
సాక్షి, అమరావతి: మొహర్రం మాసం 10వ రోజు ఇచ్చే సాధారణ సెలవును ఆగస్టు 19వ తేదీ (గురువారం) నుంచి 20వ తేదీ (శుక్రవారం)కి మారుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 20న మొహర్రం నిర్వహణకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ జామా మసీదు ప్రకటన ఆధారంగా మొహర్రం నిర్వహణ తేదీల్లో మార్పులు చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది.
(చదవండి: ప్రేమ పెళ్లి.. అమ్మాయి దక్కదేమోనన్న అనుమానంతో..)
Comments
Please login to add a commentAdd a comment