సాక్షి, హైదరాబాద్: ఆకాశంలో గురువారం నెలవంక కనిపించడంతో రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 1న మొహర్రం జరుపుకోవాలని రుయాతే హిలాల్ (నెలవంక నిర్ధారణ) కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబుల్‌పాషా షుత్తరీ సూచించారు. మొజాంజాహీ మార్కెట్‌లోని కమిటీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా నెలవంక కనిపించిందన్న సమాచారం వచ్చిందన్నారు.