కరాచీ: పాకిస్థాన్లోని బెలూచిస్తాన్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ సాయుధుడు బస్సులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో నలుగురు మైనారిటీ మహిళలు ప్రాణాలుకోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. బస్సంతా రక్తసిక్తంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొహర్రం నేపథ్యంలో కొంతమంది తమకు కావాల్సిన వస్తువులు తీసుకొని తిరిగి తమ ప్రాంతమైన హజారాకు వస్తుండగా కొంతమంది సాయుధులు ఆ బస్సును అడ్డుకున్నారు.
అనంతరం అందులో ఒకసాయుధుడు బస్సులోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మొహర్రం నేపథ్యంలో ఇప్పటికే బలగాలను పెద్ద మొత్తంలో మోహరించినప్పటికీ ఈ ఘటన జరగడం పట్ల బెలూచ్ ముఖ్యమంత్రి నవాబ్ సనావుల్లా ఖాన్ జెరీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు. ఇలాంటివి దురదృష్టకరమైన సంఘటనలు అని, అమాయకుల ప్రాణాలు తీసుకోవడం సరికాదని ఖండించారు. కాగా, ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.
బస్సులోకి చొరబడి మహిళలపై కాల్పులు
Published Wed, Oct 5 2016 11:29 AM | Last Updated on Sat, Mar 23 2019 8:28 PM
Advertisement
Advertisement