Muharram
-
వందేళ్ల వాగ్దానం.. ఆ గ్రామంలో హిందువుల మొహర్రం
మొహర్రం పండుగను దేశవ్యాప్తంగా నేడు (బుధవారం) జరుపుకుంటున్నారు. మొహర్రం అనేది సంతాపాన్ని సూచించే పండుగ. అయితే బీహార్‌లోని ఆ గ్రామంలో హిందువులు మొహర్రంను జరుపుకుంటారు. గత వందేళ్లుగా ఆ గ్రామంలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది.బీహార్‌లోని కతిహార్‌లోని హిందువులు గత వందేళ్లుగా తమ పూర్వీకుల వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ముహర్రంను జరుపుకుంటున్నారు. హసన్‌గంజ్ బ్లాక్‌లోని మహమ్మదియా హరిపూర్ గ్రామంలోని హిందువులు మొహర్రంను జరుపుకోవడం ద్వారా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు.ఇక్కడ విశేషమేమిటంటే ఈ గ్రామంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదు. కానీ ఇప్పటికీ ప్రతి సంవత్సరం మొహర్రం పండుగను సంప్రదాయ రీతిలో ఇక్కడ జరుపుకుంటారు. దివంగత చెడి సాహ్ సమాధి ఈ గ్రామంలో ఉంది. ఈ ప్రాంతం మియాన్ (ముస్లిం మతపెద్ద)కు చెందినదని గ్రామస్తులు చెబుతున్నారు. అతని కుమారులు అనారోగ్యంతో మృతి చెందారట. ఈ నేపధ్యంలో ఆయన ఆవేదనకులోనై తన భూమికి ఈ గ్రామానికి అప్పగించారట. ఆ తర్వాత అతను కన్నుమూసే ముందు గ్రామస్తులంతా ప్రతీయేటా మొహర్రం జరుపుకోవాలని కోరారట. ఈ మేరకు తమ గ్రామ పూర్వీకులు ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటికీ నిలబెట్టుకుంటున్నామని గ్రామస్తులు చెబుతుంటారు. 100 साल पहले किया वो वादा... बिहार के इस गांव में हिंदू भी मनाते हैं मुहर्रम #Bihar | #Muharram | #Hindu pic.twitter.com/1mIU57HtRp— NDTV India (@ndtvindia) July 17, 2024 -
త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ: సీఎం జగన్
తాడేపల్లి : మొహర్రం పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ అని, ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ దేవుని కరుణాకటాక్షాలు మన రాష్ట్రంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం జగన్ ట్వీట్ ద్వారా ఆకాంక్షించారు. త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ. ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ దేవుని కరుణాకటాక్షాలు మన రాష్ట్రంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 29, 2023 ఇది కూడా చదవండి: AP: ఉదారంగా వరద సాయం -
ఇమామ్ త్యాగం.. స్మరణీయం స్ఫూర్తిదాయకం
సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు వారుతున్నప్పుడు సమాజ శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్య ప్రియులు, న్యాయ ప్రేమికులు, పౌరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయంకోసం, ధర్మం కోసం, మానవీయ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పరిధిలో శక్తివంచన లేకుండా పోరాడాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడల్లా దాన్ని కాపాడుకోడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. విలువల ప్రేమికులందరూ ఒక్కటిగా ముందుకు కదలాలి. దానికి ఇమామ్ త్యాగం స్ఫూర్తిగా నిలవాలి. ఇస్లామీ క్యాలండరు ప్రకారం ‘ముహర్రం’ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన మాసం. ఇది ముస్లిమ్ జగత్తుకు నూతన సంవత్సరం. ముహర్రం మాసంతోనే ఇస్లామీయ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇస్లామ్‌కు పూర్వం అప్పటి సమాజంలో కూడా కొత్తసంవత్సరం ‘ముహర్రం’ నుండే ప్రారంభమయ్యేది. ముహమ్మద్ ప్రవక్త(స) ముహర్రం మాసాన్ని అల్లాహ్ నెల అని అభివర్ణించారు. రమజాన్ రోజాల (ఉపవాసాలు) తరువాత అత్యంత శుభప్రదమైన రోజా ఆషూరా రోజానే. అంటే ముహర్రం పదవ తేదీన పాటించే రోజా అన్నమాట. రమజాన్ రోజాలు విధిగా నిర్ణయించక ముందు ఆషూరా రోజాయే ఫర్జ్ రోజాగా ఉండేది. కాని రమజాన్ రోజాలు విధిగా నిర్ణయించబడిన తరువాత ఆషూరా రోజా నఫిల్‌గా మారిపోయింది. కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ప్రాముఖ్యత మరింతగా పెరిగిపోయింది. అంత మాత్రాన ముహర్రం మాసమంతా విషాద దినాలుగా పరిగణించడం, ఎలాంటి శుభకార్యాలూ నిర్వహించక పోవడం సరికాదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరగతి పొందారు. ధర్మయుద్ధంలో అమరుడు కావడం మానవ సహజ భావోద్రేకాలపరంగా బాధాకరం కావచ్చునేమోగాని, లౌకికంగా సత్కర్మల ఆచరణ అనివార్యంగా జరగాల్సిన నేపథ్యం లో పూర్తిగా విషాదానికి పరిమితం కావడమూ అంత సరికాకపోవచ్చు. ముహమ్మద్ ప్రవక్త(స) నిర్యాణం తరువాత తొలి నలుగురు ఖలీఫాల సార«థ్యంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ జనరంజకమైన ప్రజాస్వామ్య పాలన పరిఢవిల్లింది. ఇస్లామీయ ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి సూత్రం,‘దేశం దైవానిది, దేశవాసులు ఆయన పాలితులు’. అంతేకాని పాలకులు ప్రజలకు ప్రభువులు ఎంతమాత్రంకాదు. ఇస్లామీయ రాజ్యానికి దైవభీతి, సచ్ఛీలత, జవాబుదారీతనం ప్రాణం లాంటివి. పాలకులు ఈ సుగుణాలకు ప్రతిరూపంగా, ఆదర్శంగా ఉండేవారు. అధికారులు, న్యాయమూర్తులు, సేనాపతులు, అన్నిశాఖల అధికారులు ఎంతో నిజాయితీపరులుగా, న్యాయ ప్రేమికులుగా ఉండేవారు. అనుక్షణం దైవానికి భయపడుతూ, ప్రజాసేవలో ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తపడేవారు. ప్రజలకు సమాధానం చెప్పుకునే విషయంలో కూడా వారు, ‘ఎప్పుడైనా, ఎక్కడైనా తాము ప్రజలకు జవాబుదారులమని భావించేవారు. ప్రతిరోజూ నమాజుల సమయంలో ప్రజల్ని కలుసుకొని, వారి అవసరాలు తీర్చేవారు. అవసరమైన సూచనలు, హితవులు చేసేవారు. కాని ఖలీఫాల తదనంతర కాలంలో పరిస్థితులు మారిపోయాయి. దైవభీతి, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య భావనలకు భంగం ఏర్పడింది. యజీద్ రాచరికం రూపంలో పురుడు పోసుకున్న దుష్పరిణామాలు ఇస్లామీయ ప్రజాస్వామ్య భావనను, ఆ సూత్రాలను తుంగలో తొక్కాయి. ఈ విధంగా కుటుంబ పాలన, చక్రవర్తుల పరంపర ప్రారంభమైంది. ఈ దురదృష్టకర పరిణామాల కారణంగా ముస్లిం సమాజం నేటి వరకూ ఇస్లామీయ ప్రజాస్వామ్య స్ఫూర్తికి దూరంగానే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణకు హజ్రత్ ఇమామె హుసైన్ (ర) కంకణబద్ధులయ్యారు. లక్ష్యసాధన కోసం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోడానికి సిధ్ధపడ్డారు. విలువల పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడలేదు. ప్రజాకంటకమైన రాచరిక వ్యవస్థను ఎదుర్కొన్న క్రమంలో సంభవించిన పరిణామ ఫలితాలు ఈనాడు మనముందున్నాయి. ఇమామె హుసైన్ ఇంతటి ప్రమాదాన్ని కూడా లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడి, ఇస్లామీయ ప్రజాస్వామ్య సంక్షేమరాజ్యాన్ని, దాని ప్రత్యేకతల్ని కాపాడుకోడానికి ’కర్బలా’ సాక్షిగా ఒక విశ్వాసి పోషించవలసిన పాత్రను ఆచరణాత్మకంగా నిరూపించారు. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందుకే ప్రతియేటా ‘మొహర్రం’ పదవ తేదీన (యౌమె ఆషూరా) ఆయన త్యాగాన్ని స్మరించుకుంటారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరత్వం ఆషామాషీ మరణం కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మసంస్థాపన, దైవప్రసన్నతే ధ్యేయంగా సాగిన సమరంలో పొందిన వీరమరణం. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం, ఏ ధ్యేయం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి అమరుడయ్యారో మనం దాన్నుండి స్ఫూర్తిని పొందాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
హైదరాబాద్: మొహర్రం సందర్భంగా పాతబస్తీలో భారీ బందోబస్తు
-
త్యాగనిరతికి ప్రతీక మొహర్రం: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: మానవీయ విలువలన్నింటిలో త్యాగనిరతి గొప్పదని మొహర్రం చాటిచెబుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. నిజవిశ్వాసం కోసం ప్రాణత్యాగం చేసిన ముహమ్మద్ ప్రవక్త మునిమనవడు హజ్రత్ ఇమామ్ హుసేన్‌ను స్మరిస్తూ మొహర్రం జరుపుకుంటారని తెలిపారు. ఇస్లాంకు మూలసిద్ధాంతమైన మూర్తీభవించిన మానవతావాదాన్ని అనుసరించాలనే సందేశాన్ని మొహర్రం ఇస్తుందన్నారు. దయ, కరుణ, శాంతి, న్యాయాన్ని పాటించాలన్న స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు. (చదవండి: టీఆర్ఎస్లో త్వరలో అసమ్మతి బాంబ్ బ్లాస్ట్: మురళీధర్‌రావు ) ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలి బహదూర్‌పురా/చార్మినార్ (హైదరాబాద్): ఇంటింటా మువ్వన్నెల జెండాను ఎగురవేస్తూ జాతీయతను చాటి చెప్పాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సోమవారం సాలార్జంగ్ మ్యూజియంలో తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల ఛాయాచిత్రాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవాలను ప్రారంభించిందన్నారు. ఎందరో త్యాగాల ఫలాన్ని మనం అనుభవిస్తున్నామన్నారు. జాతీయ భావాన్ని బలోపేతం చేస్తూ ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలని చెప్పారు. ఆనాడు దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి పోరాడిన మహానుభావుల జీవిత చరిత్రను తెలియజేసే ఛాయాచిత్రాల ప్రదర్శనను మ్యూజియంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జిబిషన్‌ను ఒక్కసారైనా తిలకించాలని అన్నారు. సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ ఎ.నాగేందర్ రెడ్డి, పీఐబీ అండ్ సీబీసీ డైరెక్టర్ శ్రుతి పాటిల్, పీఐబీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. మ్యూజియం వద్ద గవర్నర్ సెల్ఫీ.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సాలార్జంగ్ మ్యూజియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘లవ్ సాలార్జంగ్ మ్యూజియం’అనే బోర్డు వద్ద నిల్చుని సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం సాలార్జంగ్ భవన ప్రాంగణం వచ్చేలా కూడా తన సెల్ ఫోన్లో సెల్ఫీ తీసుకున్నారు. -
గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. త్యాగాలకు ప్రతీకగా సాగే ‘పీర్ల’ఊరేగింపును తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలతో పాటు హిందువులూ కలిసి జరుపుకుంటారని తెలిపారు. మతాలకతీతంగా హిందూముస్లింల సఖ్యతను, ఐక్యతను గంగా జమునా తెహజీబ్‌ను మొహర్రం చాటి చెప్తుందని సీఎం తెలిపారు. (చదవండి: కేసీఆర్ పాలనలో పైలం బిడ్డో అంటూ బడికి.. ) త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక! రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు, హిందువులూ కలిసి నిర్వహించే 'పీర్ల' ఊరేగింపు తెలంగాణ ప్రజలమధ్య సఖ్యతను, ఐక్యతను, గంగా-జమునా తెహజీబ్ ను చూపే సందర్భం!#Muharram pic.twitter.com/bRVcaQrbN7 — Telangana CMO (@TelanganaCMO) August 9, 2022 -
పీర్ల పండుగలో ‘గోరటి’ సందడి
తెలకపల్లి: ఎమ్మెల్సీ గోరటి వెంకన్న.. శాసనమండలికి ఎంపికైన తర్వాత తొలిసారి వచ్చిన పీర్ల పండుగలో సందడి చేశారు. ఆయన స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా గౌరారంలో పీర్ల చావడిలో గురువారం రాత్రి ఫాతేహా నిర్వహించారు. పీర్లకు దట్టీలు సమర్పించి, మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామ యువకులతో కలిసి అగ్ని గుండం చుట్టూ ఆడిపాడారు. టీఆర్ఎస్ను గద్దె దించుతాం: ఠాగూర్ సాక్షి, నాగర్‌కర్నూల్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గద్దె దించుతా మని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌లో శుక్రవారం నిర్వహించిన పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నిరంగాల్లో గుణాత్మకమైన అభివృద్ధి చోటు చేసుకుంటుందన్నారు. పార్టీలో సెప్టెంబర్ 30లోగా ప్రతి బూత్‌కు ముగ్గురుసభ్యుల చొప్పున కమిటీ నియామకాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీనియర్ నేతలు మల్లు రవి, బోసు రాజు, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, మహేశ్‌గౌడ్, నాగం జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహర్రం : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఇస్లాం మత పునరుజ్జీవానికి ప్రాణం పోసిన అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహర్రం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం మొహర్రం పండుగను పురస్కరించుకుని ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ ఇస్లాం మత పునరుజ్జీవానికి ప్రాణం పోసిన అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహర్రం. పవిత్ర యుద్దంలో వీర మరణం పొందిన ఇమాం హుస్సేన్ త్యాగం వెలకట్టలేనిది. ఈ పవిత్రమైన సంతాప దినాలు(పీర్ల పండుగ) రాష్ట్రంలో హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయి’’ అని పేర్కొన్నారు. ఇస్లాం మత పునరుజ్జీవానికి ప్రాణం పోసిన అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహర్రం. పవిత్ర యుద్దంలో వీర మరణం పొందిన ఇమాం హుస్సేన్ త్యాగం వెలకట్టలేనిది. ఈ పవిత్రమైన సంతాప దినాలు(పీర్ల పండుగ) రాష్ట్రంలో హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయి. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 20, 2021 చదవండి : అవినీతికి తావివ్వద్దు : సీఎం జగన్ -
ఆంధ్రప్రదేశ్‌లో 20న మొహర్రం సెలవు
సాక్షి, అమరావతి: మొహర్రం మాసం 10వ రోజు ఇచ్చే సాధారణ సెలవును ఆగస్టు 19వ తేదీ (గురువారం) నుంచి 20వ తేదీ (శుక్రవారం)కి మారుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 20న మొహర్రం నిర్వహణకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ జామా మసీదు ప్రకటన ఆధారంగా మొహర్రం నిర్వహణ తేదీల్లో మార్పులు చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. (చదవండి: ప్రేమ పెళ్లి.. అమ్మాయి దక్కదేమోనన్న అనుమానంతో..) -
పాతబస్తీలో ప్రారంభమైన బీబీ కా ఆలం ఊరేగింపు
సాక్షి, హైదరాబాద్: త్యాగానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రం ఊరేగింపునకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆదివారం పాతబస్తీలో ప్రసిద్ధ బీబీ కా ఆలం ఊరేగింపు ప్రారంభమైంది. ఈ ఊరేగింపునకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోవిడ్ ఆంక్షలతో ఏనుగుపై కాకుండా డీసీఎం వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. యాకత్పురా, చార్మినార్ గుల్జార్‌హౌస్, మీరాల మండి, దారుల్షిఫా మీదుగా చాదర్‌ఘాట్ వరకు ఆలం ఊరేగింపు జరిగింది. -
మొహరం ఊరేగింపులో అపశ్రుతి
-
పీర్ల పండుగలో అపశ్రుతి; పిట్టగోడ కూలడంతో..
సాక్షి, కర్నూలు : మొహరం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పిట్టగోడ కూలిన ఘటనలో 20 మంది గాయాలపాలయ్యారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వివరాలు.. కర్నూలు మండలం బి.తాండ్రపాడులో పీర్ల పండుగ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పీర్ల చావిడి వద్ద నిప్పులు తొక్కుతున్న దృశ్యాల్ని చూసేందుకు పక్కనే ఉన్న ఓ ఇంటిపై పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. వారంతా బంగ్లాపై ఉన్న పిట్టగోడను ఆనుకుని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అది కుప్పకూలింది. గోడను ఆనుకుని ఉన్నవారందరూ అంతెత్తు నుంచి కిందపడిపోయారు. గోడ, దాంతోపాటు మనుషులు కిందనున్నవారిపై పడటంతో అందరూ తీవ్ర గాయాలపాలయ్యారు. దాంతో ఆ ప్రాంతమంతా హాహాకారాలతో నిండిపోయింది. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ బాధితులను పరామర్శించారు. -
త్యాగానికి ప్రతీక మొహరం
కడప సెవెన్‌రోడ్స్/చిన్నమండెం/ కడప కల్చరల్ : మొహరం నెలతో ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. శాంతి, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం 14 శతాబ్దాల క్రితం జరిగిన చారిత్రాత్మక పోరాటంలో అసువులు బాసిన అమరుల సంస్మరణే మొహరం. అందుకే దీన్ని ‘షహీద్’ మాసంగా పేర్కొంటారు. వాస్తవానికి ఇవి విషాద రోజులైనప్పటికీ తెలుగు నేలలో పీర్ల పండుగగా పిలుస్తారు. మండల కేంద్రమైన చిన్నమండెంలో పీర్ల పండుగ అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు. ఇది రాయలసీమలోనే ప్రసిద్ధి గాంచింది. మూడు మకాన్లు ఉన్నప్పటికీ ప్రధానమైనది శ్రీ హజరత్ గంధం పీరు మకాన్. అన్ని కార్యక్రమాలకు కేంద్ర బిందువు ఈ మకాన్. మొహరం నెలలో మూడవ రోజు శ్రీ హజరత్ గంధం పీరు కొలువు తీర్చారు. వివిధ రకాల పుష్పమాలలతో అలంకరించారు. మకాన్ వద్ద అలంకరించిన రంగురంగుల విద్యుద్దీపాలు రాత్రి వేళ నక్షత్ర తోరణాల్ని తలపిస్తున్నాయి. మతాలకు అతీతంగా ప్రజలు శ్రీ హజరత్ గంధం పీరును దర్శించుకుంటున్నారు. ముజావర్లు చదివింపులు నిర్వహిస్తున్నారు. మకాన్ ఎదుట అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడే పదేళ్లలోపు పిల్లలకు ఆటీలు (తాయత్తులు) కడతారు. ఇందువల్ల అనారోగ్యం బారి నుంచి పిల్లలు బయటపడతారని ఇక్కడి ప్రజల విశ్వాసం. మొహరంలో 9, చివరిదైన పదవరోజు కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి. బాషికం సమర్పణ, గంధం పీరు మెరవణి తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అమీన్‌పీర్ దర్గాలో... కడప నగరంలో రెండు, మూడుచోట్ల మొహరంను ఘనంగా నిర్వహిస్తారు. స్థానిక అమీన్‌పీర్ దర్గాలో పీర్ల చావిడి ఉంది. మొహరం నాడు ఈ దర్గాలో హజరత్ సయ్యద్‌షా పీరుల్లామాలిక్ సాహెబ్ ఉరుసుగా నిర్వహిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక ధార్మిక కార్యక్రమాలు, ఫాతెహా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా హజరత్ పీరుల్లామాలిక్ మజార్ ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా ప్రత్యేకంగా తెప్పించే పూలతో అలంకరిస్తారు. నేడు గంధం పీరు మెరవణి.. మొహరం కార్యక్రమాల్లో చివరిదైన మంగళవారం సాయంత్రం పీర్లను జల్దికి తీసుకు వెళతారు. రాత్రి 10 గంటలకు శ్రీ హజరత్ గంధం పీరు మెరవణి ప్రారంభమవుతుంది. ప్రజలు పెద్ద ఎత్తున కొబ్బరి దివిటీలను వెలిగిస్తారు. కాలిన కొబ్బెరను ప్రసాదంగా భావించి ఇళ్లకు తీసుకు వెళతారు. కొబ్బెర ప్రసాదాన్ని తింటే దీర్ఘకాలిక వ్యాధులు నయం కావడంతోపాటు ఇంటిల్లిపాదికి మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం. తెల్లవారుజాము వరకు సాగే ఈ మెరవణి కార్యక్రమం ఆద్యంతం కొబ్బరి దివిటీల వెలుగులోనే కొనసాగుతుంది. ముంబయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదు వంటి ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఈ కార్యక్రమానికి తరలి వస్తుంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బాషికంపై నిర్ణయం మరుసటి సంవత్సరం మొహరంలో గంధం పీరుకు బాషికం ఎవరు సమర్పించాలో ముందే నిర్ణయిస్తారు. ఉత్సవాల్లో పదవ రోజు గంధం పీరు మెరవణి తెల్లవారుజాముకు ముగుస్తుంది. పీరు మకాన్లోకి ప్రవేశించే సమయానికి, వచ్చే ఏడు బాషికం సమర్పించుకోవాలని భావించే వారంతా అక్కడ గుమికూడతారు. వచ్చే ఏడు బాషికం ఎవరు సమర్పించాలో గంధం పీరును మోస్తున్న వ్యక్తి నిర్ణయిస్తారు. కడప పెద్దదర్గా పీఠాధిపతులు చిన్నమండెంలో నిర్వహించే మొహరం కార్యక్రమాల్లో ప్రధానమైన బాషిక సమర్పణకు వస్తున్నారని మకాన్ కమిటీ సభ్యులు సాక్షికి వివరించారు. పీఠాధిపతి తన శిష్య బృందంతో కలిసి గంధం పీరుకు చదివింపులు నిర్వహిస్తారు. బాషికం ఊరేగింపు కార్యక్రమాన్ని తిలకించేందుకు రాయలసీమ జిల్లాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. కడపలో మట్టి పెద్దపులి.. కడప నగరం రెడ్‌క్రాస్ భవనం ఎదురుగా నాలుగు రోడ్ల కూడలిలో గల మట్టిపెద్దపులి విగ్రహానికి ఓ చరిత్ర ఉంది. నగర వాసులు ఈ మట్టి పెద్దపులి విగ్రహాన్ని తరుచూ చూస్తూనే ఉంటారు గానీ దాన్ని అక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తారో పెద్దల్లో కొద్దిమందికి మాత్రమే తెలుసు. దీనికి పీర్ల పండుగకు చిన్న సంబంధం ఉంది గనుక ఈ సందర్భంగా దాని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మట్టి పెద్దపులి విగ్రహం ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు తాలింఖానాలను నిర్వహించేవారు. ఆ చుట్టుపక్కల గల తాలింఖానాలలో ముస్లిం యువకులతోపాటు హిందు యువకులు కూడా వ్యాయామం చేస్తూ కుస్తీలు పట్టడం నేర్చుకునేవారు. వీధులలోగానీ, గ్రామానికి గానీ అరాచక శక్తుల వల్ల ఏదైనా ఆటంకాలు ఎదురైతే తాలింఖానా నిర్వాహకుల సూచనతో యువకులు వెళ్లి అవసరమైతే శారీరక బలం చూపి ఆ సమస్యను పరిష్కరించేవారు. పులులు లాంటి యువకులు, వారు వ్యాయామం చేసే తాలింఖానాలు ఉండే ప్రదేశం గనుక ఆ రోడ్ల కూడలిలో సాహస యువకులకు గుర్తుగా మట్టితో పెద్ద పులి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది రోడ్డు విస్తరణలో దెబ్బతినడంతో సిమెంటుతో పులి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల దాన్ని కూడా రోడ్డు విస్తరణలో తొలగించగా, కొద్దిపాటి మరమ్మతులు చేసి గౌస్‌నగర్ వద్ద డివైడర్‌లో దాన్ని ఏర్పాటు చేశారు. పాత దాని స్థానంలో కొత్తగా సిమెంటు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాలింఖానాలోని యువకుల ఆధ్వర్యంలో అప్పట్లో పీర్ల పండుగను ఘనంగా నిర్వహించేవారు. మకాన్ల వద్ద నుంచి పీర్లను ఊరేగింపుగా తీసుకెళ్లి తిరిగి వాటిని శుభ్రం చేసి తిరిగి మకాన్లకు చేర్చేవారు. ఊరేగింపులో తాలింఖానాల యువకుల సాహస కృత్యాల ప్రదర్శనలే ప్రధాన ఆకర్శణగా ఉండేవి. -
పాకిస్తాన్ క్రికెట్ జట్టు దుస్తులు ధరించి..
పాట్నా : మొహర్రం పర్వదినం సందర్భంగా బిహార్‌లోని బెట్టయ్య ప్రాంతంలో పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన 21 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ధరించే దుస్తులు వేసుకుని, చేతిలో లాఠీలు ఇతర ఆయుధాలు పట్టుకుని ఈ నినాదాలు చేశారని అధికారులు చెబుతున్నారు. మొహర్రం-దుర్గా పూజల సందర్భంగా మత ఘర్షణలకు తావిచ్చేలా నినాదాలు చేశారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎఫ్ఐఆర్లో పొందుపరిచామని పోలీసులు ప్రకటించారు. పాకిస్తాన్ క్రికెట్ దుస్తులు ధరించిన యువకుల ఇళ్లల్లో సోదాలు జరిపినట్లు పోలీస్ అధికారి వివేక్ కుమార్ జైస్వాల్ తెలిపారు. సోదాల్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ధరించే టీ షర్టులు, వివాదాస్పద పుస్తకాలు, మరికొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదైన 21 మంది ప్రస్తుతం పరారీలో ఉన్నారని జైస్వాల్ తెలిపారు. పరారీలో ఉన్న వారిలో కొందరిని గుర్తించామని చెప్పారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసినవారిలో నజీర్, ఆఫ్తాబ్, సర్ఫరాజ్, సల్మాన్, అజార్, గుహార్, అజుఖ్, ఇమ్రాన్, సలావుద్దీన్, నసీరుద్దీన్ తదితరులు ఉన్నట్లు చంపారన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వినయ్ కుమార్ చెప్పారు. నిందితులను వీలైనంత తొందరగా అదుపులోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
మొహర్రం.. ప్రశాంతం
-
ఘనంగా బీబీకా ఆలం ఊరేగింపు..
సాక్షి, హైదరాబాద్ : మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని ఆదివారం ఘనంగా నిర్వహించిన బీబీకాఆలం సామూహిక ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. ఇస్లాం మతం పరిరక్షణకు ప్రాణత్యాగం చేసిన హజ్రత్ ఇమాం హుస్సేన్, హసన్‌లను స్మరిస్తూ వేలాది మంది యువకులు, చిన్నారులు విషాద గీతాలు ఆలపిస్తూ చేతులకు బ్లేడ్లను అమర్చుకొని ఎదపై బాదుకుంటూ రక్తం చిందించారు. డబీర్‌పురా బీబీకా అలావా నుంచి ప్రారంభమైన భారీ ఊరేగింపు చాదర్‌ఘాట్ వరకు కొనసాగింది. దారి పొడవునా ఏర్పాటు చేసిన స్వాగత వేదికలపై నుంచి పలువురు అధికార, అనధికార ప్రముఖులు బీబీకాఆలంకు స్వాగతం పలికి పూలు, దట్టీలు సమర్పించారు. చార్మినార్ వద్ద నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, పురానీహవేలి వద్ద గ్రేటర్ డిప్యూటీ మేయర్ బాబా ఫసివుద్దీన్, సెట్విన్ చైర్మన్ మీర్ ఇనాయత్ అలీ బాక్రీ, టీఆర్ఎస్ సీనియర్‌నేత లయాఖ్ అలీ, దారుషిఫా వద్ద ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, గ్రేటర్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు హాజరై బీబీకా ఆలంకు స్వాగతం పలికి పూలు, దట్టీలు సమర్పించారు. (ఫొటో స్లైడ్ చూడండి..) -
ధర్మ సంస్థాపనార్థం...
‘ముహర్రం’ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినటువంటి మాసం. ఇస్లామీ క్యాలండరు ప్రకారం ముహర్రం మాసంతోనే ఇస్లామీయ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. రమజాన్ రోజాల తరువాత అత్యంత శుభప్రదమైన రోజా ఆషూరా రోజానే. అంటే ముహర్రం పదవ తేదీన పాటించబడే రోజా అన్నమాట. రమజాన్ రోజాలు విధిగా (ఫర్జ్ గా) నిర్ణయించబడక పూర్వం ఆషూరా రోజాయే ఫర్జ్ రోజా. రమజాన్ రోజాలు నిర్ణయించబడిన తరువాత ఆషూరా రోజా నఫిల్ గా మారిపోయింది. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర) ప్రకారం, ఒకసారి ప్రవక్త మహనీయులు మదీనాకు వెళ్ళారు. ఆరోజు అక్కడి యూదులు రోజా పాటిస్తున్నారు. అది ముహర్రం పదవ తేదీ. వారిని ప్రవక్త అడిగారు ఏమిటి ఈరోజు విశేషం? అని.దానికి వారు,‘ఇదిచాలా గొప్పరోజు. ఈరోజే అల్లాహ్ మూసా(అ)ను,ఆయన జాతిని ఫిరౌన్ బారినుండి రక్షించాడు. ఫిరౌన్ ను, అతడి సైన్యాన్ని సముద్రంలో ముంచిపారేశాడు. అప్పుడు మూసా ప్రవక్త, దేవునికి కృతజ్ఞతగా రోజా పాటించారు. కనుక ఆయన అనుసరణలో ఈరోజు రోజా పాటిస్తాం’ అని చెప్పారు. అప్పుడు ప్రవక్త మహనీయులు, మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులమని చెప్పి, రోజా పాటించమని అనుచరులకు ఉపదేశించారు. ఆషూరా రోజా యూదులే కాదు క్రైస్తవులూ పాటించేవారు. ఈ ఇరువర్గాలూ ముహర్రం పదవ తేదీన రోజా పాటించేవి. కాని ప్రవక్తవారు, మీరు రెండురోజులు పాటించమని తన సహచరులకు బోధించారు. అంటే ముహర్రం మాసం 9,10 కాని, లేక 10,11 కాని రెండురోజులు రోజా పాటించాలి. ముహర్రం మాసమంతా శుభకార్యాలూ నిర్వహించక పోవడం సరికాదు. సత్యం, న్యాయం, ధర్మం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర)అమరగతి పొందారు. ధర్మయుద్ధంలో అమరుడు కావడం విషాదం కాదు. ‘ఎవరైతే అల్లాహ్ మార్గంలో అమరులయ్యారో వారిని మృతులు అనకండి. వారు సజీవంగా ఉన్నారు. తమ ప్రభువువద్ద ఆహారం కూడా పొందుతున్నారు.’ అంటోంది పవిత్రఖురాన్. అమరులు అల్లాహ్‌కు సన్నిహితులు. ఇదీ షహీదుల స్థాయి, వారి గౌరవం. వారి ఘనత. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అక్టోబర్ 1న మొహర్రం
సాక్షి, హైదరాబాద్: ఆకాశంలో గురువారం నెలవంక కనిపించడంతో రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 1న మొహర్రం జరుపుకోవాలని రుయాతే హిలాల్ (నెలవంక నిర్ధారణ) కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబుల్‌పాషా షుత్తరీ సూచించారు. మొజాంజాహీ మార్కెట్లోని కమిటీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా నెలవంక కనిపించిందన్న సమాచారం వచ్చిందన్నారు. -
‘ఆ రోజు హింస జరిగితే నాకు సంబంధం లేదు’
కోల్‌కతా : మొహర్రం సందర్భంగా దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంలో ఒక వేళ హింస జరిగితే బాధ్యత తనది కాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తాను ఏం చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. మొహర్రం రోజున దుర్గామాత విగ్రహాల నిమజ్జనంపై బెంగాల్ ప్రభుత్వం నిషేదం విధించగా హైకోర్టు దానిని ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందించారు. మొహర్రం సందర్భంగా దుర్గా మాత విగ్రహాల నిమజ్జనంపై నిషేధాన్ని కోర్టు ఎత్తివేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏకపక్షంగా ఇలాంటి ఉత్తర్వులను జారీ చేయరాదని స్పష్టం కూడా చేసింది. దుర్గా మాత విగ్రహాల నిమజ్జనాన్ని మొహరం రోజుతో సహా అన్ని రోజులూ అర్థరాత్రి 12 గంటల వరకూ అనుమతించింది. నిమజ్జనానికి, తజియా ఊరేగింపుకూ రూట్ మ్యాప్ ఖరారు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పౌరుల హక్కులను ఆలోచనారహితంగా నియంత్రించరాదని ప్రభుత్వానికి చురకలు అంటించింది. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి ఉత్తర్వులు జారీ చేసిందని వ్యాఖ్యానించింది. అధికారం ఉంది కదా అని ఏకపక్షంగా ఆదేశాలిస్తారా అంటూ నిలదీసింది. -
మొహర్రం నాడు నిమజ్జనానికి నో!
ఒకేరోజున దుర్గామాత నిమజ్జనం, మొహర్రం రావడంతో.. మమత సర్కారు నిర్ణయం.. మండిపడుతున్న బీజేపీ కోల్‌కతా: హిందువులు ఘనంగా నిర్వహించే దుర్గామాత విగ్రహాల నిమజ్జనం, ముస్లింలు భక్తిపూర్వకంగా సంతాపం పాటించే మొహర్రం ఒకేరోజున రావడం పశ్చిమ బెంగాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ రెండు కార్యక్రమాలు ఒకేరోజున రావడంతో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బుధవారం దుర్గాపూజ నిర్వాహకులు, ముస్లిం మతపెద్దలు, ఇతర మతాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ రెండు వేడుకలు ఒకేరోజున ఉన్న నేపథ్యంలో మతసామరస్యాన్ని పాటించే దిశగా వ్యవహరించాలని ఆమె కోరారు. దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సెప్టెంబర్ 30వ తేదీన ప్రారంభం అవుతుందని, అయితే, అక్టోబర్ 1న మొహర్రం దృష్ట్యా ఆ రోజు విగ్రహాల నిమజ్జనానికి అనుమతించబోమని, అక్టోబర్ 2వ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు యథాతథంగా నిమజ్జనం సాగుతుందని ఆమె ఈ సమావేశంలో స్పష్టం చేశారు. మత ఉద్రిక్తతలు, ఘర్షణలు తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే అక్టోబర్ 1న దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి అనుమతించడం లేదని పేర్కొన్నారు. విగ్రహాల నిమజ్జనం, మొహర్రం ఊరేగింపులు ఎదురుపడితే.. అవాంఛనీయ ఘటనలు జరుగుతాయనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే, మమత నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ద్వారా హిందు, ముస్లింలను విడగొట్టడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి మమత సర్కారు ప్రయత్నిస్తున్నదని మండిపడింది. ముస్లింలను సంతృప్తి పరిచేందుకే మమత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించింది. -
ప్రశాంతంగా బీబీకా ఆలం ఊరేగింపు
చార్మినార్: మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన అంబారీపై బీబీకా ఆలం సామూహిక ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. ఇస్లాం మతం పరిరక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన హజ్రత్ ఇమాం హుస్సేన్, హసన్‌లను స్మరిస్తూ వేలాది మంది యువకులు, చిన్నారులు విషాద గీతాలు ఆలపిస్తూ చేతులకు బ్లేడ్లను అమర్చుకొని ఎదపై బాదుకుంటూ రక్తం చిందించారు. డబీర్‌పురా బీబీకా అలావా నుంచి ప్రారంభమైన భారీ ఊరేగింపు చాదర్‌ఘాట్ వరకు కొనసాగింది. దారిపొడవునా ఏర్పాటు చేసిన స్వాగత వేదికలపై నుంచి పలువురు బీబీకా ఆలంకు స్వాగతం పలికి పూలు, దట్టీలు సమర్పించారు. -
పాతబస్తీలో భద్రత కట్టుదిట్టం
హైదరాబాద్ : మొహర్రం నేపథ్యంలో బుధవారం పాతబస్తీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 2,500 మంది పోలీసులతోపాటు 2 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. అలాగే ఐదు బాంబు స్క్వాడ్స్‌తోపాటు 10 షీ టీమ్స్‌తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అనుమానిత వాహనాలను పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. -
బస్సులోకి చొరబడి మహిళలపై కాల్పులు
కరాచీ: పాకిస్థాన్‌లోని బెలూచిస్తాన్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ సాయుధుడు బస్సులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో నలుగురు మైనారిటీ మహిళలు ప్రాణాలుకోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. బస్సంతా రక్తసిక్తంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొహర్రం నేపథ్యంలో కొంతమంది తమకు కావాల్సిన వస్తువులు తీసుకొని తిరిగి తమ ప్రాంతమైన హజారాకు వస్తుండగా కొంతమంది సాయుధులు ఆ బస్సును అడ్డుకున్నారు. అనంతరం అందులో ఒకసాయుధుడు బస్సులోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మొహర్రం నేపథ్యంలో ఇప్పటికే బలగాలను పెద్ద మొత్తంలో మోహరించినప్పటికీ ఈ ఘటన జరగడం పట్ల బెలూచ్ ముఖ్యమంత్రి నవాబ్ సనావుల్లా ఖాన్ జెరీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు. ఇలాంటివి దురదృష్టకరమైన సంఘటనలు అని, అమాయకుల ప్రాణాలు తీసుకోవడం సరికాదని ఖండించారు. కాగా, ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. -
ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండగ
-
పాతబస్తీలో మొహరం ఊరేగింపు
-
నెత్తుటి తర్పణం!
-
పాపం చిన్నారులు
నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డి : ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ‘మొహర్రం’ నాగిరెడ్డిపేట మండలం అచ్చాయపల్లి గ్రామంలో విషాదం నింపింది. మంగళవారం పీర్లను ఊరేగిస్తున్న బృంద స భ్యులు విద్యుదాఘాతానికి గురి కాగా, ఒకరు సజీవ దహనమయ్యారు. 26మంది గాయపడ్డారు. ఇందు లో ఎక్కువ మంది చిన్నారులే ఉండ టం పలువురిని కలిచివేసింది. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో గ్రా మంలోని చిన్నారులు పీర్ల ఊరేగిం పులో ఉత్సాహంగా పాల్గొన్నారు. చి న్నారులంతా పీర్ల ముందు ఆడుతూ, గెంతుతూ గ్రామంలోకి వస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిలో 15 మందికిపైగా 15 ఏళ్లలోపు వారే ఉన్నారు. ఒళ్లంతా భగ భగమండుతుంటే చిన్నారులు పడుతున్న నరకయాతనను చూడలేక వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గ్రామానికి చెందిన కొందరు మాలోని దూదిపీర్, ఇతంపీర్ను ఎత్తుకొని ఊరేగింపుగా సమీపంలోని ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామానికి వెళ్లారు. తిరిగి గ్రామానికి వస్తుండగా శివారులోని 132 కేవీ హైటెన్షన్వైర్లకు దూదిపీర్ కర్ర తగలడంతో ఊరేగింపు బృందం విద్యుదాఘాతానికి గురై ప్రమాదం నెలకొంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన జింకల చిన్నసాయిలు (32) మృతి చెందాడు. గాయపడ్డవారిని నాగిరెడ్డిపేట జడ్పీటీసీ సభ్యుడు నారాయణ, గ్రామసర్పంచ్ భర్త కృష్ణ, గ్రామస్తులు ప్రమాదంలో బైక్‌లపై, ఆటోల్లో, 108 వాహనాల్లో ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారిన ఏడుగురిని వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ఎల్లారెడ్డి ఆసుపత్రిలో తరుణ్, మహేష్, సందీప్, మోహన్, సంపత్, సాజిద్, భాగ్య, శ్రీనివాస్,సాయిలు, వంశీ, ప్రేమ్‌కుమార్, కిరణ్, సాయి, తేజ, నవీన్, సురేష్ కల్పన, సంతు, లోకయ్య చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా : ఎమ్మెల్యే మృతుడు జింక సాయిలు కుటుంబానికి ప్రభుత్వ తరపున ఎక్స్‌గ్రేషియా అందించేలా చూస్తామని ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో బాధితులను కలిసి పరామర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రమాద ఘటన విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రభుత్వమే పూర్తిగా ఖర్చు భరిస్తుందన్నారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ సైతం చేయిస్తామన్నారు. ఎల్లారెడ్డిలో చికిత్స పొందుతున్న వారికి వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి సేవలు అందిస్తారన్నారు. అచ్చాయపల్లి గ్రామంలో నిర్వహించిన సాయిలు అంత్యయ్రల్లోనూ ఎ మ్మెల్యే పాల్గొన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్, నాయకులు గంగాధర్, సాయిలు, కృష్ణాగౌడ్, శ్రీనివాస్, పప్పువెంకటేశం, బాలకిషన్, నారాయణ, ఇబాద్, హబీబ్, రాజు, నాగబూషణం, యూసూఫ్, డీఎంహెచ్ వో గోవింద్వాంగ్మారే, కామారెడ్డి డీఎస్పీ భాస్క ర్, సీఐ రామకృష్ణ, ఎస్సైలు రాజశేఖర్, పూర్ణేశ్వర్ తదితరులు ఉన్నారు. ఎల్లారెడ్డి యంపిపి సంజీ వులు, నాయకులు సంజీవులు తదితరులున్నా రు. ఆస్పత్రిలో క్షతగాత్రులను కామారెడ్డి డీఎస్పీ భాస్కర్, ఆర్డీవో వేంకటేశ్వర్లు పరామర్శించారు. భాదితుల కుటుంభాల సభ్యుల రోధనలతో ఆసుపత్రి దద్దరిల్లిపోయింది. టీఆర్ఎస్,కాంగ్రెస్,టీడీపీ నాయకుల పరామర్శ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లమడుగు సురేందర్ బాధితులకు పండ్లు, కొబ్బరి బోండాలను అందజేశారు.టీడీపీ నాయకులు గయాజుద్దీన్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. -
హైదరాబాద్‌లో మొహర్రం
-
మతసామరస్యానికి ‘పెద్దల’ చొరవ
సాక్షి, న్యూఢిల్లీ : మొహర్రం ఊరేగింపు విషయమై వాయవ్య ఢిల్లీలోని బవానాలో రెండు మతాల మధ్య తలెత్తిన ఉద్రికత్తను తగ్గించడానికి ఇరుమతాల పెద్దలు శ్రీకారం చుట్టారు. కొన్నాళ్లుగా గ్రామంలో హిందూ- ముస్లింల మధ్య సామరస్యం లోపించింది. ఈక్రమంలోనే ముస్లింలు మొహర్రం రోజు నిర్వహించే తాజియా ఊరేగింపు మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. తమ ప్రాంతాల గుండా వెల్లకూడదని పలువురు హిందువులు ఆదివారం జరిగిన మహాపంచాయత్‌లో డిమాండ్ చేయడంతో ఈ దుస్థితి దాపురించింది. దీంతో రెండు మతాల పెద్దలు చొరవతీసుకుని ఇరుమతాల వారికి నచ్చజెప్పడంతో పరిస్థితి కొంత చక్కబడింది. హిందువులు నివసించే ప్రాంతాల గుండా తాజియా ఊరేగింపు నిర్వహించమని ముస్లింలు లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. మహా పంచాయతీకి మొర బవానా గ్రామంలో ఓ చిన్న కాలవకు ఒక పక్క హిందువుల కాలనీ, మరో పక్క ముస్లింల కాలనీ ఉంది. ప్రతి ఏటా మొహర్రం రోజు ముస్లింలు నిర్వహించే ‘తాజియాల ఊరేగింపు’ హిందువుల కాలనీ గుండా, మార్కెట్ గుండా సాగుతోంది. గతేడాది కూడా చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకొంది. ఈ విషయంపై ఈ సారి కూడా రెచ్చగొట్టే పోస్టర్లు గ్రామంలో గోడలపైనా కరనిపించడం, తాజియా ఊరేగింపు నిషేధించాలన్న డిమాండ్‌తో వాట్సప్ ద్వారా ప్రచారం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఊరేగింపుు రెచ్చగొట్టేదిగా, హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ కాలనీ గుండా అనుమతించరాదనే డిమాండ్‌కు తెరలేపారు. ఈ క్రమంలోనే ఆదివారం బవానా గ్రామంలో మహాపంచాయత్ జరిగింది. ఇందులో 1000 మంది పాల్గొన్నారు. వారంతా ఊరేగింపు తమ కాలనీ గుండా ఊరేగింపు వెళ్లడాన్ని వ్యతిరేకించారు. పీస్ కమిటీ ఏర్పాటు మొహర్రం ను పురస్కరించుకుని త్రిలోక్‌పురిలో జరిగే నాలుగు ఊరేగింపులలో 30 మంది హిందూ వాలంటీర్లు పాల్గొంటారని అమన్ కమిటీ ( శాంతి కమిటీ) సభ్యుడు రియాజుద్దీన్ సైఫీ చెప్పారు. ఒక్కొక్క ఊరేగింపులో 400 మంది పాల్గొంటారన్నారు. ఈ ఊరేగింపులో పాల్గొనే పీస్ కమిటీకి చెందిన హిందూ- ముస్లిం వాలంటీర్లు అనుమానాస్పద వ్యక్తులపై కన్నేసి ఉంచుతారని ఆయన చెప్పారు. వారి కార్యకలాపాలను తక్షణమే పోలీసులకు తెలియచేస్తారని ఆయన చెప్పారు. త్రిలోక్‌పురి, బవానాలో పోలీసులు అప్రమత్తం ఇటీవల త్రిలోక్‌పురి మతఘర్షణలతో అట్టుడికి పోయిన నేపథ్యంలో బవానాలో కూడా అదే పరిస్థితి తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. బవానాలో అదనంగా 800 మంది పోలీసు సిబ్బందిని మోహ రించారు. త్రిలోక్‌పురిలో మొహర్రం ఊరేగింపు ప్రశాంతంగా సాగడానికి పోలీసులు గట్టి ఏర్పాట్లు చేశారు. అదనంగా 200 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. బ్లాక్ 27 నుంచి త్రిలోక్‌పురిలోని కోట్లా వద్ద గల కర్బలా వరకు కిలోమీటరు పొడువునా మొహర్రం ఊరిగింపు వెంట పోలీసులు నడుస్తారు. ఊరేగింపులో బ్లేడ్లు, చైన్లు, కొరడాలను వినియోగించడాన్ని నిషేధించారు. తాజియాల ఊరేగింపులో పాల్గొనే ముస్లింలు సాధారణంగా ఈ పరికరాలతో ఒంటిని గాయపరచుకుని తమను తాము హింసించుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితి దష్ట్యా ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని పోలీసుల విజ్ఞప్తి చేయడంతో అంగీకరించారు. అధికారులదే బాధ్యత బవానాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న బీజేపీ ఎమ్మెల్యే గూగన్ సింగ్ మాట్లాడుతూ.. తాజియా ఊరేగింపు కొనసాగితే, జరిగే హింసాకాండకు అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ చెందిన కౌన్సిలర్ దేవేంద్ర కుమార్ కూడా ఊరేగింపు నిర్వహిస్తే ఉద్రిక్తతలు చోటుచేసుకొంటాయన్నారు. రెచ్చగొడుతున్న బీజేపీ : ఆమ్ఆద్మీ, కాంగ్రెస్ ఇదిలా ఉండగా బీజేపీ మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. త్రిలోక్‌పురి, నంద్‌నగరి, బవానా, ముండ్కా ప్రాంతాలలో బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు షకీల్ అహ్మద్ కూడా ఇటువంటి ఆరోపణలే చేశారు. మొహర్రం సందర్భంగా భద్రత పటిష్టం న్యూఢిల్లీ: మొహర్రం సందర్భంగా రాజధాని నగరమంతటా పటిష్టమైన భద్రతాఏర్పాట్లు చేశామని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ సోమవారం చెప్పారు. పుకార్లు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. సీనియర్ పోలీస్ అధికారులు స్థానికంగా శాంతి కమిటీలతో సంప్రదింపులు జరిపారని, మొహర్రం ఊరేగింపుల సందర్భంగా శాంతిని కాపాడుతామని రెండు మతాలకు చెందిన వారు హామీ ఇచ్చారని బస్సీ తెలిపారు. ఇదిలా ఉండగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సీనియర్ అధికారులతో సమావేశమై నగరంలో పరిస్థితిని సమీక్షించారు. -
అమరుల త్యాగ స్మరణయే మొహర్రం
దోమ: ఇస్లాం పరిరక్షణకు ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకునే మాసమే మొహర్రం. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం మొదటి మాసంగా పేర్కొంటారు. ఇరాక్‌లోని కర్బలాలో జరిగిన యుద్ధంలో శత్రువులతో పోరాడి వీరమరణం పొందిన ఇమామ్ హుస్సేన్, హస్సన్, వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని స్మరించుకునేందుకు ఏటా ఈ మాసంలో సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంగళవారం మొహర్రం నేపథ్యంలో పది రోజుల క్రితమే గ్రామాల్లో చావిడీలను ప్రత్యేకంగా అలంకరించి వాటిలో పీర్లను ప్రతిష్టించారు. అప్పటి నుండి సోమవారం వరకు సంతాప దినాలుగా పాటించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. మొహర్రం అనే పేరు హరం అనే ఉర్దూ పదం నుండి వచ్చిందని చెబుతుంటారు. హరం అంటే త్యాగం, క్షమాపణ అని అర్థం. మొహర్రం సందర్భంగా పలు చోట్ల ముస్లింలు ఛాతీ బాదుకుంటూ, రక్తం చిందిస్తూ మాతం యాత్ర నిర్వహించి యుద్ధంలో అమరులైన వారికి సంతాపం తెలుపుతారు.మొహర్రం గ్రామాల్లో మతసామరస్యానికి వేదికగా నిలుస్తోంది. చాలా గ్రామాల్లో పీర్లను ముస్లింలతో సమానంగా హిందువులు దర్శించుకొని పూజలు చేస్తారు. హిందువులు మాతం యాత్రలోనూ పాల్గొని ముస్లింలకు సంఘీభావం తెలపడం ఓ సాంప్రదాయంగా కొనసాగుతోంది. ముస్లింల సంఖ్య తక్కువగా ఉండే గ్రామాల్లో హిందువులే ముందుండి మొహర్రం కార్యక్రమాలను నిర్వహిస్తుండడం ఓ విశేషంగా చెప్పుకోవచ్చు.దోమ మండల పరిధిలోని పాలేపల్లి, దోమ, మోత్కూర్, దిర్సంపల్లి, కిష్టాపూర్ తదితర గ్రామాల్లో మొహర్రం నాడు ఏటా ఘనంగా పీర్ల ఊరేగింపు నిర్వహిస్తారు. పది రోజుల పాటు చావిడీల్లో దర్శనార్థం ఉంచిన పీర్లను మంగళవారం నెలవంక దర్శనం కాగానే మాతం యాత్ర చేపట్టనున్నారు. -
అత్యంత ప్రాముఖ్యమైన రోజు యౌమె ఆషూరా
ఎవరైతే ఆషూరా రోజున ఉపవాసం (రోజా) పాటిస్తారో, వారు చాలా సుదీర్ఘకాలంపాటు ఉపవాస వ్రతం పాటించిన దానితో సమానం. దీనికి ప్రతిఫలంగా అమితమైన పుణ్యం లభిస్తుంది. ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, వస్త్ర విహీనులకు దుస్తులు సమకూర్చడం, ప్రేమగా అనాథల తలనిమరడం, దాహార్తుల దాహం తీర్చడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, రోగులను పరామర్శించడంలాంటి మంచిపనులు చేసినవారికి దైవం స్వర్గంలో అమితమైన గౌరవమర్యాదలు ప్రసాదిస్తాడు. ముహర్రం మాసం పదవతేదీని ‘యౌమె ఆషూరా’ అంటారు. ఇస్లామీ ధర్మంలో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆరోజు ముస్లింలు రోజా ((ఉపవాసం) పాటిస్తారు. ఎందుకంటే ముహమ్మద్ ప్రవక్త (స) రమజాన్ రోజాల తర్వాత మళ్లీ అంత శ్రద్ధగా ‘ఆషూరా’ రోజానే పాటించేవారు. ప్రజాస్వామ్య ప్రేమికుడైన ఇమా మె హుసైన్ (రజి) ధర్మపోరాటంలో అమరులైంది ఈ రోజే. పూర్వచరిత్రలో కూడా దీనికి ప్రత్యేక ప్రాముఖ్యమే ఉంది. ఆరోజు దైవం ఆదిమానవుడైన హ . ఆదం(అ)పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. హ. ఇద్రీస్ (అ)కు ఆకాశంలో ఉన్నతస్థానాన్ని అదే రోజు దైవం హ. మూసా(అ)తో సంభాషించాడు. ఆయనకు ‘తౌరాత్’ గ్రంథాన్ని బహూకరించాడు. హ.అయ్యూబ్ (అ), హ. యూసుఫ్ (అ) లు కలుసుకున్నది ఈరోజే. హ. యూనుస్ (అ)ను దైవం చేప కడుపు నుండి రక్షించింది కూడా ఈ రోజే. ఫిరౌన్ బారినుండి హ.మూసా(అ) జాతి జనులను నీల్ సముద్రంలో ప్రత్యేకమార్గం ఏర్పాటుచేసి రక్షించింది కూడా ఈ రోజే. ఇదే రోజు దైవం హ. దావూద్ (అ)ను కనికరించి క్షమించి వేశాడు. ఇదేరోజు హ. సులైమాన్ (అ) కు మరోసారి అధికార పీఠం అప్పగించాడు. ఈ రోజే హ. ఈసా (అ)ను దైవం ఆకాశం పైకి ఎత్తుకున్నాడు. హ. జిబ్రీల్ (అ) దైవ కారుణ్యాన్ని తీసుకుని దివినుంచి భువికి దిగివచ్చింది కూడా ఈ రోజే. ఇదేరోజు ముహమ్మద్ ప్రవక్త (స) ముద్దుల మన వడు హ. ఇమామె హుసైన్ (రజి)తోపాటు, ఆయన సహచరులు, కుటుంబీకులు మొత్తం సుమారు డెబ్భయి రెండుమంది అమరులయ్యారు. ఈ ఆషూరా రోజునే దైవం ఈ సృష్టిని సృజించాడు. మొట్టమొదటిసారి ఆకాశం నుండి వర్షం కురిసింది కూడా ఈ రోజే. దైవకారుణ్యం భూమిపై అవతరించింది కూడా ఈరోజునే. ఎవరైతే ఆషూరా రోజున ఉపవాసం (రోజా) పాటిస్తారో, వారు చాలా సుదీర్ఘకాలంపాటు ఉపవాస వ్రతం పాటించిన దానితో సమానం. దీనికి ప్రతిఫలంగా అమితమైన పుణ్యం లభిస్తుంది. ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, వస్త్ర విహీనులకు వస్త్రాలు సమకూర్చడం, ప్రేమగా అనాథల తలనిమరడం, దాహార్తుల దాహం తీర్చడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, రోగులను పరామర్శించడంలాంటి మంచిపనులు చేసినవారికి దైవం స్వర్గంలో అమితమైన గౌరవమర్యాదలు ప్రసాదిస్తాడు. స్వర్గ దస్తర్ఖాన్ దృష్ట్యా ముహర్రం మాసం పదవ తేదీని యౌమె ఆషూరా అంటారు. అసలు ముహర్రం అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేర్లు హసన్, హుసైన్. (ర). ముస్లింలకే కాదు, ముస్లిమేతర సోదరులకు కూడా ఆ మహనీయుల త్యాగాలు మనసులో మెదులుతాయి. ఆనాడు జరిగిన కర్బలా దుర్ఘటన, దుర్మార్గుల దురాగతాలు, ఆ మహనీయుల అనుచరులపై జరిగిన దౌర్జన్యాలు, వారికుటుంబీకుల దీనస్థితి, పసిబిడ్డల హాహాకారాలు, శాంతి, సామరస్యాలకు వారు చేసిన ప్రయత్నాలు, రాచరిక నిర్మూలనకు, ప్రజాస్వామిక పరిరక్షణకు వారు చేసిన అవిరళ కృషి, వేలాది శతృసైన్యాన్ని గడగడలాడించి యుద్ధరంగంలోనే అమరులైన ఆ వీర ఘట్టం, మృతవీరుల కళేబరాలతో దుష్టులు, దుర్మార్గులు అయిన యజీద్ సైన్యం అవలంబించిన జుగుప్సాకరమైన వైఖరి, వారి ఫాసిస్టు చరిత్ర ఒక్కసారిగా అందరి హృదయాల్లో కదలాడుతుంది. ఎప్పుడైతే, ఎక్కడైతే న్యాయం, ధర్మం అనేది కాలు మోపుతుందో అప్పుడే, అక్కడే అన్యాయం, అధర్మం కూడా రంగప్రవేశం చేస్తుంది. న్యాయాన్ని, ధర్మాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి ప్రయత్నిస్తుంది. కుయుక్తిని, కుటిలబుద్ధిని ప్రయోగిస్తుంది. ఇది మనకు చరిత్ర చెప్పే సత్యం. మంచీ చెడుల మధ్య సంఘర్షణ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. గతంలోనూ జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతోంది. ముందు ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఇది నిప్పులాంటి నిజం. ఈ విధంగా సత్యాసత్యాలకు, ధర్మాధర్మాలకు మధ్య జరిగిన సంఘర్షణా ఫలితమే కర్బలా దుర్ఘటన. - యండీ ఉస్మాన్ ఖాన్