వందేళ్ల వాగ్దానం.. ఆ గ్రామంలో హిందువుల మొహర్రం | Hindus Celebrate Muharram in Katihar | Sakshi
Sakshi News home page

వందేళ్ల వాగ్దానం.. ఆ గ్రామంలో హిందువుల మొహర్రం

Published Wed, Jul 17 2024 12:59 PM | Last Updated on Wed, Jul 17 2024 1:12 PM

Hindus Celebrate Muharram in Katihar

మొహర్రం పండుగను దేశవ్యాప్తంగా నేడు (బుధవారం) జరుపుకుంటున్నారు. మొహర్రం అనేది సంతాపాన్ని సూచించే పండుగ. అయితే బీహార్‌లోని ఆ గ్రామంలో  హిందువులు మొహర్రంను జరుపుకుంటారు. గత వందేళ్లుగా ఆ గ్రామంలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

బీహార్‌లోని కతిహార్‌లోని హిందువులు గత వందేళ్లుగా తమ పూర్వీకుల వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ముహర్రంను జరుపుకుంటున్నారు. హసన్‌గంజ్ బ్లాక్‌లోని మహమ్మదియా హరిపూర్ గ్రామంలోని హిందువులు మొహర్రంను జరుపుకోవడం ద్వారా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు.

ఇక్కడ విశేషమేమిటంటే ఈ గ్రామంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదు. కానీ ఇప్పటికీ ప్రతి సంవత్సరం మొహర్రం పండుగను సంప్రదాయ రీతిలో ఇక్కడ జరుపుకుంటారు. దివంగత చెడి సాహ్ సమాధి ఈ గ్రామంలో ఉంది. ఈ ప్రాంతం మియాన్‌ (ముస్లిం మతపెద్ద)కు చెందినదని గ్రామస్తులు చెబుతున్నారు. అతని కుమారులు అనారోగ్యంతో మృతి చెందారట. ఈ నేపధ్యంలో ఆయన ఆవేదనకులోనై తన భూమికి ఈ ‍గ్రామానికి అప్పగించారట. ఆ తర్వాత అతను కన్నుమూసే ముందు గ్రామస్తులంతా ప్రతీయేటా మొహర్రం జరుపుకోవాలని కోరారట. ఈ మేరకు తమ గ్రామ పూర్వీకులు ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటికీ నిలబెట్టుకుంటున్నామని గ్రామస్తులు చెబుతుంటారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement