పాపం చిన్నారులు | Electric shock in muharram celebrations | Sakshi
Sakshi News home page

పాపం చిన్నారులు

Published Wed, Nov 5 2014 3:52 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

Electric shock in muharram celebrations

నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డి : ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ‘మొహర్రం’  నాగిరెడ్డిపేట మండలం అచ్చాయపల్లి గ్రామంలో విషాదం నింపింది. మంగళవారం పీర్లను ఊరేగిస్తున్న బృంద స భ్యులు విద్యుదాఘాతానికి గురి కాగా, ఒకరు సజీవ దహనమయ్యారు.

26మంది గాయపడ్డారు. ఇందు లో ఎక్కువ మంది చిన్నారులే ఉండ టం పలువురిని కలిచివేసింది. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో గ్రా మంలోని చిన్నారులు పీర్ల ఊరేగిం పులో ఉత్సాహంగా పాల్గొన్నారు.  చి న్నారులంతా పీర్ల ముందు ఆడుతూ, గెంతుతూ గ్రామంలోకి వస్తున్న
 సమయంలోనే ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిలో 15 మందికిపైగా 15 ఏళ్లలోపు వారే ఉన్నారు. ఒళ్లంతా భగ భగమండుతుంటే చిన్నారులు పడుతున్న నరకయాతనను చూడలేక వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.

 గ్రామానికి చెందిన కొందరు మాలోని దూదిపీర్, ఇతంపీర్‌ను ఎత్తుకొని ఊరేగింపుగా సమీపంలోని ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామానికి వెళ్లారు. తిరిగి గ్రామానికి వస్తుండగా శివారులోని 132 కేవీ హైటెన్షన్‌వైర్లకు దూదిపీర్ కర్ర తగలడంతో ఊరేగింపు బృందం విద్యుదాఘాతానికి గురై ప్రమాదం నెలకొంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన జింకల చిన్నసాయిలు (32) మృతి చెందాడు.

గాయపడ్డవారిని నాగిరెడ్డిపేట జడ్పీటీసీ సభ్యుడు నారాయణ, గ్రామసర్పంచ్ భర్త కృష్ణ, గ్రామస్తులు ప్రమాదంలో బైక్‌లపై, ఆటోల్లో, 108 వాహనాల్లో ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారిన ఏడుగురిని వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ఎల్లారెడ్డి ఆసుపత్రిలో తరుణ్, మహేష్, సందీప్, మోహన్, సంపత్, సాజిద్, భాగ్య, శ్రీనివాస్,సాయిలు, వంశీ, ప్రేమ్‌కుమార్, కిరణ్, సాయి, తేజ, నవీన్, సురేష్ కల్పన, సంతు, లోకయ్య చికిత్స పొందుతున్నారు.

 బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా : ఎమ్మెల్యే
  మృతుడు జింక సాయిలు కుటుంబానికి ప్రభుత్వ తరపున ఎక్స్‌గ్రేషియా అందించేలా చూస్తామని ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో బాధితులను కలిసి పరామర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రమాద ఘటన విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రభుత్వమే పూర్తిగా ఖర్చు భరిస్తుందన్నారు.

అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ సైతం చేయిస్తామన్నారు. ఎల్లారెడ్డిలో చికిత్స పొందుతున్న వారికి వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి సేవలు అందిస్తారన్నారు. అచ్చాయపల్లి గ్రామంలో నిర్వహించిన సాయిలు అంత్యయ్రల్లోనూ ఎ మ్మెల్యే పాల్గొన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్, నాయకులు గంగాధర్, సాయిలు, కృష్ణాగౌడ్, శ్రీనివాస్, పప్పువెంకటేశం, బాలకిషన్, నారాయణ, ఇబాద్, హబీబ్, రాజు, నాగబూషణం, యూసూఫ్, డీఎంహెచ్ వో గోవింద్‌వాంగ్మారే, కామారెడ్డి డీఎస్పీ భాస్క ర్, సీఐ రామకృష్ణ, ఎస్సైలు రాజశేఖర్, పూర్ణేశ్వర్ తదితరులు ఉన్నారు. ఎల్లారెడ్డి యంపిపి సంజీ వులు, నాయకులు సంజీవులు తదితరులున్నా రు. ఆస్పత్రిలో క్షతగాత్రులను కామారెడ్డి డీఎస్పీ భాస్కర్, ఆర్డీవో వేంకటేశ్వర్లు పరామర్శించారు. భాదితుల కుటుంభాల సభ్యుల రోధనలతో ఆసుపత్రి దద్దరిల్లిపోయింది.

 టీఆర్‌ఎస్,కాంగ్రెస్,టీడీపీ నాయకుల పరామర్శ
 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమడుగు సురేందర్ బాధితులకు పండ్లు, కొబ్బరి బోండాలను అందజేశారు.టీడీపీ నాయకులు గయాజుద్దీన్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement