Muharram festival
-
మొహర్రం సందర్భంగా ముస్లింలకు వైఎస్ జగన్ సందేశం..
-
ప్రవక్త జీవితంలో ముఖ్య ఘట్టం.. మొహర్రం
ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం సంవత్సరంలోని మొదటి నెల ‘మొహర్రం ’. ప్రతి సంవత్సరం ఈ నెల వస్తూనే ముహమ్మద్ ప్రవక్త (స) వారి జీవితంలోని ఓ ముఖ్యమైన ఘట్టం మనసులో మెదులుతుంది. అదే ‘హిజ్రత్’. (మక్కా నుండి మదీనాకు వలస). హిజ్రత్ తరువాతనే ధర్మానికి జవసత్వాలు చేకూరాయి, ధర్మం ఎల్లెడలా విస్తరించింది. ధర్మ పరిరక్షణ, మానవ సేవ, మానవులకు సత్య సందేశాన్ని అందించడం లాంటి మహత్తర ఆశయం కోసం కష్ట నష్టాలను సహించాల్సి వచ్చినా, చివరికి స్వదేశాన్ని విడిచి వలస వెళ్ళవలసి వచ్చినా వెనకాడకూడదనే విషయాన్ని ముహర్రం ప్రతి సంవత్సరం విశ్వాసులకు గుర్తు చేస్తూ ఉంటుంది.దేవుడు భూమ్యాకాశాలను సృష్టించిన నాటినుండి నెలల సంఖ్య పన్నెండు మాత్రమే. వాటిలో నాలుగు పవిత్ర మాసాలు’. అందులో ‘మొహర్రం’ కూడా ఒకటి. ప్రవక్త(స) ప్రవచనం ప్రకారం: ‘పన్నెండు నెలలు ఒక సంవత్సరం. అందులో నాలుగు నెలలు గౌరవప్రదమైనవి. జుల్ ఖ అద, జుల్ హిజ్జ, ముహర్రమ్, రజబ్. కనుక ఈ నెలలో ఎక్కువగా సత్కార్యాలు ఆచరిస్తూ పాపాలకు దూరంగా ఉండాలి. సమాజంలో సత్యం, న్యాయం, ధర్మం, మానవీయ విలువల పరిరక్షణకు కృషి చేయాలి. సమాజంలో ప్రబలిన అన్ని రకాల చెడులను రూపుమాపడానికి ప్రయత్నం చేయాలి. సతతం దైవ భీతి (తఖ్వా) తో గడపాలి. అప్పుడే దైవ సహాయం లభిస్తుంది. ఈ నెల ఘనతకు సంబంధించి ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా అన్నారు. ‘ముహర్రం అల్లాహ్ నెల. రమజాన్ ఉపవాసాల తరువాత శ్రేష్టమైన ఉపవాసాలు ముహర్రం ఉపవాసాలే.’ (సహీహ్ ముస్లిం: 2755) రమజాను ఉపవాసాలు ఫర్జ్ కాక ముందు ఆషూర (ముహర్రం పదవ తేది) ఉపవాసం విధిగా ఉండేది. అదే రోజు కాబాపై కొత్తవస్త్రం కప్పేవారు. ప్రవక్త మహనీయులు మదీనాకు వలస వెళ్ళిన తరువాత, అక్కడి యూదులు రోజా (ఉపవాసం) పాటించడం గమనించారు. అది ముహర్రం పదవ తేదీ. (యౌమె ఆషూరా) అప్పుడు ప్రవక్త వారు, ‘ఏమిటి ఈరోజు విశేషం?’ అని వారిని అడిగారు. దానికి వారు, ‘ఇది చాలా గొప్పరోజు. ఈ రోజే దైవం మూసా ప్రవక్త(అ) ను, ఆయన జాతిని ఫిరౌన్ బారినుండి రక్షించాడు. అప్పుడు మూసా ప్రవక్త, దైవానికి కృతజ్ఞతగా రోజా పాటించారు. కనుక మేము కూడా ఆయన అనుసరణలో ఈ రోజు ఉపవాసం పాటిస్తాము’. అని చె΄్పారు. అప్పుడు ప్రవక్తమహనీయులు, ‘మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులం’ అని చెప్పి, తమ అనుచరులకు రోజా పాటించమని ఉపదేశించారు. ముహర్రం మాసం 9, 10 లేదా 10, 11 కాని రెండురోజులు రోజా (ఉపవాసం) పాటించాలి. ఆషూరా ఉపవాసం పాటించడం వల్ల గత సంవత్సరకాలం పాపాలు మన్నించబడతాయని కూడా ఆయన సెలవిచ్చారు. (సహీహ్ ముస్లిం 1162).మొహర్రం నెల ్రపాముఖ్యం, హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరత్వం మామూలు విషయం కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మసంస్థాపన, దైవప్రసన్నతే ధ్యేయంగా సాగిన సమరంలో హజ్రత్ ఇమామె హుసైన్, ఆయన పరివారం వీరమరణం పొందారు. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం ్రపాణాలను సైతం లెక్క చేయకుండా ΄ోరాడి అమరుడయ్యారో మనం దాని నుంచి ప్రేరణ పొందాలి. సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, సమాజ శ్రేయోభిలాషులు, న్యాయప్రేమికులు, ΄ûరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయం కోసం, ధర్మం కోసం, మానవీయ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శక్తివంచన లేకుండా ΄ోరాడాలి. ఇదే ఇమామె హుసైన్ అమరత్వం మనకిస్తున్న సందేశం.( 17, బుధవారం మొహర్రం – యౌమె ఆషూరా)కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ్రపాముఖ్యత మరింతగా పెరిగి΄ోయింది. అంతమాత్రాన ముహర్రం నెలంతా విషాద దినాలుగా పరిగణించనక్కర లేదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, విలువల కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరగతి పొందిన చారిత్రక రోజది. అమరత్వం అనేది మానవ సహజ భావోద్రేకాల పరంగా బాధాకరం కావచ్చునేమోగాని, విషాదం ఎంతమాత్రం కాదు. ‘కర్బలా’ సాక్షిగా ఒక విశ్వాసి ΄ోషించవలసిన పాత్రను ఆయన ఆచరణాత్మకంగా నిరూపించారు. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచారు. అందుకే ప్రతియేటా ‘మొహర్రం’ నెలలో ఆయన త్యాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్మరించుకుంటారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ: సీఎం జగన్
తాడేపల్లి : మొహర్రం పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ అని, ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ దేవుని కరుణాకటాక్షాలు మన రాష్ట్రంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం జగన్ ట్వీట్ ద్వారా ఆకాంక్షించారు. త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ. ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ దేవుని కరుణాకటాక్షాలు మన రాష్ట్రంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 29, 2023 ఇది కూడా చదవండి: AP: ఉదారంగా వరద సాయం -
నెల్లూరు : రొట్టెల పండగ ప్రారంభం...దర్గాకు పోటెత్తిన జనం (ఫొటోలు)
-
త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక మొహర్రం : సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మొహర్రం సందర్భంగా సీఎం జగన్ సందేశం విడుదల చేశారు. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీకగా పేర్కొన్నారు. ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల కూడా మొహర్రం అని చెప్పారు. ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతిబింబంలా నిలుస్తాయని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. చదవండి: (100 శాతం ‘మద్దతు’) త్యాగానికి ప్రతీక మొహర్రం. నమ్మిన సిద్ధాంతం కోసం కష్టనష్టాలను భరించి, ఆత్మ బలిదానానికి కూడా సిద్ధపడిన మహ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ జీవితం అందరికీ ఆదర్శం. పవిత్రమైన ఈ మొహర్రం సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతీకగా నిలుస్తాయి. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2022 -
త్యాగానికి ప్రతీక మొహర్రం
సాక్షి, అమరావతి: మొహర్రం త్యాగనిరతికి ప్రతీకని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. పవిత్ర ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ వంటి అమరవీరులను మొహర్రం గుర్తుకు చేస్తుందని తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఇళ్లకే పరిమితమై మొహర్రం కార్యక్రమాలు నిర్వహించు కోవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం ఓ ప్రకటనలో సూచించారు. -
ఆంధ్రప్రదేశ్‌లో 20న మొహర్రం సెలవు
సాక్షి, అమరావతి: మొహర్రం మాసం 10వ రోజు ఇచ్చే సాధారణ సెలవును ఆగస్టు 19వ తేదీ (గురువారం) నుంచి 20వ తేదీ (శుక్రవారం)కి మారుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 20న మొహర్రం నిర్వహణకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ జామా మసీదు ప్రకటన ఆధారంగా మొహర్రం నిర్వహణ తేదీల్లో మార్పులు చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. (చదవండి: ప్రేమ పెళ్లి.. అమ్మాయి దక్కదేమోనన్న అనుమానంతో..) -
Telangana: 20న మొహర్రం సెలవు
సాక్షి, హైదరాబాద్: మొహర్రం మాసం 10వ రోజు ఇచ్చే సాధారణ సెలవును ఆగస్టు 19వ తేదీ(గురువారం) నుంచి 20వ తేదీ(శుక్రవారం)కి మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొహర్రం 9వ రోజు ఇచ్చే ఐచ్ఛిక సెలవును ఆగస్టు 18 నుంచి 19వ తేదీకి మార్పు చేశారు. నెలవంక ఆధారంగా మొహర్రం మాసం ఒకరోజు ఆలస్యంగా ప్రారంభమైందని, కాబట్టి సెలవులను మార్చాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. కాగా, మొహర్రం సెలవును గురువారం నుంచి శుక్రవారానికి మారుస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. -
ఏపీ: మొహర్రం వేడుకల్లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరి
సాక్షి, అమరావతి: మొహర్రం వేడుకల్లో భక్తులు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పలు మార్గదర్శకాలను విడుదల చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు ఈ మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ►సాధారణ సూచనలు: వ్యక్తులు బహిరంగ ప్రదేశాలలో కనీసం 6 అడుగుల (2 మీటర్లు) దూరం పాటించాలి. ఫేస్ మాస్క్‌లు తప్పనిసరిగా ఉపయోగించాలి. సబ్బు, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోరు, ముక్కు వద్ద చేతి రుమాలు, టిష్యూ పేపర్ వంటివి అడ్డుపెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయకూడదు. ►మార్గదర్శకాలు: మొహర్రం ప్రదర్శన, పీర్ల వద్ద ఎక్కువ మంది గుమికూడరాదు. భౌతిక దూరాన్ని పాటించాలి. సాధారణ ప్రజలు, భక్తులను ఎక్కువ మందిని అనుమతించకూడదు. అశూర్ఖానా (పీర్ల చావిడి) వద్ద తగినన్ని శానిటైజర్లు ఏర్పాటు చేసుకోవాలి. వృద్ధులు, పిల్లలతోపాటు దగ్గు, జలుబు, జ్వరం, మధుమేహం, అధిక బీపీ, గుండె జబ్బులు ఉన్నవారిని అనుమతించకూడదు. ఊరేగింపుల్లో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించాలి. సన్నాయి మేళం మినహా ఆర్కెస్ట్రా, సంగీత బృందాలు వంటివి ఏర్పాటు చేయకూడదు. తబరుక్, షర్బత్‌లను సీలు చేసిన ప్యాకెట్లలో మాత్రమే ఇవ్వాలి. -
హైదరాబాద్ లో మొహర్రం ఊరేగింపు
-
4 వందల ఏళ్ల ఆచారం.. అనుమతినివ్వండి
సాక్షి, హైదరాబాద్ : మొహరం పండుగకు అనుమతినివ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలైంది. నాలుగు వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారాలను కాపాడాలని కోరుతూ శియా సంస్థ శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 30 తేదీన డబిర్పుర బిబికా అలావా నుంచి చాదర్‌ఘాట్ మజీద్ ఇలాహి వరకు అనుమతి ఇవ్వాలని ముస్లిం ప్రతినిధులు కోరారు. ఏనుగు మీద ఎలాంటి ఊరేగింపులు జరపమని 12 మంది సిబ్బందితో 12 అలమ్‌లను డీసీఎం వాహనాల ద్వారా సమర్పిస్తామని పిటిషన్లో పేర్కొన్నారు. గత మే నెలలో సుప్రీంకోర్టు జగన్నాథ రథయాత్రకు కేంద్రం అనుమతిచ్చిందని, తమకు కూడా అనుమతి ఇవ్వాలని పిటిషనర్ న్యాయస్థాన్ని అభ్యర్థించారు. (అల్లాహ్ మాసం మొహర్రం) అనుమతి కోసం హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీ కుమార్‌కు ఇచ్చిన వినతి పత్రం ఇంకా పెండింగ్‌లో ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. మొహరం పండుగ అనుమతుల కోసం ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిందని కోర్టుకు తెలిపింది. ఆగస్టు 31 తారీకు వరకు కేంద్ర హోంశాఖ ఇచ్చిన నిబంధనలు అమలులో ఉంటాయని వివరించింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. జగన్నాథ రథయాత్ర తీర్పు, మార్గదర్శకాలను పరిశీలించాలని నగర సీపీని హైకోర్టు అదేశించింది. అంతేకాకుండా అనుమతి కోసం ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్ కమిషనర్‌కు సూచించింది. -
అల్లాహ్ మాసం మొహర్రం
సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మంకోసం, విలువల కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరగతి పొందిన చారిత్రక రోజది. ఇస్లాం ధర్మం ప్రకారం సంవత్సరంలోని పన్నెండు మాసాలూ శుభప్రదమైనవే. పన్నెండులో నాలుగు మాసాలు అత్యంత గౌరవప్రదమైనవి. అందులో ‘మొహర్రం’ ఒకటి. ప్రవక్త(స) ప్రవచనం ప్రకారం ‘పన్నెండు మాసాలు ఒక సంవత్సరం. అందులో నాలుగు మాసాలు గౌరవప్రదమైనవి. జీఖాద, జిల్ హజ్జ, ముహర్రమ్, రజబ్. (బుఖారి 3197). కనుక ఈ మాసంలో ఇతర మాసాలకంటే ఎక్కువగా సత్కార్యాలు ఆచరిస్తూ పాపాలకు దూరంగా ఉండాలి. సమాజంలో సత్యం, న్యాయం, ధర్మం, మానవీయ విలువల పరిరక్షణకు కృషి చేయాలి. సమాజంలో ప్రబలిన అన్ని రకాల చెడులను రూపుమాపడానికి ప్రయత్నం చేయాలి. సతతం దైవభీతి (తఖ్వా) తో గడపాలి. అప్పుడే దైవ సహాయం లభిస్తుంది. ఈ మాసం ఘనతకు సంబంధించి ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా అన్నారు. ‘ముహర్రం అల్లాహ్ మాసం. రమజాన్ ఉపవాసాల తరువాత శ్రేష్టమైన ఉపవాసాలు ముహర్రం ఉపవాసాలే.’ (సహీహ్ ముస్లిం: 2755) రమజాను ఉపవాసాలు ఫర్జ్ కాక ముందు ఆషూర (ముహర్రం పదవ తేది) ఉపవాసం విధిగా ఉండేది. అదే రోజు కాబాపై కొత్త వస్త్రం కప్పబడేది. (బుఖారి 1592). ప్రవక్త మహనీయులు మదీనాకు వలస వెళ్ళిన తరువాత, అక్కడి యూదులు రోజా (ఉపవాసం) పాటించడం గమనించారు. అది ముహర్రం పదవ తేదీ. (యౌమె ఆషూరా) అప్పుడు ప్రవక్త వారు, ‘ఏమిటి ఈరోజు విశేషం?’ అని వారిని అడిగారు. దానికి వారు, ‘ఇది చాలా గొప్పరోజు. ఈ రోజే దైవం మూసా ప్రవక్త(అ)ను, ఆయన జాతిని ఫిరౌన్ బారినుండి రక్షించాడు. ఫిరౌన్‌ను, అతడి సైన్యాన్ని సముద్రంలో ముంచేశాడు. అప్పుడు మూసా ప్రవక్త, దైవానికి కృతజ్ఞతగా రోజా పాటించారు. కనుక మేము కూడా ఆయన అనుసరణలో ఈరోజు ఉపవాసం పాటిస్తాము’. అని చెప్పారు. అప్పుడు ప్రవక్త మహనీయులు, మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులం. అని చెప్పి, తమ అనుచరులకు రోజా పాటించమని ఉపదేశించారు. ఆషూరా ఉపవాసం కేవలం యూదులే కాదు, క్రైస్తవులు కూడా పాటించేవారు. ఈ ఇరువర్గాలూ ముహర్రం పదవ తేదీన మాత్రమే రోజా పాటించేవి. కాని ప్రవక్తవారు, మీరు రెండురోజులు పాటించమని తన సహచరులకు బోధించారు. అంటే ముహర్రం మాసం 9, 10 కాని, లేక 10,11 కాని రెండురోజులు రోజా (ఉపవాసం) పాటించాలి. ఆషూరా ఉపవాసం పాటించడం వల్ల గత సంవత్సరకాలం పాపాలు మన్నించబడతాయని కూడా ఆయన సెలవిచ్చారు. (ముస్లిం 1162). కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ప్రాముఖ్యత మరింతగా పెరిగిపోయింది. అంతమాత్రాన ముహర్రం మాసమంతా విషాద దినాలుగా పరిగణించడం సరికాదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మంకోసం, విలువల కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరగతి పొందిన చారిత్రక రోజది. అమరత్వం అనేది మానవ సహజ భావోద్రేకాల పరంగా బాధాకరం కావచ్చునేమో గాని, విషాదం ఎంతమాత్రం కాదు. ‘కర్బలా’ సాక్షిగా ఒకవిశ్వాసి పోషించవలసిన పాత్రను ఆయన ఆచరణాత్మకంగా నిరూపించారు. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచారు. అందుకే ప్రతియేటా ‘మొహర్రం’ మాసంలో ఆయనగారి త్యాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్మరించుకుంటారు. సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు వారుతున్నప్పుడు సమాజ శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్య ప్రియులు, న్యాయ ప్రేమికులు, పౌరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయం కోసం, ధర్మం కోసం, మానవీయ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పరిధిలో శక్తివంచన లేకుండా పోరాడాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ప్రస్తుత తరుణంలో దాన్ని కాపాడుకోడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఇదే ఇమామె హుసైన్ అమరత్వం మనకిస్తున్న సందేశం. (30న ఇమామె హుసైన్ (ర) వర్ధంతి యౌమె ఆషూరా సందర్భంగా..) – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మొహర్రం రోజు పాటించాల్సిన కోవిడ్ నిబంధనలు ఇవే!
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కోవిడ్–19 నిబంధనలు మొహర్రం పండుగలో భక్తులు తప్పకుండా పాటించాలని మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి మహమ్మద్ ఇలియాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 20 నుంచి పది రోజులు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. పండుగ రోజు పాటించాల్సిన కోవిడ్ నియమాలు: పీర్ల చావిడి వద్ద ముజావర్లు, ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీ సభ్యులు కలిసి 10 మందికి మించకుండా ఉండాలి. భౌతిక దూరం పాటించాలి. ప్రజలకు, భక్తులకు తమ ఇళ్లలోనే పాతియా (భోజనం) అందించాలి. పీర్ల చావిడి వద్ద శానిటైజర్లు ఉంచాలి. దగ్గు, జలుబు, జ్వరం ఉన్న పెద్దలు, పిల్లలు పీర్ల చావిడి వద్దకు రాకుండా చూడాలి. మొహర్రం (షాహదత్) చివరి 9, 10వ రోజుల్లో పది మందికి మించకుండా ఊరేగింపు చేసుకోవచ్చు. పీర్లచావిడి వద్ద జంతు బలి, ఆర్కెస్ట్రా సంగీత బృందాలు నిషేధం. æ పై కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, విభాగాధిపతులను ప్రభుత్వం ఆదేశించింది. చదవండి: కరోనా కాదంటూ రోదించినా... -
చార్మినార్ రక్త తర్పణం
-
కొనసాగుతున్న మొహర్రం ఊరేగింపు
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని ప్రసిద్ధ బీబీకా ఆలం నుంచి ప్రారంభమయిన మొహర్రం ఊరేగింపు కొనసాగుతోంది. డబిల్ పుర నుంచి చార్మినార్ వరుకు జరిగే ర్యాలీ సందర్భంగా పోలీసుశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. భారీగా పోలీసులను మోహరించారు. పూర్తిస్థాయి భద్రతకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని సీపీ అంజనికుమార్ తెలిపారు. ఈ ర్యాలీ సాయంత్రం ఏడు గంటలకు జరుగుతుందని పేర్కొన్నారు. నగరంలో నేడు కూడా గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయని.. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్ని రోడ్లకు మరమ్మతులు పూర్తి చేశామని వెల్లడించారు. గణేష్ నిమజ్జనాల సమయంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. -
హైదరాబాద్ పాతబస్తీలో మొహర్రం ఊరేగింపు
-
నేడే మొహర్రం చరిత్రలో ఎంతో ప్రత్యేకం
సాక్షి సిటీబ్యూరో: చరిత్రలో మొహర్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ముస్లింలు నూతన సంవత్సరం ప్రారంభ మాసంగా మొహర్రంను పరిగణిస్తారు. పూర్వం నుంచే ఈ విధానం ఉంది. మహ్మద్ ప్రవక్త కూడా ఇదే విధానాన్ని అమలులో ఉంచారు. అసలు మహ్మద్ ప్రవక్త సమాజానికి, విశ్వాసాలకు ఉపకరించే ఏ పాత పద్ధతులనూ మార్చలేదు. సమాజ వికాసానికి దోహదపడే విధానాలు, పద్ధతులను స్వయంగా ఆచరించారు. పవిత్ర దినం... ఇస్లామియా చరిత్రలో మొహర్రం మాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మొహర్రం మాసం పదో తేదీని ఆషూరా అంటారు. చరిత్రలో ఈ తేదీకి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఆదిమానవుడైన ఆదం ఆలైహిస్సలాంను దైవం సృష్టించింది, స్వర్గానికి పంపించింది ఆషూరా రోజునే. నోవా (నూహ్) ప్రవక్త నావను కనివిని ఎరగని భయంకర తుఫాన్ నుంచి రక్షించి, దైవం ఒడ్డుకు చేర్చింది ఈరోజే. యూనుస్ ప్రవక్తను చేప కడుపు నుంచి రక్షించింది కూడా ఈ రోజే. ఇబ్రహీంను నమ్రూద్ రాజు అగ్నిగుండంలో పడేసినప్పుడు దైవం ఆయన్ని అగ్ని నుంచి కాపాడాడు. మోషే ప్రవక్త, అనుయాయులను అష్టకష్టాలకు గురిచేసిన రాజు ఫిరోన్’(ఫారో) బారి నుంచి రక్షించాడు. దీనికి కృతజ్ఞతగా మోజెస్ ప్రవక్త అనుయాయులు (యాదులు) ఆ రోజు ఉపవాసం ఉండేవారు. మహ్మద్ ప్రవక్త రెండు రోజులు ఉపవాసం పాటించాలని బోధించారు. అంటే 9, 10వ తేదీల్లో గానీ 10, 11వ తేదీల్లో గానీ ఉపవాస వ్రతం పాటించాలి. ఆ ఆషూరా ఉపవాసాలకు రంజాన్న్ఉపవాసాల తరువాత స్థానం ఇచ్చారు మహ్మద్ ప్రవక్త(స). ఈ రెండు ఉపవాసాలు పాటించిన వారి గత పాపాలన్నీ దైవం క్షమిస్తాడు. మహ్మద్ ప్రవక్త(స) బోధనలతో ముస్లింలంతా పునీతులయ్యారు. ప్రజాస్వామ్యమే పరమావధి... మహ్మద్ ప్రవక్త పరమపదించిన తరువాత ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు తమ ప్రతినిధిని ఎన్నుకున్నారు. అటువంటి ప్రజాప్రతినిధిని ఖలీఫా అని పిలుస్తారు. మొట్టమొదటిసారిగా ఖలీఫాగా హజ్రత్ సిద్ధిఖ్æ ఎన్నికయ్యారు. ఆయన తరువాత వరుసగా హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. వీరి పాలనా కాలంలో న్యాయం నాలుగుపాదాలపై నడిచింది. ఆర్థిక, ధార్మిక, రాజకీయ పరిపాలన రంగాలన్నింటిలోనూ సమతూకం నెలకొని ఉండేది. ప్రజలందరికీ ఎలాంటి వ్యత్యాసాలు, తారతమ్యాలు లేకుండా సమాన న్యాయం, గౌరవ మర్యాదలు లభించేవి. అందుకే వీరి పరిపాలన కాలం ప్రపంచ మానవ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయంగా పేరొందింది. అధికార దాహం... నాలుగో ఖలీఫా హజ్రత్ అలీ తరువాత ప్రజలు ఇమామే హసన్‌ను తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్‌గా ఉన్న హజ్రత్ మావియా కొందరు స్వార్థ రాజకీయ నాయకుల సలహా మేరకు అధికారం కోసం పోటీపడ్డారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య యుద్ధం వచ్చింది. కానీ ఇరువైపులా కరవాలాలు చేతపట్టిన అమాయక సొదర ప్రజానీకాన్ని చూసి ఇమామే హసన్ మనసు చలించిపోయింది. వెంటనే రణరంగం నుంచి నిష్క్రమించి ప్రజలు కట్టబెట్టిన రాజ్యాధికారాన్ని త్యాగం చేశారు. ఈ విధంగా మావియా మనుసులో నాటుకున్న రాజ్యకాంక్ష అనే విషబీజం పెరిగి పెద్దదై అధికార వ్యామోహంతో తన కొడుకు యజీద్‌ను రాజుగా గుర్తించమని ప్రజలపై ఒత్తిడి తెచ్చారు. రాజ్యంలో అలజడులు, హింసాకాండ చెలరేగాయి. ప్రజలు భయంతో యజీద్‌ను రాజుగా గుర్తించారు. ఈ విధంగా ప్రజాస్వామ్యానికి పెద్దదెబ్బ తగిలింది. ప్రజాస్వామ్యవాదులకు ఈ పరిణామం ఏ మాత్రం రుచించలేదు. వారు రాచరికానికి ఎదురు తిరిగారు. ప్రజాస్వామ్య ఉద్యమానికి నాయకత్వం వహించే బాధ్యత ఇమామే హసన్ భుజస్కంధాలపై మోపారు. ఇస్లామీ ధర్మశాస్త్రం ప్రకారం ఏ సమస్యకైనా చర్చలు, సంప్రదింపులే పరిష్కార మార్గాలు. అందుకని ఇమామే హసన్ ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. ముఖాముఖి చర్చల కోసమని ఇమామ్ రాజధాని కుఫాకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న యజీద్ ఇమామ్ రాజధానికి చేరితే తన అధికారానికే ముప్పు వస్తుందని గ్రహించి ఆయన్ని అడ్డుకోవడానికి ఓ పెద్ద సైన్యాన్ని పంపాడు. మార్గ మధ్యలో కర్బలా అనే చోట యజీద్ సైన్యం ఇమామ్ పరివారాన్ని అడ్డగించి యజీద్‌ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతి ఇమామే హసన్‌ను హెచ్చరించాడు. తాను కేవలం చర్చల కోసమే రాజధానికి వెళుతున్నానని, దయచేసి తనను అడ్డగించవద్దని ఇమామే సెన్యాధికారిని కోరాడు. కానీ సైన్యాధిపతి ఇమామ్ మాటల్ని ఏ మాత్రం ఖాతరు చేయకుండా యజీద్‌ను రాజుగా గుర్తించడమో, లేక యుద్ధమో తేల్చుకోమన్నాడు. ఆశయసాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే కాని.. దౌర్జన్యం ముందు తలవంచనన్నారు ఇమామే హసన్. ఆయనతో పాటు 72 మంది అమరులయ్యారు. షియా ముస్లింలు మొహర్రం మాసం మొదటి 10 రోజులు వీరి జ్ఞాపకార్థం మాతంగా పాటిస్తారు. మొహర్రం 10వ రోజు పెద్ద ఎత్తున ముస్లింలు తమ రక్తాన్ని చిందించి వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహీల పాలనా కాలం నుంచి నేటికీ రాష్ట్ర ప్రభుత్వం బీబీకా ఆలం ఊరేగింపును నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 400 ఏళ్ల నుంచి ఏ దేశంలో, రాష్ట్రంలో లేని విధంగా బీబీకా ఆలం ఊరేగింపు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తోంది. ఊరేగింపునకు బల్దియా ఏర్పాట్లు సాక్షి, సిటీబ్యూరో: మొహర్రంను పురస్కరించుకొని చారిత్రాత్మక బీబీకా అలవా నుంచి శుక్రవారం జరిగే ఊరేగింపునకు వివిధ విభాగాల ద్వారా తగిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. ఊరేగింపు కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దాదాపు రూ.3 కోట్లతో రోడ్ల మరమ్మతులు, అదనపు లైటింగ్, నూతన రోడ్ల నిర్మాణం, పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. బీబీకా ఆలం ఊరేగింపు మార్గంతో పాటు అన్ని అషూర్ఖానాల మార్గంలో రోడ్ల మరమ్మతులు, నూతన రోడ్ల నిర్మాణం తదితర పనులతో పాటు అదనంగా 95 మంది శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఊరేగింపు మార్గంలో భవన నిర్మాణ వ్యర్థాలను పూర్తిగా తొలగించామని చెప్పారు. బీబీకా ఆలం నుంచి చాదర్‌ఘాట్ వరకు మొహర్రం ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో జలమండలి ద్వారా నాలుగున్నర లక్షల మంచినీటి ప్యాకెట్ల పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారు. -
ఆధ్యాత్మికం..పాతబస్తీ ప్రత్యేకం
చార్మినార్: మొహర్రం సంతాప దినాలతో పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు ఒకరోజు తేడాతో కలిసి వస్తున్నాయి. 1985లో మొహర్రం సంతాప దినాలతో పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు ఒకే రోజు కలిసి వచ్చాయి. తిరిగి ఈసారి ఒక రోజు తేడాతో ఉత్సవాలు జరగనున్నాయి. మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకుని షియా ముస్లిలు నగరంలోని ఆషుర్ఖానాలను తీర్చిదిద్దుతుండగా... వినాయక నవరాత్రి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించుకోవడానికి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకే నెలలో ఒక రోజు తేడాతో మొహర్రం సంతాప దినాల ప్రారంభం...వినాయక విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు వెంటవెంటనే ప్రారంభమవుతున్నాయి. అలాగే 10వ,మొహర్రం సందర్బంగా పాతబస్తీ వీధుల్లో నిర్వహించే బీబీకాఆలం సామూహిక ఊరేగింపు ముగిసిన మరుసటి రోజే వినాయక నిమజ్జనోత్సవాలు జరుగనున్నాయి. ఒక వైపు మొహర్రం సంతాప దినాలు కొనసాగనుండగా...మరోవైపు వినాయక నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగనున్నాయి. దీంతో నగరంలోని హిందువులు వినాయక ఉత్సవాల్లో నిమగ్నమవుతుండగా... షియా ముస్లిం ప్రజలు మొహర్రం సంతాప దినాల్లో పాల్గొననున్నారు. దీంతో ఇరువర్గాల ప్రజల కార్యక్రమాలతో పాతబస్తీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది. ఇందుకోసం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగర పోలీసులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నగర పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో అటు గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో పాటు షియా ముస్లింలతో సమావేశాలు నిర్వహించి తగిన సలహాలు,సూచనలు అందిస్తున్నారు. అదనపు బలగాలతో గట్టి బందోబస్తును నిర్వహించనున్నారు. 12నుంచి సంతాప దినాలు... హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ షియా ముస్లిం ప్రజలు ఈ నెల 12వ తేదీ నుంచి మొహర్రం సంతాప దినాలను కొనసాగించనున్నారు. ఈ నెల 11న రాత్రి ఆకాశంలో నెల వంక కనిపించిన వెంటనే మరుసటి రోజు సంతాప దినాల్లో పాల్గొంటారు. సంతాప దినాల్లో భాగంగా 21న, పాతబస్తీ వీధుల్లో అంబారీతో 10వ మొహర్రం సామూహిక ఊరేగింపు కొనసాగుతుంది. డబీర్‌పురా బీబీకాఅలావాకు చెందిన బీబీకాఆలంతో షియా ముస్లింలు ఊరేగింపులో పాల్గొంటారు. సంతాప దినాలను పురస్కరించుకొని డబీర్‌పురా బీబీకాఅలావాలో ఆలంలను ప్రతిష్టించి 1వ మొహర్రం నుంచి 10వ మొహర్రం వరకు మజ్లిస్, మాతం నిర్వహిస్తారు. 13నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 13వ, తేదీ నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 23వ తేదీన విగ్రహాలను నగరంలో పెద్ద ఎత్తున నిర్వహించే సామూహిక నిమజ్జనోత్సవ ఊరేగింపు అనంతరం నిమజ్జనం చేస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను ఖరీదు చేసి మండపాలకు తరలిస్తున్నారు. పది రోజుల ముందుగానే ఉత్సవాల నిర్వాహకులు మండపాలు, ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆయా మండపాల వద్ద ప్రతిరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించనున్నారు. -
పీర్ల ఉరేగింపులో అపశృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్ది మండలం మాచాపూర్‌లో మంగళవారం పీర్ల ఉరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. మొహర్రం పండగం సందర్భంగా పీర్లు విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో విద్యుదాఘాతం సంభవించి ఒకరు మరణించారు. మరో 20 మంది చిన్నారులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి పోలీసులు తెలుసుకున్నారు.