కొనుక్కెళ్లండని బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. పెద్దనోట్లు ఇచ్చాక అందుకు సరిపడే సరుకులను ఒకే రోజున కొనక్కర్లేదని.. నాలుగు రోజులపాటు వాటిని తీసుకోవచ్చంటూ సందడి చేస్తున్నాడు. రైల్వే స్టేషన్ రోడ్డులో కల్యాణి కూల్‌డ్రింక్స్ దుకాణం నిర్వహిస్తున్న కుమార్ అనే వ్యాపారి ఓ బోర్డు పెట్టిమరీ వినియోగదారులను ఆకర్షిస్తున్నాడు. రూ.500, రూ.1000 రూపాయలకు సరిపడా డ్రింక్స్, పాలు, పెరుగు, బిస్కెట్లు, రీచార్జ్ కూపన్లు, రిఫండ్ ఆయిల్, పామాయిల్, బియ్యం (25 కిలోల బస్తా) తీసుకెళ్లాలంటూ బోర్డు పెట్టాడు. పాత నోట్లను మీరేం చేస్తారని అడిగితే ’బ్యాంకులో ఖాతాలో వేసుకుంటాం.ఽ బ్యాంక్ ఖాతాలో సొమ్ము రూ.2.50 లక్షలు దాటితే ఏమవుతుంది. మహాఅయితే నోటీసు ఇస్తారు. పోనీ.. అరెస్ట్ చేస్తారా. చేసుకోమనండి. నేనేమీ తప్పు చేయడం లేదు. నోట్ల రద్దుతో కష్టాల్లో ఉన్న వినియోగదారులకు సేవ చేస్తున్నా. ప్రధాని మోదీయే కాదు. నేను, నా భార్య కల్యాణి ఇలా సేవ చేస్తున్నాం’ అని సగర్వంగా చెబుతున్నాడు. భలే ఆఫర్ కదూ. ఇంకెందుకు ఆలస్యం మీ వద్ద పాతనోట్లు ఇంకా ఉంటే.. చలో తాడేపల్లిగూడెం. -
అమెరికా విద్యార్థికి చాక్లెట్ కంపెనీ బంపర్ ఆఫర్
-
బంపర్ ఆఫర్..
కిలో మటన్ రూ. 200లు చికెన్ రూ. 100 ఉట్నూర్ : పస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర రూ. 200లు, కిలో మటన్ ధర రూ. 400లు పలుకుతుంది. అయితే మండల కేంద్రంలో కొందరు మటన్, చికెన్ దుకాణదారులు శుక్రవారం ఏజెన్సీలో బడుగ పండుగ సందర్భంగా బంఫర్ ఆఫర్ ప్రకటించారు. కిలో చికెన్ ధర రూ. 100లు, కిలో మటన్ ధర రూ. 200లుగా ప్రకటించి విక్రయించారు. దీంతో మటన్, చికెన్ కొనుగోలు కోసం జనం ఎగబడ్డారు. బడుగ పండుగకు తోడు ఇన్ని రోజులు శ్రావణమాసంతో మాంసహారానికి దూరంగా ఉన్న వారు బంఫర్ అఫర్‌ను బాగా ఉపయోగించుకున్నారు. -
బంపర్ ఆఫర్ పేరిట మోసం
భైంసాలో బాధితుల ఆందోళన పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు భైంసా : శ్రీవరలక్ష్మీ మార్కెటింగ్ పేరిట రంగుల బ్రోచర్లను ముద్రించి బంపర్ ఆఫర్ అంటూ ఆశ చూపి నిరక్షరాస్యులను, గ్రామీణ ప్రాంత వాసులను నిలువుగా ముంచేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సదరు దుకాణం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులను ఆశ్రయించారు. భైంసా పట్టణ ఎస్సై మహేందర్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇదీ జరిగింది... భైంసా డివిజన్లోని చుట్టుపక్కల ప్రాంతాల్లో, పట్టణంలోని పలు కాలనీల్లో గుర్తుతెలియని కొంతమంది శ్రీవరలక్ష్మీ మార్కెటింగ్ బంపర్ ఆఫర్ టికెట్లను విక్రయించారు. ఒక్కో టికెట్ రూ.2వేలకు అమ్మారు. కార్డు తీసుకుని కస్టమర్లు డబ్బులు ఇవ్వగానే వారికి అదే రోజు స్క్రాచ్ కార్డులను కూడా అందించారు. బ్రోచర్లో వాషింగ్‌మిషన్, 21 ఇంచుల ఎల్సీడీ టీవీ, 10 గ్రాముల బంగారం, ల్యాప్‌టాప్, రిఫ్రిజిరేటర్, డీవీడీ ప్లేయర్, హోంథియేటర్, 10 లీటర్ల ప్రెషర్ కుక్కర్, స్టాండింగ్ ఫ్యాన్, ఇండక్షన్ స్టౌ, రైస్‌కుక్కర్, మిక్సర్‌గ్రైండర్ లక్కీగా ఇస్తామని చెప్పారు. ఈ నెల 30న భైంసాలో లక్కీ స్కీం ఉంటుందని ప్రకటించారు. కార్డులు కొనుగోలు చేసిన బాధితులంతా శనివారం భైంసా చేరుకున్నారు. సదరు దుకాణం ముందుకు చేరుకోగానే కార్డులు అందించిన వారంతా పత్తాలేకుండా పోయారని తెలుసుకున్నారు. తాము మోసపోయామంటూ కొనుగోలుచేసిన కార్డులు, టికెట్లు చేతపట్టుకుని భైంసా–నిర్మల్ 61వ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు 60 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువగానే ముంచారు వరలక్ష్మీ బంపర్ స్కీం పేరిట గుర్తుతెలియని వ్యక్తులు పెద్ద సంఖ్యలోనే కార్డులు విక్రయించినట్లు తెలుస్తోంది. నిర్మల్ డివిజన్ అంతా ఈ కార్డులు విక్రయించినట్లు సమాచారం. వందల సంఖ్యల్లోనే కార్డులన్నీ లక్షల రూపాయలతో ఉడాయించిన ఈ ముఠాపై దష్టిసారించాల్సిన అవసరం ఉంది. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో బాధితుల సంఖ్య తేలనుంది. ఇలాంటివాటిని నమ్మవద్దు : మహేందర్, పట్టణ ఎస్సై లక్కీ స్కీం, బంపర్ ఆఫర్లపేరిట గుర్తుతెలియని వ్యక్తులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దు. ఇలాంటి వారి ఆచూకీ తెలిస్తే మాకు సమాచారం ఇవ్వండి. అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా ఇలాంటి వ్యాపారం చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. -
పరిశ్రమలకు బంపర్ ఆఫర్
-
పరిశ్రమలకు బంపర్ ఆఫర్
- కొత్తగా ఉద్యోగులను చేర్చుకుంటే పీఎఫ్ తామే చెల్లిస్తామన్న కేంద్ర కార్మిక శాఖ - రూ.15 వేల లోపు వేతనం వారికి యజమాని వాటా చెల్లించేందుకు సంసిద్ధత - 8.33 శాతం కేంద్రం, 3.67 శాతం యజమాని చెల్లించేలా మార్గదర్శకాలు వెల్లడి - సంఘటిత రంగంలోని సంస్థలకే అవకాశం.. మూడేళ్ల పాటు అమలులో కొత్త విధానం - ఈ ఏడాది పీఎఫ్ చెల్లింపులకు రూ.1,000 కోట్లు విడుదల చేసిన ఈపీఎఫ్‌వో సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకూ పరిశ్రమలు నెలకొల్పడానికి అనేక రాయితీలు ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉద్యోగావకాశాలు కల్పించడానికి కొత్త ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం పరిశ్రమలకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం మనుగడలో ఉన్న కంపెనీలు లేదా కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలు ఎంత మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పిస్తే వారందరి భవిష్యనిధి(పీఎఫ్) చెల్లించేందుకు కేంద్ర కార్మిక శాఖ ముందుకొచ్చింది. ఈ మేరకు కొత్తగా కొలువులోకి తీసుకున్న కార్మికునికి రూ.15 వేల లోపు వేతనం ఉన్నట్లయితే వారందరికీ సంస్థ తరఫున చెల్లించే 12 శాతం పీఎఫ్‌లో కేంద్రం 8.33 శాతం చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. మిగతా 3.67 శాతం వాటాను యజమాని చెల్లించేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అయితే సంఘటిత రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించే సంస్థలకు మాత్రమే ఈ కొత్త అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ విధానాన్ని మూడేళ్ల పాటు కొనసాగించనున్నట్లు కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మొదటి ఏడాదికిగానూ ఈపీఎఫ్‌వో నుంచి దాదాపు రూ.1,000 కోట్లు విడుదల చేసింది. ఉపాధి అవకాశాలే లక్ష్యంగా.. దేశవ్యాప్తంగా యువతకు సరైన ఉద్యోగావకాశాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు కేంద్రం నిర్వహించిన ప్రత్యేక సర్వేలో వెల్లడైంది. ఏటా వ్యవసాయ రంగంలో అవకాశాలు తగ్గిపోతుండటంతో అదే స్థాయిలో పరిశ్రమల్లో అవకాశాలు లభించడం లేదని గుర్తించింది. ఈ మేరకు పరిశ్రమల స్థాపనకు ఎన్నో రాయితీలు ప్రకటిస్తున్నా ఆశించిన స్థాయిలో ఉద్యోగావకాశాలు లభించడంలేదని భావించింది. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి ‘ప్రధానమంత్రి ప్రోత్సాహ రోజ్‌గార్ యోజన’ ద్వారా సంస్థలో కార్మికులకు యాజమాన్యం వాటాగా చెల్లించే పీఎఫ్‌ను చెల్లించాలని కేంద్రం నిర్ణయించింది. తద్వారా పరిశ్రమల యాజమాన్యాలు పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని యోచిస్తోంది. ఎంత మందిని కొత్తగా చేర్చుకున్నా వారందరికీ మూడేళ్ల పాటు పీఎఫ్‌ను భరించనున్నట్లు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రూ.15 వేల వేతనం పొందే వారికి ఈఎస్ఐ అందజేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ప్రోత్సాహ రోజ్‌గార్ యోజన వల్ల కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి పీఎఫ్‌తో పాటు ఈఎస్ఐ సౌకర్యం కూడా లభించనుంది. కొత్త పథకంపై విస్తృత ప్రచారం ఈ కొత్త పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కార్మిక శాఖ యోచిస్తోంది. కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలకు అవసరమైతే బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇప్పించాలని భావిస్తోంది. ఉద్యోగాలు పొందిన వారికి మొదట్లోనే యూనివర్సల్ అకౌంట్ నంబర్ కేటాయించాలని కార్మిక శాఖ నిర్ణయించింది. కార్మికులు వేరే సంస్థకు మారినా పీఎఫ్ ఖాతా అదే కొనసాగేలా చర్యలు చేపట్టింది. -
బంపర్ ఆఫర్!
ఈ మధ్యకాలంలో వెండితెరకు పరిచయమైన తారల్లో కీర్తి సురేశ్ మంచి మార్కులు సంపాదించుకోగలిగారు. ‘రైజింగ్ స్టార్’గా తమిళ, మలయాళ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి ‘నేను శైలజ’ ద్వారా తెలుగు తెరకు పరిచయమై, ఇక్కడివారిని కూడా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కీర్తిని ఓ బంపర్ ఆఫర్ వరించింది. తంతే బూరెల బుట్టలో పడ్డట్లు ఏకంగా తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించే అవకాశం దక్కించేసుకున్నారు. ‘‘విజయ్ సార్ సరసన సినిమా చేసే చాన్స్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ ఎప్పుడెప్పుడు ఆరంభం అవుతుందా?’’ అని ఎదరు చూస్తున్నా అని కీర్తీ సురేశ్ పేర్కొన్నారు. -
రెబల్స్ విపక్షలకు అధికార పార్టీ బంపర్ ఆఫర్
-
బంపర్ ఆఫర్ పేరుతో..
రూ. లక్షలు వసూలు చేసి ఉడాయించిన ముఠా లబోదిబోమంటున్న బాధితులు భువనగిరి : ప్రజల అమాయకత్వాన్ని, ఆశను ఆసరా చేసుకుని బంపర్ ఆఫర్ల పేరుతో రూ.లక్షలు వసూలు చేసి ఉడాయించిన ఓ ముఠా ఉదంతం గురువారం భువనగిరిలో వెలుగు చూసింది. జిల్లాతో పాటు ,రంగారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో ఆటోల ద్వారా హోంనీడ్స్ పేరిట మోసపోయిన వారంతా భువనగిరికి చేరుకుని లబోదిబోమంటున్నారు. వివ రాలు.. 20 రోజుల క్రితం నలుగురు యువకులు శ్రీ ఆంజనేయ మార్కెటింగ్ పేరుతో పోచమ్మవాడలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. రంగు రంగుల బ్రోచర్లు తయారు చేసి ఆటోల్లో గ్రామాలకు చేరుకున్నారు. బ్రోచర్లలో స్క్రాచ్ కార్డులను పొందుపరిచారు. ఒక్కో కార్డు రూ.100కు విక్రయించారు. కార్డును స్క్రాచ్ చేయగ అందులో ఆర్డినరి కంపెనీలకు చెందిన రైస్ కుక్కర్ , మిక్సి, టేబుల్‌ఫ్యాన్, డీవీడీ, హోం థియేటర్, మిక్సర్‌గ్రైండర్‌లు బహుమతులుగా వచ్చాయి. మందుగానే ఒక్కొక్కరి వద్ద రూ.1900 వసూలు చేసి వీటిలో కేవలం 500 లోపు విలువ గల వస్తువులను ఇచ్చారు. ఈనెల 10 తేదీన భువనగిరిలో బంపర్ డ్రా తీయడం జరుగుతుందని చెప్పారు. బంపర్ డ్రాలో రిఫ్రిజిరేటర్, ఎల్సీడీ, 10 గ్రాముల బంగారం, ల్యాప్‌ట్యాప్, వాషింగ్ మెషీన్‌లభిస్తాయని చెప్పడంతో పెద్ద ఎత్తున వారివద్ద స్క్రాచ్ కార్డులు కొన్నారు. ఇలా మోసగాళ్లు యాదగిరిగుట్ట, యాదగిరిపల్లి, మోత్కూరు, ఆత్మకూర్, వడాయిగూడెం, ముగ్దుంపల్లి, కొండమడుగు, మాదాపురం, అవుషాపురం, వలిగొండ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున స్క్రాచ్ కార్డులు విక్రయించి రూ.లక్షలు దండుకున్నారు. అయితే తమకు స్క్రాచ్ కార్డులో వచ్చిన ఫ్యాన్లు ఇవ్వకుండా కేవలం రైస్‌కుక్కర్‌ను మాత్రమే ఇచ్చిన వారు మిగతా వస్తువులతో పాటు బంపర్ ఫ్రైజ్ కూడా ఇస్తామని చెప్పిన ప్రకారం వివిధ గ్రామాల నుంచి కార్డులు తీసుకువచ్చారు. తీరా ఇక్కడి వచ్చి చూస్తే మోసగాళ్లు ఇంటికి తాళం వేసి ఎప్పుడో ఉడాయించారు. దీంతో తాముమోసపోయామని ఆగ్రహించిన వారంత తీవ్ర దూషణలకు దిగారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమకు జరిగిన మోసాన్ని వివరించి న్యాయం చేయాలని పోలీస్‌లను కోరారు. 10వ తేదీ రమ్మన్నారు ఆగస్టులో మాయింటికి వచ్చారు. బంపర్ ఆఫర్ ఉందని చెప్పి రూ.1900 తీసుకుని స్క్రాచ్ కార్డు ఇచ్చారు. అందులో ఫ్యాన్ వచ్చింది.కానీ రూ. 400ల కుక్కర్ ఇచ్చారు. ఇదేమిటని అడిగితే 10వ తేదీ భువనగిరిలో బంపర్ డ్రా తీస్తారు. ఆ రోజు అక్కడివస్తే ఫ్యాన్ లేదా మిగిలిన 1500లు ఇస్తామని నమ్మబలికారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరూ లేరు. తనలాంటి వారెందరో మోసపోయారు. - మారగోని మల్లయ్య, వలిగొండ -
బంపర్ ఆఫర్ కొట్టేసింది!
-
కోలీవుడ్‌లో సంపూకి బంపర్ ఆఫర్
-
బంపర్ ఆఫర్లు
విజయనగరం మున్సిపాలిటీ: తెలుగు ప్రజల పెద్దపండగ సంక్రాంతి. దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఉద్యోగస్తులు, విద్యార్థులు ఉన్నా పండగ సమయానికి సొంత ఊళ్లకు రావడం ఆనవాయితీ. పెద్దపండగ వస్తోందంటే సందడి అంతా ఇంతా కాదు. సంక్రాంతి రావడంతోనే ఏడాదంతా దాచుకున్న డబ్బుతో నూతన వస్త్రాలు, పాదరక్షలు, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఏటా మార్కెట్లో డిస్కౌంట్ ఆఫర్లు హడావుడి సృష్టించేవి. అయితే ఈ ఏడాది డిస్కౌంట్ ఆఫర్లకు బదులుగా బంపర్ ఆపర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇంతవరకు పెట్టిన డిస్కౌంట్ ఆఫర్‌పై వినియోగదారునికి మోజు తీరిపోయిందని గ్ర హించారో ఏమో గానీ..దుకాణదారులు మరికాస్త ముందుకెళ్లి ఒకటి కొనండి..రెండవది ఉచితంగా పొందండి అంటూ వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డారు. ప్రధానంగా ఏడాది వ్యవధిలో పెళ్లి చేసుకున్న నూతన వధూవరులకు ఈ పండగ వరాలు కురిపిస్తుంది. కొత్త అల్లుళ్లకు, ఇంటి ఆడపిల్లలకు నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, కొత్త వాహనాలు కొనుగోలు చేసి కానుకగా అందించడం అనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా ఇంట్లో సందడి చేసే మనుమలు, మనుమరాళ్లకు ఈ పండగలో వారు ఏం కోరితే అది కొనిచ్చి సంతోష పెడుతుంటారు. వీరిని దృష్టిలోపెట్టుకుని వ్యాపారులు ఉచితబహుమతులు, సున్నాశాతం వడ్డీతో సులభవాయిదాల పద్ధతులు ప్రవేశపెట్టి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. దీంతో షాపులన్నీ కొనుగోలుదారులతో సందడిగా మారాయి. జిల్లాకేంద్రమైన విజయనగరం పట్టణంలో మెయిన్‌రోడ్,కన్యకాపరమేశ్వరి అమ్మవారిఆలయం జంక్షన్, ఉల్లివీధి, కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్, ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ తదితర ప్రాంతాల్లో మార్కెట్ రద్దీ నెలకొంది. కొంగొత్త డిజైన్లు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండే పలు రకాల వస్త్రాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా మధ్య, దిగువ తరగతి ప్రజలకు అనువైన ధరల్లో వారి అభిరుచికి తగినట్టు దుస్తులు కొనుగోలుచేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువగా రెడీమేడ్ దుస్తుల పైనే మొగ్గుచూపుతున్నారు. టీషర్ట్స్,జీన్స్, చుడీదార్, శారీస్ వివిధరకాల ఫ్యాషన్ వస్త్రాలు ఎక్కువగా అమ్ముడవుతు న్నాయి. యువకులను ఆకర్షించేందుకు దేశ ప్రధాని నరేంద్రమోడీ వాడే వస్త్రాల తరహాలో కోటు మోడల్స్ నూతన ఆకర్షణగా ఈ ఏడాది మార్కెట్లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయనగరం మార్కెట్లో రెడీమేడ్ వస్త్రాలు విక్రయించే దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి. ఆధ్యాత్మిక గ్రంథాల పంపిణీ విజయనగరం టౌన్ : మతరహిత ఆధ్యాత్మిక గ్రంథాలను మిషన్ తారా విశాల్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు సంస్థ కో ఆర్డినేటర్ హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆదివారం టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో విశాఖ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఉచితంగా ఆధ్యాత్మిక గ్రంథాలను భక్తులకు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా మానసికంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇ టువంటి పుస్తకాలను చదవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇప్పటివరకూ పది వేలకు పైగా పుస్తకాలను ఉచి తంగా పంపిణీ చేశామన్నారు.ఈ కార్యక్రమంలో డాక్ట ర్ రంగారావు, ప్రసన్నలక్ష్మి, నిర్మల, వరుణ్, సన, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు. -
బంపర్ ఆఫర్!
అమెరికన్ మోడల్ తారా రీడ్‌కు ఓ బంపర్ ఆఫర్ తగిలింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసిన న్యూడీ పిక్చర్స్‌కు ఓ పోర్న్ కంపెనీ తెగ ఇంప్రస్ అయిందట. తాము తీయబోయే సెక్స్ టేప్ పిక్చర్లో నటిస్తే మిలియన్ డాలర్లు ఇస్తామంటూ ఈ సుందరికి ఆహ్వానం పంపింది. ‘గేమ్లింక్.కామ్’ అనే సదరు ఆన్‌డిమాండ్ పోర్న్ సైట్ ఇచ్చిన ఈ మెగా ఆఫర్‌కు తార ఇంకా స్పందించలేదని టీఎంజడ్.కామ్ కథనం. న్యూ ఇయర్‌ను ఫుల్మూడ్లో ఆస్వాదిస్తుండగా తీసిన ఈ ఫొటోస్ ఎంతో ‘ఇది’గా ఉన్నాయట. ఏదిఏమైనా... ఈ కొత్త సంవత్సరంలో తార ‘కొత్త’తరహా మూవీస్‌కు అంగీకరిస్తుందో లేదోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. -
భాగ్యనగరంతో బంపర్ ఆఫర్
నాడు ఎర్ర బస్సెక్కి వచ్చిన అనుభవాలు, రోడ్లపై పచార్లు, అడ్డాలో చాయ్ బాతాఖానాలు.. నేటికీ సజీవం! ఫారిన్ కార్లలో షికార్లు కొట్టినా.. ‘క్లాప్’లతో ‘షో’పుటప్లు పెరిగినా.. ఆ అనుభూతులు పదిలం. సొంతూరు పుట్టుకనిస్తే, భాగ్యనగరం బతుకునిచ్చింది. అమ్మదనం నిండిన కమ్మదనం, బంధుత్వాన్ని మరిపించిన స్నేహగణం.. అన్నీ ఇచ్చిన హైదరాబాద్‌తో తనది మరపురాని బంధమంటున్నాడు హీరో సాయిరామ్ శంకర్. భాగ్యనగరంతోనే తన జీవితానికి బంపర్ ఆఫర్ వచ్చిందంటున్నాడు. ఆ రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. 1997లో.. పెట్టేబేడా సర్దుకొని నగరానికి షిఫ్ట్ అయ్యా. అంతకుముందు చాలాసార్లే వచ్చివెళ్లినా పర్మనెంట్‌గా వచ్చింది మాత్రం ఆ ఏడాదే. అప్పట్లో అన్నయ్య పూరీ జగన్నాథ్ ఇక్కడ సీరియల్ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. తన దగ్గరే మకాం. ఎర్రగడ్డ జక్ కాలనీలో ఉండేవాళ్లం. ఎదురుగా గోకుల్ థియేటర్. అదే మా అడ్డా. అన్నయ్య దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసేవాడిని. బ్లూసీ.. వాటే టీ..! నిఖార్సయిన చాయ్ తాగాలంటే సికింద్రాబాద్ బ్లూసీకి వెళ్లాల్సిందే. నిజంగా అంత టేస్టుంటుంది అక్కడ టీ. రెగ్యులర్‌గా చాయ్ తాగడానికి దస్ నంబర్ బస్ ఎక్కి మరీ వెళ్లేవాళ్లం. ఇక సంగీత్ థియేటర్లో సినిమా చూడ్డం ఓ హాబీ. ఆ సౌండ్ ఎఫెక్ట్స్, పిక్చర్ క్వాలిటీకి ఫిదా అవ్వని ప్రేక్షకుడుంటాడా! వారం వారం అన్నయ్య, నేను అందులో ఇంగ్లిష్ సినిమాలు చూసేవాళ్లం. ఎర్రగడ్డ టు అమీర్‌పేట్ కొంతకాలానికి మకాం అమీర్‌పేట్‌కు మారింది. అప్పుడప్పుడూ ఊర్వశి రెస్టారెంట్లో ‘ఎంజాయ్మెంట్’. రూమ్‌లో వంట (అన్నయ్యే నేర్పించాడు) బోర్ కొడితే గోల్డెన్ కేవ్ రెస్టారెంట్లో వాలిపోయేవాళ్లం. మా బ్యాచ్ దాదాపు పాతిక మంది. బాటా ఎదురుగా ఓ చిన్న కేఫ్ ఉండేది. ఇరవై నాలుగు గంటలూ అక్కడే. అర్ధరాత్రి పోలీసులు వచ్చి తరిమేసిన సందర్భాలూ ఉన్నారుు. దర్శకుడు శ్రీను వైట్ల కూడా వచ్చేవాడు. కానీ ఆయనతో మాకప్పుడు పరిచయం లేదు. రోడ్ నంబర్ 3.. నాడలా... ఫ్లాష్‌బ్యాక్‌కు వెళితే ఒక్కోసారి విచిత్రమనిపిస్తుంది. ఆ వెంటనే ఆనందమూ ఉప్పొంగుతుంది. నేను తొలిసారి షూటింగ్ కోసం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3కి వచ్చా (1997). ‘నాంది’ చిత్రం షూటింగ్ కోసం బస్సులో అక్కడి నుంచి బయలుదేరి బనగానపల్లి వెళుతున్నాం. జాన్ (నటి హేవు భర్త) దానికి కెమెరామన్. నేను అసిస్టెంట్ కెమెరామన్. ఆ బస్సులో బంపర్ ఆఫర్ రవి, బాలీవుడ్ దర్శకుడు ఇ.నివాస్ తదితరులున్నారు. అప్పట్లో ఈ రోడ్డులో మసీదు, క్యూ మార్టే కనిపించేవి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు తరువాత పెద్దమ్మ గుడి ఒకటి ఉండేదని తెలుసంతే. ఇదే రోడ్డులో ఓ బిల్డింగ్ ఉంది. సినిమాలో హీరో ఇల్లు కొన్నా, అమ్మినా.. మరేదైనా బిల్డింగ్ సీన్ అయినా అప్పుడక్కడే షూటింగ్. ఇప్పుడా బిల్డింగ్‌లోనే ఓ ఫ్లాట్ కొన్నా. కెరీర్ వేటలో మొదట అడుగు పెట్టిన చోటే ఇప్పుడు నివాసముంటుంటే.. అదో వింత అనుభూతి. ఎలా కట్టారో? నగరంలో నాకు బాగా నచ్చే స్పాట్ గోల్కొండ. అంత పెద్ద కోటను ఎలా కట్టారోననిపిస్తుంది. షూటింగ్‌లకు వెళ్లినప్పుడు హడావుడిగా చూడటమే గానీ, ఇంత వరకు కోట పైకి వెళ్లడం కుదరలేదు. ప్యూర్ నాన్‌వెజ్! బేసిగ్గా నేను ప్యూర్ నాన్వెజ్జీని (నవ్వుతూ). షూటింగ్‌లు లేనప్పుడు ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా. లేదంటే స్క్రిప్ట్‌లు వింటుంటా. బోర్ కొడితే ఏ రెస్టారెంట్‌కో వెళ్లి వెరైటీ ఫుడ్ ఆర్డర్ చేస్తుంటా. కేఫ్ 4 రెస్టాలో చికెన్ పాస్తా, జిటిలో ఆలూ చికెన్, డైన్హిల్లో గ్రిల్ చికెన్.. ఇలా ఒక్కో చోట ఒక్కో వెరైటీ టేస్ట్ చేయడం సరదా. నాన్న కోరిక అన్నయ్య తీర్చాడు నన్ను వెండితెరపై చూడాలన్నది మా నాన్న అభిలాష. హీరోని చేసి ఆ కోరికను అన్నయ్య తీర్చాడు. నేనీ స్థాయిలో ఉన్నానంటే ఆ క్రెడిట్ అన్నయ్యదే. ఆయన దగ్గర చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా. అదే సమయంలో ‘ఇడియట్’లో నటించా. హీరోగా మాత్రం తొలి సినిమా ‘143’. ప్రస్తుతం ‘రోమియో’ విడుదలకు సిద్ధంగా ఉంది. జగదంబ, తమిళ హీరో శరత్‌కుమార్‌తో కలిసి మరో సినిమా చేస్తున్నా. నాకు నచ్చే నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన ఆల్ ఇన్ వన్. తరువాత బ్రహ్మానందం హాస్యం తెగ ఎంజాయ్ చేస్తా. ప్రేమ.. పెళ్లి.. ఇప్పటికీ చాలామందికి తెలీదు.. నాకు పెళ్లయినట్టు. ఈ విషయం ఎక్కడా చెప్పలేదనుకోండి. సిటీలోనే ఆమెతో పరిచయం. పేరు వనజ. లవ్ మ్యారేజ్. ఒక పాప.. జనన్య. నర్సరీ చదువుతోంది. టుడే ఈజ్ మై బర్త్‌డే అన్నట్టు చెప్పడం మరిచా.. ఈ రోజే నా బర్త్‌డే! సెలబ్రేషన్స్ అంటూ ఏమీ చేసుకోను. ఉదయం దేవాలయానికి వెళ్లడం, కుదిరితే ఫ్యామిలీతో కలసి లంచో, డిన్నరో చేసి రావడం. ఇంతకు మించి నో స్పెషల్స్. ఎవర్ స్పెషల్ విశాఖపట్నం నర్సీపట్నం దగ్గర ఓ చిన్న గ్రామం మాది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన తరువాత హైదరాబాద్‌కు వచ్చా. పుట్టి పెరిగిన ఊరునొదిలి రావడం బాధగా ఉన్నా, కెరీర్ కోసం మకాం మార్చక తప్పలేదు. ఒకటి జీవితం ఇచ్చిన ఊరు, ఇంకొకటి జీవించడం నేర్పిన ఊరు. భాగ్యనగరమే నాకు బతుకునిచ్చింది. అందుకే ఈ మహానగరం అంటే నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. - హనుమా ఫొటో : ఎన్.రాజేష్‌రెడ్డి -
చిరంజీవి బంపర్ ఆఫర్!
టాలీవుడ్‌ని మకుటంలేని మహారాజులా ఏలిన చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేసి బోల్తాపడ్డారు. ఆ సినీ సుప్రీం ఇప్పుడు మళ్లీ వెండితెరకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యారు. రాజకీయాల ద్వారా పోయిన ప్రజాదరణను, సినిమాల ద్వారా ప్రేక్షకాదరణ రూపంలో మళ్లీ పొందాలని ఆయన ఆశిస్తున్నారు. ఇప్పుడు వీలైనంత త్వరగా తన 150వ చిత్రం ప్రారంభించాలన్న ఉత్సాహంతో చిరంజీవి ఉన్నారు. అత్యంత ప్రతాష్టాత్మకంగా, తన మెగా ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ సినిమా ఉండాలని ఆశిస్తున్నారు. అయితే ముందుగా అందుకు తగ్గ కథ కావాలి. ఆ ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి పలు కథలు విన్నారు. రీమేక్ కోసం పలు ఇతర భాష చిత్రాలు కూడా చూశారు. ఇప్పటివరకు ఆయనకు ఏ కథా నచ్చలేదు. అందుకని కథా రచయితలకు చిరంజీవి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. తన ఇమేజ్‌కు, తన 150 చిత్రం స్థాయికి తగిన అద్భుతమైన కథ అందిస్తే కోటి రూపాయల పారితోషికం ఇప్పిస్తానని ప్రకటించారట. చిరంజీవి 150వ సినిమాకు కథ అంటే మాటలుకాదు. ఆ చిత్రానికి కథ అందిస్తే ఎంతటి పేరు వస్తుందో అందరికీ తెలిసిందే. చిరుకు నచ్చే విధంగా, మెచ్చేవిధంగా కథను రాయడానికి రచయితలు పోటీపడుతున్నారు. కోటి రూపాయల బంపర్ ఆఫర్ ఎవరిని వరిస్తుందో! -
భారం: ఆ దేశాలకు ఒక బరువైన సమస్య...!
ప్రపంచానికి ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటి? ఏ సమస్య పరిష్కారం కోసం చాలా దేశాల ప్రభుత్వాలు కంకణం కట్టుకొని ప్రయత్నిస్తున్నాయి? ఏ విషయంలో కృషి చేసిన వారిని ప్రభుత్వాలు ప్రత్యేకంగా అభినందిస్తున్నాయి? వారికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి?! ఇలాంటి ప్రశ్నలు ఎదురైతే.. మనలో చాలా మంది ‘పచ్చదనం పరిశుభ్రత’ ‘అడవుల పెంపకం’ ‘కాలుష్య నియంత్రణ’ తరహా సమాధానం ఇచ్చేసుకొంటాం. అయితే ఈ రంగాల్లో కృషి చేస్తున్న వారి విషయం ఎలా ఉన్నా.. ఇప్పుడు ప్రపంచానికి ఒక ‘బరువైన’ సమస్య తలనొప్పిగా తయారైంది. ఆ సమస్యను పరిష్కరించడానికి అనేక దేశాల ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అదే ‘ఊబకాయం’. దుబాయ్‌లో బంగారం ఇస్తున్నారు! ఒక కిలోగ్రాము బరువు తగ్గారంటే ఒక గ్రాము బంగారం ఉచితం అనే బంపర్ ఆఫర్‌ను అమల్లో పెట్టింది దుబాయ్ ప్రభుత్వం. ఆ దేశ ప్రభుత్వానికి ప్రజల ఊబకాయం నిద్రలేకుండా చేస్తోంది. ఎలాగైనా సరే వాళ్లందరి బరువును తగ్గించాలని, ఫిట్‌గా ఉంచాలని అక్కడి ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. నిజానికి దుబాయ్ ప్రభుత్వం ప్రతిదానికీ రాయితీలు ఇస్తుండటంతో ఆ దేశప్రజలకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోతోంది. శారీరక శ్రమ చేయాల్సిన అవసరం తగ్గింది. చిన్న చిన్న పనులకు కూడా పరాయి దేశాల నంచి కూలీలను తెచ్చుకొనే సంస్కృతి ఉందక్కడ. దీంతో శారీరకంగా ఏమాత్రం కష్టపడని జనాలు ఊబకాయులు అవుతున్నారు. ఇప్పుడు దుబాయ్‌లో దాదాపు 40 శాతం మంది ఊబకాయం బాధితులే అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాయితీలతో ప్రజలను ఇలా తయారు చేసిన ప్రభుత్వం ఇప్పుడు అలాంటి విధానాలతోనే వారి బరువును తగ్గించడానికి పాటుపడుతోంది. ‘బరువు త గ్గండి బంగారం పొందండి’ అంటూ పదేపదే బంపర్ ఆఫర్లతో జనాలను ప్రలోభపరుస్తోంది. అయితే దీనికి వస్తున్న స్పందన అంతంత మాత్రమేనట! బ్రిటన్ పీఎం స్వయంగా రంగంలోకి దిగాడు! దుబాయ్లాగే పౌరుల ఊబకాయత్వంతో బాగా ఇబ్బందులు పడుతున్న దేశం బ్రిటన్. ఇక్కడ కూడా దాదాపు 30 శాతం ప్రజలు మితిమీరిన బరువుతో ఏ పనీ చేయలేకపోతున్నారట. ఆఖరికి సొంత పనులకు కూడా వీళ్లకు సహాయకుడు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే చిన్నపిల్లల్లో కూడా ఊబకాయ సమస్య తీవ్రస్థాయికి చేరింది. వాళ్లు తీసుకొనే ఆహారంలో కొవ్వులు ఎక్కువగా ఉంటున్నాయనీ, దీంతో శరీరాల్లో ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ పెరిగిపోతోందనీ వైద్యులు నిర్ధారిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు బ్రిటన్ ప్రధాని కామెరూన్. ప్రతి వారాంతంలోనూ క్యాలరీ, షుగర్ ఫ్రీ ఆహారాన్ని తీసుకొంటానని ఆయన ప్రకటించారు. శని, ఆదివారాల్లో కామెరూన్ తన శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరకుండా చూసుకొంటూ అందరికీ ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. తను పత్యం పాటిస్తున్నాడు కాబట్టి దేశంలో తనను అభిమానించే వాళ్లు ఆ విషయంలో ఆదర్శంగా తీసుకొంటారనీ, దీని వల్ల కొంతమేర అయినా ఊబకాయ సమస్య తగ్గుతుందనీ కామెరూన్ ఆశ. కేవలం దుబాయ్, బ్రిటన్లే కాదు. ఆర్థికంగా పుష్టిగా ఉన్న దేశాల్లో, ప్రజలకు రాయితీలను ఇచ్చి పెంచుతున్న అనేక దేశాలలో ఊబకాయం (ఒబేసిటీ) ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది. దాన్ని నివారించడానికి ఎవరి పాట్లు వాళ్లు పడుతున్నారు. ఎందుకంటే ఊబకాయం దేశాల ఉత్పాద కతను తగ్గిస్తోంది. మానవ వనరుల్లో సోమరితనాన్ని పెంచుతోంది. ఇది భవిష్యత్తులో వైద్య పరంగానూ భారం అయ్యే ప్రమాదం ఉంది. చాలా దేశాల్లో ఇలా మితిమీరి తినడం, శారీరక శ్రమ చేయపోవడం జాతీయ విపత్తులుగా మారుతున్నాయి. ఏదేమైనా ప్రమాదాన్ని మొదట గుర్తించిన దేశాలు ఈ రెండు. వీటి సరసన నడవడానికి మరికొన్ని దేశాలు సిద్ధంగా ఉన్నాయి. -
ఫలితాలు చెప్పండి 10 లక్షల పట్టుకెళ్లండి
హైదరాబాద్ : భారత హేతువాద సమాఖ్య... జ్యోతిష్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలను కచ్చితంగా వెల్లడించిన వారికి రూ.10 లక్షల బహుమతిగా గెలుచుకోవచ్చని ప్రకటించింది. తాము గత నలభై సంవత్సరాలుగా ఈ సవాలు విసురుతున్నప్పటికి భవిష్యత్తు చెప్పే శక్తులు ఉన్నాయని చెప్పుకొనే వారెవ్వరూ ఇప్పటి వరకు బహుమతి గెలవలేదు అని ఐహెచ్ఈయూ(అంతర్జాతీయ హేతువాద, మానవవాద సంఘాల సమాఖ్య) సంచాలకుడు బాబు గోగినేని అన్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ నెల 12న మున్సిపల్, 13న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు, 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా 2009 ఎన్నికల ఫలితాలు కూడా మే 16ననే వెలువడ్డాయి. సరిగ్గా మరోసారి మే 16 వ తేదీనే ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు జ్యోతిష్యుల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. అప్పట్లో మే 16న శనివారం, విరోధినామ సంవత్సరం, బహుళ సప్తమి, శ్రవణ నక్షత్రం, వైశాఖ మాసం రోజున లెక్కింపు జరిగింది. ఇప్పుడు మే 16 శుక్రవారం, జయనామ సంవత్సరం, బహుళ విధియ, ధనుష్క నక్షత్రం, వైశాఖమాసంనాడు ఓట్ల లెక్కింపు జరుగనుంది. దీంతో జ్యోతిష్యులు కూడా ఫలితాలపై అంచనాలు వెల్లడిస్తున్నారు. మరి ఎవరి భవిష్యత్ ఎలా ఉందో తేలాలంటే మే 16వరకూ ఆగాల్సిందే. -
బేరసారాలు మొదలు !
ఉపసంహరణకు రూ.లక్షలు నజరానా ? రెబల్స్‌ను బుజ్జగిస్తున్న పార్టీల నేతలు ‘స్థానిక’ పోరులో అభ్యర్థుల హైరానా బీఫాం కోసం నేతల చుట్టూ ప్ర‘దక్షిణ’లు! ఖమ్మం: స్థానిక పోరులో ఇక బేరసారాలకు తెర లేచింది. నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ అభ్యర్థులకు ఆఫర్లమీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. లక్షల రూపాయలు నజరానా ఇచ్చేందుకు మధ్యవర్తులతో మంతనాలు జరుపుతున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ప్రస్తుతం ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఉపసంహరణ గడువు దగ్గర పడుతుండడంతో ఎవరికివారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా 640 ఎంపీటీసీ స్థానాలకు నాలుగు వేలకు పైగా నామినేషన్లు, 46 జెడ్పీటీసీలకు 497 నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని పార్టీలు ఒక స్థానం నుంచి ఒక్క అభ్యర్థినే బరిలోకి దించితే.. మరికొన్ని పార్టీల నుంచి ఒక్కో స్థానానికి ముగ్గురు, నలుగురు వరకు నామినేషన్లు వేశారు. ప్రధానంగా ఎంపీటీసీ నామినేషన్లలో ఈ పరిస్థితి కనిపించింది. నేతల హామీలతో వారి అనుచరగణమంతా ఎవరికివారు తమది ఫలానా పార్టీ అని పేర్కొంటూ ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేశారు. ఒక్కో స్థానానికి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేయడంతో ఇప్పుడు ఎవరు బరిలో ఉంటారు..?ఎవరు పోటీ నుంచి తప్పుకుంటారనే చర్చ ఆయా పార్టీల్లో కొనసాగుతోంది. కొత్తగూడెం, ఇల్లెందు, పాలేరు, మధిర, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి రెబల్ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇల్లెందు నియోజకవర్గంలో అన్ని ఎంపీటీసీ స్థానాలకు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి అనుచరులు పోటీగా నామినేషన్లను వేసి వర్గపోరు సమసిపోలేదని నిరూపించారు. అలాగే పార్టీల తరఫున బీఫాం వస్తుందో..రాదోనని మరికొంత మంది స్వతంత్రులుగా కూడా నామినేషన్ వేశారు. ఇలా పార్టీల తరఫున ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ఎక్కువ సంఖ్యలో నామినేషన్ వేయడంతో ఎవరిని బుజ్జగించాలన్నది ఇప్పుడు నాయకులకు తలనొప్పిగా మారింది. బుజ్జగింపులు.. నజరానాలు.. నామినేషన్ల పరిశీలన ముగియడం, ఉప సంహరణ గడువు దగ్గర పడుతుండడంతో ఎవరిని బరిలో ఉంచాలన్నది పార్టీ నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బరిలో తప్పకుండా నిలవాలనుకనే వారు.. నామినేషన్ వేసిన వారికి ఎంతోకొంత నజరానా ఇవ్వాల్సిందేనని ఇప్పటికే నేతలు అభ్యర్థుల ముందు ప్రస్తావన తెచ్చారని తెలుస్తోంది. ఎంపీటీసీకి రిజర్వేషన్ ఆధారంగా రూ. లక్ష నుంచి రూ.2 లక్షల పైగా బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. మండలపరిషత్ పీఠం దక్కించుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చ నడుస్తోంది. కొన్ని చోట్ల వర్గాల వారీగా నామినేషన్లు వేయడంతో ఇక్కడ బుజ్జగింపులు ఉండవని, ప్రత్యక్ష పోరులోనే అమీతుమీ తేల్చుకుంటామని ఆయా పార్టీల నేతలు అంటున్నారు. బీ ఫారానికీ ‘రేటు’.. కొన్ని పార్టీల తీరు ఎలా ఉందంటే....పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థులకు రెండువైపులా చిలుము వదిలే పరిస్థితి ఎదురవుతోంది. రెబల్స్‌ను బుజ్జగించడానికి నజరానా ఇవ్వడం ఒకటయితే.. బీఫాం దక్కించుకోవడానికి కూడా జేబు ఖాళీ అవుతోంది. ఎక్కువ ఓటర్లు ఉండి, రాజకీయంగా పలుకుబడి ఉండే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పార్టీ తరఫున బీఫాం దక్కాలంటే.. ఆయా నేతలు నిర్ణయించిన రేటుకు తల ఊపాల్సిందే. నామినేషన్ వేసిన అభ్యర్థులు పార్టీ బీఫాం దక్కించుకోవడానికి తమకు తెలిసిన నేతల ద్వారా అసలు నేతలతో బేరసారాలకు తెరలేపారు. నామినేషన్ వేసినా పార్టీ గుర్తింపు లేకపోతే విజయం వరించదన్న భావనతో బీఫాం కోసమే రూ.లక్షలు ముట్టజెప్పడానికి కూడా కొందరు అభ్యర్థులు వెనుకాడడం లేదని సమాచారం. నామినేషన్ల ఉప సంహరణకు ఇక మూడు రోజులే గడువు ఉండడంతో మధ్యవర్తులతో ప్రయోజనం లేదని భావిస్తున్న కొంతమంది అభ్యర్థులు ఏకంగా నేతల ఇంటి చుట్టూ అప్పుడే ప్రదక్షిణలు చేస్తున్నారు. -
దిల్లున్నోడి కథ
అతను బాగా దిల్లున్నోడు. ఏదైనా అనుకుంటే అది సాధించడానికి ఎంతకైనా తెగిస్తాడు. ఈ నేపథ్యంతో రూపొందిన చిత్రం ‘దిల్లున్నోడు’. సాయిరామ్ శంకర్ హీరోగా ‘బంపర్ ఆఫర్’ ఫేమ్ జయరవీంద్ర దర్శకత్వంలో శ్రీ సౌదామినీ క్రియేషన్స్ పతాకంపై కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో కె.వేణుగోపాల్ నిర్మించిన చిత్రం ఇది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కె.వేణుగోపాల్ మాట్లాడుతూ -‘‘ఇది యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. యూత్‌కి, మాస్‌కి నచ్చే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ‘బంపర్ ఆఫర్’లాంటి హిట్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ వారంలో పాటలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. దర్శకుడు జయ రవీంద్ర మాట్లాడుతూ -‘‘ఇందులో మొత్తం 5 పాటలున్నాయి శేఖర్‌చంద్ర సంగీతం ఆకట్టుకుంటుంది. ’’ అని చెప్పారు. జాస్మిన్, ప్రియదర్శిని ఇందులో కథానాయికలు. -
టే-మంత్రులకు బంపర్ ఆఫర్
-
‘క్లియరెన్స్’ పండుగ!
బంపర్ ఆఫర్.. బ్రహ్మాండమైన క్లియరెన్స్ సేల్.. అప్ టు 60 శాతం డిస్కౌంట్.. ఆలసించిన ఆశాభంగం.. రండి.. త్వరపడండి.. ఇటువంటి ప్రకటనలు చూడగానే అర్థమైపోతుంది.. ఇదేదో వ్యాపార ప్రకటన అని.. కానీ ఇక్కడ మనం చెప్పుకొనేది ఈ వ్యాపార ప్రకటనల గురించి కాదు!.. అచ్చం అదే రీతిలో సర్కారీ కార్యాలయంలో జరిగిన పండుగ చెల్లింపుల క్లియరెన్స్ గురించి..!!.. అక్కడ కొనుగోలుదారులకు వ్యాపారస్తులు డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తే.. ఇక్కడ బిల్లులు క్లియర్ చేసినందుకు కృతజ్ఞతగా కాంట్రాక్టర్ల నుంచి ఉద్యోగులే పర్సంటేజీల ఆఫర్ తీసుకున్నారు. వెరసి అక్కడ సంక్రాంతికి ముందే చెల్లింపుల క్లియరెన్స్ పండుగ చేసుకున్నారు. శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: రెండో శనివారం సెలవు.. తర్వాత ఆదివారం.. ఆ వెంటనే సంక్రాంతి సెలవులు.. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. సాధారణంగా వరుసగా రెండు రోజులు సెలవులు వస్తే.. ఆ ముందు రోజు మధ్యాహ్నానికే కార్యాలయాలు ఖాళీ అయిపోతాయి. అటువంటి వరుసుగా ఐదారు రోజులు సెలవులు వచ్చినా.. రెండో శనివారమైనా జిల్లా పరిషత్‌లోని ఒక విభాగం మాత్రం సందడిగానే కనిపించింది. ఫైళ్లతో కుస్తీ పడుతూ ఉద్యోగులు.. హడావుడిగా లోనికి, బయటకు తిరుగుతూ బయటి వ్యక్తులు.. బిజీ బిజీగా గడిపారు. సెలవు రోజు ఈ హడావుడి ఏమిటా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. సంక్రాంతి వస్తోంది.. ఖర్చులకు చేతిలో డబ్బులుండాలి. కొన్నాళ్లుగా పెండింగులో ఉన్న బిల్లులను క్లియర్ చేస్తే ఇటు కాంట్రాక్టర్లకు డబ్బులు అందుతాయి. అందుకు ప్రతిఫలంగా ఉద్యోగులకు పర్సంటేజీలు(పీసీలు) అందుతాయి. ఇద్దరి పండుగ ఖర్చులు గట్టెక్కుతాయి. ఉభయతారకంగా ఉన్న ఈ ఆఫర్ పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారుల నుంచే కాంట్రాక్టర్లకు అందింది. వారు సంబరంగా సరే అన్నారు. ఇంకేముందు సెలవు రోజైనా శనివారం పెద్దసంఖ్యలో కాంట్రాక్టర్లు జెడ్పీ కార్యాలయానికి వచ్చి బిల్లులు క్లియర్ చేయించుకున్నారు. ప్రధానంగా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో చేపట్టిన పనుల బిల్లులు ఎక్కువగా క్లియర్ అయినట్లు సమాచారం. ఇచ్చి..పుచ్చుకున్నారు శనివారం రోజంతా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపే లక్ష్యంగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది పని చేశారు. ఆదివారం కూడా కార్యాలయం తెరిచే ఉంది. సిబ్బంది ఇదే పని కొనసాగించారని తెలుస్తోంది. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నరసన్నపేట తదితర నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంట్రాక్టర్లకు గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు మంజూరు చేస్తామని, అందుకు ప్రతిగా తమకు ఇవ్వాల్సింది ఇచ్చేయాలని అధికారులు ముందే చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆ మేరకు ఒక్క శనివారమే కోట్లాది రూపాయల విలువైన ఉపాధి హామీ రోడ్లు, తుఫాన్ పునుర్నిర్మాణాలు, తదితర పనులకు సంబంధించిన బిల్లులు క్లియర్ చేసి పెద్ద మొత్తంలో పీసీ దండుకున్నట్లు ఆ కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. దీనిపై సంబంధిత ఈఈ ప్రభాకరరావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా ‘మాకేం సెలవులండీ..అందునా పండుగ కదా.. పండుగ ముందే బిల్లులు ఇచ్చేస్తే కాంట్రాక్టర్లు సంతోషిస్తారని మేమే పిలిపించి బిల్లులు చేయించామని’ చెప్పారు. -
‘కారు’చౌక బేరం!
హూస్టన్(అమెరికా): అదృష్టం రెండుసార్లు తలుపు తట్టడం అంటే ఇదే మరి! అమెరికాలో కృతజ్ఞతార్పణల దినోత్సవం(థ్యాంక్స్ గివింగ్ డే) అనంతరం నిర్వహించిన భారీ తగ్గింపు మేళాలో ఓ కుటుంబం కేవలం ఒకే ఒక డాలర్ చొప్పున చెల్లించి రెండు కార్లు సొంతం చేసుకుంది. వీరిద్దరూ తల్లీకొడుకులు కావటం మరో విశేషం. ‘బ్లాక్ ఫ్రైడే’ రోజు కారుచౌక విక్రయాలను పురస్కరించుకుని నైరుతి హూస్టన్‌లోని కార్ల విక్రయ కేంద్రం స్టెర్లింగ్ మెక్ కాల్ టయోటా ఎదుట జనం పెద్ద ఎత్తున బారులు తీరి రాత్రంతా జాగారం చేశారు. దాదాపు 200 మంది ఇందులో పాల్గొన్నారు. కొందరైతే తాము ఎంపిక చేసుకున్న వాహనం పక్కనే కునికిపాట్లు పడ్డారు. ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. రెగినాల్డ్ అనోక్వురు(15)ను తొలుత అదృష్ట లక్ష్మి వరించింది. డాలర్‌కే కారు సొంతమైంది. ఈ ఆనందం నుంచి తేరుకునేలోపే అతడి తల్లికి కూడా ఒక్క డాలర్‌కే కారు దక్కినట్లు తెలియటంతో ఆ కుటుంబం ఉబ్బితబ్బిబ్బైంది. ఈ పిల్లాడికి దక్కిన కారుకు దాదాపుగా అతడి వయసే ఉంది. మొత్తం 300 వాహనాలను ‘బ్లాక్ ఫ్రైడే’లో ప్రదర్శనకు ఉంచగా ఐదు కార్లను మాత్రం డాలర్‌కే విక్రయాలకు పెట్టారు. మిగతా కార్లను బయట మార్కెట్లో దొరికే ధరలకే అమ్మారు. -
కాన్పూర్ ఐఐటీ విద్యార్థులకు బంపర్ ఆఫర్
కాన్పూర్: కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఇద్దరు విద్యార్థులకు బంపర్ ఆఫర్ లభించింది. ఐటీ దిగ్గజం ఒరాకిల్ కంపెనీ వీరిని ఏడాదికి రూ.1.2 కోట్ల భారీ వేతన ప్యాకేజీతో ఉద్యోగాల్లోకి తీసుకుంది. కాన్పూర్ ఐఐటీలో సాగుతున్న క్యాంపస్ రిక్రూట్మెంట్లో సోమవారం వీరికి కొలువులు ఇచ్చింది. మరో 76 మందికి గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ తదితర కంపెనీలు ఏడాదికి రూ.8 లక్షల నుంచి రూ.24 లక్షల వేతనం గల ఉద్యోగాలు ఇచ్చాయి. ఈ రోజు వరకు 180 మంది ఆఫర్ లెటర్లు అందుకున్నారు. 1,100 మంది బీటెక్, ఎమ్ టెక్, ఎంబీఏ, ఎమ్మెస్సీ విద్యార్థులు ఉద్యోగాల కోసం ప్లేస్ మెంట్ సెల్ లో పేర్లు నమోదు చేసుకున్నారు. -
మామూలిచ్చి అమ్ముకోండి!
మంత్రిగారి బంధువుబంపర్ ఆఫర్ =ఇండెంట్ చెల్లించి పది శాతం ఎక్కువకు అమ్ముకోండి =మంత్రిగారి పేరిట వసూళ్లు కప్పం కట్టండి.. ఎక్కువకు అమ్ముకోండి.. ఇదీ జిల్లాలోని వైన్‌షాపులు, బార్ యజమానులకు మంత్రి గారి బంధువు నుంచి వచ్చిన బంపర్ ఆఫర్. ఇప్పటికే అందరికీ మామూళ్లు ఇస్తూనే వస్తున్నామని, ఇప్పుడు అమాత్యుడి పేరుతో అడిగితే తమకు ఇబ్బందేనని వాపోవడం నిర్వాహకుల వంతయింది.. ఇంతకీ ఆ కథేంటో తెలుసుకుందాం... సాక్షి, విజయవాడ : జిల్లాలోని వైన్‌షాపులు, బార్ యజమానులకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. అదేంటంటే రూ.40 వేలు కప్పం కడితే ఎంఆర్పీ కన్నా పది శాతం ఎక్కువకు అమ్ముకున్నా పట్టించుకోం అని. అయితే ఈ హామీ అబ్కారీ శాఖ నుంచి కాకుండా ఆ శాఖ అదనపు బాధ్యతలు చూస్తున్న మంత్రిగారి దగ్గర బంధువు నుంచి రావడం విశేషం. ఈ అంశంలో మంత్రి పుంగవుడు ఎక్కడా నేరుగా జోక్యం చేసుకోలేదు. ఆయనకు దగ్గర బంధువుగా సిండికేట్లతో పాటు అసోసియేషన్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న నేత ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చినట్లు సమాచారం. త్వరలో ఎన్నికలు వస్తున్నాయి... అవసరాల కోసం మనం ఇవ్వడం మంచిదని ఆయన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వాన్‌పిక్ కేసులో అప్పటి అబ్కారీ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు కావడంతో మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథికి అదనపు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అసోసియేషన్ ముందుకు ప్రతిపాదన... జిల్లాలో 360 వరకూ వైన్‌షాపులు, బార్లు ఉన్నాయి. ఒక్కో షాపు నుంచి రూ.40 వేలు మంత్రికి నజరానాగా ఇవ్వాలని అసోసియేషన్ ముందుకు ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన తెచ్చింది కూడా మంత్రి బంధువే. ఈ బంధువే ఈ అసోసియేషన్‌లో కీలక బాధ్యత వహిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు జిల్లాలోని వైన్‌షాపుల నుంచి పెద్దగా అభ్యంతరాలు రాకపోయినా, బార్ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. వారికి లూజ్ అమ్మకాలు, ఎంఆర్పీ కన్నా ఎక్కువకు అమ్మకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అదే బార్ల విషయానికి వస్తే రేటు ఎంతకి అమ్మాలన్న నిబంధనలు లేవు. దీంతో వారు ఈ ఆఫర్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 60 నుంచి 70 షాపుల వారు సదరు నేతకు రూ.40 వేల చొప్పున చెల్లించారు. డబ్బులు చెల్లించిన వారి షాపులపై కూడా ఇటీవల ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. ఒకసారి కేసు నమోదై షాపు మూతపడితే మళ్లీ తెరుచుకోవడానికి కనీసం నెలరోజులు పడుతుంది. రాజధాని స్థాయి నుంచి మళ్లీ అనుమతులు రావాల్సి ఉండటం, ఇక్కడి నుంచి ప్రతిపాదనలు పంపడానికి చాలా సమయం పట్టడం దీనికి కారణం. దీనివల్ల ఆయా షాపులకు ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల వరకు వ్యాపారంలో నష్టం వస్తోంది. షాపుల యజమానుల షరతు... డబ్బులు చెల్లించిన తర్వాత కూడా కేసులు రాస్తుండటంతో వారు అడ్డం తిరిగినట్లు సమాచారం. తమ జోలికి రాకుండా ఉంటేనే డబ్బులు ఇస్తామని మిగిలిన షాపుల వారు మొండికేస్తున్నట్లు సమాచారం. కనీసం నెలన్నర రోజులైనా ఎటువంటి దాడులూ జరగవని హామీ ఉంటే అడిగిన మొత్తం ఇస్తామని వైన్‌షాపుల యజమానులు షరతు పెట్టారు. దీంతో నాలుగురోజుల క్రితం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో కోపంగా ఉన్న సభ్యులు సమావేశానికి హాజరుకాలేదు. కేవ లం ఇద్దరు ముగ్గురు మాత్రమే రావడంతో మిగిలిన వారితో సదరు నేత ఫోన్లో సంప్రదింపులకు తెరతీసినట్లు తెలిసింది. ఇప్పటికే విజయవాడలోని బార్ యజమానులు చాలామంది అందరికీ మామూళ్లు ఇస్తూనే వస్తున్నామని, కొత్తగా మళ్లీ మంత్రిగారి పేరుతో అడిగితే తాము ఇచ్చేదిలేదని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. అసలు మంత్రిగారికి ఇస్తారో లేదో కూడా తమకు అనుమానాలున్నాయని, అందుకే ఇవ్వడానికి ఇష్టపడటం లేదని అధికార పార్టీకి చెందిన బార్ యజమాని ‘సాక్షి’ వద్ద వ్యాఖ్యానించారు. -
ఎంపీ ఇల్లు ముట్టడి
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: తిరుపతి ఎంపీ చింతామోహన్ ఇంటిని ఆర్టీసీ, రెవెన్యూ, మెడికల్, ఉపాధ్యాయ జేఏసీ(ఉద్యోగ జేఏసీ) సమైక్యవాదులు ముట్టడించారు. శుక్రవారం కపిలతీర్థం మార్గంలోని రామచంద్రానగర్ ఉన్న ఎంపీ నివా సం వద్దకు ఆర్టీసీ జేఏసీ నాయకులు మునిసుబ్రమణ్యం, ప్రకాష్, సురేంద్రబాబు, లతారెడ్డి, పీసీబాబు, ఎన్జీవో జేఏసీ నాయకులు నరసింహారెడ్డి, మంజూనాథ్, కోటీశ్వరరావు, సురేష్, విజయలక్ష్మి, నిర్మల, ఉదయలక్ష్మి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో ఇంటి ముందు బైఠాయించి ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి వైఎస్సార్ సీపీ నాయకుడు వరప్రసాద్‌రావు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. ఎంపీ రాజీనామా చేయకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆయన ఊర్లో లేని సమయంలో ఆందోళన చేయడం సరికాదని, వెళ్లిపోవాలని సూచించారు. వరప్రసాద్‌రావు, మునిసుబ్రమణ్యం మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతం నుంచి దళిత, బడుగు, బలహీన వర్గాల ఓట్లతో గెలిచిన ఎంపీ చింతామోహన్ వారిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. సీమాంధ్ర ఉనికికే ప్రమాదకరంగా మారిన రాష్ట్ర విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరూ ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమాన్ని చూడాల్సిన ఎంపీ విభజన ప్రకటన వచ్చినప్పటి నుంచి కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. మరో ఆరు నెలల్లో ఊడిపోయే పదవి కోసం ఎంపీ చింతా పాకులాడడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా ఆయన తన పదవికి రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. ఎంపీని ఇండిపెండెంట్‌గానైనా గెలిపించి తిరిగి చట్టసభకు పంపిస్తామని సమైక్యవాదుల తరఫున బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏపీఎన్జీవో నాయకులు ఆంజేయులు, శేషారెడ్డి, కిరణ్, బాలాజి, భారతి, గోపాల్ హాజరయ్యారు.