
సాక్షి, హైదరాబాద్: త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. త్యాగాలకు ప్రతీకగా సాగే ‘పీర్ల’ఊరేగింపును తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలతో పాటు హిందువులూ కలిసి జరుపుకుంటారని తెలిపారు. మతాలకతీతంగా హిందూముస్లింల సఖ్యతను, ఐక్యతను గంగా జమునా తెహజీబ్‌ను మొహర్రం చాటి చెప్తుందని సీఎం తెలిపారు.
(చదవండి: కేసీఆర్ పాలనలో పైలం బిడ్డో అంటూ బడికి.. )
త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక!
— Telangana CMO (@TelanganaCMO) August 9, 2022
రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు, హిందువులూ కలిసి నిర్వహించే 'పీర్ల' ఊరేగింపు తెలంగాణ ప్రజలమధ్య సఖ్యతను, ఐక్యతను, గంగా-జమునా తెహజీబ్ ను చూపే సందర్భం!#Muharram pic.twitter.com/bRVcaQrbN7