Government holiday
-
Hyderabad: ప్రయాణికులకు మెట్రో రైలు బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు మెట్రో రైలు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వ సెలవు రోజున రూ.59 చెల్లించి అపరిమితంగా ప్రయాణించేందుకు ‘సూపర్ సేవర్ హాలిడే కార్డు’ను ప్రవేశపెట్టింది. ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి గురువారం అమీర్‌పేట మెట్రో స్టేషన్లో దీనిని ప్రారంభించారు. ఈ కార్డుతో సెలవు రోజున కేవలం రూ.59తో మెట్రోలో ప్రయాణించవచ్చని ఆయన వెల్లడించారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగవచ్చు. ఉగాది పండగ రోజు (ఏప్రిల్ 2) నుంచి మెట్రో రైల్ టికెట్ కౌంటర్ల వద్ద ఈ కార్డులు విక్రయిస్తారని ఆయన తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ముందుగా ప్రకటించిన 100 ప్రభుత్వ సెలవు దినాల్లోనే ఈ రాయితీ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. లక్కీ డ్రా విజేతలకు బహుమతుల ప్రదానం మెట్రో సువర్ణ ఆఫర్లో భాగంగా నెలవారీ పాసులు కొనుగోలు చేసిన ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపికచేశారు. గెలుపొందిన 5 మంది విజేతలకు బహుమతులను అందజేశారు. మెట్రో సువర్ణ ఆఫర్ విజేతలకు ప్రతి నెల లక్కీ డ్రా తీసి బహుమతులను అందజేస్తున్నట్లు కేవీబీ రెడ్డి తెలిపారు. చదవండి: (రీజినల్ రింగ్ రోడ్డు తొలి గెజిట్ విడుదల) -
Eid Milad-un-Nabi: 19న సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: మిలాద్-ఉన్-నబీ పండుగు సెలవును అక్టోబర్ 20వ తేదీకి బదులుగా 19కి మారుస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నిన్నటి రోజున యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సెలవు దినాన్ని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ప్రభుత్వం సెలవును మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆంధ్రప్రదేశ్‌లో 20న మొహర్రం సెలవు
సాక్షి, అమరావతి: మొహర్రం మాసం 10వ రోజు ఇచ్చే సాధారణ సెలవును ఆగస్టు 19వ తేదీ (గురువారం) నుంచి 20వ తేదీ (శుక్రవారం)కి మారుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 20న మొహర్రం నిర్వహణకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ జామా మసీదు ప్రకటన ఆధారంగా మొహర్రం నిర్వహణ తేదీల్లో మార్పులు చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. (చదవండి: ప్రేమ పెళ్లి.. అమ్మాయి దక్కదేమోనన్న అనుమానంతో..) -
సిక్కులకూ ‘కల్యాణ లక్ష్మి’
♦ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి ♦ ప్రభుత్వ సెలవు దినంగా గురునానక్ జయంతి ప్రకటన హైదరాబాద్: ఇక నుంచి సిక్కు కుటుంబాల్లోని ఆడపిల్లలకూ ‘కల్యాణలక్ష్మి’ పథకం కింద ఆర్ధిక సహాయాన్ని అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలలోని అమ్మాయిల పెళ్లి ఖర్చుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సిక్కులకు కూడా విస్తరించనున్నామన్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారులను ఆదేశించనున్నట్లు చెప్పారు. సిక్కుల గురువు గురునానక్‌దేవ్‌జీ మహారాజ్ 545(ప్రకాష్ ఉత్సవ్)వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అఫ్జల్‌గంజ్ అశోక్బజార్లోని గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ, గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జయంత్యుత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విశాల్దివాన్(ఆధ్యాత్మిక సభ)లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,మూడు వందల ఏళ్లుగా నగరంతో అనుబంధం ఉన్న సిక్కులు సామూహిక ప్రార్థనలు నిర్వహిం చుకునేందుకు, సభలు, సమావేశాల ఏర్పాటుకు కమ్యూనిటీ భవనం, ప్రార్ధనామందిరం కోసం మూడెకరాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కమ్యూనిటీహాల్ నిర్మాణానికి రూ. కోటి నిధులను అందజేయనున్నట్లు వెల్లడిం చా రు. దక్షిణ భారత్‌లోనే అతి పెద్ద గురుద్వారా నగరంలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సెలవు దినంగా నానక్ జయంతి గురునానక్ జయంతి రోజును ఇక నుంచి ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించనున్నట్లు చెప్పారు.అపారమైన ధైర్య సాహసాలతో పాటు ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో, కష్టపడేతత్వం గల సిక్కుల జీవన విధానం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అనంతరం కేసిఆర్ తన కుటుంబం తరపున రూ.1.16 లక్షల చెక్కును గురుద్వారా నిర్మాణం నిమిత్తం నిర్వాహకులకు విరాళంగా అందజేశారు. ఉదయం 11గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో సుమారు 30వేలమంది సిక్కులు కుటుంబాల సమేతంగా పాల్గొని భక్తి, శ్రద్ధలతో పూజలు జరిపారు. ఈ సందర్భంగా సిక్కు మతగురువులు భక్తి, భజన కీర్తనలు ఆలపించడంతో పాటు గురునానక్ దేవ్‌జీ మహరాజ్ ఆధ్యాత్మిక ప్రవచనాలను, సందేశాలను బోధించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ, అల్పాహారం, భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా గురుద్వారాల ఛైర్మన్ గురుచరణసింగ్బగ్గా, టీఆర్ఎస్ పార్టీ గోషామహల్, అంబర్పేట్ నియోజకవర్గాల ఇంచార్జిలు ప్రేమ్‌కుమార్‌ధూత్, ఎడ్ల సుధాకర్‌రెడ్డి, అశోక్‌బజార్ గురుద్వారా శ్రీ గురుసింగ్సభ అధ్యక్షుడు కుల్దీప్సింగ్బగ్గా, గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్ అధ్యక్షుడు బల్దేవ్సింగ్ బగ్గా, కార్యదర్శులు ఇంద్రజిత్‌సింగ్ టుటేజా, అవతార్‌సింగ్ కనూజా, గురుద్వారాల ప్రబంధక్ కమిటీ ప్రతినిధులతో పాటు పెద్దసంఖ్యలో సిక్కుసోదరులు పాల్గొన్నారు. -
సెలవుల్లో కూడా పన్ను చెల్లించొచ్చు
ముంబై: ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా పన్ను చెల్లింపుదారుల కోసం ఎంపికచేసిన శాఖలను ఈ నెలాఖరులో మూడురోజులూ తెరిచివుంచాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) బుధవారం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29 (శనివారం), 31(సోమవారం-ప్రభుత్వం ఉగాది సెలవు ప్రకటించని బ్యాంక్ బ్రాంచీల్లో) ఆయా శాఖల్ని రాత్రి 8 గంటల వరకూ తెరిచి ఉంచాలని పేర్కొంది. ఈ నెల 30(ఆదివారం), 31 (సోమవారం) ప్రభుత్వ సెలవు ప్రకటించిన బ్రాంచీల్లో కూడా ఆ రోజుల్లో సాధారణ పని గంటల వరకూ బ్యాంకులను తెరచి ఉంచాలని ఆదేశించింది. భారత ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల విన్నపం మేరకు ఆర్థిక సంవత్సరం ముగింపును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ వివరించింది. అంతే కాకుండా ఈ నెల 29, 30, 31 తేదీల్లో అన్ని క్లియరింగ్ హౌజుల్లో ప్రత్యేకమైన క్లియరింగ్‌ను నిర్వహించాలని నిర్ణయించామని ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ అకౌంట్ లావాదేవీల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.