peerlu
-
మొహరం ఊరేగింపులో అపశ్రుతి
-
పీర్ల పండుగలో అపశ్రుతి; పిట్టగోడ కూలడంతో..
సాక్షి, కర్నూలు : మొహరం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పిట్టగోడ కూలిన ఘటనలో 20 మంది గాయాలపాలయ్యారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వివరాలు.. కర్నూలు మండలం బి.తాండ్రపాడులో పీర్ల పండుగ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పీర్ల చావిడి వద్ద నిప్పులు తొక్కుతున్న దృశ్యాల్ని చూసేందుకు పక్కనే ఉన్న ఓ ఇంటిపై పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. వారంతా బంగ్లాపై ఉన్న పిట్టగోడను ఆనుకుని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అది కుప్పకూలింది. గోడను ఆనుకుని ఉన్నవారందరూ అంతెత్తు నుంచి కిందపడిపోయారు. గోడ, దాంతోపాటు మనుషులు కిందనున్నవారిపై పడటంతో అందరూ తీవ్ర గాయాలపాలయ్యారు. దాంతో ఆ ప్రాంతమంతా హాహాకారాలతో నిండిపోయింది. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ బాధితులను పరామర్శించారు. -
విజయవాడ వించిపేటలో ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ : నగరంలోని వన్ టౌన్ వించిపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మైనారిటీలకు చెందిన పవిత్రమైన పీర్ల సావడి స్థలాన్ని కబ్జా చేసేందుకు స్థానిక ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రయత్నించిన బాగోతం బయటపడింది. పీర్ల సావడి స్థలం నుంచి పీర్లకు సంబంధించిన సామగ్రిని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అనుచరులు బయటపడేసి దౌర్జన్యానికి దిగారు. అంతేకాకుండా ఈ స్థలంలో మాంసం దుకాణాన్ని ఏర్పాటుచేశారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యాన్ని, కబ్జాయత్నాన్ని వ్యతిరేకిస్తూ పీర్ల సావడి వద్ద ముస్లింలు ఆందోళనకు దిగారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విజయవాడలో కబ్జాలు పెరిగిపోయాయని, తాజాగా పవిత్రమైన ముస్లింల ప్రదేశాన్ని కూడా టీడీపీ నేతల అండగా కబ్జా చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ముస్లిం నేతలు, ముస్లిం ప్రజలు పీర్ల సావడి కబ్జాయత్నంపై భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నగరంలోని ఖాళీ ప్రదేశాలపై కన్నేసి.. కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడుతున్నారు. -
భక్తిశ్రద్ధలతో మొహర్రం
కడప కల్చరల్: శాంతి, ధర్మాల పరిరక్షణయే ధ్యేయంగా పోరాడి అమరులైన (షహీద్) వీరుల స్మృతి చిహ్నంగా మొహర్రం కార్యక్రమాలను బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక అమీన్‌పీర్ దర్గాలోని పీర్ల చావడిలో దర్గా పీఠా«ధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆ«ధ్వర్యంలో∙పీర్ల వద్ద మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక భక్తులతోపాటు బయటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కడప నగరం నాగరాజుపేటలోని బాదుల్లా మకాన్లో మూడు రోజులపాటు పీర్లను ప్రతిష్ఠించి ప్రార్థనలు చేశారు. నగరానికి చెందిన భక్తులు విశేష సంఖ్యలో హాజరై పీర్లను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. స్థానిక విశ్వనాథపురంలోని పీర్ల చావిడిలో విశేష ప్రార్థనలు నిర్వహించారు. అక్కడే ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పలువురు భక్తులు ధైర్య త్యాగాలకు చిహ్నంగా నిప్పులపై నడిచారు. -
నిండు శోకంతో మొహర్రం
ఇమామ్ హుస్సేన్‌కు ఘన నివాళి గుమ్మటాలు, పీర్ల ఊరేగింపు ద్రాక్షారామ(రామచంద్రపురం రూరల్) : మహ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ సంతాప దినాలు (మొహర్రం సంతాప దినాలు), మొహర్రం పండుగగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటుంటారు. 6వ శతాబ్దంలో ఇరాన్‌లోని కర్బలాలో జరిగిన యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్, అతని పరివారాన్నిSప్రత్యర్థులు హతమార్చారు. అప్పటి నుంచి ఏటా ముస్లింలు మొహర్రం సంతాపదినాలను పాటిస్తున్నారు. ఈ నెల 2 న చంద్ర దర్శనంతో ఇస్లాం క్యాలండర్‌లోని మొదటి నెల మొహర్రం ప్రారంభమైంది. 11 రోజుల మొహర్రం సంతాప దినాలు బుధవారంతో ముగిశాయి. ఈ 11 రోజుల్లో ముఖ్యమైన రోజులలో జులూస్ (ఊరేగింపులు), నిప్పుల గుండంపై నడవడం, మజ్లిస్‌లు నిర్వహించారు. రంగురంగుల పీర్ల(అలం) ఊరేగింపు తదితర కార్యక్రమాలలో మహిళలు కూడా పాల్గొన్నారు. ఇమాం హుస్సేన్ వీర మరణం(షహీద్) పొందిన మొహర్రం పదకొండో రోజైన బుధవారం ముస్లింలు ద్రాక్షారామలోని పెద్ద మసీదు సెంటర్ నుంచి, హజరత్ అబ్బాస్ రోడ్డు వరకు తమ వీపులపైన, శిరస్సులపైన, ఛాతీలపైన రక్తం చిందేలా మాతం చేసి ఇమాం హుస్సేన్‌పై తమ భక్తిని చాటుకున్నారు. రాత్రి మొహర్రం సంతాప దినాలలో ప్రధాన ఘట్టమైన బార్ మే ఇమాం(తల్లి పీరు) ఊరేగింపు ఆగా వారి పెద్ద పంజా నుంచి మాతం నిర్వహించుకుంటూ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. పంజాముజావర్లు(ధర్మకర్తలు) భక్తులకు భోజన వసతులు కల్పించారు. మజ్లిస్ (ప్రార్థన) బోధించేందుకు ఇరాక్‌లోని నజఫ్ పట్టణంలో విద్యాభ్యాసం చేసిన మౌలానా షమీముల్ హసన్ నజఫీ విచ్చేశారు. ఆయన మొహర్రం ప్రాశస్త్యాన్ని వివరించారు. ముస్లింలు నల్ల దుస్తులు ధరించి పీరులను, గుమ్మటాలను చెరువుకు తీసుకుని వెళ్లి కడిగి శాంతింపజేశారు. ద్రాక్షారామతో పాటు హసన్‌బాద, పెడపర్తి, పసలపూడి, తాళ్లరేవు గ్రామాలలో పీర్ల పంజాలలో సంతాప దినాలు నిర్వహించారు. వివిధ ముస్లిం సంఘాలు ఏర్పాట్లను పర్యవేక్షించాయి. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మీరా›్జ ఖాసిం హుస్సేన్ (చోటు), డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీఐ కొమ్ముల శ్రీధర్‌కుమార్, ఎస్సై ఫజుల్ రహమన్, పంజా ధర్మకర్తలు, ఇమాంలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ద్రాక్షారామ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మామిడికుదురులో.. మామిడికుదురు : ముస్లింల ఆరాధ్య దైవం హజరత్ ఇమామ్ హుస్సేన్, ఆయన పరివారం అమరత్వం పొందిన రోజు (షహదత్) ను పురస్కరించుకుని మొహర్రం ను బుధవారం నిండు శోకంతో నిర్వహించారు. భక్తులు కత్తులు, బ్లేడులు, గొలుసులతో తమ శరీరాలను గాయపర్చుకుని రక్తం చిందిస్తూ ‘హుస్సేన్... హుస్సేన్’... అని నినదిస్తూ మాతం నిర్వహించారు. మామిడికుదురు, నగరం గ్రామాల్లోని సుమారు 45 పంజాల నుంచి పీర్లు, గుమ్మటాలను తీసి గ్రామ వీధుల్లో ఊరేగించారు. స్థానిక హజరత్ ఇమామ్ హుస్సేన్ పంజా నుంచి ప్రారంభమైన ఊరేగింపు నగరం పెద పంజీషా వరకు జరిగింది. నగరంలోని మంజిలే కర్బలా నుంచి రక్తం చిందిస్తూ మాతం నిర్వహిం చారు. పెద పంజీషాలో మౌలానా అలీ హైదర్ హైదరీ షహదత్ మజ్లిస్ ఆల పించారు. నగరంలోని చెరువులో పీర్లను శాంతింప చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ముస్లింలు నలుపు దుస్తులు ధరించి మొహర్రం సంతాప కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ ముస్లిం సంఘాల ప్రతినిధులు భక్తులకు ప్రసాద వితరణ చేశాయి.