మొహరం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పిట్టగోడ కూలిన ఘటనలో 20 మంది గాయాలపాలయ్యారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వివరాలు.. కర్నూలు మండలం బి.తాండ్రపాడులో పీర్ల పండుగ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పీర్ల చావిడి వద్ద నిప్పులు తొక్కుతున్న దృశ్యాల్ని చూసేందుకు పక్కనే ఉన్న ఓ ఇంటిపై పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. వారంతా బంగ్లాపై ఉన్న పిట్టగోడను ఆనుకుని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అది కుప్పకూలింది.