లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేస్తున్న కేవీబీ రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు మెట్రో రైలు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వ సెలవు రోజున రూ.59 చెల్లించి అపరిమితంగా ప్రయాణించేందుకు ‘సూపర్ సేవర్ హాలిడే కార్డు’ను ప్రవేశపెట్టింది. ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి గురువారం అమీర్పేట మెట్రో స్టేషన్లో దీనిని ప్రారంభించారు. ఈ కార్డుతో సెలవు రోజున కేవలం రూ.59తో మెట్రోలో ప్రయాణించవచ్చని ఆయన వెల్లడించారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగవచ్చు. ఉగాది పండగ రోజు (ఏప్రిల్ 2) నుంచి మెట్రో రైల్ టికెట్ కౌంటర్ల వద్ద ఈ కార్డులు విక్రయిస్తారని ఆయన తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ముందుగా ప్రకటించిన 100 ప్రభుత్వ సెలవు దినాల్లోనే ఈ రాయితీ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
లక్కీ డ్రా విజేతలకు బహుమతుల ప్రదానం
మెట్రో సువర్ణ ఆఫర్లో భాగంగా నెలవారీ పాసులు కొనుగోలు చేసిన ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపికచేశారు. గెలుపొందిన 5 మంది విజేతలకు బహుమతులను అందజేశారు. మెట్రో సువర్ణ ఆఫర్ విజేతలకు ప్రతి నెల లక్కీ డ్రా తీసి బహుమతులను అందజేస్తున్నట్లు కేవీబీ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment