
సాక్షి, ముంబై: దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ కస్టమర్లకు శుక్రవారం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన బాలెనో మోడల్ కారుపై లక్ష రూపాయలు తగ్గించి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఢిల్లీలో బాలెనో మోడల్ ధర 5,58,602 ఉంది. ఎంపిక చేసిన పది మోడల్స్‌పై రెండో రోజుల క్రితం 5000 రూపాయల వరకు తగ్గింపు ప్రకటించిన విషయం తెలిసిందే. పండుగ సీజన్‌కు ముందు ఇలాంటి ఆఫర్లతో అమ్మకాలు పెరుగుతాయని తద్వారా కొత్త కస్టమర్లు పెరిగే అవకాశం ఉన్నట్లు మారుతి సుజుకి తెలిపింది.
ఇటీవల కాలంలో ఆర్థిక మాంద్యం ప్రభావంతో అన్ని కంపెనీల కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో అన్ని కంపెనీలు కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మారుతీ సుజకీ బంపర్ ఆఫర్లు ప్రకటించడం విశేషం. సియామ్ గణాంకాల ప్రకారం ఆగస్టులో వాహనాల అమ్మకాలు 31.57 శాతం వరకు పడిపోయాయి. (చదవండి: మందగమనంపై సర్జికల్ స్ట్రైక్!)
Comments
Please login to add a commentAdd a comment