
షాంఘై: చైనాలో మందుబాబులకు అక్కడి మద్యం కంపెనీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. 1675 డాలర్లు చెల్లిస్తే జీవితాంతం మద్యాన్ని ఉచితంగా అందిస్తామని తెలిపింది. నవంబర్ 11న జరిగే షాపింగ్ ఫెస్టివల్‌లో 11,111 యువాన్లు(1675డాలర్లు) చెల్లించి ఈ ఆఫర్ పొందొచ్చని జియాంగ్ షియాబా అనే మద్యం తయారీ కంపెనీ తెలిపింది. ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. సైట్‌లో ఉండే స్టోర్ కూపన్లు, డిస్కౌంట్లను వాడుకుంటే ఈ రేటు ఇంకా తగ్గే వీలుంది. ఈ ఆఫర్ 99 మంది లక్కీ కస్టమర్లకు మాత్రమే. ‘బైజియు’ మద్యాన్ని జీవితాంతం ప్రతీ నెల 12 బాక్సుల్లో లక్కీ కస్టమర్లకు అందిస్తామని తెలిపింది. ఈ ఆఫర్ పొందిన ఐదేళ్లలోపు ఎవరైనా చనిపోతే కుటుంబంలోని ఒక వ్యక్తికి ఇదే ఆఫర్‌ను ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment